← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహత్తత్వము mahattatvamu

Original — తెలుగు
  1. “హిరణ్యగర్భ లింగశరీరం మహత్తత్వం” (వేదాంతపరి భాష - ధర్మరాజాధ్వరీంద్ర)

(హిరణ్యగర్భుని - చతుర్ముఖ బ్రహ్మయొక్క లింగశరీరమే మహతత్తము). (సృష్టిలోని వస్తువులన్నియు కారణశరీరరూపములై ఒకే చోట కలిసి, మరల సృష్టి ప్రారంభమగువరకు లోలోన తగిన మార్పు అవ్యక్తముచెందు స్థితి).

  1. “మహత్తత్వం ప్రథానం, కృత్స్న ప్రపంచస్య అపి మూలకారణీ భూతం ప్రథానం, ప్రకృతిరపి తస్యా ప్రాకృతత్వాత్”

(మహత్తత్వమనగా ప్రథానము, ప్రపంచమంతటికి మూలకారణమైనది ప్రథానము)

  1. “ప్రకృతివలన మహత్తత్వంబును, దానివలన నహంకారత్రయంబును బుట్టె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 112)

  2. “ఆత్మ మాయంజేసి తత్వాంతర్గతుడైన జీవుని వలన క్షుభితంబయి జగత్కారణంబగు ప్రకృతియందు బరమ పురుషుండు దన వీర్యంబు పెట్టిన నా ప్రకృతి హిరణ్మయంబైన మహత్తత్వంబు పుట్టించె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 888)

  3. “తస్మానవ్యక్తాన్మహా నుత్పద్యతే”, తల్లింగ ఏవ (బుద్ధితత్వం).

(అవ్యక్తమునుండి - ప్రకృతినుండి మహత్తత్వము పుట్టినది)

  1. “సీ. ధృతిబూన కాలచోదితము, నవ్యక్తంబు బ్రకృతియు నను పేళ్ళ బరగి మాయ

వలన మహత్తత్వమెలమి బుట్టించె; మాయాంశకాలాది గుణాత్మకంబు

నైన మహత్తత్వమచ్యుత దృగ్గోచరమగుచు విశ్వనిర్మాణవాంఛ

నందు టజేసి రూపాంతరంబున బొందె; నట్టి మహత్తత్వమందు నోలి

తే. కార్యకారణ కర్త్రాత్మకమైన

మహిత భూతేంద్రియకమయ మనంగ

దగు నహంకార తత్వముత్పన్నమయ్యె

గోరి సత్వరజస్తమో గుణకమగుచు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 201)

  1. ప్రకృతి యనునది భోగ్యాత్మకత్వంబులగూడి దేహాది ప్రపంచ పదా ర్థంబులనంబడి, గుణత్రయ సమావస్థల యందుండి, వెండియు, నవిద్యలో ప్రతిఫలించియున్న యా జీవులకు భోగార్థంబై సకల కార్యమయ్యేటందులకు ఈశ్వర సన్నిధాన లక్షణమాత్రచే వికసించి, మొదట కాలతత్వము బడసి, వెండియు నాకాలవశంబున బరిణమించి మహత్తత్వమనంబడు - మఱియు నా మహత్తత్వంబెట్లనిన - ఎత్తు నీటితోగూడి అంకురించిన వలె నుండక యల్బణా వస్థను గూడిన బీజముంబోలె కారణ ప్రకృతియుంగాక కరణంబున అహంకారముంగాక మిథ్యాజ్ఞానంబువలన నిర్వికల్ప స్వరూపంబున మథ్యావస్థ యనంబడు. అటి మహత్తత్వంబువలన గుణభేదంబులం బడసి మిథ్యాజ్ఞానంబును సకల్ప స్వరూపంబగు ప్రథానాధ్యాస యనంబడిన మూలాహంకారంబు జనింపుచు నుండును.” (వివేకచింతామణి - పరమానందతీర్థ).

  2. “మహత్తత్వంబు ప్రథమ సర్గంబు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)

  3. “మహత్తత్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబు గావున సప్తావరణా వృతంబగు లోకంబును స్వదేహంబు విస్తరింపజేయు -”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 29 -)

  1. “మహత్తత్వము, దానియందు ప్రతిబింబించిన ఈశ్వర ప్రతిబింబము, ఈశ్వ రుడు అను నీ మూడుకలిసి హిరణ్యగర్భుడని చెప్పబడును. హిరణ్య గర్భుడు తన నిజరూపమగు బ్రహ్మస్వరూపము నెఱుంగకసామాన్యరూపమగు బిద్ధిని, సామాన్యరూపమగు ప్రాణమును తన స్వరూపముగా నెఱుగుచున్నాడు. కనుక మహత్తత్వాభిమాని యని చెప్పబడుచున్నాడు”.
Transliteration
  1. “hiraṇyagarbha liṃgaśarīraṃ mahattatvaṃ” (vēdāṃtapari bhāṣa - dharmarājādhvarīṃdra)

(hiraṇyagarbhuni - caturmukha brahmayokka liṃgaśarīramē mahatattamu). (sṛṣṭilōni vastuvulanniyu kāraṇaśarīrarūpamulai okē cōṭa kalisi, marala sṛṣṭi prāraṃbhamaguvaraku lōlōna tagina mārpu avyaktamuceṃdu sthiti).

  1. “mahattatvaṃ prathānaṃ, kṛtsna prapaṃcasya api mūlakāraṇī bhūtaṃ prathānaṃ, prakṛtirapi tasyā prākṛtatvāt”

(mahattatvamanagā prathānamu, prapaṃcamaṃtaṭiki mūlakāraṇamainadi prathānamu)

  1. “prakṛtivalana mahattatvaṃbunu, dānivalana nahaṃkāratrayaṃbunu buṭṭe” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 112)

  2. “ātma māyaṃjēsi tatvāṃtargatuḍaina jīvuni valana kṣubhitaṃbayi jagatkāraṇaṃbagu prakṛtiyaṃdu barama puruṣuṃḍu dana vīryaṃbu peṭṭina nā prakṛti hiraṇmayaṃbaina mahattatvaṃbu puṭṭiṃce” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 888)

  3. “tasmānavyaktānmahā nutpadyatē”, talliṃga ēva (buddhitatvaṃ).

(avyaktamunuṃḍi - prakṛtinuṃḍi mahattatvamu puṭṭinadi)

  1. “sī. dhṛtibūna kālacōditamu, navyaktaṃbu brakṛtiyu nanu pēḷḷa baragi māya

valana mahattatvamelami buṭṭiṃce; māyāṃśakālādi guṇātmakaṃbu

naina mahattatvamacyuta dṛggōcaramagucu viśvanirmāṇavāṃcha

naṃdu ṭajēsi rūpāṃtaraṃbuna boṃde; naṭṭi mahattatvamaṃdu nōli

tē. kāryakāraṇa kartrātmakamaina

mahita bhūtēṃdriyakamaya manaṃga

dagu nahaṃkāra tatvamutpannamayye

gōri satvarajastamō guṇakamagucu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 201)

  1. prakṛti yanunadi bhōgyātmakatvaṃbulagūḍi dēhādi prapaṃca padā rthaṃbulanaṃbaḍi, guṇatraya samāvasthala yaṃduṃḍi, veṃḍiyu, navidyalō pratiphaliṃciyunna yā jīvulaku bhōgārthaṃbai sakala kāryamayyēṭaṃdulaku īśvara sannidhāna lakṣaṇamātracē vikasiṃci, modaṭa kālatatvamu baḍasi, veṃḍiyu nākālavaśaṃbuna bariṇamiṃci mahattatvamanaṃbaḍu - maṟiyu nā mahattatvaṃbeṭlanina - ettu nīṭitōgūḍi aṃkuriṃcina vale nuṃḍaka yalbaṇā vasthanu gūḍina bījamuṃbōle kāraṇa prakṛtiyuṃgāka karaṇaṃbuna ahaṃkāramuṃgāka mithyājñānaṃbuvalana nirvikalpa svarūpaṃbuna mathyāvastha yanaṃbaḍu. aṭi mahattatvaṃbuvalana guṇabhēdaṃbulaṃ baḍasi mithyājñānaṃbunu sakalpa svarūpaṃbagu prathānādhyāsa yanaṃbaḍina mūlāhaṃkāraṃbu janiṃpucu nuṃḍunu.” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha).

  2. “mahattatvaṃbu prathama sargaṃbu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)

  3. “mahattatvaṃbu jagattunaku naṃkura svarūpaṃbu gāvuna saptāvaraṇā vṛtaṃbagu lōkaṃbunu svadēhaṃbu vistariṃpajēyu -”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 29 -)

  1. “mahattatvamu, dāniyaṃdu pratibiṃbiṃcina īśvara pratibiṃbamu, īśva ruḍu anu nī mūḍukalisi hiraṇyagarbhuḍani ceppabaḍunu. hiraṇya garbhuḍu tana nijarūpamagu brahmasvarūpamu neṟuṃgakasāmānyarūpamagu biddhini, sāmānyarūpamagu prāṇamunu tana svarūpamugā neṟugucunnāḍu. kanuka mahattatvābhimāni yani ceppabaḍucunnāḍu”.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.