← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మత్పరః matparaḥ

Original — తెలుగు
  1. భగవత్పరః - అహమేవ - భగవానేవ - సర్వస్మాత్ ఉత్కృష్టః యస్యసః మత్పరః -

(ఎవనికి భగవంతుడనైన నేనే అన్నింటికంటె పరుడు ఉత్కృష్టమైనవాడు).

  1. అహం భగవాన్ వాసుదేవః ఏవ పరః ప్రకృష్టః, ప్రీతి విషయః యస్యసః.

(భగవంతుడు వాసుదేవుడు అగు నేనే అన్నింటికంటె ఉతృష్టమైనవాడు, ప్రీతివిషయమైనవాడు అని తలచువాడు) - (ప్రీతితో, భక్తితో చేరతగినవాడు అని అభిప్రాయము గలవాడు).

  1. అహమేవ పరః సర్వకర్మభిః ప్రాప్యః యస్యసః.

(నేనే - భగవంతుడే - అన్ని కర్మలు చేయుటవలన పొందతగినవాడు, మోక్షరూపుడు అని తలంచువాడు, భగవంతుడే పరమపదము, మోక్షము అని నమ్మువాడు).

  1. అహంపరః పరమపురుషార్థత్వేన ఉపాస్యః యస్యసః -

(ధర్మార్థకామమోక్షములను నాలుగు విధములగు పురుషార్థములలోను ఉత్కృష్టమైన మోక్షము పరమపదము నేనే యగుటవలన నేనే ఉత్కృష్టమైనవాడనని ఉపాసన చేయతగినవాడనని నమ్మువాడు).

  1. అహం వాసుదేవః, సర్వప్రత్యగాత్మ, పరోయస్య సమత్పరః - న, అనో అహం, తస్మాత్ ఇతి.

(నేనే వాసుదేవుడను, అందఱిలోనుండు ప్రత్యగాత్మను, ఉత్కృష్టుడను, మఱొకడనుకాను అని నమ్మినవాడు).

  1. అహమేవ ఫలతయా ప్రాప్యః ఇత్యనుసంథానః కర్మాణి కుర్వన్ స్థితః -

(చేసిన కర్మలఫలముగా నన్నే పొందదగినవాడుగా తలచువాడు - అని కర్మలను చేయువాడు).

  1. “అహమేవ సర్వేషాం ప్రత్యగాత్మపరః, బాహ్యేభ్యః, దేహేంద్రియాదిభ్యః, అంతరేభ్యః చ ఉత్కృష్టః, ప్రియతమః, యస్యసః మత్పరః” –

(నీలకంఠవ్యాఖ్య)

(అందఱిలోన నుండు ప్రత్యగాత్మ అయినవాడు, బాహ్యములైన దేహము, ఇంద్రియములు, అంతరింద్రియముకంటె నేనే (భగవంతుడనైన నేనే) ఉత్కృష్టమైనవాడనని, అత్యంత ప్రియమైనవాడనని నా గుఱించి తలచువాడు).

  1. ఏకాంత మద్భక్తః - (అనన్యభావముతో నన్ను - భగవంతుని కొలుచు భక్తుడు)
Transliteration
  1. bhagavatparaḥ - ahamēva - bhagavānēva - sarvasmāt utkṛṣṭaḥ yasyasaḥ matparaḥ -

(evaniki bhagavaṃtuḍanaina nēnē anniṃṭikaṃṭe paruḍu utkṛṣṭamainavāḍu).

  1. ahaṃ bhagavān vāsudēvaḥ ēva paraḥ prakṛṣṭaḥ, prīti viṣayaḥ yasyasaḥ.

(bhagavaṃtuḍu vāsudēvuḍu agu nēnē anniṃṭikaṃṭe utṛṣṭamainavāḍu, prītiviṣayamainavāḍu ani talacuvāḍu) - (prītitō, bhaktitō cērataginavāḍu ani abhiprāyamu galavāḍu).

  1. ahamēva paraḥ sarvakarmabhiḥ prāpyaḥ yasyasaḥ.

(nēnē - bhagavaṃtuḍē - anni karmalu cēyuṭavalana poṃdataginavāḍu, mōkṣarūpuḍu ani talaṃcuvāḍu, bhagavaṃtuḍē paramapadamu, mōkṣamu ani nammuvāḍu).

  1. ahaṃparaḥ paramapuruṣārthatvēna upāsyaḥ yasyasaḥ -

(dharmārthakāmamōkṣamulanu nālugu vidhamulagu puruṣārthamulalōnu utkṛṣṭamaina mōkṣamu paramapadamu nēnē yaguṭavalana nēnē utkṛṣṭamainavāḍanani upāsana cēyataginavāḍanani nammuvāḍu).

  1. ahaṃ vāsudēvaḥ, sarvapratyagātma, parōyasya samatparaḥ - na, anō ahaṃ, tasmāt iti.

(nēnē vāsudēvuḍanu, aṃdaṟilōnuṃḍu pratyagātmanu, utkṛṣṭuḍanu, maṟokaḍanukānu ani namminavāḍu).

  1. ahamēva phalatayā prāpyaḥ ityanusaṃthānaḥ karmāṇi kurvan sthitaḥ -

(cēsina karmalaphalamugā nannē poṃdadaginavāḍugā talacuvāḍu - ani karmalanu cēyuvāḍu).

  1. “ahamēva sarvēṣāṃ pratyagātmaparaḥ, bāhyēbhyaḥ, dēhēṃdriyādibhyaḥ, aṃtarēbhyaḥ ca utkṛṣṭaḥ, priyatamaḥ, yasyasaḥ matparaḥ” –

(nīlakaṃṭhavyākhya)

(aṃdaṟilōna nuṃḍu pratyagātma ayinavāḍu, bāhyamulaina dēhamu, iṃdriyamulu, aṃtariṃdriyamukaṃṭe nēnē (bhagavaṃtuḍanaina nēnē) utkṛṣṭamainavāḍanani, atyaṃta priyamainavāḍanani nā guṟiṃci talacuvāḍu).

  1. ēkāṃta madbhaktaḥ - (ananyabhāvamutō nannu - bhagavaṃtuni kolucu bhaktuḍu)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.