← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనుష్య జన్మ manuṣya janma

Original — తెలుగు
  1. “మనుష్యాత్ జన్మ” (మనుష్యునినుండి పుట్టుట)

  2. “మనుష్య జన్మనః ఏవ భగవద్ధర్మా చరణోపయుక్తత్వం. అన్యస్యతు తదనుగుణత్వంచ అభిప్రేతం. వివిధ విచిత్ర పుణ్య పాపాత్మక కర్మభిః దేవతిర్యఙ్మ నుష్య స్థావరాది రూపేణ సంసరతో జీవస్య నియమేన ప్రతి జన్మమానుషం జన్మైవేతి విశ్వాస హేతోః అభావాత్ దుర్లభం మానుషం జన్మ - సుకృత పరిపాక విశేష లబ్ధమితి. తత్త్రైవ భగవద్ధర్మాన్ ఆచరేత్”

(మనుష్యుడై పుట్టుటవలననే భగవద్ధర్మములు నాచరించుటకు ఉపయుక్తముగా నున్నది. మిగిలిన జన్మలు దానికి అనుగుణమైనవి అనేక విధములుగాను, చిత్ర విచిత్రముగానుండు పుణ్యకర్మలు పాపకర్మల వలన దేవతలు, తిర్యగ్జంతువులు, మనుష్యులు, స్థావరములు మొదలగు రూపములతో సంసారములో పుట్టుచు గిట్టుచుండు జీవునికి ప్రతిజన్మ మానుష జన్మమే ఎత్తును అను విశ్వాసము - నమ్మకము - లేనందున మనుష్య జన్మ ఎత్తుటయే దుర్లభము - కష్టము - అనగా, పుణ్యకర్మలు పండి ఫలమునిచ్చుటయను విశేషముచేతనే లబ్దమగును. అందుచేత ఆ మానుష జన్మ ఎత్తినపుడే భగవద్ధర్మముల నాచరింపవలయును).

  1. “ద్వయోహ వై ప్రాజాపత్యాః దేవాశ్చ అసురాశ్చ”. (బృహదారణ్యకోపనిషత్ - 1 - 3 - 1)

(మనుష్యులు దైవస్వభావులు, ఆసురస్వభావులు అని రెండు విధములు). “ఎన్నో నోములు నోచిన ఫలమిది - ఈ నరజన్మము”.

Transliteration
  1. “manuṣyāt janma” (manuṣyuninuṃḍi puṭṭuṭa)

  2. “manuṣya janmanaḥ ēva bhagavaddharmā caraṇōpayuktatvaṃ. anyasyatu tadanuguṇatvaṃca abhiprētaṃ. vividha vicitra puṇya pāpātmaka karmabhiḥ dēvatiryaṅma nuṣya sthāvarādi rūpēṇa saṃsaratō jīvasya niyamēna prati janmamānuṣaṃ janmaivēti viśvāsa hētōḥ abhāvāt durlabhaṃ mānuṣaṃ janma - sukṛta paripāka viśēṣa labdhamiti. tattraiva bhagavaddharmān ācarēt”

(manuṣyuḍai puṭṭuṭavalananē bhagavaddharmamulu nācariṃcuṭaku upayuktamugā nunnadi. migilina janmalu dāniki anuguṇamainavi anēka vidhamulugānu, citra vicitramugānuṃḍu puṇyakarmalu pāpakarmala valana dēvatalu, tiryagjaṃtuvulu, manuṣyulu, sthāvaramulu modalagu rūpamulatō saṃsāramulō puṭṭucu giṭṭucuṃḍu jīvuniki pratijanma mānuṣa janmamē ettunu anu viśvāsamu - nammakamu - lēnaṃduna manuṣya janma ettuṭayē durlabhamu - kaṣṭamu - anagā, puṇyakarmalu paṃḍi phalamuniccuṭayanu viśēṣamucētanē labdamagunu. aṃducēta ā mānuṣa janma ettinapuḍē bhagavaddharmamula nācariṃpavalayunu).

  1. “dvayōha vai prājāpatyāḥ dēvāśca asurāśca”. (bṛhadāraṇyakōpaniṣat - 1 - 3 - 1)

(manuṣyulu daivasvabhāvulu, āsurasvabhāvulu ani reṃḍu vidhamulu). “ennō nōmulu nōcina phalamidi - ī narajanmamu”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.