← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మర్కట కిశోర న్యాయము markaṭa kiśōra nyāyamu

Original — తెలుగు
  1. కోతియొక్క నడుమును దాని పిల్ల గట్టిగా పట్టుకొని యుండును - ఏమాత్రము పట్టువదలినను, పిల్ల జారిపడును. పిల్ల పడకుండనుండుభారము పిల్లదే - ఇట్లే భగవంతుని పట్టుకొనివేలాడు అవలంబనముచేయువాడు తన పట్టు విడువక భగవంతుని కొలిచి మోక్షము నొందవలెను - ఇట్లు చేయుటలో భారము భగవంతుని కొలుచువానిదే.

  2. “యథా మర్కట కిశోరః ప్రాకారః ప్రాకారాది లంఘనే అసి దండవదవలంబ మానః మాతుః కాంక్షితం స్తన్యం అనుభవతి, తథా శ్రౌతస్మార్త కర్మద్వారా సేవమానో భక్తః భగవత్ప్రసాదం లభతే ఇతి మర్కట కిశోర న్యాయాను గృహీతః”.

(కోతి గోడలు మొదలగువాటిని ఎక్కుతూ గెంతుతూ ఉన్నప్పటికీ దాని పిల్ల దానిని పట్టుకొని వేలాడుచు కావలసిన పాలు త్రాగుచు పట్టువదలకుండనుండునో అట్లే శ్రౌత, స్మార్త కర్మలద్వారా భగవంతుని సేవించు భక్తుడు పట్టు వదలక భగవంతుని దయ - ప్రసాదము - ను పొందును - ఇదియే మర్కటకిశోర న్యాయము).

Transliteration
  1. kōtiyokka naḍumunu dāni pilla gaṭṭigā paṭṭukoni yuṃḍunu - ēmātramu paṭṭuvadalinanu, pilla jāripaḍunu. pilla paḍakuṃḍanuṃḍubhāramu pilladē - iṭlē bhagavaṃtuni paṭṭukonivēlāḍu avalaṃbanamucēyuvāḍu tana paṭṭu viḍuvaka bhagavaṃtuni kolici mōkṣamu noṃdavalenu - iṭlu cēyuṭalō bhāramu bhagavaṃtuni kolucuvānidē.

  2. “yathā markaṭa kiśōraḥ prākāraḥ prākārādi laṃghanē asi daṃḍavadavalaṃba mānaḥ mātuḥ kāṃkṣitaṃ stanyaṃ anubhavati, tathā śrautasmārta karmadvārā sēvamānō bhaktaḥ bhagavatprasādaṃ labhatē iti markaṭa kiśōra nyāyānu gṛhītaḥ”.

(kōti gōḍalu modalaguvāṭini ekkutū geṃtutū unnappaṭikī dāni pilla dānini paṭṭukoni vēlāḍucu kāvalasina pālu trāgucu paṭṭuvadalakuṃḍanuṃḍunō aṭlē śrauta, smārta karmaladvārā bhagavaṃtuni sēviṃcu bhaktuḍu paṭṭu vadalaka bhagavaṃtuni daya - prasādamu - nu poṃdunu - idiyē markaṭakiśōra nyāyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.