సూర్యుడు.
మృతే అండే జాతః మార్తాండః - సర్వ సమ్హారే తత్సృష్టయే పునః ప్రాదుర్భూతః -
(బ్రహ్మాండము బ్రద్దలయిపోగా పుట్టినవాడు - చూడుము - “బ్రహ్మాండము”. ఇదివరకున్న ప్రపంచములోనున్న వస్తువులన్నియు ప్రళయములో నశించినవి - అనగా సూక్ష్మాతి సూక్ష్మమైన రూపములో వేఱువేఱుగా నుండెను. పరబ్రహ్మ సం రక్షకుడగుటవలన - (సమ్యక్ కర్షతి ఆకర్షతి ఇతి సం కర్షణః = అడ్డులేని ఆకర్షణశ్క్తి గలవాడు అగుటవలన - (Irresistable Magnetic force) - ప్రతి అణువులోను తానుండుటవలన - వాటి నన్నింటిని ఒకదానితో నొకటి కలియునట్లుగా ఆకర్షింపచేసి, కూడుకుపోయి కరడుకట్టుకుపోయి - ఘనీభవించినట్లు చేయగా అవి అండాకారముగా - గుడ్డు ఆకారముగా మారెను - పరబ్రహ్మ వృద్ధిపొందు శక్తిగలవాడు - బృమ్హణాత్ బ్రహ్మ - అందుచేత బ్రహ్మ అండాకారముగా మారుటవలన అది బ్రహ్మాండమని చెప్పబడినది. పరబ్రహ్మ తేజస్వరూపుడు - బ్రహ్మాండములోనుండి దానికి వేడిమి కలిగించి - తపనము కలిగించగా పట్టలేని వేడిమివలన - చుంచుబుడ్డివలె - ఆ అండము పగిలి దానిలోని ముక్కలు చెల్లచెదురై విరజిమ్ముకుపోగా, ఆ ముక్కలు ఒక్కొక్క లోకముగా మారెను - అట్లు - తేజోరూపములుగా మారినవన్నియు మార్తాండములే - వాటిలో మనసూర్యుడు ఒకడు - తేజోమూర్తి మార్తాండుడు అని చెప్పబడుచున్నాడు - అందుచేత ఇదివరకు సృష్టిలోని వస్తువులు నామరూపములు లేకుండనున్న వాటిని మరల సృష్టించుటకు పుట్టినవాడు అని చెప్పబడినది).
(అండాకారముగా ప్రేలిపోయిన అచేతనమైన ప్రకృతి పరిణామ వస్తువును తిరిగి జీవింపచేయువాడు, చేతనవంతముగా చేయువాడు).
(అచేతనరూపములో నున్నది చనిపోగా - ప్రేలి బద్దలయిపోగా దానిలోనుండి వైరాజరూపములో - విరాట్ రూపములో - అనేక రూపములతో ప్రకాశించువాడుగా మారినవాడు).
sūryuḍu.
mṛtē aṃḍē jātaḥ mārtāṃḍaḥ - sarva samhārē tatsṛṣṭayē punaḥ prādurbhūtaḥ -
(brahmāṃḍamu braddalayipōgā puṭṭinavāḍu - cūḍumu - “brahmāṃḍamu”. idivarakunna prapaṃcamulōnunna vastuvulanniyu praḷayamulō naśiṃcinavi - anagā sūkṣmāti sūkṣmamaina rūpamulō vēṟuvēṟugā nuṃḍenu. parabrahma saṃ rakṣakuḍaguṭavalana - (samyak karṣati ākarṣati iti saṃ karṣaṇaḥ = aḍḍulēni ākarṣaṇaśkti galavāḍu aguṭavalana - (Irresistable Magnetic force) - prati aṇuvulōnu tānuṃḍuṭavalana - vāṭi nanniṃṭini okadānitō nokaṭi kaliyunaṭlugā ākarṣiṃpacēsi, kūḍukupōyi karaḍukaṭṭukupōyi - ghanībhaviṃcinaṭlu cēyagā avi aṃḍākāramugā - guḍḍu ākāramugā mārenu - parabrahma vṛddhipoṃdu śaktigalavāḍu - bṛmhaṇāt brahma - aṃducēta brahma aṃḍākāramugā māruṭavalana adi brahmāṃḍamani ceppabaḍinadi. parabrahma tējasvarūpuḍu - brahmāṃḍamulōnuṃḍi dāniki vēḍimi kaligiṃci - tapanamu kaligiṃcagā paṭṭalēni vēḍimivalana - cuṃcubuḍḍivale - ā aṃḍamu pagili dānilōni mukkalu cellacedurai virajimmukupōgā, ā mukkalu okkokka lōkamugā mārenu - aṭlu - tējōrūpamulugā mārinavanniyu mārtāṃḍamulē - vāṭilō manasūryuḍu okaḍu - tējōmūrti mārtāṃḍuḍu ani ceppabaḍucunnāḍu - aṃducēta idivaraku sṛṣṭilōni vastuvulu nāmarūpamulu lēkuṃḍanunna vāṭini marala sṛṣṭiṃcuṭaku puṭṭinavāḍu ani ceppabaḍinadi).
(aṃḍākāramugā prēlipōyina acētanamaina prakṛti pariṇāma vastuvunu tirigi jīviṃpacēyuvāḍu, cētanavaṃtamugā cēyuvāḍu).
(acētanarūpamulō nunnadi canipōgā - prēli baddalayipōgā dānilōnuṃḍi vairājarūpamulō - virāṭ rūpamulō - anēka rūpamulatō prakāśiṃcuvāḍugā mārinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.