← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మాయాస్వరూపం māyāsvarūpaṃ

Original — తెలుగు
  1. జీవేశ్వర విభాగశూన్య శుద్ధ చైతన్యాశ్రితా మాయా. ఇయం ఉత్పత్తిరహితత్వాత్ అనాదిః, సా చై కైవా. జ్ఞాన నాశత్వాత్ సాంతా, సేయం మాయా సదసద్విలక్షణా; జ్ఞాన బాద్గత్వాత్ సద్విలక్షణా, అవస్థాత యేపి మాయా ప్రతీయతే. అతః సా అసద్విలక్షణా.

(జీవుడని, ఈశ్వరుడని - పరబ్రహ్మయని - భేదములేని శుద్ధచైతన్యమును - చిచ్ఛక్తిని - ఆశ్రయించియున్నమాయ. ఈ మాయ పుట్టుకలేనిదగుటవలన అనాది. మాయ ఒకటే, కాని జ్ఞానము కలుగగానే - పరబ్రహ్మ జ్ఞానము కలుగగానే, తానే పరబ్రహ్మయను జ్ఞానము కలుగగనే - నశించునది. (లేకుండపోవునది). కనుక అంతము కలది - ఆది లేదుగాని అంతము కలది. ఇది సత్తు అసత్తు లక్షణములు కలది, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను అవస్థలందుకూడ నుండునది. అందుచేత అసత్తు కానిది.

  1. శుద్ధబ్రహ్మశ్రితాం మాయా అవిద్యా ఇతి అజ్ఞానం ఇతి చ ఆహుః.

(శుద్ధబ్రహ్మను ఆశ్రయించునది మాయ, అవిద్యా అజ్ఞానము అని చెప్పబడుచున్నది).

  1. అచింత్యానంత శక్తి మత్వాత్ యుక్తీనాం అవ్బిషయత్వాచ్చ మాయా ఇతి వ్యపదేశః -

(ఇటువంటుదియని ఊహించుటకు వీలుకానిది, అనంతమైన శక్తి కలది - ఎన్ని పర్యాయములు సృష్టి చేసినను, ప్రతిసృష్టిలోను ఎన్నెన్నో జీవరాసులకు - పదార్థములకు తన శక్తినిచ్చినప్పటికిన్నీ తరగని శక్తికలది అగుటవలన, యుక్తులచేత నిర్ణయించుటకు వీలుకానిది యగుటచేతను మాయయని చెప్ప బడుచున్నది).

Transliteration
  1. jīvēśvara vibhāgaśūnya śuddha caitanyāśritā māyā. iyaṃ utpattirahitatvāt anādiḥ, sā cai kaivā. jñāna nāśatvāt sāṃtā, sēyaṃ māyā sadasadvilakṣaṇā; jñāna bādgatvāt sadvilakṣaṇā, avasthāta yēpi māyā pratīyatē. ataḥ sā asadvilakṣaṇā.

(jīvuḍani, īśvaruḍani - parabrahmayani - bhēdamulēni śuddhacaitanyamunu - cicchaktini - āśrayiṃciyunnamāya. ī māya puṭṭukalēnidaguṭavalana anādi. māya okaṭē, kāni jñānamu kalugagānē - parabrahma jñānamu kalugagānē, tānē parabrahmayanu jñānamu kalugaganē - naśiṃcunadi. (lēkuṃḍapōvunadi). kanuka aṃtamu kaladi - ādi lēdugāni aṃtamu kaladi. idi sattu asattu lakṣaṇamulu kaladi, jāgrat, svapna, suṣupti anu avasthalaṃdukūḍa nuṃḍunadi. aṃducēta asattu kānidi.

  1. śuddhabrahmaśritāṃ māyā avidyā iti ajñānaṃ iti ca āhuḥ.

(śuddhabrahmanu āśrayiṃcunadi māya, avidyā ajñānamu ani ceppabaḍucunnadi).

  1. aciṃtyānaṃta śakti matvāt yuktīnāṃ avbiṣayatvācca māyā iti vyapadēśaḥ -

(iṭuvaṃṭudiyani ūhiṃcuṭaku vīlukānidi, anaṃtamaina śakti kaladi - enni paryāyamulu sṛṣṭi cēsinanu, pratisṛṣṭilōnu ennennō jīvarāsulaku - padārthamulaku tana śaktiniccinappaṭikinnī taragani śaktikaladi aguṭavalana, yuktulacēta nirṇayiṃcuṭaku vīlukānidi yaguṭacētanu māyayani ceppa baḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.