← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానస యజ్ఞము mānasa yajñamu

Original — తెలుగు
  1. “సోహం ఇతి చిరభావనా తః తన్మయం తద్భావసాధనం, తదేవ మానసో యజ్ఞో భవతి”.

(సః + అహం = సోహం, సః = అతను - ఆ పరబ్రహ్మ, అహం = నేను - (ఆ పరబ్రహ్మ నేనే). “అహం బ్రహ్మాస్మి” (నేను బ్రహ్మను అయి యున్నాను) అను మహావాక్యముయొక్క అర్థమునే చెప్పునది ‘సోహం’. ఈ సోహం అన్నమాటలోని అక్షరములు తారుమారు చేస్తే (వెనుక అక్షరము ముందుకు, ముందు అక్షరము వెనుకకు పెడితే) హంసః అవుతుంది - సః హం = సో(అ)హం - హంసః. హంస యనగా పరబ్రహ్మమే. ‘సోహం’ అని చాలాకాలము భావన చేయుచుండుట వలన తన్మయం అగుదురు - అనగా, దానియందే, ఆ భావనయందే, లేక, ఆ పరబ్రహ్మమందే, మనస్సు లగ్నము అయియుండును - ఇట్లు చేయుటయే మానస యజ్ఞము).

  1. విధి యజ్ఞాజ్ఞపయజ్ఞో విశిష్టో దశభిర్గుణైః |

ఉపాంశుః స్యాచ్ఛత గుణః సాహస్రో మానసః స్మృతః ||“.

(శాస్త్రములో చెప్పిన యజ్ఞములకంటె జపయజ్ఞము పదిరెట్లు శ్రేష్ట మైనది, ఉపాంశువు ఆరురెట్లు అధికమైనది. మానసయజ్ఞము వేయిరెట్లు మిన్న).

Transliteration
  1. “sōhaṃ iti cirabhāvanā taḥ tanmayaṃ tadbhāvasādhanaṃ, tadēva mānasō yajñō bhavati”.

(saḥ + ahaṃ = sōhaṃ, saḥ = atanu - ā parabrahma, ahaṃ = nēnu - (ā parabrahma nēnē). “ahaṃ brahmāsmi” (nēnu brahmanu ayi yunnānu) anu mahāvākyamuyokka arthamunē ceppunadi ‘sōhaṃ’. ī sōhaṃ annamāṭalōni akṣaramulu tārumāru cēstē (venuka akṣaramu muṃduku, muṃdu akṣaramu venukaku peḍitē) haṃsaḥ avutuṃdi - saḥ haṃ = sō(a)haṃ - haṃsaḥ. haṃsa yanagā parabrahmamē. ‘sōhaṃ’ ani cālākālamu bhāvana cēyucuṃḍuṭa valana tanmayaṃ aguduru - anagā, dāniyaṃdē, ā bhāvanayaṃdē, lēka, ā parabrahmamaṃdē, manassu lagnamu ayiyuṃḍunu - iṭlu cēyuṭayē mānasa yajñamu).

  1. vidhi yajñājñapayajñō viśiṣṭō daśabhirguṇaiḥ |

upāṃśuḥ syācchata guṇaḥ sāhasrō mānasaḥ smṛtaḥ ||“.

(śāstramulō ceppina yajñamulakaṃṭe japayajñamu padireṭlu śrēṣṭa mainadi, upāṃśuvu ārureṭlu adhikamainadi. mānasayajñamu vēyireṭlu minna).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.