← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మన ఆత్మవాదము mana ātmavādamu

Original — తెలుగు
  1. నారద పంచరాత్ర తంత్రానుసారిణః మన ఏవ

ఆత్మా ఇతి వదంతి. ప్రాణోజడః తస్మత్ స న ఆత్మా ఘటాదివత్. బంధమోక్షౌ మనోమాత్రాధీనౌ. విషయాసక్తం మనోబంధ హేతుః విషయవాసనా సూన్యం మనః మోక్షహేతుః. కించ మనస్సంబంధా దేవ ఇంద్రియాణాం స్వస్వ విషయావభోదన సామర్థ్యం, న అన్యథా. తస్మాత్ మన ఏవ సర్వ వ్యవహార కారణం, అతః మన ఏవ ఆత్మా.

(నారద పంచరాత్రతంత్రము ననుసరించువారు మనస్సే ఆత్మయని చెప్పుచున్నారు, ఘటము మొదలగువాటివలె. ప్రాణము జడము. అందుచేత అది జడముకాదు - బంధమోక్షములు మనస్సుయొక్క ఆధీనములోనున్నవి. విషయములందాసక్తిగల మనస్సు బంధమునకు కారణము - విషయవాసనలేని మనస్సు మోక్షమునకు కారణము. కాని మనస్సుతో సంబంధము గలిగియుండుటవలననే ఇంద్రియములకు వాటి వాటికి సంబంధించిన విషయములను తెలుసుకొను సామర్థ్యము కలిగియున్నవి, ఇంకొక విధముగాకాదు. అందుచేత అన్ని వ్యవహారములకు మనస్సే కారణము - అందుచేత మనస్సే ఆత్మ).

  1. నమనః చేతనం. కింతు జడమేవ, తస్మాత్ మనః న ఆత్మా - మనసః స్థైర్య చాంచల్యాది వేత్తా, సాక్షీభూతః - ఆత్మా మనో విలక్షణః. చైతన్య భాస సహితమేవ మనః భోక్తృ భవతి, న స్వతంత్రం మనః. అతః అభోక్తృత్వాదపి మనః న ఆత్మా.

(మనస్సు చేతనముకాదు, జడము. అందుచేత మనస్సు ఆత్మకాదు - మనస్సు స్థిరముగానుండుటకు, చంచలముగా నుండుటకు సాక్షిగానుండి వాటిని తెలుసుకొనునది మనస్సుకంటె వేరైనది ఆత్మ. చైతన్యముయొక్క ఆభాసముతో కూడినదే మనస్సు. అదియే భోక్త. మనస్సు స్వతంత్రమైనదికాదు - అందుచేత భోక్త కాదు, కనుకను మనస్సు ఆత్మకాదు).

  1. సుషుప్తి యందు మనస్సులేదు, చైతన్యమున్నది. మనస్సు లేనియడల చైతన్యములేదు - అనుట సిద్ధించదు - అందుచేత మనస్సు ఆత్మకాదు.

  2. “మనో బ్రహ్మేతి వ్య జానాత్” (మనసే బ్రహ్మము)

  3. “అహంకారాది దేహాంతం భేదో నాత్మా ఘటాదివత్|”.

(అహంకారము మొదలు దేహమువఱకుగల (మార్పులు గలిగి వచ్చుచుండు) వస్తువులన్నియు ఘటమువలె ఆత్మకావు అనిన్నీ - “మనసో మనః చాక్షుస్చక్షురితి”, “తస్యభాసా సర్వమిదం విభాతి”, “సవేత్తి వేద్యం, న చ తస్యాస్తి వేత్తా” (మనసునకు మనసు అయినది, ‘కంటికి కన్ను వంటిది అనిన్నీ’, ‘దానికాంతిచేత అన్ని వస్తువులు ప్రకాశించుచున్నవి, తెలియవలసిన దానిని తెలుసుకొనును’ - ‘ఇట్టి దానిని తెలుసుకొనునది ఇతరము లేదు’ అనిన్నీ, ఆత్మ గుఱించి చెప్పుటవలన మనస్సు ఆత్మకాదు).

Transliteration
  1. nārada paṃcarātra taṃtrānusāriṇaḥ mana ēva

ātmā iti vadaṃti. prāṇōjaḍaḥ tasmat sa na ātmā ghaṭādivat. baṃdhamōkṣau manōmātrādhīnau. viṣayāsaktaṃ manōbaṃdha hētuḥ viṣayavāsanā sūnyaṃ manaḥ mōkṣahētuḥ. kiṃca manassaṃbaṃdhā dēva iṃdriyāṇāṃ svasva viṣayāvabhōdana sāmarthyaṃ, na anyathā. tasmāt mana ēva sarva vyavahāra kāraṇaṃ, ataḥ mana ēva ātmā.

(nārada paṃcarātrataṃtramu nanusariṃcuvāru manassē ātmayani ceppucunnāru, ghaṭamu modalaguvāṭivale. prāṇamu jaḍamu. aṃducēta adi jaḍamukādu - baṃdhamōkṣamulu manassuyokka ādhīnamulōnunnavi. viṣayamulaṃdāsaktigala manassu baṃdhamunaku kāraṇamu - viṣayavāsanalēni manassu mōkṣamunaku kāraṇamu. kāni manassutō saṃbaṃdhamu galigiyuṃḍuṭavalananē iṃdriyamulaku vāṭi vāṭiki saṃbaṃdhiṃcina viṣayamulanu telusukonu sāmarthyamu kaligiyunnavi, iṃkoka vidhamugākādu. aṃducēta anni vyavahāramulaku manassē kāraṇamu - aṃducēta manassē ātma).

  1. namanaḥ cētanaṃ. kiṃtu jaḍamēva, tasmāt manaḥ na ātmā - manasaḥ sthairya cāṃcalyādi vēttā, sākṣībhūtaḥ - ātmā manō vilakṣaṇaḥ. caitanya bhāsa sahitamēva manaḥ bhōktṛ bhavati, na svataṃtraṃ manaḥ. ataḥ abhōktṛtvādapi manaḥ na ātmā.

(manassu cētanamukādu, jaḍamu. aṃducēta manassu ātmakādu - manassu sthiramugānuṃḍuṭaku, caṃcalamugā nuṃḍuṭaku sākṣigānuṃḍi vāṭini telusukonunadi manassukaṃṭe vērainadi ātma. caitanyamuyokka ābhāsamutō kūḍinadē manassu. adiyē bhōkta. manassu svataṃtramainadikādu - aṃducēta bhōkta kādu, kanukanu manassu ātmakādu).

  1. suṣupti yaṃdu manassulēdu, caitanyamunnadi. manassu lēniyaḍala caitanyamulēdu - anuṭa siddhiṃcadu - aṃducēta manassu ātmakādu.

  2. “manō brahmēti vya jānāt” (manasē brahmamu)

  3. “ahaṃkārādi dēhāṃtaṃ bhēdō nātmā ghaṭādivat|”.

(ahaṃkāramu modalu dēhamuvaṟakugala (mārpulu galigi vaccucuṃḍu) vastuvulanniyu ghaṭamuvale ātmakāvu aninnī - “manasō manaḥ cākṣuscakṣuriti”, “tasyabhāsā sarvamidaṃ vibhāti”, “savētti vēdyaṃ, na ca tasyāsti vēttā” (manasunaku manasu ayinadi, ‘kaṃṭiki kannu vaṃṭidi aninnī’, ‘dānikāṃticēta anni vastuvulu prakāśiṃcucunnavi, teliyavalasina dānini telusukonunu’ - ‘iṭṭi dānini telusukonunadi itaramu lēdu’ aninnī, ātma guṟiṃci ceppuṭavalana manassu ātmakādu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.