← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మరణము maraṇamu

Original — తెలుగు
  1. పూర్వ గృహీత దేహేంద్రియాది వియోగః మరణం - వ్యయం.

(ఇదివఱకు గ్రహించియున్న - కలిగియున్న - ధరించియున్న - కలిగియున్న - దేహమును, ఇంద్రియములు మొదలగునవి (చైతన్యవంతముగా కలిసియున్న అవయవములు, ప్రాణము మొదలగునవి - వేటికి అవి విడిపోవుట - (Integration of the five elements so as to form a physical body - is birth and their disintegration is death).

  1. “జీవుండు భూతేంద్రియ మనోమయంబైన దేహంబు గలిగియుండు. అట్టి దేహ నిరోధంబె మరణంబు, నావిర్భావంబె జననంబు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 31 - 1009)

  1. “సీ. అట్టి విరాడ్విగ్రహంబందు గగనతేజఃప్రాణములు సర్వ జంతురతుడు

నైనట్టి జీవుని ననుసరింపుచు నుండు; బింబ జీవుడు శరీరంబువలన

వెలువడి చన, జీవినెనుకొని ప్రాణముల్ చనుచుండు, నిజనాధు ననుసరించు

భటుల చందంబున - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 269)

  1. “చక్షషో వా మూర్థ్నో వా (అ)న్యేభ్యో వా శరీర దేశేభ్యస్తముత్క్రామంతంప్రాణో(అ)నుత్క్రామంతి, ప్రాణమనూత్క్రామంతం సర్వే ప్రాణాః అనుత్క్రామంతి”.

(నేత్రమునుండికాని, శిరస్సునుండికాని, ఇతరములగు శరీరప్రదేశములనుండికాని ఆ జీవుడు నిర్గమించుచుండగా ప్రాణము అతనితోకూడ నిర్గమించును. ప్రాణముతో కూడ ప్రాణములు అన్నియు (మిగిలినప్రాణములు ఉపప్రాణములు) నిర్గమించును).

  1. ఏవమేవాస్య పరిద్రష్టురిమాఃషోడశకళాః పురుషాయణాః పురుషం ప్రాప్యాస్తం గచ్ఛంతి.

(ఈ విధముగానే బ్రహ్మవేత్తయొక్క షోడశకళలును - అనగా, పదకొండు ఇంద్రియములు, పంచప్రాణములు - పరమేశ్వరుడే ఆధారముగా గలవిగాన ఆయన యందే లీలములగును).

  1. “జాగ్రత్స్వప్న సుషుప్తి మూర్ఛానాం అన్యా బ్రహ్మాది స్తంబ పర్యంతం సర్వ జీవ భయప్రదా స్థూలదేహ విసర్జనీ మరణావస్థా భవతి”.

(జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్ర్యవస్థ, మూర్ఛ - ఈ అవస్థలకంటె వేరైనది. చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబమువరకు గల సకల జీవరాసులకు భయమును కలుగచేయునది. స్థూలదేహమును విడిచుట అనునది మరణము).

  1. “జాతస్య మరణం ధ్రువం” (పుట్టినది గిట్టకమానది). “జాతస్య హి ధృవో మృత్యుః” (శ్రీమద్భగవద్గీత -2 - 27)

(షడ్భావ వికారములఓ నొకటి - శరీరము పొందు మార్పులలో ఆఖరుది.)

  1. “సీ. పాంచభౌతికమైన భవనంబు దేహంబు; పురుషుడు దీనిలో బూర్వ కర్మ

వశమున నొకవేళ వర్తించు, దీపించు, దఱియైన నొకవేళ దలగిపోవు - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2 - 51)

(పంచభూతముల అంశల సమ్మేళనము వలన కలిగినది శరీరము - పాంచభౌతికము. (Integration of the five elements -). ఈ పంచభూతముల అంశలు వేటికవి విడిపోయి శరీరమును వదలివేయుటయే ఆ శరీరమునకు మరణము - శరీరములోని కఠిన పదార్థము - యముకలు మొదలగునవి - భూమి అంశకనుక భూమిలో కలిసిపోవును - శరీరదహనమువలనగాని, పాతిపెట్టుటవలనకాని- శరీరములోని ద్రవపదార్థము జలము అన్నరసము నెత్తురు మొదలగునవి - జలముయొక్క అంశ ఆర్చుకొనిపోవును. శరీరములోని అగ్ని అంశ లేక ఉష్ణత లేకుండును - శరీరము చల్లపడును (Body temperature) ప్రాణవాయువు శరీరములో సంచలనము చేయదు - రక్తనాళములు ముడుచుకొనిపోయినందున ఆకాకము నకవకాశములేదు - శరీరమునకు చైతన్యముండదు - ఈ స్థితియే మరణము - శరీరములో పంచభూతముల అంశలు సమానపాళ్ళలో (proportionలో) నున్నంతకాలము శరీరము చైతన్యవంతమై జీవము గలదిగానుండును. అట్లు కానప్పుడు శరీరము మరణించినట్లే).

  1. “ఉ. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, దేహి పుట్టుచుం

జచ్చుచునుంట జూచెదరు చావకమానెడువారిభంగి నీ

చచ్చినవారికేడ్చెదరు; చావు పునకొల్లక డాగవచ్చునే?

యెచ్చటబుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 46)

  1. “ఆ. - - - అడవి రక్షలేని యబలుండు

వర్థిల్లు రక్షితుండు మందిరమున జచ్చు“. (పరీక్షిత్తు) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 2- 49)

  1. “ఫొకన్మానది ప్రాణమెంత తనువున్ పోషించి రక్షించినన్”

  2. ‘చనిపోవుట’ - చనుట యనగా వెళ్ళిపోవుట యని అర్థము. ఒక శరీరములోనున్న జీవుడు ఆ శరీరమును వదలి మఱియొక శరీరమునకు వెళ్ళిపోవుట - జీర్ణవస్త్రములను విడిచికొత్త వస్త్రములు ధరించినట్లు –

“వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరో (అ)పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సం యాతి నవాని దేహీ ||”.

(శ్రీమద్భగవద్గీత - 2 - 22)

(జీర్ణించిన వస్త్రములను వదలి కొత్త వస్త్రములను దేహి - దేహముగలవాడు, జీవుడు ఎట్లు గ్రహించునో యట్లే జీవుడు జీర్ణించిపోయిన శరీరములను వదలివేసి కొత్త శరీరములనుపొందును). - (శరీరము జీర్ణించిపోయినందున - అందులో నుండిన ప్రయోజనములేదు కనుక - జీవుడు దాని వదలిపోవుటయే మరణము (శరీరమునకు మరణము). (ఎంతకాలము శరీరమును సం రక్షించుకొనిన అంతకాలము జీవుడు దానిలోనుండును. శరీరము బాగుపడని స్థితిలోనున్నపుడు దానిని జీవుడు వదలివేయును - అదియే మరణము). అగ్నికి వేడిగానుండుటెట్లు స్వభావమో, మంచునకు శీతలత్వమెట్లు స్వభావమో, అట్లే దేహముమకు జనమరణములు స్వభావములు).

  1. “అవసానకాలము సమీపించినపుడు స్థూలదేహములో నిమిడియుండు నాడీ పనజరము మెల్లన నెల్లవైపుల నుండియు లోపలికి ముడుచుకొనును - ముడుచుకొని స్థూల శరీరభూత సూక్ష్మమును ఆవరించుకొని హృదయస్థానమునందు జ్వలించుచు నిలుచును. అపుడు అంగాంగములు చల్లనగుటకు నారంభించును. ప్రాణకళ హృదయస్థానమందు కొంతతడవుండి అక్కడి భూతసూక్షమముతో సహా ముడుచుకొని యుండు నాడీ పంజరముతోకూడి పైకిలేచును, హృదయమునుండి కంఠస్థానమందుండు చక్రమునకు అచ్చటనుండి భృఊమధ్యస్థమైన చక్రమునకు, తదనంతరము సహస్రారమునకు వెళ్ళి శరీరము విడిచిపోవును”.
Transliteration
  1. pūrva gṛhīta dēhēṃdriyādi viyōgaḥ maraṇaṃ - vyayaṃ.

(idivaṟaku grahiṃciyunna - kaligiyunna - dhariṃciyunna - kaligiyunna - dēhamunu, iṃdriyamulu modalagunavi (caitanyavaṃtamugā kalisiyunna avayavamulu, prāṇamu modalagunavi - vēṭiki avi viḍipōvuṭa - (Integration of the five elements so as to form a physical body - is birth and their disintegration is death).

  1. “jīvuṃḍu bhūtēṃdriya manōmayaṃbaina dēhaṃbu galigiyuṃḍu. aṭṭi dēha nirōdhaṃbe maraṇaṃbu, nāvirbhāvaṃbe jananaṃbu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 31 - 1009)

  1. “sī. aṭṭi virāḍvigrahaṃbaṃdu gaganatējaḥprāṇamulu sarva jaṃturatuḍu

nainaṭṭi jīvuni nanusariṃpucu nuṃḍu; biṃba jīvuḍu śarīraṃbuvalana

veluvaḍi cana, jīvinenukoni prāṇamul canucuṃḍu, nijanādhu nanusariṃcu

bhaṭula caṃdaṃbuna - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 269)

  1. “cakṣaṣō vā mūrthnō vā (a)nyēbhyō vā śarīra dēśēbhyastamutkrāmaṃtaṃprāṇō(a)nutkrāmaṃti, prāṇamanūtkrāmaṃtaṃ sarvē prāṇāḥ anutkrāmaṃti”.

(nētramunuṃḍikāni, śirassunuṃḍikāni, itaramulagu śarīrapradēśamulanuṃḍikāni ā jīvuḍu nirgamiṃcucuṃḍagā prāṇamu atanitōkūḍa nirgamiṃcunu. prāṇamutō kūḍa prāṇamulu anniyu (migilinaprāṇamulu upaprāṇamulu) nirgamiṃcunu).

  1. ēvamēvāsya paridraṣṭurimāḥṣōḍaśakaḷāḥ puruṣāyaṇāḥ puruṣaṃ prāpyāstaṃ gacchaṃti.

(ī vidhamugānē brahmavēttayokka ṣōḍaśakaḷalunu - anagā, padakoṃḍu iṃdriyamulu, paṃcaprāṇamulu - paramēśvaruḍē ādhāramugā galavigāna āyana yaṃdē līlamulagunu).

  1. “jāgratsvapna suṣupti mūrchānāṃ anyā brahmādi staṃba paryaṃtaṃ sarva jīva bhayapradā sthūladēha visarjanī maraṇāvasthā bhavati”.

(jāgradavastha, svapnāvastha, suṣuptryavastha, mūrcha - ī avasthalakaṃṭe vērainadi. caturmukhabrahma modalu staṃbamuvaraku gala sakala jīvarāsulaku bhayamunu kalugacēyunadi. sthūladēhamunu viḍicuṭa anunadi maraṇamu).

  1. “jātasya maraṇaṃ dhruvaṃ” (puṭṭinadi giṭṭakamānadi). “jātasya hi dhṛvō mṛtyuḥ” (śrīmadbhagavadgīta -2 - 27)

(ṣaḍbhāva vikāramulaō nokaṭi - śarīramu poṃdu mārpulalō ākharudi.)

  1. “sī. pāṃcabhautikamaina bhavanaṃbu dēhaṃbu; puruṣuḍu dīnilō būrva karma

vaśamuna nokavēḷa vartiṃcu, dīpiṃcu, daṟiyaina nokavēḷa dalagipōvu - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2 - 51)

(paṃcabhūtamula aṃśala sammēḷanamu valana kaliginadi śarīramu - pāṃcabhautikamu. (Integration of the five elements -). ī paṃcabhūtamula aṃśalu vēṭikavi viḍipōyi śarīramunu vadalivēyuṭayē ā śarīramunaku maraṇamu - śarīramulōni kaṭhina padārthamu - yamukalu modalagunavi - bhūmi aṃśakanuka bhūmilō kalisipōvunu - śarīradahanamuvalanagāni, pātipeṭṭuṭavalanakāni- śarīramulōni dravapadārthamu jalamu annarasamu netturu modalagunavi - jalamuyokka aṃśa ārcukonipōvunu. śarīramulōni agni aṃśa lēka uṣṇata lēkuṃḍunu - śarīramu callapaḍunu (Body temperature) prāṇavāyuvu śarīramulō saṃcalanamu cēyadu - raktanāḷamulu muḍucukonipōyinaṃduna ākākamu nakavakāśamulēdu - śarīramunaku caitanyamuṃḍadu - ī sthitiyē maraṇamu - śarīramulō paṃcabhūtamula aṃśalu samānapāḷḷalō (proportionlō) nunnaṃtakālamu śarīramu caitanyavaṃtamai jīvamu galadigānuṃḍunu. aṭlu kānappuḍu śarīramu maraṇiṃcinaṭlē).

  1. “u. maccika vīrikella bahumātramu cōdyamu, dēhi puṭṭucuṃ

jaccucunuṃṭa jūcedaru cāvakamāneḍuvāribhaṃgi nī

caccinavārikēḍcedaru; cāvu punakollaka ḍāgavaccunē?

yeccaṭabuṭṭe naccaṭiki nēguṭa naijamu prāṇikōṭikin”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 46)

  1. “ā. - - - aḍavi rakṣalēni yabaluṃḍu

varthillu rakṣituṃḍu maṃdiramuna jaccu”. (parīkṣittu) (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 2- 49)

  1. “phokanmānadi prāṇameṃta tanuvun pōṣiṃci rakṣiṃcinan”

  2. ‘canipōvuṭa’ - canuṭa yanagā veḷḷipōvuṭa yani arthamu. oka śarīramulōnunna jīvuḍu ā śarīramunu vadali maṟiyoka śarīramunaku veḷḷipōvuṭa - jīrṇavastramulanu viḍicikotta vastramulu dhariṃcinaṭlu –

“vāsāṃsi jīrṇāni yathā vihāya, navāni gṛhṇāti narō (a)parāṇi tathā śarīrāṇi vihāya jīrṇānyanyāni saṃ yāti navāni dēhī ||”.

(śrīmadbhagavadgīta - 2 - 22)

(jīrṇiṃcina vastramulanu vadali kotta vastramulanu dēhi - dēhamugalavāḍu, jīvuḍu eṭlu grahiṃcunō yaṭlē jīvuḍu jīrṇiṃcipōyina śarīramulanu vadalivēsi kotta śarīramulanupoṃdunu). - (śarīramu jīrṇiṃcipōyinaṃduna - aṃdulō nuṃḍina prayōjanamulēdu kanuka - jīvuḍu dāni vadalipōvuṭayē maraṇamu (śarīramunaku maraṇamu). (eṃtakālamu śarīramunu saṃ rakṣiṃcukonina aṃtakālamu jīvuḍu dānilōnuṃḍunu. śarīramu bāgupaḍani sthitilōnunnapuḍu dānini jīvuḍu vadalivēyunu - adiyē maraṇamu). agniki vēḍigānuṃḍuṭeṭlu svabhāvamō, maṃcunaku śītalatvameṭlu svabhāvamō, aṭlē dēhamumaku janamaraṇamulu svabhāvamulu).

  1. “avasānakālamu samīpiṃcinapuḍu sthūladēhamulō nimiḍiyuṃḍu nāḍī panajaramu mellana nellavaipula nuṃḍiyu lōpaliki muḍucukonunu - muḍucukoni sthūla śarīrabhūta sūkṣmamunu āvariṃcukoni hṛdayasthānamunaṃdu jvaliṃcucu nilucunu. apuḍu aṃgāṃgamulu callanaguṭaku nāraṃbhiṃcunu. prāṇakaḷa hṛdayasthānamaṃdu koṃtataḍavuṃḍi akkaḍi bhūtasūkṣamamutō sahā muḍucukoni yuṃḍu nāḍī paṃjaramutōkūḍi paikilēcunu, hṛdayamunuṃḍi kaṃṭhasthānamaṃduṃḍu cakramunaku accaṭanuṃḍi bhṛūmadhyasthamaina cakramunaku, tadanaṃtaramu sahasrāramunaku veḷḷi śarīramu viḍicipōvunu”.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.