← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మిధ్య midhya

Original — తెలుగు
  1. యదాదిమదంతవచ్చ తన్మిధ్యా, యథా మృగతృష్ణికాది.

(ఆది అంతము కలది మిథ్య - మృగతృష్ణిక మొదలగువాటివలె - దూరమునుండి చూచిన ఎండమావులు నీరువలె ఉన్నట్లు కనిపించును - దగ్గఱకు వెళ్ళి చూచిన నీళ్ళు ఉండవు - అట్టిదియె మిధ్య).

  1. “మృగి జలం ఉండగానే దబ్బరైనట్లు, ఆకాశమందు నీలత్వముండగనే దబ్బరైనట్లు, ఈ ప్రపంచము విచారిస్తే మిధ్య”.

  2. “సత్య జ్ఞానానందాత్మకమై తనకు కూటస్థ చైతన్యమైన పరబ్రహ్మమందు జగత్కారణశక్తిరూపమైన మాయా శక్తిన్నీ ఆ బ్రహ్మము కంటె భిన్నమున్నూ కాక అవిచారంవల్ల తోస్తున్న నిర్విషవత్సనాభులు ఒక్క మాలికయందు తోచినట్లు, తామస సాత్విక భేదంవల్ల, విద్యా అవిద్యాత్మకమై అనిర్వాచ్యతనొంది విక్షేపావరణరూపం వల్ల జీవ జగదాకృతియై తోచిన మాయా శక్తి వైచిత్ర్యము మిధ్య”.

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  1. “గగన కుసుమంబునుంబోలె సర్వదా శూన్యమనుటగాక మరెట్లంటే స్వప్న గజాదికముం బోలె తోపుచును విచారబాధితమై యుండుటయే మిధ్య యనంబడు”. (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  2. “మిధ్యాత్వం నామ ప్రతీయమానత్వ పూర్వక యధావస్తిత వస్తు జ్ఞాన నిర్వర్త్యత్వం”.

(మిధ్య యనగా ఇప్పుడు కనబడుచుండుటకుముందు వస్తువుండు స్థితి).

  1. “ఆదావంతే చ యన్నాస్తి వర్తమానే (అ)పి తత్తథా |

వితధైః సదృశః సంతో అవితధా ఇవ లక్షితాః ||: (గౌడపాదకారికా)

(మొదటిలోను, ఆఖరున లేనిది; మధ్యనుకూడ లేనిదే. ప్రపంచము ఇట్టిదే - ఇదివరకు లేదు, ఇకముందు ఉండదు - అందుచేత ఇప్పుడుకూడ లేనిది - అందుచేత ఉన్నట్లు కనుపించుచున్నను అది లేనిదే - మిధ్యయే).

  1. “శిక్త్యౌ రూప్యం, మరౌ నీరం, రజ్జౌ సర్పో యథా తథా |

మిథ్యా బ్రహ్మణి జీవోపి సత్యం బ్రహ్మాస్తి కేవలం“|| (బ్రహ్మాస్మిమాలా - 20)

(శుక్తిని చూచి వెండియని, మరుభూమి - (ఎండమావిని) చూచి జలము అని, రాత్రివేళ చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనుట మిధ్య అయినట్లే ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే అయినను జీవుడు వేరు అనుకొనుట మిధ్య. వాస్తవముగా ఉన్నదంతయూ బ్రహ్మమే).

  1. అశేష నిఖిల ప్రపంచం మిధ్యా త్త్రైకాలిక బాధాదసత్యం.

(ఈ ప్రపంచమంతయు భూత భవిష్యద్వర్తమాన కాలములందుండునదికాదుకనుక - నిత్యముండునదికాదు - మిధ్య).

  1. ఆత్మని అనాత్మ తద్ధర్మాధ్యాసో మిధ్యాభవతు.

(ఆత్మయందు అనాత్మధర్మములున్నట్లారోపించుట మిధ్య).

  1. ఉన్నదనికాని లేనిదనికాని నిర్వచించుటకు సాధ్యముకానిది.

  2. “బ్రహ్మసత్యం జగన్మిధ్యా - బ్రహ్మైవ నా పరం”.

(పరబ్రహ్మ మూడుకాలములందుండునది - జగత్తు అనునది మిధ్య - ప్రపంచమంతయు బ్రహ్మమే, బ్రహ్మ రూపమే – వేరుకాదు) -.

  1. “యదస్యాహుః అశేష విశేష ప్రత్యనీక చిన్మాత్రం బ్రహ్మైవ పరమార్థః - తదతిరేకి నానావిధ జ్ఞాతృ జ్ఞేయ తత్కృత జ్ఞాన భేదాది సర్వం తస్మిన్నేవ పరికల్పితం మిథ్యా భూతం”.

(నిర్గుణుడు, నిర్విశేషుడు, చైతన్యమాత్రుడు అయినవాడే పరబ్రహ్మ - ఇదియే పరమార్థము - అదికానిది - దానికి వ్యతిరేకమైన - అనేక విధములైన జ్ఞాతృ, జ్ఞేయ జ్ఞానములు వాటికి సబంధించినవన్నియు పరబ్రహ్మలో కల్పించ బడినవే - అందుచేత అవి మిధ్య).

  1. “మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదరాః |

అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత ||“.

(తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు సహోదరులూ ఎవరూ లేరు - అర్థం లేదు, గృహము లేదు - అందుచేత జాగ్రత్తగా నుండుము - మాత మొదలగునవన్నియు భగవంతుడే - ఏదియు నిజముగా లేదు - ఇవన్నియు ఉన్నవనుకొనుట మిధ్యయే).

“జనకుండెవ్వడు, జాతుడెవ్వడు జనిస్థానంబులెచ్చోటు సం| జననంబెయ్యది, మేనులే కొలది - - - అంతయు విష్ణుమాయ, జాయా, విన్నబోనేటికిన్”. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

Transliteration
  1. yadādimadaṃtavacca tanmidhyā, yathā mṛgatṛṣṇikādi.

(ādi aṃtamu kaladi mithya - mṛgatṛṣṇika modalaguvāṭivale - dūramunuṃḍi cūcina eṃḍamāvulu nīruvale unnaṭlu kanipiṃcunu - daggaṟaku veḷḷi cūcina nīḷḷu uṃḍavu - aṭṭidiye midhya).

  1. “mṛgi jalaṃ uṃḍagānē dabbarainaṭlu, ākāśamaṃdu nīlatvamuṃḍaganē dabbarainaṭlu, ī prapaṃcamu vicāristē midhya”.

  2. “satya jñānānaṃdātmakamai tanaku kūṭastha caitanyamaina parabrahmamaṃdu jagatkāraṇaśaktirūpamaina māyā śaktinnī ā brahmamu kaṃṭe bhinnamunnū kāka avicāraṃvalla tōstunna nirviṣavatsanābhulu okka mālikayaṃdu tōcinaṭlu, tāmasa sātvika bhēdaṃvalla, vidyā avidyātmakamai anirvācyatanoṃdi vikṣēpāvaraṇarūpaṃ valla jīva jagadākṛtiyai tōcina māyā śakti vaicitryamu midhya”.

(brahmavidyāsudhārṇavamu - 6)

  1. “gagana kusumaṃbunuṃbōle sarvadā śūnyamanuṭagāka mareṭlaṃṭē svapna gajādikamuṃ bōle tōpucunu vicārabādhitamai yuṃḍuṭayē midhya yanaṃbaḍu”. (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  2. “midhyātvaṃ nāma pratīyamānatva pūrvaka yadhāvastita vastu jñāna nirvartyatvaṃ”.

(midhya yanagā ippuḍu kanabaḍucuṃḍuṭakumuṃdu vastuvuṃḍu sthiti).

  1. “ādāvaṃtē ca yannāsti vartamānē (a)pi tattathā |

vitadhaiḥ sadṛśaḥ saṃtō avitadhā iva lakṣitāḥ ||: (gauḍapādakārikā)

(modaṭilōnu, ākharuna lēnidi; madhyanukūḍa lēnidē. prapaṃcamu iṭṭidē - idivaraku lēdu, ikamuṃdu uṃḍadu - aṃducēta ippuḍukūḍa lēnidi - aṃducēta unnaṭlu kanupiṃcucunnanu adi lēnidē - midhyayē).

  1. “śiktyau rūpyaṃ, marau nīraṃ, rajjau sarpō yathā tathā |

mithyā brahmaṇi jīvōpi satyaṃ brahmāsti kēvalaṃ”|| (brahmāsmimālā - 20)

(śuktini cūci veṃḍiyani, marubhūmi - (eṃḍamāvini) cūci jalamu ani, rātrivēḷa cīkaṭilō trāḍunu cūci pāmu anukonuṭa midhya ayinaṭlē ī prapaṃcamaṃtayu brahmamē ayinanu jīvuḍu vēru anukonuṭa midhya. vāstavamugā unnadaṃtayū brahmamē).

  1. aśēṣa nikhila prapaṃcaṃ midhyā ttraikālika bādhādasatyaṃ.

(ī prapaṃcamaṃtayu bhūta bhaviṣyadvartamāna kālamulaṃduṃḍunadikādukanuka - nityamuṃḍunadikādu - midhya).

  1. ātmani anātma taddharmādhyāsō midhyābhavatu.

(ātmayaṃdu anātmadharmamulunnaṭlārōpiṃcuṭa midhya).

  1. unnadanikāni lēnidanikāni nirvaciṃcuṭaku sādhyamukānidi.

  2. “brahmasatyaṃ jaganmidhyā - brahmaiva nā paraṃ”.

(parabrahma mūḍukālamulaṃduṃḍunadi - jagattu anunadi midhya - prapaṃcamaṃtayu brahmamē, brahma rūpamē – vērukādu) -.

  1. “yadasyāhuḥ aśēṣa viśēṣa pratyanīka cinmātraṃ brahmaiva paramārthaḥ - tadatirēki nānāvidha jñātṛ jñēya tatkṛta jñāna bhēdādi sarvaṃ tasminnēva parikalpitaṃ mithyā bhūtaṃ”.

(nirguṇuḍu, nirviśēṣuḍu, caitanyamātruḍu ayinavāḍē parabrahma - idiyē paramārthamu - adikānidi - dāniki vyatirēkamaina - anēka vidhamulaina jñātṛ, jñēya jñānamulu vāṭiki sabaṃdhiṃcinavanniyu parabrahmalō kalpiṃca baḍinavē - aṃducēta avi midhya).

  1. “mātānāsti pitānāsti nāsti baṃdhu sahōdarāḥ |

arthaṃ nāsti gṛhaṃ nāsti tasmāt jāgrata jāgrata ||“.

(talli lēdu, taṃḍri lēḍu, baṃdhuvulu sahōdarulū evarū lēru - arthaṃ lēdu, gṛhamu lēdu - aṃducēta jāgrattagā nuṃḍumu - māta modalagunavanniyu bhagavaṃtuḍē - ēdiyu nijamugā lēdu - ivanniyu unnavanukonuṭa midhyayē).

“janakuṃḍevvaḍu, jātuḍevvaḍu janisthānaṃbuleccōṭu saṃ| jananaṃbeyyadi, mēnulē koladi - - - aṃtayu viṣṇumāya, jāyā, vinnabōnēṭikin”. (śrīmadāṃdhramahābhāgavatamu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.