← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహద్బ్రహ్మ mahadbrahma

Original — తెలుగు
  1. జగత్తునంతకును కారణమైనదగుటచేత మహద్బ్రహ్మ.

  2. గొప్పదైన - పెద్దదైన ప్రకృతి.

  3. “మమయోనిర్మహద్బ్రహ్మ, తస్మిన్ గర్భం దదామ్యహం

సంభవః సర్వభూతానాం తతో భవతి భారతం ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 3)

“సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః (అ)హం బీజప్రదః పితా”.

(శ్రీమద్భగవద్గీత - 14 - 4)

“మమ స్వరూపభూతా మదీయా మాయా, త్రిగుణాత్మికా ప్రకృతిః యోనిః సర్వభూతానాం కారణం, సర్వ కార్యేభ్యో మహత్వాత్ కారణత్వాత్, బృమ్హణ త్వాచ్చ సవ్వికారాణాం మహత్ బ్రహ్మ ఇతి యోనిరేవ విశిష్యతే” (శ్రీశంకరః)

(ప్రపంచమును సృష్టించుటలో భగవంతుడు - పరబ్రహ్మ, పురుషుడు - జడమైన ప్రకృతిలో ప్రవేశించి తన చైతన్య శక్తిచే - పరాశక్తిచే దానిని చైతన్యవంతముగ చేసి దానిలోనుండి (ఒకదానిలోనుండి ఒకటిగా) సమస్త వస్తువులను పుట్టింప చేయుచున్నాడు. ఇట్లు ప్రకృతి పురుష సం యోగము వలననే సృష్టి జరుగుచున్నది కనుక భగవంతుడు సృష్టికి బీజము. ప్రకృతి యోని (ప్రపంచములోని వస్తువులు పుట్టుచోటు). ఆ ప్రకృతియే మహద్బ్రహ్మ, లేక చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పబడినది).

(సృష్టి ప్రారంభములో సృష్టిలోని సమస్త వస్తువు పుట్టుటకు మహద్బ్రహ్మ, లేక ప్రకృతి - చతుర్ముఖ బ్రహ్మ - యోని. సృష్టిప్రారంభమునుండి ఇప్పటి వఱకు, ఇక ముందుకూడ ఏ వస్తువు పుట్టినను, ఆ వస్తువు ఎందులోనుండి పుట్టినదో - అది మొదటి యోని - మహద్యోనియైన ప్రకృతియొక్క రూపమే అగుటచేత - అది దానికి యోని. ఇట్టి యోనులన్నింటికి కారణమైనది మొదటి కారణమగుటచేత ప్రకృతి - వస్తువులన్నింటికి మూల యోని - మహద్యోని, మహద్బ్రహ్మ - ప్రతి వస్తువులోని ప్రకృతియొక్క అంశ, భగవంతుని అంశ - రెండునూ కలిసియేయున్నవికనుక)

(నా స్వస్వరూపమే అయినటువంటిన్నీ, నా మాయయే అయినటూవంటిన్నీ, సత్వరజస్తమోగుణములు అను త్రిగుణములు కలిగినటువంటిదిన్నీ అయిన ప్రకృతియే సమస్త భూతములకు యోని - పుట్టుచోటు - కార్యవస్తువులన్నింటికంటెను గొప్పదగుటవలనను, పెద్దదగుటవలనను - జగత్తులోని వస్తువులకు కారణ మైనదగుటవలనను - ప్రపంచరూపములో వృద్ధిపొందునదగుట వలనను, దాని వికారములకంటె, ద్ఫాని కార్యవస్తువులకంటెను మహద్యోని యని చెప్పబడినది).

  1. “మహద్బ్రహ్మ ప్రకృతిః, సాచశ్రీః, భూః, దుర్గేతి భిన్నా ఉమా సరస్వత్యాద్యాస్తు తదంశయుతాః అన్యజీవాః - - మహద్బ్రహ్మ శబ్ద వాచ్యాపి ప్రకృతిరేవ, మహతీబ్రహ్మ బ్రహ్మణీద్వేతు ప్రకృతిశ్చ మహేశ్వరః” (శ్రీ ఆనందతీర్థః)

(మహద్బ్రహ్మ అనగా ప్రకృతి. ఆ ప్రకృతి శ్రీమహాలక్ష్మియని, భూదేవియని, దుర్గయని వేఱు వేఱుగా చెప్పబదుచున్నది. ఉమా (పార్వతి) సరస్వతి మొదలగునవి దాని అంశతో కూడియున్నవి. మహద్బ్రహ్మ అనగా ప్రకృతియే).

  1. “భూమిరాపో(అ)నలో వాయుః, ఖం, మనోబుద్ధి రేవచ |

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టథా ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 4)

అపరేయం ఇతి నిర్దిష్టో అచేతన ప్రకృతిః మహదహంకారాది వికారాణాం కారణతయా మహద్బ్రహ్మ ఇత్యుచ్యతే –

“ఇతస్తు అన్యాం ప్రకృతిం విద్దిమే పరాం |

జీవభూతాం సకలప్రాణి బీజతయా గభశబ్దేన ఉచ్యతే |

తస్మిన్న చేతనే యోని భూతే మహతి బ్రహ్మణి చేతన పుంజరూపం గర్భం దదామ - అచేతన ప్రకృత్యా భోగక్షేత్ర భూతయా భోక్తృవర్గ పుంజభూతాం చేతన ప్రకృతిం సం యోజయామీత్యర్థః” (శ్రీమాన్ రామానుజః)

(భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాసము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి ఎనిమిది విధములుగానున్నది. ఇది అపరా ప్రకృతి అని శ్రీమద్భగ వద్గీతలో చెప్పబడుటచేత ఇది అచేతన ప్రకృతి - జడము - మహత్తత్వము, అహ్నకారము మొదలగు వాని వికారములకు (మార్పులకు) కారణమగుటవలన - వాటిని పుట్టించినదగుటచేత - మహద్బ్రహ్మ యని చెప్పబడుచున్నది. “దీని కంటె వేఱైనది నా పరాప్రకృతి - జీవము అయినది” అని చెప్పుటవలన చేతన పుంచమైనది - చైతన్యఘనము - అంతా చైతన్యమే అయినది. సమస్త ప్రాణు లకు బీజమైనది కనుక గర్భము అని చెప్పబడినది. ఇట్లు అచేతనమైనటు వంటిన్నీ యోని అయినటువంటిన్నీ మహద్బ్రహ్మయందు “చేతన్మరూపమైన గర్భమునుంచుచున్నాను” అనగా అచేతనప్రకృతి భోగక్షేత్రము అయిన దానితో భోక్తయగు చేతన ప్రకృతిని - ఆ భోగస్థానముననుభవించు భోక్తను కలుపుచున్నాను - క్షేత్రముతో క్షేత్రజ్ఞుని కలుపుచున్నాను. ఇట్లు ప్రకృతి పురుష సం యోగము కలుగుచున్నది. దీనివలననే జగదుత్పత్తి కలుగుచున్నది).

  1. “మహతాం భూతానాం తత్కారణస్య అహంకారస్య తత్కారణస్య మహత్తత్వస్య చ కారణతయా తత్తత్కార్యోపేక్షయా మహత్వ విశేషిత బ్రహ్మత్వం అపి ఉపపన్నం బ్రహ్మ శబ్దశ్చ కారణత్వ బృహత్వాది సాదృశాత్ అబ్రహ్మణి అపి ప్రయోక్తుం యుజ్యతే”

(శ్రీవేదాంతదేశికః)

(మహాభూతములకు వాటికి కారణమైన అహంకారమునకు, దానికి కారణమైన మహత్తత్వమునకు కూడా కారణమగుటచేత అవన్నియు దీని కార్యములగుటచేత ప్రకృతి మహద్బ్రహ్మ అని చెప్పబడినది. ‘బ్రహ్మ’ అనగా బృహత్వముకలది - పెద్దదిగా పెరుగునది, కార్య వస్తువులన్నింటికి కారణమగు నది కనుక ప్రకృతి ‘బ్రహ్మ’ కాకపోయినను - పరబ్రహ్మ కాకపోయినను మహద్బ్రహ్మ అని చెప్పబడినది).

Transliteration
  1. jagattunaṃtakunu kāraṇamainadaguṭacēta mahadbrahma.

  2. goppadaina - peddadaina prakṛti.

  3. “mamayōnirmahadbrahma, tasmin garbhaṃ dadāmyahaṃ

saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bhārataṃ ||“. (śrīmadbhagavadgīta - 14 - 3)

“sarvayōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ tāsāṃ brahma mahadyōniḥ (a)haṃ bījapradaḥ pitā”.

(śrīmadbhagavadgīta - 14 - 4)

“mama svarūpabhūtā madīyā māyā, triguṇātmikā prakṛtiḥ yōniḥ sarvabhūtānāṃ kāraṇaṃ, sarva kāryēbhyō mahatvāt kāraṇatvāt, bṛmhaṇa tvācca savvikārāṇāṃ mahat brahma iti yōnirēva viśiṣyatē” (śrīśaṃkaraḥ)

(prapaṃcamunu sṛṣṭiṃcuṭalō bhagavaṃtuḍu - parabrahma, puruṣuḍu - jaḍamaina prakṛtilō pravēśiṃci tana caitanya śakticē - parāśakticē dānini caitanyavaṃtamuga cēsi dānilōnuṃḍi (okadānilōnuṃḍi okaṭigā) samasta vastuvulanu puṭṭiṃpa cēyucunnāḍu. iṭlu prakṛti puruṣa saṃ yōgamu valananē sṛṣṭi jarugucunnadi kanuka bhagavaṃtuḍu sṛṣṭiki bījamu. prakṛti yōni (prapaṃcamulōni vastuvulu puṭṭucōṭu). ā prakṛtiyē mahadbrahma, lēka caturmukha brahma ani ceppabaḍinadi).

(sṛṣṭi prāraṃbhamulō sṛṣṭilōni samasta vastuvu puṭṭuṭaku mahadbrahma, lēka prakṛti - caturmukha brahma - yōni. sṛṣṭiprāraṃbhamunuṃḍi ippaṭi vaṟaku, ika muṃdukūḍa ē vastuvu puṭṭinanu, ā vastuvu eṃdulōnuṃḍi puṭṭinadō - adi modaṭi yōni - mahadyōniyaina prakṛtiyokka rūpamē aguṭacēta - adi dāniki yōni. iṭṭi yōnulanniṃṭiki kāraṇamainadi modaṭi kāraṇamaguṭacēta prakṛti - vastuvulanniṃṭiki mūla yōni - mahadyōni, mahadbrahma - prati vastuvulōni prakṛtiyokka aṃśa, bhagavaṃtuni aṃśa - reṃḍunū kalisiyēyunnavikanuka)

(nā svasvarūpamē ayinaṭuvaṃṭinnī, nā māyayē ayinaṭūvaṃṭinnī, satvarajastamōguṇamulu anu triguṇamulu kaliginaṭuvaṃṭidinnī ayina prakṛtiyē samasta bhūtamulaku yōni - puṭṭucōṭu - kāryavastuvulanniṃṭikaṃṭenu goppadaguṭavalananu, peddadaguṭavalananu - jagattulōni vastuvulaku kāraṇa mainadaguṭavalananu - prapaṃcarūpamulō vṛddhipoṃdunadaguṭa valananu, dāni vikāramulakaṃṭe, dphāni kāryavastuvulakaṃṭenu mahadyōni yani ceppabaḍinadi).

  1. “mahadbrahma prakṛtiḥ, sācaśrīḥ, bhūḥ, durgēti bhinnā umā sarasvatyādyāstu tadaṃśayutāḥ anyajīvāḥ - - mahadbrahma śabda vācyāpi prakṛtirēva, mahatībrahma brahmaṇīdvētu prakṛtiśca mahēśvaraḥ” (śrī ānaṃdatīrthaḥ)

(mahadbrahma anagā prakṛti. ā prakṛti śrīmahālakṣmiyani, bhūdēviyani, durgayani vēṟu vēṟugā ceppabaducunnadi. umā (pārvati) sarasvati modalagunavi dāni aṃśatō kūḍiyunnavi. mahadbrahma anagā prakṛtiyē).

  1. “bhūmirāpō(a)nalō vāyuḥ, khaṃ, manōbuddhi rēvaca |

ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛtiraṣṭathā ||“. (śrīmadbhagavadgīta - 7 - 4)

aparēyaṃ iti nirdiṣṭō acētana prakṛtiḥ mahadahaṃkārādi vikārāṇāṃ kāraṇatayā mahadbrahma ityucyatē –

“itastu anyāṃ prakṛtiṃ viddimē parāṃ |

jīvabhūtāṃ sakalaprāṇi bījatayā gabhaśabdēna ucyatē |

tasminna cētanē yōni bhūtē mahati brahmaṇi cētana puṃjarūpaṃ garbhaṃ dadāma - acētana prakṛtyā bhōgakṣētra bhūtayā bhōktṛvarga puṃjabhūtāṃ cētana prakṛtiṃ saṃ yōjayāmītyarthaḥ” (śrīmān rāmānujaḥ)

(bhūmi, jalamu, agni, vāyuvu, ākāsamu, manassu, buddhi, ahaṃkāramu ani nā prakṛti enimidi vidhamulugānunnadi. idi aparā prakṛti ani śrīmadbhaga vadgītalō ceppabaḍuṭacēta idi acētana prakṛti - jaḍamu - mahattatvamu, ahnakāramu modalagu vāni vikāramulaku (mārpulaku) kāraṇamaguṭavalana - vāṭini puṭṭiṃcinadaguṭacēta - mahadbrahma yani ceppabaḍucunnadi. “dīni kaṃṭe vēṟainadi nā parāprakṛti - jīvamu ayinadi” ani ceppuṭavalana cētana puṃcamainadi - caitanyaghanamu - aṃtā caitanyamē ayinadi. samasta prāṇu laku bījamainadi kanuka garbhamu ani ceppabaḍinadi. iṭlu acētanamainaṭu vaṃṭinnī yōni ayinaṭuvaṃṭinnī mahadbrahmayaṃdu “cētanmarūpamaina garbhamunuṃcucunnānu” anagā acētanaprakṛti bhōgakṣētramu ayina dānitō bhōktayagu cētana prakṛtini - ā bhōgasthānamunanubhaviṃcu bhōktanu kalupucunnānu - kṣētramutō kṣētrajñuni kalupucunnānu. iṭlu prakṛti puruṣa saṃ yōgamu kalugucunnadi. dīnivalananē jagadutpatti kalugucunnadi).

  1. “mahatāṃ bhūtānāṃ tatkāraṇasya ahaṃkārasya tatkāraṇasya mahattatvasya ca kāraṇatayā tattatkāryōpēkṣayā mahatva viśēṣita brahmatvaṃ api upapannaṃ brahma śabdaśca kāraṇatva bṛhatvādi sādṛśāt abrahmaṇi api prayōktuṃ yujyatē”

(śrīvēdāṃtadēśikaḥ)

(mahābhūtamulaku vāṭiki kāraṇamaina ahaṃkāramunaku, dāniki kāraṇamaina mahattatvamunaku kūḍā kāraṇamaguṭacēta avanniyu dīni kāryamulaguṭacēta prakṛti mahadbrahma ani ceppabaḍinadi. ‘brahma’ anagā bṛhatvamukaladi - peddadigā perugunadi, kārya vastuvulanniṃṭiki kāraṇamagu nadi kanuka prakṛti ‘brahma’ kākapōyinanu - parabrahma kākapōyinanu mahadbrahma ani ceppabaḍinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.