(అన్ని విధముల, అన్నియు నేనే (భగవంతుడే) యని, ఉత్సాహముతో నన్ను భజించువాడు నా భక్తుడు - భగవద్భక్తుడు.)
(నాయందే మిక్కిలి ప్రేమకలిగి - ప్రేమీ భక్తి కలిగి - నన్ను కీర్తించుచు, నా గుఱించి పాడుచు, నన్ను స్తోత్రము చేయుచు, నాకు నమస్కరించుచు యుండని బ్రతుకు ఒక బ్రతుకుకాదని, అన్నిక్రియల ప్రయోజనము నేనే అని ఎవడన్నియు చేయుచుండునో, అట్టివాడు నా భక్తుడు (భగవద్భక్తుడు)
(పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, పరమగురువు - గురుణాం గురుః - వాసుదేవుడు (అందఱిలోను, అన్నింటియందు నుండువాడు - అయిన నేనే సర్వాత్ముడు (అందఱికి ఆత్మ అయినవాడు, లేక, అందఱూ తానే అయినవాడు) అని నాయందు భావము కలిగియుండి, తను ఏది చేసినను, ఏది చూచినను, ఏది తినినను, ఏది ముట్టుకొనినను, అవన్నియు భగవంతుడైన వాసుదేవుడే అని, గ్రహము పట్టినవానివలె, మనస్సు కలిగి యుండువాడు నాభక్తుడు - (భగవద్భక్తుడు).
(anni vidhamula, anniyu nēnē (bhagavaṃtuḍē) yani, utsāhamutō nannu bhajiṃcuvāḍu nā bhaktuḍu - bhagavadbhaktuḍu.)
(nāyaṃdē mikkili prēmakaligi - prēmī bhakti kaligi - nannu kīrtiṃcucu, nā guṟiṃci pāḍucu, nannu stōtramu cēyucu, nāku namaskariṃcucu yuṃḍani bratuku oka bratukukādani, annikriyala prayōjanamu nēnē ani evaḍanniyu cēyucuṃḍunō, aṭṭivāḍu nā bhaktuḍu (bhagavadbhaktuḍu)
(paramēśvaruḍu sarvajñuḍu, paramaguruvu - guruṇāṃ guruḥ - vāsudēvuḍu (aṃdaṟilōnu, anniṃṭiyaṃdu nuṃḍuvāḍu - ayina nēnē sarvātmuḍu (aṃdaṟiki ātma ayinavāḍu, lēka, aṃdaṟū tānē ayinavāḍu) ani nāyaṃdu bhāvamu kaligiyuṃḍi, tanu ēdi cēsinanu, ēdi cūcinanu, ēdi tininanu, ēdi muṭṭukoninanu, avanniyu bhagavaṃtuḍaina vāsudēvuḍē ani, grahamu paṭṭinavānivale, manassu kaligi yuṃḍuvāḍu nābhaktuḍu - (bhagavadbhaktuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.