చింతనము -
“జీవబ్రహ్మణోర భేదః సత్యః, ఉతభేద ఇతి ప్రమేయకత సందేహః; స చ అనేక ప్రకారోపి మననేన నివార్యతే”. (విచారసాగరము)
(జీవ బ్రహ్మలకు భేదములేదు - భేదమున్నది అను రెండింటిలోను ఏది నిజము అనునది మననముచేత నివారించబడుచున్నది).
(గురువు వలన వినిన వేదాంతవాక్యములననుసరించి యుక్తులచేత అద్వితీయమైన బ్రహ్మను (బ్రహ్మకాని వస్తువులేదు, అన్ని వస్తువులు బ్రహ్మమే అని) ఎల్లపుడు చింతించుట మననము).
(గురువు ఉపదేశించిన అర్థమును - భగవంతునిగుఱించి అయిన విషయమును - ‘ఇది యిట్లే’ (ఇదియే యదార్థము) అని కారణములతో మనసులో సిద్ధాంతము చేసుకొనుట).
(జీవబ్రహ్మల ఐక్యమును బోధించునవి, జీవబ్రహ్మల భేదమును ఖండించునవి యగు యుక్తులచేత “బ్రహ్మ ఒక్కడే, బ్రహ్మముకానిది వేరే యేమియు లేదు” అని ఎల్లపుడు అనుసంధానము చేయుట).
(గురువుచేత చెప్పబడిన మహావాక్యముల గూడార్థమును ఏకాంతముగ (తనలో) తర్కించుకొని, ఇది సరియైనదే యని అనుసంథానము చేయుట).
(మననమనగా ఉపనిషత్తులలో చెప్పిన విషయము అద్వైత బ్రహ్మమే - బ్రహ్మకంటె వేరేమియు లేదు - అను తాత్పర్యమును అవధారణచేయు మానసవృత్తి).
(వేదములో చెప్పబడిన అర్థము - విషయము, భగవంతుడు గుఱించి ఇతర ప్రమాణములు చెప్పెడి విరోదార్థమును నిరాకరించుటకు అనుకూలమైన తర్కజ్ఞానము కలుగచేయు మనోవ్యాపారము మననము).
(మహావాక్యార్థమును యుక్తిచే సంభావితమగునట్లు అనుసంధానము చేయుట మననము).
“శ్రుత్యర్థంబులు యుక్తిచే చింతనసేయ మననంబనంబడు” (వివేకచింతామణి - పరమానందతీర్థ)
“యుక్తిభిరను చింతనం మననం”. (యుక్తులచేత పదేపదే చింతించుట మననము)
“అసంభావనా నిరాసనం” (అసంభావన నిరసించుట)
“మననేచ శ్రవణం హేతుః, నిధిధ్యాసనే చ మననం హేతుః, మననస్యార్థదార్ఢ్యాభావేన తద్విషయే నిధిధ్యాసనా యోగాత్”
(మననమునకు శ్రవణము కారణము, నిధిధ్యాసనమునకు మననము కారణము, మనసులోని అర్థము దృఢముగా లేనిచో నిధిధ్యాసనము కలుగదు కనుక).
ciṃtanamu -
“jīvabrahmaṇōra bhēdaḥ satyaḥ, utabhēda iti pramēyakata saṃdēhaḥ; sa ca anēka prakārōpi mananēna nivāryatē”. (vicārasāgaramu)
(jīva brahmalaku bhēdamulēdu - bhēdamunnadi anu reṃḍiṃṭilōnu ēdi nijamu anunadi mananamucēta nivāriṃcabaḍucunnadi).
(guruvu valana vinina vēdāṃtavākyamulananusariṃci yuktulacēta advitīyamaina brahmanu (brahmakāni vastuvulēdu, anni vastuvulu brahmamē ani) ellapuḍu ciṃtiṃcuṭa mananamu).
(guruvu upadēśiṃcina arthamunu - bhagavaṃtuniguṟiṃci ayina viṣayamunu - ‘idi yiṭlē’ (idiyē yadārthamu) ani kāraṇamulatō manasulō siddhāṃtamu cēsukonuṭa).
(jīvabrahmala aikyamunu bōdhiṃcunavi, jīvabrahmala bhēdamunu khaṃḍiṃcunavi yagu yuktulacēta “brahma okkaḍē, brahmamukānidi vērē yēmiyu lēdu” ani ellapuḍu anusaṃdhānamu cēyuṭa).
(guruvucēta ceppabaḍina mahāvākyamula gūḍārthamunu ēkāṃtamuga (tanalō) tarkiṃcukoni, idi sariyainadē yani anusaṃthānamu cēyuṭa).
(mananamanagā upaniṣattulalō ceppina viṣayamu advaita brahmamē - brahmakaṃṭe vērēmiyu lēdu - anu tātparyamunu avadhāraṇacēyu mānasavṛtti).
(vēdamulō ceppabaḍina arthamu - viṣayamu, bhagavaṃtuḍu guṟiṃci itara pramāṇamulu ceppeḍi virōdārthamunu nirākariṃcuṭaku anukūlamaina tarkajñānamu kalugacēyu manōvyāpāramu mananamu).
(mahāvākyārthamunu yukticē saṃbhāvitamagunaṭlu anusaṃdhānamu cēyuṭa mananamu).
“śrutyarthaṃbulu yukticē ciṃtanasēya mananaṃbanaṃbaḍu” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
“yuktibhiranu ciṃtanaṃ mananaṃ”. (yuktulacēta padēpadē ciṃtiṃcuṭa mananamu)
“asaṃbhāvanā nirāsanaṃ” (asaṃbhāvana nirasiṃcuṭa)
“mananēca śravaṇaṃ hētuḥ, nidhidhyāsanē ca mananaṃ hētuḥ, mananasyārthadārḍhyābhāvēna tadviṣayē nidhidhyāsanā yōgāt”
(mananamunaku śravaṇamu kāraṇamu, nidhidhyāsanamunaku mananamu kāraṇamu, manasulōni arthamu dṛḍhamugā lēnicō nidhidhyāsanamu kalugadu kanuka).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.