(శారదా తిలకములో చెప్పబడిన మంత్రదోషములను పోగొట్టి మంత్రములు సిద్ధిని పొందించుట).
హంస హంసేతి మంత్రోయం సర్వేఐర్జీవైశ్చ జప్యతే |
గురు వాక్యాత్ సుషుమ్నాయాః విపరీతో భవేజ్జపః |
సోహం సోహం ఇతి యఃస్యాన్ మంత్రయోగస్స ఉచ్యతే ||“. (యోగశిఖోపనిషత్)
(‘హ’ కారము అని పలుకునపుడు నోటినుండి బైటకువచ్చి, ‘స’ కారము అనునప్పుడు లోనికి వాయువు పోవును - ఈ రెండు కలసి (హం+స) హంస యను మంత్రమగును - ఊపిరి పైకి వదలుచు లోనికి పీల్చుకొనుచుండుట ప్రతి రోజు అనుక్షణము ప్రతి జీవి చేయుచుండు పనియే. ఇదియే ‘హంస’ యను మంత్రము; దీనినే అజపామంత్రమనియు చెప్పుదురు - ప్రయత్నము చేయకయే జపము చేయుట. గురు బోధవలన సుషుమ్నావలన ఈ జపము విపరీతమగును - ‘హంస’ అను రెండు అక్షరములను వెనుకదానిని ముందుంచి, ముందుదానిని వెనుకకు పెట్టిన సః (=సో) హం = ‘సోహం’ అగును - సః అనగా ఆ పరబ్రహ్మ (‘తత్’) అహం అంగా నేనే - ఆ పరబ్రహ్మ నేనే అయి యున్నాను - (‘అహం బ్రహ్మాస్మి’ = నేనే పరబ్రహ్మ అయితిని అను మహావాక్యార్థమే ఇది. ఇట్లు మంత్రమును - ‘సో(అ)హం’ - జపించుటయే మంత్రయోగము).
“స్వభావసిద్ధములైన రేచక, పూరక, కుంభకములు - అనగా, నిశ్శ్వాస ఉచ్ఛ్వాసములు స్వస్థుడగు వానికి దినమునకు ఇరువదియొక్కవేల ఆరునూరుమార్లు తిరుగుచుండును. ఇది ‘హంస’ యను ఇవి కలిసిన మంత్రము ‘హంస’ అను మంత్రమగుచున్నది. దీనిని జపించుచున్నట్లు యోగి భావించవలెను - ఈ మంత్రమునకే ‘అజపామంత్ర’ మని పేరు. ఈ విధముగా భావించుటే అజపామంత్రానుష్ఠానము - ఇదియే మంత్రయోగము - ప్రాకృత స్వాభావిక ప్రాణాయామ యోగము”
“మాతృకాదియుతం మంత్రం ద్వాదశాబ్దంతు యోజపేత్ |
క్రమేణ లభతే జ్ఞానం అణిమాది గృహాన్వితం ||“. (యోగతత్వోపనిషత్)
(సర్వమంత్రములకు మాతృక అయిన ఓంకారము మొదలగువానితో కలిపి జపించిన 12 సంవత్సరములు ఎవడు జపించునో వానికి అణిమాది సిద్ధులు పొందగలిగే జ్ఞానము లభించును)
(śāradā tilakamulō ceppabaḍina maṃtradōṣamulanu pōgoṭṭi maṃtramulu siddhini poṃdiṃcuṭa).
haṃsa haṃsēti maṃtrōyaṃ sarvēairjīvaiśca japyatē |
guru vākyāt suṣumnāyāḥ viparītō bhavējjapaḥ |
sōhaṃ sōhaṃ iti yaḥsyān maṃtrayōgassa ucyatē ||“. (yōgaśikhōpaniṣat)
(‘ha’ kāramu ani palukunapuḍu nōṭinuṃḍi baiṭakuvacci, ‘sa’ kāramu anunappuḍu lōniki vāyuvu pōvunu - ī reṃḍu kalasi (haṃ+sa) haṃsa yanu maṃtramagunu - ūpiri paiki vadalucu lōniki pīlcukonucuṃḍuṭa prati rōju anukṣaṇamu prati jīvi cēyucuṃḍu paniyē. idiyē ‘haṃsa’ yanu maṃtramu; dīninē ajapāmaṃtramaniyu ceppuduru - prayatnamu cēyakayē japamu cēyuṭa. guru bōdhavalana suṣumnāvalana ī japamu viparītamagunu - ‘haṃsa’ anu reṃḍu akṣaramulanu venukadānini muṃduṃci, muṃdudānini venukaku peṭṭina saḥ (=sō) haṃ = ‘sōhaṃ’ agunu - saḥ anagā ā parabrahma (‘tat’) ahaṃ aṃgā nēnē - ā parabrahma nēnē ayi yunnānu - (‘ahaṃ brahmāsmi’ = nēnē parabrahma ayitini anu mahāvākyārthamē idi. iṭlu maṃtramunu - ‘sō(a)haṃ’ - japiṃcuṭayē maṃtrayōgamu).
“svabhāvasiddhamulaina rēcaka, pūraka, kuṃbhakamulu - anagā, niśśvāsa ucchvāsamulu svasthuḍagu vāniki dinamunaku iruvadiyokkavēla ārunūrumārlu tirugucuṃḍunu. idi ‘haṃsa’ yanu ivi kalisina maṃtramu ‘haṃsa’ anu maṃtramagucunnadi. dīnini japiṃcucunnaṭlu yōgi bhāviṃcavalenu - ī maṃtramunakē ‘ajapāmaṃtra’ mani pēru. ī vidhamugā bhāviṃcuṭē ajapāmaṃtrānuṣṭhānamu - idiyē maṃtrayōgamu - prākṛta svābhāvika prāṇāyāma yōgamu”
“mātṛkādiyutaṃ maṃtraṃ dvādaśābdaṃtu yōjapēt |
kramēṇa labhatē jñānaṃ aṇimādi gṛhānvitaṃ ||“. (yōgatatvōpaniṣat)
(sarvamaṃtramulaku mātṛka ayina ōṃkāramu modalaguvānitō kalipi japiṃcina 12 saṃvatsaramulu evaḍu japiṃcunō vāniki aṇimādi siddhulu poṃdagaligē jñānamu labhiṃcunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.