← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాదేవుడు mahādēvuḍu

Original — తెలుగు
  1. మహాంశ్చాసౌ దేవశ్చ మహదేవః-

(గొప్పవాడు, దేవుడు అయినవాడు - తేజశ్శాలి అయిన దేవుడు - శివుడు).

  1. దీవ్య తీతి దేవః, మహాంశ్చాసే దేవశ్చ మహా దేవః. (ప్రకాశించువాడు, దేవుడు కనుక మహాదేవుడు).

  2. అపరిచ్ఛిన్న ప్రకాశరూపః. (అంతములేని ప్రకాశమే రూపముగా గలవాడు).

  3. మహత్వాత్ మహాదేవః -

(మహత్వము కలిగియుండిటచేత, ప్రకాశముకలవాడు కనుక మహాదేవుడు).

  1. దీప్యతే ఇతి దేవః, స్వప్రకాశః, మహాన్ కాలదేశవస్తుకృత పరిచ్ఛేద రహితః, నిత్యపరిపూర్ణ సర్వ చైతన్య స్వరూపః ఇత్యర్థః -

(పకాశించువాడుకనుక దేవుడు - తనంతటతానే ప్రకాశించువాడు, కాలమువలన కాని, దేశమువలనగాని వస్తువువలనగాని పరిచ్ఛేదము - పరిమితి - లేనివాడు కనుక మహత్ అని చెప్పబడెను - ఎల్లపుడు పూర్తిగానుండు చైతన్య స్వరూపుడు - సృష్టిలోనున్న వస్తువులన్నింటిలోను తన చైతన్యమును - చిచ్ఛక్తిని - ప్రవేశింప చేసినను తరగని చైతన్యశక్తి గలవాడు).

  1. “సర్వాన్ భవాన్ పరిత్యజ్య ఆత్మజ్ఞాన యోగైశ్వర్యే మహతి మహీయతే, తస్మాదుచ్యతే మహదేవః”. (శ్రీశంకరః)

“సర్వాన్ భవాన్ సకల పదార్థాన్ పరిత్యజ్య సమంతాత్ త్యక్త్వా, ఆత్మజ్ఞాన యోగైశ్వర్యే”అహం బ్రహ్మస్మి” త్యాత్మ జ్ఞానం, తదేవ యోగైశ్వర్యం, తస్మిన్ మహతి ప్రౌఢే నిష్ఠా లబ్ధ్వా పరమానంద రూపస్వాత్మతత్వ స్ఫూర్తి వశాత్ మహీయతే - అధవా, సర్వాన్ భవాన్ పరిత్యజ్య బాహ్య విషయాసక్తిం పరిత్యజ్య ఆత్మజ్ఞాన యోగైశ్వర్యే విషయీ కృతస్సన్ యోగి భిర్మహీయతే, పూజ్యతే - యోగినాం యో వేదాంత మహావాక్య జన్య సాక్షాత్కారః తస్య విషయో భవతి యోగిభిః జ్ఞానేన సర్వదా పూజ్యత ఈత్యర్థః - “జ్ఞానమేవ శివార్చన మిష్యతే” ఇతి స్మరణాత్. అధవా, మహాంశ్చాసౌ దేవశ్చ మహాదేవః. దీప్యతే ఇతి దేవః స్వప్రకాశః మహాన్ కాలదేశ వస్తుకృత పరిచ్ఛేద రహితః, నిత్య పరిపూర్ణ సర్వ చైతన్య స్వరూప ఇత్యర్థః”

(పదార్థములన్నింటిని పూర్తిగా విడిచిపెట్టి “నేనే బ్రహ్మను అయితిని” అను మహావాక్యములోని ఆత్మజ్ఞానమను యోగైశ్వర్యమునందు గొప్ప నిష్ట కలిగియుండి పరమానందరూపమైన తన ఆత్మతత్వస్ఫూర్తిచే గొప్పవాడు కనుక మహాదేవుడు, లేక, సమస్తమైన బాహ్య విషయములను విడిచిపెట్టి, ఆత్మజ్ఞాన విషయమందే మనస్సు నిలిపి - ఆత్మజ్ఞానమే విషయముగా చేసుకొని ధ్యానించుచు పూజింపబడువాడు. యోగులకు మహావాక్యముద్వారా కలిగిన సాక్షాత్కారము వారికి విషయముగా కలవాడు - అనగా, యోగులచేత ఎల్లపుడు పూజింపబడువాడు - బ్రహ్మజ్ఞానమనగా శివుని అర్చించుటయే యని చెప్పబడియున్నది-) (చూడుము - 1 to 5).

  1. “యః సర్వాన్ స్వాతిరిక్త భావాన్ పరిత్యజ్య మిధ్యాత్మత్వేన నిరస్య స్వాత్మజ్ఞాన యోగైశ్చర్యే స్వమహిమ్నే మహతి మహీయతే సో యం మహాదేవః పరమాత్మా ఇత్యర్థః.”

(ఆత్మకాని సమస్త విషయములు మిధ్యలు అని వాటిని విడిచిపెట్టి ఆత్మజ్ఞానమే యోగమను ఐశ్వర్యమందు - అనగా, స్వమహిమయందు - గొప్పవాడు కనుక మహా దేవుడు - పరమాత్మ).

  1. ధ్యానాది యోగ్య విగ్రహ పరిగ్రహాది క్రీడావంతో దేవాః, తేషాం ప్రశస్తో మహా దేవః - క్రియాశక్తి మధిష్టాయ యో అంబికయాసహ జగదనుగృష్ణాతి సమహా దేవః. అధవా, యః సర్వాన్ భావాన్ పతిత్యజ్య ఆత్మజ్ఞానైశ్వర్యే మహతి మహీయతే, తస్మాత్ ఉచ్యతే మహాదేవ ఇతి.

(ధ్యానము మొదలగు యోగమందు నిగ్రహ పరిగ్రహములందు క్రీడించువారు దేవతులు. అట్టి దేవతులలో ప్రశస్తమైనవాడు కనుక మహాదేవుడు. పార్వతితో సహ జ్ఞానశక్తి నధిష్టించియుండి జగత్తును అనుగ్రహించువాడు కనుక మహా శేవుడు - లేక, - సమస్త విషయములను వదలివేసి ఆత్మజ్ఞానమను ఐశ్వర్యమందే గొప్పవాడైనవాడు - అందుచేత మహా దేవుడని చెప్పబడుచున్నాడు -

  1. “యే నేదం భ్రామ్యతే చక్రం యదాకాశాంతరం మహత్ | యోగిభిర్విద్యతే తత్వం మహా దేవస్స శంకరః”. (బ్రహ్మాండపురాణే)

(ఆకాశము మధ్యలోనున్న ఈ జగచ్చక్రం ఎవనిచేత తిరుగుచున్నదో, ఎవని శక్తివలన నడచుచున్నదో, యోగులు ఎవనిని పరబ్రహ్మతత్వము - ఆత్మతత్వము - అని తెలియుదురో అతనే మహా దేవుడు - శివుడు).

  1. “ఏష దేవో మహా దేవో విజ్ఞేయస్తు మహేశ్వరః |

న తస్మాత్ పరం కించిత్ పదం సమధి గమ్యతే “. (స్కాందే)

(ఈ దేవుడే - మహేశ్వరుడే - మహా దేవుడు - అతనికి మించినపదము - ఉత్కృష్టమైనపదము, పరమపదము - మఱియొకటిలేదు).

  1. “న పశ్యామి మహా దేవా దధికం దేవతాంతరం |

దేవా అపి తమేవార్థం ప్రాహుః స్వాయం భువాంతరే ||“. (మహాభారతే)

(మహ దేవినికన్న అధికుడైన దేవుడు ఈ బ్రహ్మాండములో లేడు. దేవతలుకూడ ఈ యర్థమునే చెప్పచున్నారు -).

  1. త్రివిధ పరిచ్ఛేద రాహిత్యం హి తస్య మహత్వం పరమం మహత్వం పరమేశ్వరస్య స్వరూపం, న చ స్వభావః. “ఏకమేవా ద్వితీయం” ఇతి స్వగత, స్వజాతీయ విజాతీయ భేద నిరాసస్య శ్రుత్యా ప్రతిపాది తత్వాత్.

(దేశకాల వస్తువులను మూడు విధముల పరిచ్ఛేదము - పరిమితి - లేకుండుటయే మహా దేవుని యొక్క మహత్వము. పరమేశ్వరునియొక్క రూపమే - స్వయం ప్రకాశమే - అతని రూపమే, అతని స్వభావముకాదు - బ్రహ్మ యనువాడొక్కడే, అట్టివాడు మఱియొకడు లేడు - అని ఉపనిషత్తులలో చెప్పిన స్వజాతీయ, విజాతీయ స్వగత భేదము లేనివాడు - అని చెప్పుటయే -

  1. విశ్వం తస్మాద్ధి సంభూతం తస్మిం స్థిష్టతి శంకరే |

లయమేష్యతి తత్త్రైవ క్రియతే తచ్చ లీలయా |

స ఏవాత్మా మహా దేవః సర్వేషామేవ దేహినాం ||“. (ఆదిత్యపురాణే)

(ప్రపంచమంతయు శంకరుని నుండి పుట్టుచున్నది, అరనిలోనే యుంటున్నది, అతనిలోనే లయమగుచున్నది. అతని లీల వలన ఇది జరుగుచున్నది. సమస్త దేహులకు - దేహముగలారలకు అతనే ఆత్మ, అతనే మహాదేవుడు).

  1. “అల పతంజలి కృతంబైన భాష్యమునకే పరిఢవిల్లును మహా భాష్యపదము

- - - అల దేవదేవుడై యలరారు శివునకే తేజరిల్లును మహా దేవ పదము - - -“. (తిరుపతివెంకట కవులు)

Transliteration
  1. mahāṃścāsau dēvaśca mahadēvaḥ-

(goppavāḍu, dēvuḍu ayinavāḍu - tējaśśāli ayina dēvuḍu - śivuḍu).

  1. dīvya tīti dēvaḥ, mahāṃścāsē dēvaśca mahā dēvaḥ. (prakāśiṃcuvāḍu, dēvuḍu kanuka mahādēvuḍu).

  2. aparicchinna prakāśarūpaḥ. (aṃtamulēni prakāśamē rūpamugā galavāḍu).

  3. mahatvāt mahādēvaḥ -

(mahatvamu kaligiyuṃḍiṭacēta, prakāśamukalavāḍu kanuka mahādēvuḍu).

  1. dīpyatē iti dēvaḥ, svaprakāśaḥ, mahān kāladēśavastukṛta paricchēda rahitaḥ, nityaparipūrṇa sarva caitanya svarūpaḥ ityarthaḥ -

(pakāśiṃcuvāḍukanuka dēvuḍu - tanaṃtaṭatānē prakāśiṃcuvāḍu, kālamuvalana kāni, dēśamuvalanagāni vastuvuvalanagāni paricchēdamu - parimiti - lēnivāḍu kanuka mahat ani ceppabaḍenu - ellapuḍu pūrtigānuṃḍu caitanya svarūpuḍu - sṛṣṭilōnunna vastuvulanniṃṭilōnu tana caitanyamunu - cicchaktini - pravēśiṃpa cēsinanu taragani caitanyaśakti galavāḍu).

  1. “sarvān bhavān parityajya ātmajñāna yōgaiśvaryē mahati mahīyatē, tasmāducyatē mahadēvaḥ”. (śrīśaṃkaraḥ)

“sarvān bhavān sakala padārthān parityajya samaṃtāt tyaktvā, ātmajñāna yōgaiśvaryē”ahaṃ brahmasmi” tyātma jñānaṃ, tadēva yōgaiśvaryaṃ, tasmin mahati prauḍhē niṣṭhā labdhvā paramānaṃda rūpasvātmatatva sphūrti vaśāt mahīyatē - adhavā, sarvān bhavān parityajya bāhya viṣayāsaktiṃ parityajya ātmajñāna yōgaiśvaryē viṣayī kṛtassan yōgi bhirmahīyatē, pūjyatē - yōgināṃ yō vēdāṃta mahāvākya janya sākṣātkāraḥ tasya viṣayō bhavati yōgibhiḥ jñānēna sarvadā pūjyata ītyarthaḥ - “jñānamēva śivārcana miṣyatē” iti smaraṇāt. adhavā, mahāṃścāsau dēvaśca mahādēvaḥ. dīpyatē iti dēvaḥ svaprakāśaḥ mahān kāladēśa vastukṛta paricchēda rahitaḥ, nitya paripūrṇa sarva caitanya svarūpa ityarthaḥ”

(padārthamulanniṃṭini pūrtigā viḍicipeṭṭi “nēnē brahmanu ayitini” anu mahāvākyamulōni ātmajñānamanu yōgaiśvaryamunaṃdu goppa niṣṭa kaligiyuṃḍi paramānaṃdarūpamaina tana ātmatatvasphūrticē goppavāḍu kanuka mahādēvuḍu, lēka, samastamaina bāhya viṣayamulanu viḍicipeṭṭi, ātmajñāna viṣayamaṃdē manassu nilipi - ātmajñānamē viṣayamugā cēsukoni dhyāniṃcucu pūjiṃpabaḍuvāḍu. yōgulaku mahāvākyamudvārā kaligina sākṣātkāramu vāriki viṣayamugā kalavāḍu - anagā, yōgulacēta ellapuḍu pūjiṃpabaḍuvāḍu - brahmajñānamanagā śivuni arciṃcuṭayē yani ceppabaḍiyunnadi-) (cūḍumu - 1 to 5).

  1. “yaḥ sarvān svātirikta bhāvān parityajya midhyātmatvēna nirasya svātmajñāna yōgaiścaryē svamahimnē mahati mahīyatē sō yaṃ mahādēvaḥ paramātmā ityarthaḥ.”

(ātmakāni samasta viṣayamulu midhyalu ani vāṭini viḍicipeṭṭi ātmajñānamē yōgamanu aiśvaryamaṃdu - anagā, svamahimayaṃdu - goppavāḍu kanuka mahā dēvuḍu - paramātma).

  1. dhyānādi yōgya vigraha parigrahādi krīḍāvaṃtō dēvāḥ, tēṣāṃ praśastō mahā dēvaḥ - kriyāśakti madhiṣṭāya yō aṃbikayāsaha jagadanugṛṣṇāti samahā dēvaḥ. adhavā, yaḥ sarvān bhāvān patityajya ātmajñānaiśvaryē mahati mahīyatē, tasmāt ucyatē mahādēva iti.

(dhyānamu modalagu yōgamaṃdu nigraha parigrahamulaṃdu krīḍiṃcuvāru dēvatulu. aṭṭi dēvatulalō praśastamainavāḍu kanuka mahādēvuḍu. pārvatitō saha jñānaśakti nadhiṣṭiṃciyuṃḍi jagattunu anugrahiṃcuvāḍu kanuka mahā śēvuḍu - lēka, - samasta viṣayamulanu vadalivēsi ātmajñānamanu aiśvaryamaṃdē goppavāḍainavāḍu - aṃducēta mahā dēvuḍani ceppabaḍucunnāḍu -

  1. “yē nēdaṃ bhrāmyatē cakraṃ yadākāśāṃtaraṃ mahat | yōgibhirvidyatē tatvaṃ mahā dēvassa śaṃkaraḥ”. (brahmāṃḍapurāṇē)

(ākāśamu madhyalōnunna ī jagaccakraṃ evanicēta tirugucunnadō, evani śaktivalana naḍacucunnadō, yōgulu evanini parabrahmatatvamu - ātmatatvamu - ani teliyudurō atanē mahā dēvuḍu - śivuḍu).

  1. “ēṣa dēvō mahā dēvō vijñēyastu mahēśvaraḥ |

na tasmāt paraṃ kiṃcit padaṃ samadhi gamyatē “. (skāṃdē)

(ī dēvuḍē - mahēśvaruḍē - mahā dēvuḍu - ataniki miṃcinapadamu - utkṛṣṭamainapadamu, paramapadamu - maṟiyokaṭilēdu).

  1. “na paśyāmi mahā dēvā dadhikaṃ dēvatāṃtaraṃ |

dēvā api tamēvārthaṃ prāhuḥ svāyaṃ bhuvāṃtarē ||“. (mahābhāratē)

(maha dēvinikanna adhikuḍaina dēvuḍu ī brahmāṃḍamulō lēḍu. dēvatalukūḍa ī yarthamunē ceppacunnāru -).

  1. trividha paricchēda rāhityaṃ hi tasya mahatvaṃ paramaṃ mahatvaṃ paramēśvarasya svarūpaṃ, na ca svabhāvaḥ. “ēkamēvā dvitīyaṃ” iti svagata, svajātīya vijātīya bhēda nirāsasya śrutyā pratipādi tatvāt.

(dēśakāla vastuvulanu mūḍu vidhamula paricchēdamu - parimiti - lēkuṃḍuṭayē mahā dēvuni yokka mahatvamu. paramēśvaruniyokka rūpamē - svayaṃ prakāśamē - atani rūpamē, atani svabhāvamukādu - brahma yanuvāḍokkaḍē, aṭṭivāḍu maṟiyokaḍu lēḍu - ani upaniṣattulalō ceppina svajātīya, vijātīya svagata bhēdamu lēnivāḍu - ani ceppuṭayē -

  1. viśvaṃ tasmāddhi saṃbhūtaṃ tasmiṃ sthiṣṭati śaṃkarē |

layamēṣyati tattraiva kriyatē tacca līlayā |

sa ēvātmā mahā dēvaḥ sarvēṣāmēva dēhināṃ ||“. (ādityapurāṇē)

(prapaṃcamaṃtayu śaṃkaruni nuṃḍi puṭṭucunnadi, aranilōnē yuṃṭunnadi, atanilōnē layamagucunnadi. atani līla valana idi jarugucunnadi. samasta dēhulaku - dēhamugalāralaku atanē ātma, atanē mahādēvuḍu).

  1. “ala pataṃjali kṛtaṃbaina bhāṣyamunakē pariḍhavillunu mahā bhāṣyapadamu

- - - ala dēvadēvuḍai yalarāru śivunakē tējarillunu mahā dēva padamu - - -“. (tirupativeṃkaṭa kavulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.