(భగవంతుని సంకల్ప మాత్రముననే నిర్మించబడునది. అతి మానుషమైనది - భూత, వర్తమానకాలములందు జరుగునది మాయామాత్రము).
(స్వప్నములందు చూచిన వస్తువులన్నియు పూర్తిగా మాయామయములే - మేలుకొనిన తర్వాత కానరాకుండునవి, నిరూపించుటకు వీలుకానివగుటవలన, బాధింపబడునవి (లేకుండపోవునవి) కనుక మాయామాత్రము - స్వప్నమునందు కనుపించు వస్తువులు మాయా మయములైనట్లే - ఎట్లు మిధ్యలో, అట్లే ప్రపంచములో కనబడు వస్తువులన్నియు మిధ్యలే - జగత్తి మిధ్యయని చెప్పుటకు స్వప్నవస్తువులు ఉదాహరణగా చెప్పబడినవి).
(ప్రపంచములోని వస్తువులు మనకు ప్రత్యక్షముగా కనబడుచున్నవి - కనబడుచుండగా లేవని వాటిని లేవని, అవి మిధ్యలని చెప్పుట ఎట్లు? వ్యావహారికంగా చూచిన ఆ వస్తువులన్నియు కలవు - వాటివలన కలుగు కష్టసుఖములు అనుభవిస్తున్నాము - అందుచేత అవి లేవు అనలేము, కాని, ప్రపంచములో ఈ కనబడు వస్తువులన్నియు భగవంతునిలోనుండి పుట్టినవే, అందుచేత అట్లు పుట్టినవస్తువులన్నియు వేఱువేఱుగానున్న భగవంతుని రూపములే, ఆ రూపములలో లోపల పైన - అంతటా పూర్తిగా వ్యాపించియున్నది భగవంతుడే - అందుచేత ఈ సృష్టి అంతటిలోను వేఱు వేఱు రూపములతో అనేక వస్తువులుగానున్నట్లు కనుపించినను, అవి అన్నియు భగవంతుని రూపములే అగుటచేత సృష్టి అంతా భగవంతుడే, అందులోని వస్తువులన్నియు పారమార్థిక దృష్టిలో భగవంతుడే కాని, ఏ వస్తువునకు తానంతట దానికి ఉనికిలేదు. అందుచేత నీ ప్రపంచమంతయు భగవంతునికంటె వేఱుగా నున్నట్లు కనిపించినను వేఱుకాదు - వేఱుగా నున్నట్లు కనుపించుట - తోచుట - మిధ్య - మాయా మాత్రము - లేనిదీ ఉన్నట్లు కనుపించుట.)
(bhagavaṃtuni saṃkalpa mātramunanē nirmiṃcabaḍunadi. ati mānuṣamainadi - bhūta, vartamānakālamulaṃdu jarugunadi māyāmātramu).
(svapnamulaṃdu cūcina vastuvulanniyu pūrtigā māyāmayamulē - mēlukonina tarvāta kānarākuṃḍunavi, nirūpiṃcuṭaku vīlukānivaguṭavalana, bādhiṃpabaḍunavi (lēkuṃḍapōvunavi) kanuka māyāmātramu - svapnamunaṃdu kanupiṃcu vastuvulu māyā mayamulainaṭlē - eṭlu midhyalō, aṭlē prapaṃcamulō kanabaḍu vastuvulanniyu midhyalē - jagatti midhyayani ceppuṭaku svapnavastuvulu udāharaṇagā ceppabaḍinavi).
(prapaṃcamulōni vastuvulu manaku pratyakṣamugā kanabaḍucunnavi - kanabaḍucuṃḍagā lēvani vāṭini lēvani, avi midhyalani ceppuṭa eṭlu? vyāvahārikaṃgā cūcina ā vastuvulanniyu kalavu - vāṭivalana kalugu kaṣṭasukhamulu anubhavistunnāmu - aṃducēta avi lēvu analēmu, kāni, prapaṃcamulō ī kanabaḍu vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē, aṃducēta aṭlu puṭṭinavastuvulanniyu vēṟuvēṟugānunna bhagavaṃtuni rūpamulē, ā rūpamulalō lōpala paina - aṃtaṭā pūrtigā vyāpiṃciyunnadi bhagavaṃtuḍē - aṃducēta ī sṛṣṭi aṃtaṭilōnu vēṟu vēṟu rūpamulatō anēka vastuvulugānunnaṭlu kanupiṃcinanu, avi anniyu bhagavaṃtuni rūpamulē aguṭacēta sṛṣṭi aṃtā bhagavaṃtuḍē, aṃdulōni vastuvulanniyu pāramārthika dṛṣṭilō bhagavaṃtuḍē kāni, ē vastuvunaku tānaṃtaṭa dāniki unikilēdu. aṃducēta nī prapaṃcamaṃtayu bhagavaṃtunikaṃṭe vēṟugā nunnaṭlu kanipiṃcinanu vēṟukādu - vēṟugā nunnaṭlu kanupiṃcuṭa - tōcuṭa - midhya - māyā mātramu - lēnidī unnaṭlu kanupiṃcuṭa.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.