← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మార్జాలకిశోరన్యాయము mārjālakiśōranyāyamu

Original — తెలుగు
  1. పిల్లి తన పిల్లలను తానే నోటితో పట్టుకొని జాగ్రత్తగా తీసుకొనిపోవును - ఇట్లు చేయుటలో పిల్ల భారమంతయు తల్లిపిల్లిదే - భగవంతుడు తన భక్తుని భారమంతయు తానే భరించును - తల్లిపిల్లివలెనే - ఇందుకు భక్తునికి భగవంతునియడల కలుగు నమ్మకము, భక్తియే కారణము -

  2. “యథా మార్జాలకిశోరం తన్మాతా మార్జాలీ స్వయమేవ దంత ఘాత నాదేః సం రక్ష్య దేశాద్దేశాంతరం నీత్వా పుష్ణాతి తథా సర్వం కర్మ విహాయ స్వాత్మానం భగవతే నివేద్య వర్తమానం స్వయమేవ భగవాన్ కృతయోగక్షేమో రక్షతి - ఇతి మార్జాలకిశోరన్యాయాను గృహీతః - నరః ఇతి”.

(పిల్లి తనపిల్లను తన దంతములతో గట్టిగా పట్టుకొనుట మొదలగు పనులచేత - అట్లు పట్టుకొనుట పిల్లకు కొంచెము బాధకలుగచేయునదైనను – రక్షించు కుంటు ఒక ప్రదేశమునుండి ఇంకొక ప్రదేశమునకు తీసుకొని వెళ్ళుచూ పోషించును - (పిల్లి పిల్లలను పెట్టి పది యిళ్ళు త్రిప్పును) - తథా ఆ ప్రకారముగానే సమస్త కర్మలను విడిచిపెట్టి, తనను భగవంతునికే సమర్పించియుండు వానిని భగవంతుడు స్వయముగనే వాని యోగక్షేమము నరయుచు, పోషించును - కాపాడును - ఇదియే మార్జాలకిశోరన్యాయము - పిల్లి పిల్లలగుఱించి యోగక్షేమ భారము తానే వహించినట్లు భగవంతుడు తన భక్తుని యోగక్షేమము కాపాడుచు రక్షించును).

  1. “తెంగలాఖ్య సిద్ధాంతే మార్జాల కిశోరన్యాయకీ మోక్షః శ్లాఘ హేతుః”.

(తెంగల సిద్ధాంతములో మార్జాలకిశోరన్యాయము ననుసరించు మోక్షమే శ్లాఘనీయము అనుటకు కారణము).

Transliteration
  1. pilli tana pillalanu tānē nōṭitō paṭṭukoni jāgrattagā tīsukonipōvunu - iṭlu cēyuṭalō pilla bhāramaṃtayu tallipillidē - bhagavaṃtuḍu tana bhaktuni bhāramaṃtayu tānē bhariṃcunu - tallipillivalenē - iṃduku bhaktuniki bhagavaṃtuniyaḍala kalugu nammakamu, bhaktiyē kāraṇamu -

  2. “yathā mārjālakiśōraṃ tanmātā mārjālī svayamēva daṃta ghāta nādēḥ saṃ rakṣya dēśāddēśāṃtaraṃ nītvā puṣṇāti tathā sarvaṃ karma vihāya svātmānaṃ bhagavatē nivēdya vartamānaṃ svayamēva bhagavān kṛtayōgakṣēmō rakṣati - iti mārjālakiśōranyāyānu gṛhītaḥ - naraḥ iti”.

(pilli tanapillanu tana daṃtamulatō gaṭṭigā paṭṭukonuṭa modalagu panulacēta - aṭlu paṭṭukonuṭa pillaku koṃcemu bādhakalugacēyunadainanu – rakṣiṃcu kuṃṭu oka pradēśamunuṃḍi iṃkoka pradēśamunaku tīsukoni veḷḷucū pōṣiṃcunu - (pilli pillalanu peṭṭi padi yiḷḷu trippunu) - tathā ā prakāramugānē samasta karmalanu viḍicipeṭṭi, tananu bhagavaṃtunikē samarpiṃciyuṃḍu vānini bhagavaṃtuḍu svayamuganē vāni yōgakṣēmamu narayucu, pōṣiṃcunu - kāpāḍunu - idiyē mārjālakiśōranyāyamu - pilli pillalaguṟiṃci yōgakṣēma bhāramu tānē vahiṃcinaṭlu bhagavaṃtuḍu tana bhaktuni yōgakṣēmamu kāpāḍucu rakṣiṃcunu).

  1. “teṃgalākhya siddhāṃtē mārjāla kiśōranyāyakī mōkṣaḥ ślāgha hētuḥ”.

(teṃgala siddhāṃtamulō mārjālakiśōranyāyamu nanusariṃcu mōkṣamē ślāghanīyamu anuṭaku kāraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.