బ్రహ్మ ప్రతిపాదకమగు వేదాంత వాక్య విచారము -
“తత్ సత్యం”, “స ఆత్మా”, “తత్వమసి”, “అయమాత్మా బ్రహ్మ”, “అహం బ్రహ్మస్మి” - అని మొదలగు శ్రుతివాక్యములవలన జీవ పరమాత్మలు ఒకటే. జీవుడు తనయందు అవిద్యచేత కల్పించబడిన సంసారమును నివర్తించుటకై బ్రహ్మను గుఱించి తెలుసుకొనవలెను - ఇది తెలుసుకొనడమే విచారము - విచారించుట, బ్రహ్మను గుఱించి చేసిన విచారము - బ్రహ్మ అంటే ఏమిటి? అని ప్రయత్నించి తెలుసుకొనుట. ఈ తెలుసుకొనుటవలన, ఈ బ్రహ్మ విచారమువలన, తానే బ్రహ్మ అని తెలుసుకొనును - “అహం బ్రహ్మస్మి” (నేనే బ్రహ్మను) అను జ్ఞానము కలుగును. బ్రహ్మజ్ఞానము కలవాడు బ్రహ్మమే యగును. “బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి” (బ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మమే యగును) - బ్రహ్మకు ఇతనికి భేదములేదు - బ్రహ్మతో ఐక్యమగును).
brahma pratipādakamagu vēdāṃta vākya vicāramu -
“tat satyaṃ”, “sa ātmā”, “tatvamasi”, “ayamātmā brahma”, “ahaṃ brahmasmi” - ani modalagu śrutivākyamulavalana jīva paramātmalu okaṭē. jīvuḍu tanayaṃdu avidyacēta kalpiṃcabaḍina saṃsāramunu nivartiṃcuṭakai brahmanu guṟiṃci telusukonavalenu - idi telusukonaḍamē vicāramu - vicāriṃcuṭa, brahmanu guṟiṃci cēsina vicāramu - brahma aṃṭē ēmiṭi? ani prayatniṃci telusukonuṭa. ī telusukonuṭavalana, ī brahma vicāramuvalana, tānē brahma ani telusukonunu - “ahaṃ brahmasmi” (nēnē brahmanu) anu jñānamu kalugunu. brahmajñānamu kalavāḍu brahmamē yagunu. “brahmavid brahmaiva bhavati” (brahmanu telusukoninavāḍu brahmamē yagunu) - brahmaku itaniki bhēdamulēdu - brahmatō aikyamagunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.