← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మన్వంతరములు manvaṃtaramulu

Original — తెలుగు
  1. 71 దివ్య యుగములు ఒకమన్వంతరము. ఇట్టి మన్వంతరములు 14 - బ్రహ్మదేవున కొక పగలు.

  2. భాగవతము యొక్క లక్షణములలో నొకటి.

  3. “తే. జలజనాభ దయాకటాక్ష ప్రసాద

లబ్ది నఖిలైక లోకపాలక విభూతి

మహిమ బిందినవారి ధర్మములు విస్త

రమున బలుకుట మన్వంతరములు భూప”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 264)

  1. “ఈశ్వరుని మాయా వ్యాపారంబులచే నీ సృష్టియందు నద్యావర్తంబులంబడి భ్రమించుచున్న మహీరుహంబులంబోలె బూర్వాపర భావంబులెఱుంగం బడకుండు నీ కల్పంబనందుండు దేవాసురాదులు ప్రతి మన్వంతరంబునందును నిట్లు నామరూపంబులచే నిర్దేశింపబడుదురు”. (శ్రీ, మదాంధ్రమహాభాగవతము - 8 - 10 - 344)
Transliteration
  1. 71 divya yugamulu okamanvaṃtaramu. iṭṭi manvaṃtaramulu 14 - brahmadēvuna koka pagalu.

  2. bhāgavatamu yokka lakṣaṇamulalō nokaṭi.

  3. “tē. jalajanābha dayākaṭākṣa prasāda

labdi nakhilaika lōkapālaka vibhūti

mahima biṃdinavāri dharmamulu vista

ramuna balukuṭa manvaṃtaramulu bhūpa”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 264)

  1. “īśvaruni māyā vyāpāraṃbulacē nī sṛṣṭiyaṃdu nadyāvartaṃbulaṃbaḍi bhramiṃcucunna mahīruhaṃbulaṃbōle būrvāpara bhāvaṃbuleṟuṃgaṃ baḍakuṃḍu nī kalpaṃbanaṃduṃḍu dēvāsurādulu prati manvaṃtaraṃbunaṃdunu niṭlu nāmarūpaṃbulacē nirdēśiṃpabaḍuduru”. (śrī, madāṃdhramahābhāgavatamu - 8 - 10 - 344)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.