← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాధవః mādhavaḥ

Original — తెలుగు
  1. మా = శ్రీమహాలక్ష్మి, ధవుడు = భర్త - శ్రీమహాలక్ష్మియొక్క భర్త - శ్రీమహావిష్ణువు –

“లక్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీర్హరిప్రియా |

ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతా ||”

అని అమరకోశము - లక్ష్మి, పద్మాలయ, పద్మా, కమలా, శ్రీః, హరిప్రియా, ఇందిరా, లోకమాతా, మా, రమా, మంగళ దేవత - ఇవన్నియు శ్రీలక్ష్మీదేవి పేర్లు).

  1. “శ్లో. మా విద్యాచ హరేః ప్రోక్తా తస్యాః ఈశోయతో భవాన్ |

తస్మాత్ మాధవ నామాసి ధవః స్వామీతి శబ్దితః ||” ఇతి హరివంశే -

(మా అనగా శ్రీహరియొక్క విద్య - శక్తి, ధవుడు అనగా భర్త అని అర్థము. విష్ణు శక్తి అయిన శ్రీ లక్ష్మీదేవికి భర్త - శ్రీమహా విష్ణువు - మాధవుడు).

  1. మాయాః శ్రియాః ధవః పతిః మాధవః హరిః -

(యామా సామాయా - లేక మాయ యొక్క పతి - శ్రీ లక్ష్మీదేవి యొక్క భర్త, లేక మాయను స్వాధీనములో నుంచుకొనినవాడు - శ్రీమహావిష్ణువు. యామా = ఏది లేనిదో - సామాయా = అదేమాయ - లేనిదే, లేకుండుటే మాయ – ప్రపంచ కము కనుపించుచున్నట్లు అనుభవములోనున్నది. అది లేనిదే – ఎందుచేత ననగా అంతయు భగవంతుడే - ప్రపంచమనునది వేఱే లేదు - అందుచేత ప్రపంచకమున్నట్లు కనబడుట మాయ - ఈ మాయను తనస్వాధీనములో నుంచుకొనినవాడు దాని భర్త - అందుచేత మాధవుడు అనగా శ్రీమహావిష్ణువు).

  1. మాయాః అవిద్యయాః తస్యాః తస్తాః ధునోతి కంపయతి.

(అవిద్య లేక అజ్ఞానమును పోగొట్టువాడు, మాయ యనగా అవిద్య, లేక అజ్ఞానము).

  1. “మధుకులే జాతత్వాత్ మాధవః” (శ్రీశంకరః)

(మధువంశమున పుట్టినవాడు కనుక మాధవుడు)

మధుపుత్రస్య అపత్యం పుమాన్ మాధవః - మధోర్వంశజః.

(మధువు అనువాని పుత్రుని కుమారుడు కనుక మాధవుడు)

  1. మాయాః కపటరూపాయాః ధవః.

(కపట రూపముగల మాయకు భర్త).

  1. మధువిద్య నెఱింగినవాడు -

  2. “మౌనాత్ ధ్యానాత్ చ యోగాచ్చ విద్ధి, భారత, మాధవం” -

(మౌనముచేత, ధ్యానముచేత, యోగముచేత మాధవుని - శ్రీమహావిష్ణువును - తెలుసుకొనుము) - (ఈ మూడు కలియవలెను).

Transliteration
  1. mā = śrīmahālakṣmi, dhavuḍu = bharta - śrīmahālakṣmiyokka bharta - śrīmahāviṣṇuvu –

“lakmīḥ padmālayā padmā kamalā śrīrharipriyā |

iṃdirā lōkamātā mā ramā maṃgaḷadēvatā ||”

ani amarakōśamu - lakṣmi, padmālaya, padmā, kamalā, śrīḥ, haripriyā, iṃdirā, lōkamātā, mā, ramā, maṃgaḷa dēvata - ivanniyu śrīlakṣmīdēvi pērlu).

  1. “ślō. mā vidyāca harēḥ prōktā tasyāḥ īśōyatō bhavān |

tasmāt mādhava nāmāsi dhavaḥ svāmīti śabditaḥ ||” iti harivaṃśē -

(mā anagā śrīhariyokka vidya - śakti, dhavuḍu anagā bharta ani arthamu. viṣṇu śakti ayina śrī lakṣmīdēviki bharta - śrīmahā viṣṇuvu - mādhavuḍu).

  1. māyāḥ śriyāḥ dhavaḥ patiḥ mādhavaḥ hariḥ -

(yāmā sāmāyā - lēka māya yokka pati - śrī lakṣmīdēvi yokka bharta, lēka māyanu svādhīnamulō nuṃcukoninavāḍu - śrīmahāviṣṇuvu. yāmā = ēdi lēnidō - sāmāyā = adēmāya - lēnidē, lēkuṃḍuṭē māya – prapaṃca kamu kanupiṃcucunnaṭlu anubhavamulōnunnadi. adi lēnidē – eṃducēta nanagā aṃtayu bhagavaṃtuḍē - prapaṃcamanunadi vēṟē lēdu - aṃducēta prapaṃcakamunnaṭlu kanabaḍuṭa māya - ī māyanu tanasvādhīnamulō nuṃcukoninavāḍu dāni bharta - aṃducēta mādhavuḍu anagā śrīmahāviṣṇuvu).

  1. māyāḥ avidyayāḥ tasyāḥ tastāḥ dhunōti kaṃpayati.

(avidya lēka ajñānamunu pōgoṭṭuvāḍu, māya yanagā avidya, lēka ajñānamu).

  1. “madhukulē jātatvāt mādhavaḥ” (śrīśaṃkaraḥ)

(madhuvaṃśamuna puṭṭinavāḍu kanuka mādhavuḍu)

madhuputrasya apatyaṃ pumān mādhavaḥ - madhōrvaṃśajaḥ.

(madhuvu anuvāni putruni kumāruḍu kanuka mādhavuḍu)

  1. māyāḥ kapaṭarūpāyāḥ dhavaḥ.

(kapaṭa rūpamugala māyaku bharta).

  1. madhuvidya neṟiṃginavāḍu -

  2. “maunāt dhyānāt ca yōgācca viddhi, bhārata, mādhavaṃ” -

(maunamucēta, dhyānamucēta, yōgamucēta mādhavuni - śrīmahāviṣṇuvunu - telusukonumu) - (ī mūḍu kaliyavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.