తీర్థంబు దానంబు, తీర్థంబు సంతోషమనుకంప తీర్థంబు, కనక గౌరి
బ్రహ్మచర్యంబు తీర్థంబు, తీర్థము ధృతి, యమము తీర్థము, విద్రుమాధరోష్టి
సమత తీర్థము విజ్ఞానంబు తీర్థంబు, పుణ్యంబు తీర్థంబు పువ్వు బోడి
తీర్థములు మానసంబులు ధీ విశుద్ధి
యతిశయిల్లంగనివి యాడకాడినట్లు పంచజనులకు, గలహంస పక్షి గమన”. (శ్రీనాధుడు - కాశీఖండము - 2 అశ్వాసము)
వ్రజేత్ తన్మానసం తీర్థం తత్ర స్నాత్వమృతో భవేత్ ||“. (మహాభారతము)
(దేనియందు దేవతలు, వేదములును సంపూర్ణత్వమునొందునో అట్టి మానసతీర్థము పవిత్రమైనది. అందులో స్నానముచేసినవాడు ముక్తిని పొందును)
(మాసతీర్థమునకు జ్ఞానమే మడుగు, ధ్యానమే అందులోని జలము, రాగద్వేషములను మలములను పోగొట్టునట్టి ఆ మానసతీర్థములోని జలములో స్నానము చేసినయడల పరమ గతిని పొందును).
తత్రావగాహం కురు పాండు పుత్ర, నవారిణాం శుద్ధ్యతి చాంతరాత్మా||“. (మహాభారతము -)
(మనస్సే నది, సం యమమే జలము, సత్యమే మడుగు, శీలమే ఒడ్డు, దయయే అల. అట్టి మానసతీర్థమందు - అట్టి నదియందు - ఓ, పాండవా, స్నానముచేయుము - జలముచేత ఆత్మ పరిశుద్ధము కానేరదు).
యస్స్మరేత్ పుండరీకాక్షః స బాహ్యాభ్యంతరశ్శుచిః ||“. (పద్మపురాణము -)
(మాహావిష్ణువుని ధ్యానించుటయే మానస స్నానము).
సత్వరూపాచ గంగాచ నయాంతిబ్రహ్మ నిర్గుణం ||“.
(సరస్వతీనది రజోరూపము గలది, జమునానది తమోరూపమైనది, గంగానది సత్వరూపమైనది. ఈ మూడు నదులలోను స్నానము చేసిన (సత్వరజస్తమోగుణముల ప్రభావమంతరించి) అంతశ్శుద్ధి కలిగి బ్రహ్మప్రాప్తి కలుగును).
tīrthaṃbu dānaṃbu, tīrthaṃbu saṃtōṣamanukaṃpa tīrthaṃbu, kanaka gauri
brahmacaryaṃbu tīrthaṃbu, tīrthamu dhṛti, yamamu tīrthamu, vidrumādharōṣṭi
samata tīrthamu vijñānaṃbu tīrthaṃbu, puṇyaṃbu tīrthaṃbu puvvu bōḍi
tīrthamulu mānasaṃbulu dhī viśuddhi
yatiśayillaṃganivi yāḍakāḍinaṭlu paṃcajanulaku, galahaṃsa pakṣi gamana”. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu - 2 aśvāsamu)
vrajēt tanmānasaṃ tīrthaṃ tatra snātvamṛtō bhavēt ||“. (mahābhāratamu)
(dēniyaṃdu dēvatalu, vēdamulunu saṃpūrṇatvamunoṃdunō aṭṭi mānasatīrthamu pavitramainadi. aṃdulō snānamucēsinavāḍu muktini poṃdunu)
(māsatīrthamunaku jñānamē maḍugu, dhyānamē aṃdulōni jalamu, rāgadvēṣamulanu malamulanu pōgoṭṭunaṭṭi ā mānasatīrthamulōni jalamulō snānamu cēsinayaḍala parama gatini poṃdunu).
tatrāvagāhaṃ kuru pāṃḍu putra, navāriṇāṃ śuddhyati cāṃtarātmā||“. (mahābhāratamu -)
(manassē nadi, saṃ yamamē jalamu, satyamē maḍugu, śīlamē oḍḍu, dayayē ala. aṭṭi mānasatīrthamaṃdu - aṭṭi nadiyaṃdu - ō, pāṃḍavā, snānamucēyumu - jalamucēta ātma pariśuddhamu kānēradu).
yassmarēt puṃḍarīkākṣaḥ sa bāhyābhyaṃtaraśśuciḥ ||“. (padmapurāṇamu -)
(māhāviṣṇuvuni dhyāniṃcuṭayē mānasa snānamu).
satvarūpāca gaṃgāca nayāṃtibrahma nirguṇaṃ ||“.
(sarasvatīnadi rajōrūpamu galadi, jamunānadi tamōrūpamainadi, gaṃgānadi satvarūpamainadi. ī mūḍu nadulalōnu snānamu cēsina (satvarajastamōguṇamula prabhāvamaṃtariṃci) aṃtaśśuddhi kaligi brahmaprāpti kalugunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.