← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనస్సామ్యం manassāmyaṃ

Original — తెలుగు
  1. “సామ్యే సర్వభూతేషు బ్రహ్మ సమభావే స్థితిం నిశ్చకోభూతం మనః అంతఃకరణం” (శ్రీశంకరః)

(సమస్త భూతములందు పరబ్రహ్మ సమానముగానుండునట్లు వర్తించుట) (మనస్సును చంచలముగాకుండ నుంచుట).

  1. “విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |

శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 18)

“సాత్వికే బ్రాహ్మణి శ్రేష్టే వినీతే తత్వ దర్శిని |

గవి సంస్కార హీనాయాం రాజస్యాం మధ్యమాకృతా |

అత్యంత తామసే సర్వాధమే హస్త్యాదిక త్రయే |

సత్యాదిక గుణై స్తద్ జ్ఞైః సంస్కారె రత్య సంగికం |

ద్రష్టుం శీలం సమం బ్రహ్మ యేషాం తే జ్ఞానినో బుథాః |

సూర్యో గాంగే జలే కౌపే సురాయాం ప్రతిబింబితః |

తదుణైర్దోష సంబందైః అసం సృష్టో యథా భవేత్ |

తదా బ్రహ్మ చిదాభాస ద్వారేణ ప్రతిబింబితం |

నోపాధిగుణ దోషాభ్యాం సంబంధం యాతి చిద్ఘనం |

ఇత్యేవం మన్యమానాస్తే సర్వత్ర సమదర్శినః |

నీరాగాః స్వసుఖ స్ఫూర్త్యా జీవన్ముక్తిం భజంతి వై ||“. (గీతాభావప్రకాశము - 5 - 152 to 154.)

(సత్వగుణముకలవాడు, వినయముగలవాడు, నీతిమంతుడు, తత్వదర్శి, - బ్రహ్మసాక్షాత్కారము పొందినవాడు -, శ్రేష్టుడు అగు బ్రాహ్మణునియందు (పండితునియందు) రాజస గుణముగల గోవునందు, తామసగుణము అత్యంతము గలవియు, అధమములైనవియు నగు ఏనుగు, కుక్క, కుక్కమాంసముతినువాడు - ఈ మూడింటియందును పరబ్రహ్మకలడని, వాటి నన్నింటినీ సమముగానే చూచును. పవిత్రమైన గంగానదీజలమందు, కల్లులోను, నూతిలోని జలమందు సూర్యుడు ప్రతిబింబించినను, వాటి వాటి గుణదోషములుకాని మంచిగుణములుకాని సూర్యుని అంటనట్లు చైతన్యఘనుడు అయిన పరబ్రహ్మ తాను ఏ ఉపాధిలో చిదాభాసుడుగానున్నను ఆ ఉపాధులు యొక్క గుణదోషములు అతనిని అంటవు. అందుచేత ఉపాధులు ఎంత దోషములు గలవైనను పరబ్రహ్మ శుద్ధుడే, నిర్మలుడే, ఒకడే. అందుచేత ఆ పరబ్రహ్మ అట్టి ఉపాధులలో నుండుటబట్టి ఆ విషయములు తెలిసిన పండితులు - బ్రహ్మజ్ఞానముగలవారు - ఆ ఉపాధులన్నింటినీ సమముగానే చూతురు - వాటి అన్నింటిలోను సమమైన మనస్సు గలవారై యుందురు).

  1. “ఇహైవ తైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః |”. (శ్రీమద్భగవద్గీత - 5 -19)

(మనస్సు సామ్యముగా నుంచుకోగలుగువారు ఇక్కడనే - ఈ లోకములోనే - స్వర్గము ననుభవించెదరు).

Transliteration
  1. “sāmyē sarvabhūtēṣu brahma samabhāvē sthitiṃ niścakōbhūtaṃ manaḥ aṃtaḥkaraṇaṃ” (śrīśaṃkaraḥ)

(samasta bhūtamulaṃdu parabrahma samānamugānuṃḍunaṭlu vartiṃcuṭa) (manassunu caṃcalamugākuṃḍa nuṃcuṭa).

  1. “vidyāvinaya saṃpannē brāhmaṇē gavi hastini |

śuni caiva svapākē ca paṃḍitāḥ samadarśinaḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 18)

“sātvikē brāhmaṇi śrēṣṭē vinītē tatva darśini |

gavi saṃskāra hīnāyāṃ rājasyāṃ madhyamākṛtā |

atyaṃta tāmasē sarvādhamē hastyādika trayē |

satyādika guṇai stad jñaiḥ saṃskāre ratya saṃgikaṃ |

draṣṭuṃ śīlaṃ samaṃ brahma yēṣāṃ tē jñāninō buthāḥ |

sūryō gāṃgē jalē kaupē surāyāṃ pratibiṃbitaḥ |

taduṇairdōṣa saṃbaṃdaiḥ asaṃ sṛṣṭō yathā bhavēt |

tadā brahma cidābhāsa dvārēṇa pratibiṃbitaṃ |

nōpādhiguṇa dōṣābhyāṃ saṃbaṃdhaṃ yāti cidghanaṃ |

ityēvaṃ manyamānāstē sarvatra samadarśinaḥ |

nīrāgāḥ svasukha sphūrtyā jīvanmuktiṃ bhajaṃti vai ||“. (gītābhāvaprakāśamu - 5 - 152 to 154.)

(satvaguṇamukalavāḍu, vinayamugalavāḍu, nītimaṃtuḍu, tatvadarśi, - brahmasākṣātkāramu poṃdinavāḍu -, śrēṣṭuḍu agu brāhmaṇuniyaṃdu (paṃḍituniyaṃdu) rājasa guṇamugala gōvunaṃdu, tāmasaguṇamu atyaṃtamu galaviyu, adhamamulainaviyu nagu ēnugu, kukka, kukkamāṃsamutinuvāḍu - ī mūḍiṃṭiyaṃdunu parabrahmakalaḍani, vāṭi nanniṃṭinī samamugānē cūcunu. pavitramaina gaṃgānadījalamaṃdu, kallulōnu, nūtilōni jalamaṃdu sūryuḍu pratibiṃbiṃcinanu, vāṭi vāṭi guṇadōṣamulukāni maṃciguṇamulukāni sūryuni aṃṭanaṭlu caitanyaghanuḍu ayina parabrahma tānu ē upādhilō cidābhāsuḍugānunnanu ā upādhulu yokka guṇadōṣamulu atanini aṃṭavu. aṃducēta upādhulu eṃta dōṣamulu galavainanu parabrahma śuddhuḍē, nirmaluḍē, okaḍē. aṃducēta ā parabrahma aṭṭi upādhulalō nuṃḍuṭabaṭṭi ā viṣayamulu telisina paṃḍitulu - brahmajñānamugalavāru - ā upādhulanniṃṭinī samamugānē cūturu - vāṭi anniṃṭilōnu samamaina manassu galavārai yuṃduru).

  1. “ihaiva tairjita ssargō yēṣāṃ sāmyē sthitaṃ manaḥ |”. (śrīmadbhagavadgīta - 5 -19)

(manassu sāmyamugā nuṃcukōgaluguvāru ikkaḍanē - ī lōkamulōnē - svargamu nanubhaviṃcedaru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.