(దుశ్శకునములు - మూడు విధములు - భూమికి సంబంధించినవి - భూకంపము మొదలగునవి; ఆకాశమునకు సంబంధించినవి - ఉల్కాపాతములు మొదలగునవి - పడిపోతూ ఉన్నట్లు కనబడు నక్షత్రములు మొదలగునవి. శరీరమునకు సంబంధించినవి - ఎడమకన్ను అదురుట మొదలగునవి - ముందు రాబోవు గొప్ప అరిష్టములను సూచించునవి).
జలధులు గలింగె, దారకావళులుడుల్లె
గగన మగలెను, మ్రెఉగ్గె దిక్కరులు, దిశల
మడుగుఱు లెగసె, బిడిగులు పుడమి బడియె“.
“సీ. హోమానలంబుల ధూమంబులడగెను బ్రతికూల వాయువుల్ బలసి వీచె
దరువు లెల్లడ విటతాటంబులై కూలె గ్రహ తారకావళి కాంతి మాసె
బెరసి మొగిళ్ళు నెత్తురువాన గురిసెను; మెఱుగులు దెసల మిర్మిట్లు గొలిపె
స్వర్భాను డొగి నపర్వమున భానుని బట్టె గైకొని చిమ్మ చీకట్లుపర్వె
తే. మొనసి కుక్కలుమొఱిగెవు మోరలెత్తి
పగలు నక్కలు వాపోయె; ఖగములార్త
రవములిచ్చెను, దేవతా ప్రతిమ లొరగె;
గన్నులను నశ్రుకణములు గ్రందుకొనగ”.
“క. మొదవులు నెత్తురు జీమును
బిదికెన్; గార్ధభరవంబు భీషణమయ్యెన్;
మదముడిగె గరులకటముల
బొదివె దురంగముల వాలములనిప్పులూగిన్“.
“క.”గుహలు రొదలిచ్చె; బాప
గ్రహ మిత్రతజెంది వజ్రగతులను సౌమ్య
గ్రహములు వర్తించెను దు
స్సహ తేజోదిత దితి తనూజ సంభవ వేళన్“.
మ. భయద ప్రక్రియ నట్లు దోచిన మహోత్పాతంబు లీక్షించి సం
క్షయకాలంబని - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 602 to 606)
(duśśakunamulu - mūḍu vidhamulu - bhūmiki saṃbaṃdhiṃcinavi - bhūkaṃpamu modalagunavi; ākāśamunaku saṃbaṃdhiṃcinavi - ulkāpātamulu modalagunavi - paḍipōtū unnaṭlu kanabaḍu nakṣatramulu modalagunavi. śarīramunaku saṃbaṃdhiṃcinavi - eḍamakannu aduruṭa modalagunavi - muṃdu rābōvu goppa ariṣṭamulanu sūciṃcunavi).
jaladhulu galiṃge, dārakāvaḷuluḍulle
gagana magalenu, mreugge dikkarulu, diśala
maḍuguṟu legase, biḍigulu puḍami baḍiye”.
“sī. hōmānalaṃbula dhūmaṃbulaḍagenu bratikūla vāyuvul balasi vīce
daruvu lellaḍa viṭatāṭaṃbulai kūle graha tārakāvaḷi kāṃti māse
berasi mogiḷḷu netturuvāna gurisenu; meṟugulu desala mirmiṭlu golipe
svarbhānu ḍogi naparvamuna bhānuni baṭṭe gaikoni cimma cīkaṭluparve
tē. monasi kukkalumoṟigevu mōraletti
pagalu nakkalu vāpōye; khagamulārta
ravamuliccenu, dēvatā pratima lorage;
gannulanu naśrukaṇamulu graṃdukonaga”.
“ka. modavulu netturu jīmunu
bidiken; gārdhabharavaṃbu bhīṣaṇamayyen;
madamuḍige garulakaṭamula
bodive duraṃgamula vālamulanippulūgin”.
“ka.”guhalu rodalicce; bāpa
graha mitratajeṃdi vajragatulanu saumya
grahamulu vartiṃcenu du
ssaha tējōdita diti tanūja saṃbhava vēḷan”.
ma. bhayada prakriya naṭlu dōcina mahōtpātaṃbu līkṣiṃci saṃ
kṣayakālaṃbani - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 602 to 606)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.