ఈ యవస్థా త్రయానకున్నూ సాక్షియైన కారణానకున్నూ మహాకారణమైన శరీర లక్షణమేలాగంటే - సద్యోజాత వామదేవాది పంచబ్రహ్మలే పంచ భూతములు - అది యేలాగంటేను –
“సద్యో జాతస్తథా, భూమీ వామదే వాద్భవే జ్జలం |
అఘోరా ద్వహి రుత్పన్నః తత్పురుషా ద్వాయురుచ్యతే |
ఈశానాద్గగనాకారం పంచ బ్రహ్మమయం జగత్ ||“.
అని కలదుకనుక పంచభూతాలకున్నూ ఉత్పత్తి హేతువులయిన పంచ బ్రహ్మలే యీ శరీరానకు - మహాకారణ శరీరానకు - పంచభూతాలు - నివృత్తి, ప్రతిష్ఠా, విద్యా, శాంతి శాంత్యంతమనెడి పంచకళలే పంచ విష్యాలు. పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞాన శక్తి, ఇచ్ఛాక్తి, క్రియా శక్తి - యీ పంచశక్తులే ప్రరేపకస్వరూపా లైన పంచవాయువులు.
“బ్రహ్మ విష్ణుశ్చ రద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః”.
ఈ పంచకర్తలున్నూ అంతఃకరణపంచకము - ఈ యిరువది యైదు తత్వాలున్నూ గూడి మహాకారణ శరీరము. దీని అభిమాని ప్రత్యగాత్మ ఇందున వ్యాపక స్వరూపమైనది నిర్మలాత్మ. ఆతండె కూతస్థ చైతన్యుండు. (బ్రహ్మవిధ్యాసుధార్ణవము - 6)
ī yavasthā trayānakunnū sākṣiyaina kāraṇānakunnū mahākāraṇamaina śarīra lakṣaṇamēlāgaṃṭē - sadyōjāta vāmadēvādi paṃcabrahmalē paṃca bhūtamulu - adi yēlāgaṃṭēnu –
“sadyō jātastathā, bhūmī vāmadē vādbhavē jjalaṃ |
aghōrā dvahi rutpannaḥ tatpuruṣā dvāyurucyatē |
īśānādgaganākāraṃ paṃca brahmamayaṃ jagat ||“.
ani kaladukanuka paṃcabhūtālakunnū utpatti hētuvulayina paṃca brahmalē yī śarīrānaku - mahākāraṇa śarīrānaku - paṃcabhūtālu - nivṛtti, pratiṣṭhā, vidyā, śāṃti śāṃtyaṃtamaneḍi paṃcakaḷalē paṃca viṣyālu. parāśakti, ādiśakti, jñāna śakti, icchākti, kriyā śakti - yī paṃcaśaktulē prarēpakasvarūpā laina paṃcavāyuvulu.
“brahma viṣṇuśca radraśca īśvaraśca sadāśivaḥ”.
ī paṃcakartalunnū aṃtaḥkaraṇapaṃcakamu - ī yiruvadi yaidu tatvālunnū gūḍi mahākāraṇa śarīramu. dīni abhimāni pratyagātma iṃduna vyāpaka svarūpamainadi nirmalātma. ātaṃḍe kūtastha caitanyuṃḍu. (brahmavidhyāsudhārṇavamu - 6)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.