← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంగళం maṃgaḷaṃ

Original — తెలుగు
  1. శుభము, క్షేమము.

  2. “సుఖం తత్సాధనం జ్ఞాపకం చ” (శ్రీశంకరః)

(సుఖము, సుఖమునకు సాధనమైనది; జ్ఞాపకము చేయునది).

  1. “అశుభాని నిరాచష్టే, తనోతి శుభ సంతతిం |

స్మృతి మాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తన్ మంగళం పరం ||“.

“మంగళప్రదమ మగళాపహం సం గృణీ దశరధాత్మజం హృది ||”. (శ్రీరామకర్ణామృతం - 4 - 30)

(పరబ్రహ్మను తలచినంతమాత్రమున పురుషుల (జీవుల) అశుభములను పోగొట్టి, శుభములు కలుగుచున్నవి. అందుచేత అతను పరమ మంగళం, పరమ మంగళరూపుడు).

  1. “విష్ణుపురాణవచనాత్ కల్యాణ రూపత్వాత్ వా మంగళం” (శ్రీశంకరః)

“మంగళం భగవాన్ విష్ణుః”.

(స్మృతిమాత్రమున అశుభములు తొలగ చేయువాడనిన్నీ కల్యాణ రూపుడనిన్నీ శ్రీవిష్ణుపురాణములో చెప్పబడియుండుటచేత విష్ణువు మంగళం అని చెప్పబడుచున్నాడు). (భగవంతుడైన విష్ణువు మంగళస్వరూపుడు). (శ్రీరామకర్ణామృతం - 1 - 1)

  1. “ప్రశస్తాచరణం నిత్యం అప్రశస్తస్య వర్జనం |

ఏ తద్ధి మంగళం ప్రోక్తం మునిభిః తత్వ దర్శిభిః ||“.

(ప్రశస్తమైనదాని నాచరించుట, అప్రశస్తమైనదానిని విడిచి పెట్టుట - ఇదియే మంగళమని తత్వము తెలిసినవారు - బ్రహ్మజ్ఞానము కలవారు - చెప్పుదురు).

  1. మంగళము మూడు విధములు - వస్తువును నిర్దేశించునది, నమస్కారరూపము, ఆశీర్వాదము -

  2. “రాజాధిరాజ రాజాయ, రామభద్రాయ మంగళం” (శ్రీరామకర్ణామృతం - 1 - 6)

(రాజులకు అధిరాజు, చక్రవర్తి యగు శ్రీరామభద్రునకు మంగళమగుగాక - ప్రకాశించురూపముగల వాటికి ప్రకాశమునిచ్చువాడగు శ్రీరామచంద్రునకు శుభమగుగాక).

  1. “శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కల్యాణగుణాభిరామః |

సీతాముఖాం భోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు “. (శ్రీరామకర్ణామృతం - 3 - 105)

“అఖండ మంగళ నిధిః పాయాత్ సవోరాఘవః” (1 - 38)

(ఆశ్రితులకు - భక్తులకు - పారిజాతము (కోరిన కోరికల నిచ్చునది) అయినవాడును, సమస్త కల్యాణగుణములు గలవాడును, సీతాదేవియొక్క పద్మమువలెనుండు ముఖమునకు చంచరీకము వలెనుండు శ్రీరామచంద్రుడు ఎల్లపుడు మంగళములను - శుభములను - కలిగించుగాక). అంతములేని మంగళముల నిధి అయినవాడు. (శ్రీరామకర్ణామృతం - 1 - 38)

Transliteration
  1. śubhamu, kṣēmamu.

  2. “sukhaṃ tatsādhanaṃ jñāpakaṃ ca” (śrīśaṃkaraḥ)

(sukhamu, sukhamunaku sādhanamainadi; jñāpakamu cēyunadi).

  1. “aśubhāni nirācaṣṭē, tanōti śubha saṃtatiṃ |

smṛti mātrēṇa yatpuṃsāṃ brahma tan maṃgaḷaṃ paraṃ ||“.

“maṃgaḷapradama magaḷāpahaṃ saṃ gṛṇī daśaradhātmajaṃ hṛdi ||”. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 30)

(parabrahmanu talacinaṃtamātramuna puruṣula (jīvula) aśubhamulanu pōgoṭṭi, śubhamulu kalugucunnavi. aṃducēta atanu parama maṃgaḷaṃ, parama maṃgaḷarūpuḍu).

  1. “viṣṇupurāṇavacanāt kalyāṇa rūpatvāt vā maṃgaḷaṃ” (śrīśaṃkaraḥ)

“maṃgaḷaṃ bhagavān viṣṇuḥ”.

(smṛtimātramuna aśubhamulu tolaga cēyuvāḍaninnī kalyāṇa rūpuḍaninnī śrīviṣṇupurāṇamulō ceppabaḍiyuṃḍuṭacēta viṣṇuvu maṃgaḷaṃ ani ceppabaḍucunnāḍu). (bhagavaṃtuḍaina viṣṇuvu maṃgaḷasvarūpuḍu). (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 1)

  1. “praśastācaraṇaṃ nityaṃ apraśastasya varjanaṃ |

ē taddhi maṃgaḷaṃ prōktaṃ munibhiḥ tatva darśibhiḥ ||“.

(praśastamainadāni nācariṃcuṭa, apraśastamainadānini viḍici peṭṭuṭa - idiyē maṃgaḷamani tatvamu telisinavāru - brahmajñānamu kalavāru - ceppuduru).

  1. maṃgaḷamu mūḍu vidhamulu - vastuvunu nirdēśiṃcunadi, namaskārarūpamu, āśīrvādamu -

  2. “rājādhirāja rājāya, rāmabhadrāya maṃgaḷaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 6)

(rājulaku adhirāju, cakravarti yagu śrīrāmabhadrunaku maṃgaḷamagugāka - prakāśiṃcurūpamugala vāṭiki prakāśamuniccuvāḍagu śrīrāmacaṃdrunaku śubhamagugāka).

  1. “śrīrāmacaṃdraḥ śritapārijātaḥ samasta kalyāṇaguṇābhirāmaḥ |

sītāmukhāṃ bhōruha caṃcarīkō niraṃtaraṃ maṃgaḷamātanōtu “. (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 105)

“akhaṃḍa maṃgaḷa nidhiḥ pāyāt savōrāghavaḥ” (1 - 38)

(āśritulaku - bhaktulaku - pārijātamu (kōrina kōrikala niccunadi) ayinavāḍunu, samasta kalyāṇaguṇamulu galavāḍunu, sītādēviyokka padmamuvalenuṃḍu mukhamunaku caṃcarīkamu valenuṃḍu śrīrāmacaṃdruḍu ellapuḍu maṃgaḷamulanu - śubhamulanu - kaligiṃcugāka). aṃtamulēni maṃgaḷamula nidhi ayinavāḍu. (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 38)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.