అవ్యక్తంబు ప్రకృతియనుపేళ్ళ బరగు మాయవలన మహత్తత్వంబు పుట్టెను - ఆ మహత్తత్వమందు -
తే. కార్యకారణ కర్త్రాత్మకత్వమైన
మహిత భూతేద్రియక మనో మయమనంగ
దగు నహంకారతత్వ ముత్పన్నమయ్యె
గోరి సత్వరజస్తమో గుణకయగుచు
వెండియు రూపాంతరంబుల బొందుచున్న సాత్వికాహారంబువలన మనంబును, వైకారిక కార్యభూతంబులైన దేవతాగణంబులును సంభ వించెను. ఇంద్రియాధిష్ఠాతలైన వానివలన శబ్దంబు పూర్వంబున ప్రకా శంబగుటంజేసి జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రణంబులును, కర్మేంద్రియంబులైన వాక్వాణి పాద వాయూపస్థములును తైజసాహంకారంబున నుత్పన్నంబులయ్యె. తామసాహంకారమువలన శబ్ద స్పర్శ రూపరస గంధంబు లుదయించె. అందు శబ్దంబు నిజగుణంబయిన శబ్దంబువలన నాకాశంబు పుట్టించె. గగనంబు కాలమాయాంశల యోగంబున పుండరీ కాక్షు నిరీక్షణంబున స్పర్శ తన్మాత్రంబువలన వాయువుం గలిగించె. పవనుండు నభోబలంబున రూపతన్మాత్రంబువలన లోకలోచ నంబైన తేజంబునుత్పా దించె. తేజంబు కాలమాయాంశ యోగంబున ఉత్తమ శ్లోకును విలోకనంబున పనమానయుక్తంబగుచు రసతన్మాత్రంబువలన నంబువులం బుట్టిచె. సలిలంబు కాలమాయాంశ యోగంబున పరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజోయుక్తంబైన గంధగు తేజోయుక్తంబైన గంధగుణంబువలన పృధివి కలిగించె. అందు గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్ద స్పర్శంబునుం తేజంబునకు శబ్దస్పర్శ రూపంబును, సలిలంబునకు శబ్ద స్పర్శ రూప రసంబులును, పృధివికి శబ్ద స్పర్శ రూప రస గంధంబులు గుణంబులై యుండు. మహత్తు, అహంకారము పంచతన్మాత్రలు ఇవి ప్రకృతులు, వికృతులు నగును -
avyaktaṃbu prakṛtiyanupēḷḷa baragu māyavalana mahattatvaṃbu puṭṭenu - ā mahattatvamaṃdu -
tē. kāryakāraṇa kartrātmakatvamaina
mahita bhūtēdriyaka manō mayamanaṃga
dagu nahaṃkāratatva mutpannamayye
gōri satvarajastamō guṇakayagucu
veṃḍiyu rūpāṃtaraṃbula boṃducunna sātvikāhāraṃbuvalana manaṃbunu, vaikārika kāryabhūtaṃbulaina dēvatāgaṇaṃbulunu saṃbha viṃcenu. iṃdriyādhiṣṭhātalaina vānivalana śabdaṃbu pūrvaṃbuna prakā śaṃbaguṭaṃjēsi jñānēṃdriyaṃbulaina tvakcakṣu śrōtra jihvāghraṇaṃbulunu, karmēṃdriyaṃbulaina vākvāṇi pāda vāyūpasthamulunu taijasāhaṃkāraṃbuna nutpannaṃbulayye. tāmasāhaṃkāramuvalana śabda sparśa rūparasa gaṃdhaṃbu ludayiṃce. aṃdu śabdaṃbu nijaguṇaṃbayina śabdaṃbuvalana nākāśaṃbu puṭṭiṃce. gaganaṃbu kālamāyāṃśala yōgaṃbuna puṃḍarī kākṣu nirīkṣaṇaṃbuna sparśa tanmātraṃbuvalana vāyuvuṃ galigiṃce. pavanuṃḍu nabhōbalaṃbuna rūpatanmātraṃbuvalana lōkalōca naṃbaina tējaṃbunutpā diṃce. tējaṃbu kālamāyāṃśa yōgaṃbuna uttama ślōkunu vilōkanaṃbuna panamānayuktaṃbagucu rasatanmātraṃbuvalana naṃbuvulaṃ buṭṭice. salilaṃbu kālamāyāṃśa yōgaṃbuna paramēśvarānugrahaṃbu galigi tējōyuktaṃbaina gaṃdhagu tējōyuktaṃbaina gaṃdhaguṇaṃbuvalana pṛdhivi kaligiṃce. aṃdu gaganaṃbunaku śabdaṃbunu, vāyuvunaku śabda sparśaṃbunuṃ tējaṃbunaku śabdasparśa rūpaṃbunu, salilaṃbunaku śabda sparśa rūpa rasaṃbulunu, pṛdhiviki śabda sparśa rūpa rasa gaṃdhaṃbulu guṇaṃbulai yuṃḍu. mahattu, ahaṃkāramu paṃcatanmātralu ivi prakṛtulu, vikṛtulu nagunu -
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.