← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాకర్తా mahākartā

Original — తెలుగు
  1. “రాగద్వేషౌ సుఖం దుఃఖం ధర్మాధర్మే ఫలాఫలే |

యఃకరోత్యనపేక్త్యైవ మహాకర్తా స ఉచ్యతే ||“. (వాసిష్టే)

“యః పుమాన రాగద్వేషాదీన్ కారణత్వేన, కార్యత్వేన వా, అనపేక్ష్యైవ కరోతి, రాగాదికం స్వప్రవృత్తౌ హేతుత్వే నాపి నాపేక్షతే, ప్రయోజనత్వేనాపి నాపేక్షతే, స మహాకర్తా ఉచ్యతే”.

(రాగద్వేషములు, సుఖదుఃఖములు, ధర్మాధర్మములు ఫలాఫలములు - వీటిని ఏదైన కారణముచేతగాని, కార్యము రూపముగాగాని, ఒక ప్రయోజనము నపేక్షింపకయే చేయువాడు మహాకర్త)

  1. “మౌనవాన్ నిరహం భావో నిర్మా భోగతమత్సరః |

యః కరోతి గతోద్వేగం మహాకర్తా స ఉచ్యతే“.

“యః పుమాన్ మౌనవాన్ ఇదం కరిష్యామీతి న వక్తి; నిరహంభావః = అహమేవాస్య కర్తా ఇతి నాహం కరోతి; నిర్మానః = స్వస్మిన్ కార్యేవా ఉత్కర్షం న మన్యతే; గత మత్సరః = పర శుభ ప్రద్వేష రహితః - ఇదం భూతస్సన్, గతోద్వేగం = అవ్యాకుల మేవ కరోతి సోపి మహాకర్తా ఇత్యుచ్యతే”.

(చేసిన పనులు, తాను చేసినట్లు చెప్పక మౌనము వహించువాడు; ఈ పనికి నేనే కర్తను - ఈ పని నేనే చేయుచున్నాను అను అహంభావము లేనివాడు, తను చేయు కార్యమందలిగొప్పతనము తలంచనివాడు, ఇతరుల సుఖమును చూచి ద్వేషించనివాడు, - ఇటువంటివాడు వ్యాకులతలేని మనస్సు కలిగి పని చేయువాడు మహాకర్త అని చెప్పబడుచున్నాడు).

  1. “సర్వత్ర విగతస్నేహా యస్సాక్షి వదవ స్థితః |

నిరిచ్ఛో వర్తతే కార్యే మహాకర్తా స ఉచ్యతే |

ఉద్వేగానంద రహితః సమయా స్వచ్ఛయా ద్రియం |

న శోచతి. నచోనేతి మహాకర్తా స ఉచ్యతే||“.

“యః పుమాన్ ఉద్వేగానందరహితః క్రియమాణమిదంకార్యం నిష్పలం భవిష్యతీతి ఉద్యోగో భీతిః, ప్రీతిరానందః తద్రహితః, సమయా, స్వచ్ఛయా దియా కుర్వన్ న శోచతి, కార్యాసిద్ధౌ న విషీదతి, సిద్ధౌ న చోదేతి, నహృష్యతి స మహాకర్తా ఉచ్యతే”.

(దేనియందును స్నేహభావములేక - అనురాగములేక, సాక్షివలె తటస్థుడుగా నుండువాడును, చేయుచున్న పనియందు కోరికలేనివాడును - ఇట్టివాడు మహాకర్త అని చెప్పబడుచున్నాడు - నేను చేయు ఈ కార్యము ఫలములేకుండపోవును - పనికి రాకుండ పోవును - అను భయమువలన కలుగు ఉద్వేగముగాని, లేక, అవి ఫలించునను ఆనందముగాని లేనివాడు, మనశ్శుద్ధికలిగి పనిచేయుచు, కార్యము సిద్ధించనపుడు విచారింపక, సిద్ధించినపుడు ఉద్వేగము పొందక నుండువాడు మహాకర్త).

  1. “జన్మ స్థితి వినాశేషు సోదయాస్తమయే ష్వలం |

సమమేవ మనో యస్య మహాకర్తా స ఉచ్యతే ||“. (వాసిష్టే)

“యస్య మనః వస్తూనాం సోదయాస్తమ యేషం |

జన్మస్థితి వినాశేషు సమమేవ స మహాకర్తా ఉచ్యతే |

ఉదయాస్తమయే దఋశనా దర్శనే తిష్టతి, వినశ్యతి దృశ్యమానే అదృశ్యమానే అపి వా సమం ఏక ప్రకారమేవ స మహాకర్తా ఉచ్యతే“.

(వస్తువులు జన్మ స్థితి లయములను పొందిటను చూచి అవి కనబడినపుడు, కనబడకపోవునపుడైనను ఒకే మనస్సు కలవాడు - ఒకే విధమైన మనస్సు కలవాడు మహాకర్త యని చెప్పబడుచున్నాడు).

Transliteration
  1. “rāgadvēṣau sukhaṃ duḥkhaṃ dharmādharmē phalāphalē |

yaḥkarōtyanapēktyaiva mahākartā sa ucyatē ||“. (vāsiṣṭē)

“yaḥ pumāna rāgadvēṣādīn kāraṇatvēna, kāryatvēna vā, anapēkṣyaiva karōti, rāgādikaṃ svapravṛttau hētutvē nāpi nāpēkṣatē, prayōjanatvēnāpi nāpēkṣatē, sa mahākartā ucyatē”.

(rāgadvēṣamulu, sukhaduḥkhamulu, dharmādharmamulu phalāphalamulu - vīṭini ēdaina kāraṇamucētagāni, kāryamu rūpamugāgāni, oka prayōjanamu napēkṣiṃpakayē cēyuvāḍu mahākarta)

  1. “maunavān nirahaṃ bhāvō nirmā bhōgatamatsaraḥ |

yaḥ karōti gatōdvēgaṃ mahākartā sa ucyatē”.

“yaḥ pumān maunavān idaṃ kariṣyāmīti na vakti; nirahaṃbhāvaḥ = ahamēvāsya kartā iti nāhaṃ karōti; nirmānaḥ = svasmin kāryēvā utkarṣaṃ na manyatē; gata matsaraḥ = para śubha pradvēṣa rahitaḥ - idaṃ bhūtassan, gatōdvēgaṃ = avyākula mēva karōti sōpi mahākartā ityucyatē”.

(cēsina panulu, tānu cēsinaṭlu ceppaka maunamu vahiṃcuvāḍu; ī paniki nēnē kartanu - ī pani nēnē cēyucunnānu anu ahaṃbhāvamu lēnivāḍu, tanu cēyu kāryamaṃdaligoppatanamu talaṃcanivāḍu, itarula sukhamunu cūci dvēṣiṃcanivāḍu, - iṭuvaṃṭivāḍu vyākulatalēni manassu kaligi pani cēyuvāḍu mahākarta ani ceppabaḍucunnāḍu).

  1. “sarvatra vigatasnēhā yassākṣi vadava sthitaḥ |

niricchō vartatē kāryē mahākartā sa ucyatē |

udvēgānaṃda rahitaḥ samayā svacchayā driyaṃ |

na śōcati. nacōnēti mahākartā sa ucyatē||“.

“yaḥ pumān udvēgānaṃdarahitaḥ kriyamāṇamidaṃkāryaṃ niṣpalaṃ bhaviṣyatīti udyōgō bhītiḥ, prītirānaṃdaḥ tadrahitaḥ, samayā, svacchayā diyā kurvan na śōcati, kāryāsiddhau na viṣīdati, siddhau na cōdēti, nahṛṣyati sa mahākartā ucyatē”.

(dēniyaṃdunu snēhabhāvamulēka - anurāgamulēka, sākṣivale taṭasthuḍugā nuṃḍuvāḍunu, cēyucunna paniyaṃdu kōrikalēnivāḍunu - iṭṭivāḍu mahākarta ani ceppabaḍucunnāḍu - nēnu cēyu ī kāryamu phalamulēkuṃḍapōvunu - paniki rākuṃḍa pōvunu - anu bhayamuvalana kalugu udvēgamugāni, lēka, avi phaliṃcunanu ānaṃdamugāni lēnivāḍu, manaśśuddhikaligi panicēyucu, kāryamu siddhiṃcanapuḍu vicāriṃpaka, siddhiṃcinapuḍu udvēgamu poṃdaka nuṃḍuvāḍu mahākarta).

  1. “janma sthiti vināśēṣu sōdayāstamayē ṣvalaṃ |

samamēva manō yasya mahākartā sa ucyatē ||“. (vāsiṣṭē)

“yasya manaḥ vastūnāṃ sōdayāstama yēṣaṃ |

janmasthiti vināśēṣu samamēva sa mahākartā ucyatē |

udayāstamayē daṛśanā darśanē tiṣṭati, vinaśyati dṛśyamānē adṛśyamānē api vā samaṃ ēka prakāramēva sa mahākartā ucyatē”.

(vastuvulu janma sthiti layamulanu poṃdiṭanu cūci avi kanabaḍinapuḍu, kanabaḍakapōvunapuḍainanu okē manassu kalavāḍu - okē vidhamaina manassu kalavāḍu mahākarta yani ceppabaḍucunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.