(నమ్మకముతో, శ్రద్ధతో మననము చేయుటచేత రక్షించునది కనుక మంత్రము).
(మననము చేయుటవలన తరింపచేయునది కనుక మంత్రమని చెప్పబడినది)
“సర్వవాచ్య వస్తునః రామచంద్రస్య యో వాచకో భవతి స్వమనన మాత్రతః మంతారం స్వాతిరిక్తాస్తి త్వ భ్రమ వారిధేః తారణాత్ మంత్ర ఇతి వ్యుత్పత్తిరుచ్యతే”.
(సమస్తమైన వాచ్యవస్తువుల రూపమైన శ్రీరామచంద్రునికి వాచకమయినది. దానిని మననము చేసినంతమాత్రమున మననము చేయువారిని “తనకంటెవేఱు వస్తువున్నది - తానే బ్రహ్మము కనుక బ్రహ్మ కంటె వేఱు వస్తువున్నది” అను భ్రమ యను మహాసముద్రమును దాటించునది - అట్టి భ్రమ యను మిధ్యాజ్ఞానము లేకుండచేయునది - కనుక మంత్రము అని వ్యుత్పత్యర్థము).
(మంత్రమును జపించువాడు మంతా, వానిని రక్షించునది కనుక మంత్రమని చెప్పబడినది)
(మంత్రమును అనుసంధానము చేయువానిని రక్షించునది కనుక మంత్రము)
(మననము చేయుటవలన రక్షించుటవలన, శూరత్వము శక్తి గలిగియుండుటవలన మంత్రము అని చెప్పబడినది)
మననత్రాణమిత్యాహుః మంత్రమిత్యభిధీయతే ||“.
(‘మ’ కారమనగా మననము చేయుట, త్రకారమనగా రక్షించుట - మననము చేయువానిని రక్షించునది కనుక మంత్రమని చెప్పబడినది)
(అన్ని భావములను మననము చేయుటవలనను, జననమరణరూపమైన సంసార సాగరమునుండి రక్షించుటవలనను మంత్రమని చెప్పబడినది).
(తత్వపదమును (తత్ + త్వం) - నీవే పరబ్రహ్మము అను మహావాక్యపదమును మననము చేయుటవలన, సంసారమను మహాభయమునుండి రక్షించునదగుటచేతను మంత్రమని చెప్పబడినది).
(పరబ్రహ్మ తత్వమును బోధపఱచునదగుటచేతను జననమరణరూపమైన సంసారమను మహద్భయమునుండి రక్షించు శక్తికలది కనుక మంత్రము).
(అనుష్టించుచున్నదానియొక్క అర్థమును ప్రకాశింపచేయునది; అర్థవాదముకంటె వ్యతిరేకమైనది).
(మంత్రద్రష్టులగు శిష్టులు - ఋషులు - ఏ వాక్యమును మంత్రమని గ్రహించిరో అదియే మంత్రము).
“శబ్దానామపి వీర్యవత్వేన మంత్రత్వం ప్రమాణా రూపమేవ. తథాపి బీజ విశేషాది ఘటితయా తేషాం మంత్ర విశేషత్వం అత ఏవ విష్ణు సహస్రనామ పూర్ణసామ్య మేకస్య శ్రీరామ మంత్రస్యేతి నిరూపితం సాక్షాదీశ్వరేణ”.
(శబ్దములన్నియు - మాటలన్నియు - వీర్యవంతములే, భగవంతుని శక్తి కలవియే - బ్రహ్మాండభేదనము వలన కలిగిన మొదటి శబ్దమగు (రవమగు) ఓంకారము భగవంతుని శక్తియే - శక్తిరూపమున భగవంతుడే - బ్రహ్మాండము పేలినపుడు దానిలోని ముక్కలు లోకములుగా విరజల్లుకొనిపోయినపుడువాటిలో ఈ శబ్దము వాటిలోని అణువణువులోను పూర్తిగా వ్యాపించి వాటిని శక్తి వంతములుగా చేసెను - (Every particle of matter contains Energy). ఆ శక్తియే జీవుల శరీరములో ప్రవేశించినపుడు అక్షరరూపములుగా మారెను - (పరావాక్కు, పశ్యంతీవాక్కు). అందుచేత శబ్దములన్నియు - మాటలన్నియు, అక్షరములన్నియు (వర్ణము లన్నియు) శక్తివంతములే - భగవంతుని శక్తి అంతర్గతముగా గలిగియున్నవే. అటువంటి శబ్దములన్నింటిలోను మిక్కిలి వీర్యవంతమలగుటచేత మంత్రములు అన్నియు ప్రమాణములే. అయినను ఆ మంత్రములలోని బీజముల విశేషమువలన - బీజాక్షరశక్తివలన - వాటికి మంత్రశక్తి కలిగినది. అందుచేతనే భగవన్నామములన్నియు మంత్రములే, శక్తివంతములే. విష్ణువుయొక్క సహస్రనామముల శక్తితో సమానమైనది శ్రీరామనామమంత్రము అని సాక్షాత్తు భగవంతుడే నిరూపించెను - పరమేశ్వరుడు - పరమ శివుడు - పార్వతితో ఈ విషయమిట్లు బోధించెను : -
“శ్రీరామరామ రామేతి రమేరామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||“.
(మనస్సును రంజింపగలదియు, శ్రేష్టమైన ముఖముగలదియు నగు ఓ పార్వతీ “శ్రీరామ రామ రామ” అని నేను రామునియందు నిత్యము రమించెదను - తదేక ధ్యానముతో, ఎడతెగలేనట్లుగా, ఆ మంత్రమునుచ్చరించుచు (ఆ రామనామము నుచ్చరించుచుందును - ఎందుచేతననగా - ఆ పరబ్రహ్మయైన మహావిష్ణువుయొక్క సహస్రనామములతో సమానమైన శక్తి ఈ రామ అను నామములోని బీజాక్షరములకు ‘రా’ ‘మ’ అనువాటియందు కలదు అని మ్నత్రద్రష్ట లయిన ఋషులు తెలుసుకొనిరి. అందుచేత శివుడు ఆ మంత్రమును వాడెను - పఠించును) (చూడుము - ‘శ్రీరామమంత్రము’).
యస్తు మంత్రం జపేత్ గార్గ్య, బుద్ధం తస్య ఫలం లభేత్ ||”
ఇతి శ్రుతి స్మృతి భ్యాం వేదనే అభ్యుదయ దర్శనాత్ చ మంత్రాణాం అర్థవత్ ఋషి ఛందో దైవతాని వేది తవ్యాని.
(ఏ దేవతను గుఱించి అయిన మంత్రమో ఆ దేవతను, ఆ మంత్రద్రష్ట అయిన ఋషిని, ఆ మంత్రము ఛందస్సును ఆ మంత్రముతో ధ్యానించవలెను - “గాయత్రీ మంత్రస్య గాయత్రీ ఛందః విశ్వామిత్ర ఋషిః, సవితా దేవతా” అని చెప్పవలెను - ఇట్లు ఎవరు మంత్రమును జపింతురో వారు దాని ఫలమును పొందుదురు. దీనిని బట్టి తెలియునదేమనగా - ప్రతిమంత్రమునకు అధిదేవత, ఆ మంత్రద్రష్ట - (మంత్రము కనిపెట్టిన ఋషి), ఛందస్సు ఉండును - మంత్రమును పఠించునపుడు ఆ మంత్ర దేవతా రూపమును మనసులో నుంచుకొన వలెను - గాయత్రీ మంత్రమును జపించునపుడు - సవిత అయిన సూర్యనారాయణమూర్తి, సూర్యభగవానుడు అను ప్రతీతి గల ఆ బింబములోని తేజస్వరూపుడైన పరబ్రహ్మను ధ్యానించవలెను) చూడుము -)
“యోహ వా అవిదితార్షేయ యఛ్చందో దైవత బ్రాహ్మణేన మంత్రేణ యో జయతి వాధ్యాపయతివా స్థాణం వర్ఛతి, కర్తం వా ప్రతిపద్యతే” (ఎవడు మంత్రముయొక్క ఋషుని, ఛందస్సును, దేవతను, బ్రాహ్మణమును గుఱుతెఱుంగక మంత్రానుష్ఠానము చేయునో, లేక ఆ మంత్రముతోనట్లు పరులకు కర్మకలాపము నడుపునో, లేక, పరులకు ఆ మంత్రమునుపదేశించునో అట్టివాడు స్తంబమగును - అచరరూపమగును, లేక గోతిలో పడిపోయినవాడగును - భ్రష్టుడగును).
నవాగ్ర్వజో యజమానం హి నస్తి యధేంద్రశత్రుః స్వరతో(అ)పరాధాత్ ||“.
(స్వరవర్ణ హీనమైన మంత్రము తన స్వాభావికార్థమును బోధింపక భిన్నార్థమును బోధించును - అది పిడుగై యజమానుని మొత్తును - స్వరకృతమైన అపరాధమున వృత్రాసురుడు నశించెను)
(మంత్రములు రెండువిధములు - సాక్షాత్తుగా భగవంతునే ప్రతిపాదించునవి. విష్ణుసూక్తములోను, పురుషసూక్తములోను చెప్పబడిన మంత్రములు సాక్షాత్తుగా భగవంతుని ప్రతిపాదించునవి. ఇతర మంత్రములు సౌమ్యాగ్నేయాదిసూక్తములలో చెప్పబడినవి. భగవంతుని విభూతులను (భగవంతుని రూపములగు ఇతర దేవతలను) ఆశ్రయించి వాటిని ప్రతిపాదించుటద్వారా భగవంతునే ప్రతిపాదించునవి).
ఋషులు మంత్ర ద్రష్టలు - వారి తపః ప్రభావమున వాటి శక్తిని కనుగొనినవారు, వారు మననము చేసి వారి శిష్యులకు ప్రశిష్యులకు అందచేసిరి. ఇట్లు ఋషి పరంపరగా వచ్చినవి. వారు సూక్ష్మ శక్తులను కనుగొనినవారు - వారు చెప్పిన ప్రకారము ఆయా నియమములను పాటించి, శ్రద్ధతో, నమ్మకముతో మననము చేసినయడల వారు అప్పట్లో చెప్పిన ఫలములు ఇప్పుడైనను, ఇకముందైనను పొందుటకు సందేహములేదు.
“మంత్రోహ మహమే వాజ్యం” (శ్రీమద్భగవద్గీత - 9 - 16)
(యజ్ఞము చేయునపుడు చదువు మంత్రమునేనే,ఆ యాగాగ్నిలో ఆహుతి చేసెడి ఆజ్యము నేనే - భగవంతుడే - సృష్టిలోని వస్తువులన్నియు భగవంతుని రూపములే - అందుచేత యజ్ఞమంత్రము తానే అని చెప్పెను).
(ఈ లోకములో సప్తకోటి మహామంత్రములున్నవి)
“మంత్రో మాతా గురుః పితా” (మంత్రమే తల్లి, తండ్రి, గురువు).
“దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తు దైవతం |
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవతా ||“.
(భగవంతుడీ జగత్తును సృష్టిచేయువాడు కనుక సృష్టిచేయబడిన జగత్తంతయు అతని ఆధీనములోనున్నది. కాని ఆ దైవతము మంత్రాధీనుడు - మంత్రమునుచ్చరించిన ప్రత్యక్షమగువాడు - అట్టి మంత్రము బ్రాహ్మణాధీనము - అందుచేత బ్రాహ్మణుడు నా దైవము, భగవంతునుకి దైవము వంటివాడు).
లరయగ, తరుమూలమెల్ల నౌషధ చయమే
ధరయెల్ల ఫలనిధానమె
నరులాచందమెఱిగి నడువగవలయున్“.
“న గాయత్ర్యాం పరోమంత్రో” (గాయత్రీమంత్రము కంటె ఉతృష్టమైన మంత్రములేదు).
“యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్పరః |
తథా సర్వేషు మంత్రేషు నాస్తి చాష్టాక్షరాత్పరః ||”
నమంత్రో అష్టాక్షరాత్పరః
(దేవతులందఱిలోను నారాయణునికన్న ఉత్కృష్టమైన దేవుడు లేనట్లే, మంత్రములన్నింటిలోను అష్టాక్షరీమంత్రముకన్న ఉత్కృష్టమైన మంత్రము లేదు).
కించిల్లోపవిధానమాత్ర విఫలై స్సంసార దుఃఖావహైః |
ఏకస్సన్నపి సర్వమంత్రఫలోదో దోషాజ్ఞి తస్సర్వదా |
శ్రీరామశ్శరణం మమేతి పరమో మంత్రోయమష్టాక్షరా ||“. (శ్రీరామకర్ణామృతం - 4 - 74)
(మంత్రములనేకములున్నవి. అవి చాలా ఆయాసముతోకూడియున్నవి - ఫలము పొందుటలో కష్టమైనవి, ఏ మాత్రము వాటిలో లోపమున్నను విఫలమగునవి - (ఫలము లేకుండపోవునవి), సంసారదుఃఖముతో నిండియుండునవి (జననమరణరూపమైన సంసారము వలన కలుగు దుఃఖముతో నిండియుండునవి). ఇటువంటి అనేక మంత్రములతో ఏమి పని ? “శ్రీరామశ్శరణం మమ” (శ్రీరాముడే నాకు శరణమగుగాక) అను అష్టాక్షరీమంత్రము (ఎనిమిది అక్షరములుగల మంత్రము) ఒకటే అయినను అన్ని మంత్రముల ఫలమునిచ్చునది, దోషములన్నింటిని పోగొట్టునది)
(nammakamutō, śraddhatō mananamu cēyuṭacēta rakṣiṃcunadi kanuka maṃtramu).
(mananamu cēyuṭavalana tariṃpacēyunadi kanuka maṃtramani ceppabaḍinadi)
“sarvavācya vastunaḥ rāmacaṃdrasya yō vācakō bhavati svamanana mātrataḥ maṃtāraṃ svātiriktāsti tva bhrama vāridhēḥ tāraṇāt maṃtra iti vyutpattirucyatē”.
(samastamaina vācyavastuvula rūpamaina śrīrāmacaṃdruniki vācakamayinadi. dānini mananamu cēsinaṃtamātramuna mananamu cēyuvārini “tanakaṃṭevēṟu vastuvunnadi - tānē brahmamu kanuka brahma kaṃṭe vēṟu vastuvunnadi” anu bhrama yanu mahāsamudramunu dāṭiṃcunadi - aṭṭi bhrama yanu midhyājñānamu lēkuṃḍacēyunadi - kanuka maṃtramu ani vyutpatyarthamu).
(maṃtramunu japiṃcuvāḍu maṃtā, vānini rakṣiṃcunadi kanuka maṃtramani ceppabaḍinadi)
(maṃtramunu anusaṃdhānamu cēyuvānini rakṣiṃcunadi kanuka maṃtramu)
(mananamu cēyuṭavalana rakṣiṃcuṭavalana, śūratvamu śakti galigiyuṃḍuṭavalana maṃtramu ani ceppabaḍinadi)
mananatrāṇamityāhuḥ maṃtramityabhidhīyatē ||“.
(‘ma’ kāramanagā mananamu cēyuṭa, trakāramanagā rakṣiṃcuṭa - mananamu cēyuvānini rakṣiṃcunadi kanuka maṃtramani ceppabaḍinadi)
(anni bhāvamulanu mananamu cēyuṭavalananu, jananamaraṇarūpamaina saṃsāra sāgaramunuṃḍi rakṣiṃcuṭavalananu maṃtramani ceppabaḍinadi).
(tatvapadamunu (tat + tvaṃ) - nīvē parabrahmamu anu mahāvākyapadamunu mananamu cēyuṭavalana, saṃsāramanu mahābhayamunuṃḍi rakṣiṃcunadaguṭacētanu maṃtramani ceppabaḍinadi).
(parabrahma tatvamunu bōdhapaṟacunadaguṭacētanu jananamaraṇarūpamaina saṃsāramanu mahadbhayamunuṃḍi rakṣiṃcu śaktikaladi kanuka maṃtramu).
(anuṣṭiṃcucunnadāniyokka arthamunu prakāśiṃpacēyunadi; arthavādamukaṃṭe vyatirēkamainadi).
(maṃtradraṣṭulagu śiṣṭulu - ṛṣulu - ē vākyamunu maṃtramani grahiṃcirō adiyē maṃtramu).
“śabdānāmapi vīryavatvēna maṃtratvaṃ pramāṇā rūpamēva. tathāpi bīja viśēṣādi ghaṭitayā tēṣāṃ maṃtra viśēṣatvaṃ ata ēva viṣṇu sahasranāma pūrṇasāmya mēkasya śrīrāma maṃtrasyēti nirūpitaṃ sākṣādīśvarēṇa”.
(śabdamulanniyu - māṭalanniyu - vīryavaṃtamulē, bhagavaṃtuni śakti kalaviyē - brahmāṃḍabhēdanamu valana kaligina modaṭi śabdamagu (ravamagu) ōṃkāramu bhagavaṃtuni śaktiyē - śaktirūpamuna bhagavaṃtuḍē - brahmāṃḍamu pēlinapuḍu dānilōni mukkalu lōkamulugā virajallukonipōyinapuḍuvāṭilō ī śabdamu vāṭilōni aṇuvaṇuvulōnu pūrtigā vyāpiṃci vāṭini śakti vaṃtamulugā cēsenu - (Every particle of matter contains Energy). ā śaktiyē jīvula śarīramulō pravēśiṃcinapuḍu akṣararūpamulugā mārenu - (parāvākku, paśyaṃtīvākku). aṃducēta śabdamulanniyu - māṭalanniyu, akṣaramulanniyu (varṇamu lanniyu) śaktivaṃtamulē - bhagavaṃtuni śakti aṃtargatamugā galigiyunnavē. aṭuvaṃṭi śabdamulanniṃṭilōnu mikkili vīryavaṃtamalaguṭacēta maṃtramulu anniyu pramāṇamulē. ayinanu ā maṃtramulalōni bījamula viśēṣamuvalana - bījākṣaraśaktivalana - vāṭiki maṃtraśakti kaliginadi. aṃducētanē bhagavannāmamulanniyu maṃtramulē, śaktivaṃtamulē. viṣṇuvuyokka sahasranāmamula śaktitō samānamainadi śrīrāmanāmamaṃtramu ani sākṣāttu bhagavaṃtuḍē nirūpiṃcenu - paramēśvaruḍu - parama śivuḍu - pārvatitō ī viṣayamiṭlu bōdhiṃcenu : -
“śrīrāmarāma rāmēti ramērāmē manōramē |
sahasranāma tattulyaṃ rāmanāma varānanē ||“.
(manassunu raṃjiṃpagaladiyu, śrēṣṭamaina mukhamugaladiyu nagu ō pārvatī “śrīrāma rāma rāma” ani nēnu rāmuniyaṃdu nityamu ramiṃcedanu - tadēka dhyānamutō, eḍategalēnaṭlugā, ā maṃtramunuccariṃcucu (ā rāmanāmamu nuccariṃcucuṃdunu - eṃducētananagā - ā parabrahmayaina mahāviṣṇuvuyokka sahasranāmamulatō samānamaina śakti ī rāma anu nāmamulōni bījākṣaramulaku ‘rā’ ‘ma’ anuvāṭiyaṃdu kaladu ani mnatradraṣṭa layina ṛṣulu telusukoniri. aṃducēta śivuḍu ā maṃtramunu vāḍenu - paṭhiṃcunu) (cūḍumu - ‘śrīrāmamaṃtramu’).
yastu maṃtraṃ japēt gārgya, buddhaṃ tasya phalaṃ labhēt ||”
iti śruti smṛti bhyāṃ vēdanē abhyudaya darśanāt ca maṃtrāṇāṃ arthavat ṛṣi chaṃdō daivatāni vēdi tavyāni.
(ē dēvatanu guṟiṃci ayina maṃtramō ā dēvatanu, ā maṃtradraṣṭa ayina ṛṣini, ā maṃtramu chaṃdassunu ā maṃtramutō dhyāniṃcavalenu - “gāyatrī maṃtrasya gāyatrī chaṃdaḥ viśvāmitra ṛṣiḥ, savitā dēvatā” ani ceppavalenu - iṭlu evaru maṃtramunu japiṃturō vāru dāni phalamunu poṃduduru. dīnini baṭṭi teliyunadēmanagā - pratimaṃtramunaku adhidēvata, ā maṃtradraṣṭa - (maṃtramu kanipeṭṭina ṛṣi), chaṃdassu uṃḍunu - maṃtramunu paṭhiṃcunapuḍu ā maṃtra dēvatā rūpamunu manasulō nuṃcukona valenu - gāyatrī maṃtramunu japiṃcunapuḍu - savita ayina sūryanārāyaṇamūrti, sūryabhagavānuḍu anu pratīti gala ā biṃbamulōni tējasvarūpuḍaina parabrahmanu dhyāniṃcavalenu) cūḍumu -)
“yōha vā aviditārṣēya yachcaṃdō daivata brāhmaṇēna maṃtrēṇa yō jayati vādhyāpayativā sthāṇaṃ varchati, kartaṃ vā pratipadyatē” (evaḍu maṃtramuyokka ṛṣuni, chaṃdassunu, dēvatanu, brāhmaṇamunu guṟuteṟuṃgaka maṃtrānuṣṭhānamu cēyunō, lēka ā maṃtramutōnaṭlu parulaku karmakalāpamu naḍupunō, lēka, parulaku ā maṃtramunupadēśiṃcunō aṭṭivāḍu staṃbamagunu - acararūpamagunu, lēka gōtilō paḍipōyinavāḍagunu - bhraṣṭuḍagunu).
navāgrvajō yajamānaṃ hi nasti yadhēṃdraśatruḥ svaratō(a)parādhāt ||“.
(svaravarṇa hīnamaina maṃtramu tana svābhāvikārthamunu bōdhiṃpaka bhinnārthamunu bōdhiṃcunu - adi piḍugai yajamānuni mottunu - svarakṛtamaina aparādhamuna vṛtrāsuruḍu naśiṃcenu)
(maṃtramulu reṃḍuvidhamulu - sākṣāttugā bhagavaṃtunē pratipādiṃcunavi. viṣṇusūktamulōnu, puruṣasūktamulōnu ceppabaḍina maṃtramulu sākṣāttugā bhagavaṃtuni pratipādiṃcunavi. itara maṃtramulu saumyāgnēyādisūktamulalō ceppabaḍinavi. bhagavaṃtuni vibhūtulanu (bhagavaṃtuni rūpamulagu itara dēvatalanu) āśrayiṃci vāṭini pratipādiṃcuṭadvārā bhagavaṃtunē pratipādiṃcunavi).
ṛṣulu maṃtra draṣṭalu - vāri tapaḥ prabhāvamuna vāṭi śaktini kanugoninavāru, vāru mananamu cēsi vāri śiṣyulaku praśiṣyulaku aṃdacēsiri. iṭlu ṛṣi paraṃparagā vaccinavi. vāru sūkṣma śaktulanu kanugoninavāru - vāru ceppina prakāramu āyā niyamamulanu pāṭiṃci, śraddhatō, nammakamutō mananamu cēsinayaḍala vāru appaṭlō ceppina phalamulu ippuḍainanu, ikamuṃdainanu poṃduṭaku saṃdēhamulēdu.
“maṃtrōha mahamē vājyaṃ” (śrīmadbhagavadgīta - 9 - 16)
(yajñamu cēyunapuḍu caduvu maṃtramunēnē,ā yāgāgnilō āhuti cēseḍi ājyamu nēnē - bhagavaṃtuḍē - sṛṣṭilōni vastuvulanniyu bhagavaṃtuni rūpamulē - aṃducēta yajñamaṃtramu tānē ani ceppenu).
(ī lōkamulō saptakōṭi mahāmaṃtramulunnavi)
“maṃtrō mātā guruḥ pitā” (maṃtramē talli, taṃḍri, guruvu).
“daivādhīnaṃ jagatsarvaṃ, maṃtrādhīnaṃ tu daivataṃ |
tanmaṃtraṃ brāhmaṇādhīnaṃ brāhmaṇō mamadēvatā ||“.
(bhagavaṃtuḍī jagattunu sṛṣṭicēyuvāḍu kanuka sṛṣṭicēyabaḍina jagattaṃtayu atani ādhīnamulōnunnadi. kāni ā daivatamu maṃtrādhīnuḍu - maṃtramunuccariṃcina pratyakṣamaguvāḍu - aṭṭi maṃtramu brāhmaṇādhīnamu - aṃducēta brāhmaṇuḍu nā daivamu, bhagavaṃtunuki daivamu vaṃṭivāḍu).
larayaga, tarumūlamella nauṣadha cayamē
dharayella phalanidhāname
narulācaṃdameṟigi naḍuvagavalayun”.
“na gāyatryāṃ parōmaṃtrō” (gāyatrīmaṃtramu kaṃṭe utṛṣṭamaina maṃtramulēdu).
“yathā sarvēṣu dēvēṣu nāsti nārāyaṇātparaḥ |
tathā sarvēṣu maṃtrēṣu nāsti cāṣṭākṣarātparaḥ ||”
namaṃtrō aṣṭākṣarātparaḥ
(dēvatulaṃdaṟilōnu nārāyaṇunikanna utkṛṣṭamaina dēvuḍu lēnaṭlē, maṃtramulanniṃṭilōnu aṣṭākṣarīmaṃtramukanna utkṛṣṭamaina maṃtramu lēdu).
kiṃcillōpavidhānamātra viphalai ssaṃsāra duḥkhāvahaiḥ |
ēkassannapi sarvamaṃtraphalōdō dōṣājñi tassarvadā |
śrīrāmaśśaraṇaṃ mamēti paramō maṃtrōyamaṣṭākṣarā ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 74)
(maṃtramulanēkamulunnavi. avi cālā āyāsamutōkūḍiyunnavi - phalamu poṃduṭalō kaṣṭamainavi, ē mātramu vāṭilō lōpamunnanu viphalamagunavi - (phalamu lēkuṃḍapōvunavi), saṃsāraduḥkhamutō niṃḍiyuṃḍunavi (jananamaraṇarūpamaina saṃsāramu valana kalugu duḥkhamutō niṃḍiyuṃḍunavi). iṭuvaṃṭi anēka maṃtramulatō ēmi pani ? “śrīrāmaśśaraṇaṃ mama” (śrīrāmuḍē nāku śaraṇamagugāka) anu aṣṭākṣarīmaṃtramu (enimidi akṣaramulugala maṃtramu) okaṭē ayinanu anni maṃtramula phalamuniccunadi, dōṣamulanniṃṭini pōgoṭṭunadi)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.