“అసతః జగతః జనిం ఉత్పత్తిం యే వైశేషికాః వదంతి, సతః ఏవ బ్రహ్మ తత్వస్య ఉత్పత్తిం వదంతి, యేచ పాతం జలా దయః సతః ఏవైక వింశతి, యే ప్రకారస్య దుఃఖస్య మృతిం నాశం మోక్షం వదంతి, యే నైయాయికాః ఉత అపి ఆత్మనిభాదాం భేదం (స్థూలత్వ, కృశత్వ, మనుష్యత్వ మగత్వాది రూపాం భిదాం); యే కేచిద్వదంతీతి చార్వాక మతాను వాదః, (తే దేహం ఆత్మానం మన్యంతే) విపణం కర్మఫల వ్యవహారం (దేవమనుష్య యోః అన్యోన్యోపకార భావ జనితం వాణిజ్యఫల తుల్యం స్వర్గాదిఫలం ఋతం సత్యం యే మీమాంసకాః స్మరంతీతి కర్మఫల నిత్యవాదానువాదః న కేవలం స్మరంతి కింతు తే తార్కికాదయః ఆరోపితైః యుక్త్యా బాస్యైః భ్రమైః ఉపదిశంతి (స్వమతసిద్ధం) న తత్ దృష్ట్యా ఇత్థం ఏషాం వాదానాం అజ్ఞానమూలత్వముక్తం - భగవాన్ జ్ఞానమయః, యథావత్ విజ్ఞాతే సతి అవబోధః, తన్మూలః, వాద భేదశ్చ నాస్తి ఇత్యర్థః - కిమవబోధి నిదాన ఇత్యాపేక్షయాం మనో దోష ఏవ ఇతి. కింతన్నివృత్తి నిదానమత్యపేక్షాయాం భగవదుపాసకయోగ ఏవ ఇతి. విశుద్ధాంతః కరణాస్తు సర్వం ఇదం జగత్ భగవదాత్మక తయా సూక్ష చిదచిద్విశిష్ట భగవత్కార్య తయా చ తదన్యదేవ పశ్యంతీతి వదంతి”.
(అసత్ నుండి జగత్తు కలిగినది అని వైశేషికుల అభిప్రాయము - సత్ నుండి యే బ్రహ్మతత్వముత్పత్తి అయినది అని పాతంజలుల మతము - సత్ నుండియే ఇరువదియొక్క విధములుగానుండు దుఃఖము నాశము - మోక్షము అని నైయాలుకులు చెప్పుదురు - ఆత్మయే స్థూలత్వ, కృశత్వ, మనుష్యత్వ, మగత్వాది భేదములతో నున్నదని చార్వాకులనుచున్నారు - వారు దేహమే యని యందురు - దేవతులు, మనుష్యులు ఒకరికొకరు ఉపాకారము చేసుకొను భావము కలిగియుండుటవలన వ్యాపారముతో పోల్చతగిన కర్మఫల వ్యవహారము స్వర్గము మొదలగు ఫలము కలదగునదియే పరబ్రహ్మ తత్వమని మీమాంసకులు వాదించుచున్నారు - ఈ ప్రకారముగా చేయు వాదములు అజ్ఞానమువల్ల చెప్పబడినవి. భగవంతుడు చిన్మయుడు - జ్ఞానమయుడు. మతము ఏ ప్రకారము బోధించబడెనో దానిని బట్టి మతభేదము - మతభేదము మనోదోషము - ఏ ప్రకారముగా భగవంతుని ఉపాసించిన ఆ ప్రకారమే మతమగును - విశుద్ధాంతఃకరణములు గలవారు ఈ జగత్తు అంతయు భగవంతుని రూపమే. సూక్ష్మ చిత్ అచిత్ వస్తువులన్నియు భగవతుని కార్యములే - భగవంతునిలోనుండి పుట్టినవే కనుక అతని కంటె వేఱుకావు అని తలంచెదరు).
మతమనగా భగవంతునకు, ప్రకృతికి, జీవునకు గల సంబంధ బాంధవ్యము తెలుపునది. మొదలు, తుది తెలియని వేదములనుండి జనించినదికనుక మనమతము సనాతనము. వేదములో చెప్పబడిన విషయములనే పలువురు పలువిధముల అన్వయించుచు వచ్చుటవలన మతభేదముకలిగినది. మతభేదములెట్లుండినను అన్నియు భగవంతుని గుఱించియే చెప్పుచున్నవి - ఒకే భగవంతుని గుఱించి చెప్పుచున్నవి. ఏ మతమవలంభించినను పొందవలసిన పదము (goal) ఒక్కటే - అదే భగవంతుడు). (మతబోధకులు - ఆచార్యులు వారివారి మతానుసారము వారి మతమునకు స్ఫురించు పేర్లు పెట్టిరి - ద్వైతము, అద్వైతము, విశష్టాద్వైతము అని)
“asataḥ jagataḥ janiṃ utpattiṃ yē vaiśēṣikāḥ vadaṃti, sataḥ ēva brahma tatvasya utpattiṃ vadaṃti, yēca pātaṃ jalā dayaḥ sataḥ ēvaika viṃśati, yē prakārasya duḥkhasya mṛtiṃ nāśaṃ mōkṣaṃ vadaṃti, yē naiyāyikāḥ uta api ātmanibhādāṃ bhēdaṃ (sthūlatva, kṛśatva, manuṣyatva magatvādi rūpāṃ bhidāṃ); yē kēcidvadaṃtīti cārvāka matānu vādaḥ, (tē dēhaṃ ātmānaṃ manyaṃtē) vipaṇaṃ karmaphala vyavahāraṃ (dēvamanuṣya yōḥ anyōnyōpakāra bhāva janitaṃ vāṇijyaphala tulyaṃ svargādiphalaṃ ṛtaṃ satyaṃ yē mīmāṃsakāḥ smaraṃtīti karmaphala nityavādānuvādaḥ na kēvalaṃ smaraṃti kiṃtu tē tārkikādayaḥ ārōpitaiḥ yuktyā bāsyaiḥ bhramaiḥ upadiśaṃti (svamatasiddhaṃ) na tat dṛṣṭyā itthaṃ ēṣāṃ vādānāṃ ajñānamūlatvamuktaṃ - bhagavān jñānamayaḥ, yathāvat vijñātē sati avabōdhaḥ, tanmūlaḥ, vāda bhēdaśca nāsti ityarthaḥ - kimavabōdhi nidāna ityāpēkṣayāṃ manō dōṣa ēva iti. kiṃtannivṛtti nidānamatyapēkṣāyāṃ bhagavadupāsakayōga ēva iti. viśuddhāṃtaḥ karaṇāstu sarvaṃ idaṃ jagat bhagavadātmaka tayā sūkṣa cidacidviśiṣṭa bhagavatkārya tayā ca tadanyadēva paśyaṃtīti vadaṃti”.
(asat nuṃḍi jagattu kaliginadi ani vaiśēṣikula abhiprāyamu - sat nuṃḍi yē brahmatatvamutpatti ayinadi ani pātaṃjalula matamu - sat nuṃḍiyē iruvadiyokka vidhamulugānuṃḍu duḥkhamu nāśamu - mōkṣamu ani naiyālukulu ceppuduru - ātmayē sthūlatva, kṛśatva, manuṣyatva, magatvādi bhēdamulatō nunnadani cārvākulanucunnāru - vāru dēhamē yani yaṃduru - dēvatulu, manuṣyulu okarikokaru upākāramu cēsukonu bhāvamu kaligiyuṃḍuṭavalana vyāpāramutō pōlcatagina karmaphala vyavahāramu svargamu modalagu phalamu kaladagunadiyē parabrahma tatvamani mīmāṃsakulu vādiṃcucunnāru - ī prakāramugā cēyu vādamulu ajñānamuvalla ceppabaḍinavi. bhagavaṃtuḍu cinmayuḍu - jñānamayuḍu. matamu ē prakāramu bōdhiṃcabaḍenō dānini baṭṭi matabhēdamu - matabhēdamu manōdōṣamu - ē prakāramugā bhagavaṃtuni upāsiṃcina ā prakāramē matamagunu - viśuddhāṃtaḥkaraṇamulu galavāru ī jagattu aṃtayu bhagavaṃtuni rūpamē. sūkṣma cit acit vastuvulanniyu bhagavatuni kāryamulē - bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē kanuka atani kaṃṭe vēṟukāvu ani talaṃcedaru).
matamanagā bhagavaṃtunaku, prakṛtiki, jīvunaku gala saṃbaṃdha bāṃdhavyamu telupunadi. modalu, tudi teliyani vēdamulanuṃḍi janiṃcinadikanuka manamatamu sanātanamu. vēdamulō ceppabaḍina viṣayamulanē paluvuru paluvidhamula anvayiṃcucu vaccuṭavalana matabhēdamukaliginadi. matabhēdamuleṭluṃḍinanu anniyu bhagavaṃtuni guṟiṃciyē ceppucunnavi - okē bhagavaṃtuni guṟiṃci ceppucunnavi. ē matamavalaṃbhiṃcinanu poṃdavalasina padamu (goal) okkaṭē - adē bhagavaṃtuḍu). (matabōdhakulu - ācāryulu vārivāri matānusāramu vāri matamunaku sphuriṃcu pērlu peṭṭiri - dvaitamu, advaitamu, viśaṣṭādvaitamu ani)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.