← Back to మ · Booklets 31–40 (digitized file 4)

ముక్తః muktaḥ

Original — తెలుగు
  1. ముక్తిని - మోక్షమును పొందినవాడు.

  2. విముక్త బంధః

(బంధమునుండి - కర్మబంధమునుండి విడువబడినవాడు).

  1. దేహాను బంధిభిః దుఃఖైః కామాధిభిః ముక్తః -

(దేహముతో బంధించునవి యగు - జన్మ కలుగునట్లు చేయునవి యగు - దుఃఖములనుండి (కామము మొదలగు వాటినుండి) విడువబడినవాడు)

  1. అవిద్యాకృత కామ కర్మ బంధనైః ముక్తః -

(అవిద్యాకార్యములైన కామ కర్మల బంధమువలన విడువబడినవాడు).

  1. త్యక్త సంసారః -

(సంసారమును విడిచినవాడు - జననముఇ, కరణము మొదలగువాటివలన కలుగు సంబంధములు లేనివాడు).

(రాగ ద్వేషములు, కామ క్రోధములు మొదలగునవి గల బంధములనుండి విడువ బడినవాడు)

  1. “నివృత్త ధర్మాధర్మాది బంధః” (శ్రీశంకరః)

(ధర్మము, అధర్మము - పుణ్యము, పాపము అను మొదలగు బంధములు లేనివాడు).

  1. కర్తృత్వ భోక్తృత్వాది అథ్యాస శూన్యః - (మధుసూధనీ వ్యాఖ్య)

(కర్తృత్వము, భోక్తృత్వము మొదలగు అథ్యాస లేనివాడు - అన్నీ భగవంతుడే అయినప్పుడు కర్తం భోక్త అనువారు వేఱుగానున్నారు అనుకొనుట అద్యాస - అట్టి అధ్యాస లేనివాడు)

  1. శరీరాద్యనభిమానః -

(శరీరము మొదలగునవి తానే అను అభిమానము లేనివాడు).

  1. అనాసక్తః స్వావిద్యా ద్వయతో ముక్తః.

(దేనియందును ఆసక్తి లేనివాడు - అంతా బ్రహ్మమే అయినప్పుడు రెండవ వస్తువులేదు. రెండవ వస్తువు ఉన్నది అను అవిద్య వలన - అజ్ఞానమువలన విడుదలపొందినవాడు).

  1. “వివేకీ సర్వ దా ముక్త సంసార భ్రమ వర్కితః” (యోగశిఖోపనిషత్)

(జననమరణ రూపమైన సంసారము ఒక భ్రమ. అంతా భగవంతుదే, సంసారమనునది లేనేలేదు అను వివేకము - జ్ఞానము - గలవాడు ఎల్లపుడూ ముక్తుడే)

  1. పరమార్థతః భేద దర్శన జన్మాది రహితః, ముక్త శబ్దో అవిద్యాకృత జన్మాది రాహిత్య పరః.

(పరమార్థ దృష్టిలో భేదములు - జీవుడు వేఱు, ఆత్మ వేరు అను మొదలగు అభిప్రాయములు కలుగచేయు జన్మ మొదలగునవి లేనివాడు - ముక్తుడగుట యనగా అవిద్యాకార్యములగు - అజ్ఞానముచే కలుగు - జననమరణములు లేకుండుట).

  1. సంచిన్న సంస్కృతిపాశో ముక్తః -

(జననమరణములు గల సంసారమను పాశమునుండి - త్రాడునుండి - బంధమునుండి - విడువబడినవాడు).

  1. పారవశ్యరహితం, అత ఏవ శుద్ధం బుద్ధంచ.

(పరవశుడు కాకుండుట. అందుచేత శుద్ధుడు, ఏ విధమైన దోషము లేనివాడు, బుద్ధుడు, జ్ఞానము కలవాడు - ఆత్మవలె స్వతంత్రుడైనవాడు).

  1. బంధ కాలేపి స్వతః బంధా భావో ముక్తత్వంచ ప్రతీయతే -

(బద్ధుడై యున్నప్పటికీ - సంసారములోనున్నప్పటికీ బంధము లేనట్లుండువాదు).

  1. “ముక్తాభిమానీ ముక్తోహి, బద్దో బద్ధాపిమాన్యపి |

కిం వదంతీహసత్యేయం యా మతిః సాగతిర్భవేత్ ||” (అష్టావక్రగీత - 1 - 9)

(దేహము మొదలగువాటియందు, నేను, నాయది యను అభిమానములేనివాడుముక్తుడు - అట్టి అభిమానము గలవాడు బద్ధుడు - అందుచేత, మనస్సును బట్టియే బంధముగాని, మోక్షముగాని కలుగును).- “యచ్చిత్తం తన్మయో భవతి పూరుషః” (మనస్సు ఏ ప్రకారముగనుండునో - దేనిని గుఱించి దీర్ఘముగా నాలోచించు చుండునో, పురుషుడు అదియే యగును. ముక్తి గుఱించి ఆలోచించువాడు ముక్తుడగును). “మన ఏవ కారణం బంధ మోక్ష యోః”’ (బంధమునకుగాని, మోక్షమునకు గాని కారణము మనస్సే).

  1. ” పునశ్శరీరం న గృహ్ణాతీతి ముక్తః.

(మరల శరీరమును పొందనివాడు ముక్తుడు)

  1. ముక్తః బ్రహ్మాభిన్నత్వేన అవిభాగేన నిరతిశయానంద బ్రహ్మాత్మనా ఏవ అవతిష్టతే - “బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి”, “తత్వమసి” ఇత్యాది శ్రుతిషు అభేదస్యైవ దృష్టత్వాత్.

(ముక్తుడైనవాడు బ్రహ్మకంటె వేరుగాక నిరతిశయమైన ఆనందము - మోక్షము - తానె అయిన బ్రహ్మవలె నుండును. అట్లుండువాడే ముక్తుడు - ఎందుచేతననగా - “బ్రహ్మవలె నుండుచు బ్రహ్మమే యగును” అనిన్నీ, “ఆ పరబ్రహ్మ నీవే అయితివి” అనిన్నీ, ఈ మొదలగు శ్రుతి వాక్యములు (జీవ బ్రహ్మలకు) అభేదమునే చెప్పుచున్నవి).

  1. “స్థూల సూక్ష్మ కారణాత్మక శరీర త్రయ విలక్షణం, పంచకోశ విలక్షణంచ, స్వస్వరూపం అఖండా ద్వితీయ స్వయం జ్యోతి స్వభావానంద ఘన బ్రహ్మ రూపేణ యః సాక్షాత్ అపరోక్షీ కరోతి, కరతలామలకవత్, స ఏవ ముక్తః - ఇత్యుచ్యతే.”

(స్థూలశరీరము, సూక్ష్మశరీరము, కారణశరీరము అను శరీర త్రయము - మూడు శరీరములు - కంటె వేరై పంచ కోశములకంటె వేరైనటు వంటి స్వస్వరూపము (బ్రహ్మయొక్క యథార్థ స్వరూపము) - తన మొదటి రూపము -, అఖండము (పూర్ణము - అన్నింటిలోను పూర్తిగా నిండియుండునది), అద్వితీయము (తనకంటె వేరే మఱియొక వస్తువు లేనిది, అంతయు తానే అయునది), స్వయముగా ప్రకాశించునది (ప్రకాశించుటకు ఇతర వస్తువుమీద ఆధారపడి యుండునది), ఆనందఘనము (ఘనీభవించిన ఆనందము కలది, ఉన్నదంతా ఆనందమే అయినది). అయినటువంటిదిగా పరబ్రహ్మ రూపమును, చేతిలోని ఉసిరికాయవలె, ఎవడు సాక్షాత్కరించుకొనునో (సాక్షాత్తుగా చూచి అనుభవించునో, అట్టివాడు ముక్తుడు అని చెప్పబడుచున్నాడు).

  1. “పూర్వమవస్థాత్రయ కలుషితః సంసారీవ తిష్టమానోపి సర్వ సంసారానర్థ మాత్రాన్ ముక్తః పరితః ప్రద్యోతమాన పూర్ణా నందాత్మనా అవతిష్టతే - మహాన్ అయం విశేషః.”

జాగ్రత్స్వప్నసుషుప్తులను మూడు అవస్థలు కలిగియున్నవాడైనప్పటికీ, అన్ని విధములైన అనర్థములతో కూడిన సంసారమునుండి ముక్తుడై (విడుదల పొందిన వాడై) అంతటను వ్యాపించియుండి ప్రకాశించు పూర్ణానంద రూపుడగు పరబ్రహ్మవలె ఉండుటయే ముక్తుని యొక్క గొప్ప విశేషము).

  1. “దేహాత్మజ్ఞానద్ జ్ఞానం దేహాత్మాజ్ఞాన బాధకం |

ఆత్మన్యేవ భవేద్యస్య స నేచ్ఛన్నపి ముచ్యతే ||“.

(దేహమే ఆత్మ యను అజ్ఞానము, దేహాత్మల యొక్క తత్వజ్ఞానము కలిగిన తర్వాత పోవును. తన నిజ స్వరూపమగు పరమాత్మయందే నిమగ్నుడైయుండు తాను కోరకపోయినను ముక్తుడగును).

  1. “అహమేకో న మేకశ్చిన్నాహ మన్యస్య కస్యచిత్ |

నతః పశ్యామి యస్యాహన్ తం న పశ్యామి యో మమ ||

అహమేవ పరబ్రహ్మ జగన్నాధో హమీశ్వరః |

ఇతి స్యాన్నిశ్చితో ముక్తో బద్ద్జస్స్యాదనథా పుమాన్ ||“.

(నేను ఒక్కడినే, నాకు ఎవరూ లేరు - నేనెవరివాడనుకాను, ఎవరివాడనో నాకు తెలియదు. నేనే పరబ్రహ్మను, నేనే ఈ జగత్తునకుకీశ్వరుడను, నాధుడను - ఈ జగత్తును శాసించువాడను, నడిపించువాడను నేనే - ఇటువంటి నిశ్చయమున్నవాడు ముక్తుడు - అట్లుకానివాడు బద్ధుడే).

“సీ. ఎవ్వనివాడనం చేమని నుడువుదు, నాయంతవాడనై నడువనేర్తు

- - - నొరులు కారు నాకు, నొరులకు నేనౌదు

నొంటివాడ చుట్తమొకడులేదు - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 19 - 552) (వామనావతారము)

  1. విద్వాన్ (ముక్తః) సంస్కార వశేన దేహస్థోపి దేహస్దో న భవతి - యథా స్వప్నాత్ ఉత్థితః స్మర్యమాణః స్వప్నస్థితోపి తత్రస్థో న భవతి, తద్గత సుఖదుఃఖాద్య బావాత్, తద్వత్.

(ముక్తుడైనవాడు సంస్కారవశమున దేహము కలిగి యున్నవాడైనను - దానివలన కలుగు దుఃఖములు అతనికి కలుగుచున్నను - దేహముతోనుండువాడు కానట్లే - ఎట్లంటే, స్వప్నములో సుఖదుఃఖముల ననుభవించినట్లు అనిపించినను, మేల్కొనిన తర్వాత వాటిని స్మరించుకొని, ఆ సుఖదుఃఖములు తాను అనుభవించినవి కావు అని తెలుసుకొనినట్లే. ముక్తుడైనవాడు దేహముతోనుండియు దానివలన కలుగు సుఖదుఃఖములననుభవించడు.)

  1. “స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే బ్రువోః |

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతర చారిణౌ |

యతేంద్రియమనో బుద్ధిర్మోక్ష పరాయణః |

విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః ||” (శ్రీమద్భగవద్గీత - 5 - 27, 28)

“బాహ్యాః శబ్దాదయో బుద్ధా మింద్రియైః సంప్రవేశితాః |

వైరాగ్యేణైవతాన్ బాహ్యాన్ మహిః కృత్వా ప్రయత్నతః |

యద్యేతే అంతరాస్యుర్వై తదోపాయ సహస్ర కైః |

బహిర్నస్యుః స్వభావస్య భంగః కర్తుం న శక్యతే |

బహ్యం స్త్వంతః ప్రవిష్టాం స్తా న్రాగావేశా ద్బహిస్తథా |

కర్తుం శక్యాన్విరాగేణ బాహ్యానితి విశేషణాత్ |

వైరాగ్యం తదనే నోక్త్వాప్రాహాభ్యాస మథోక్షజః |

అత్యంతమీలనే నిద్రా ప్రసారే విభ్రమాద యః |

అతో అర్థమీలనే నైవ భ్రూమధ్యే చిక్షుసోః స్థితిః |

ఊర్థ్వాధోగతి నిచ్చేదాన్నా సాభ్యంతర చారిణౌ |

కుంభకేన సమేకృత్వా ప్రాణా పానౌ విచక్షణః |

సం యతా ఇత్యుపాయేన యస్యేంద్రియ మనోధియః |

విషయాన్ విషవత్త్యక్త్వా సము నిర్మోక్ష తత్పరః |

ఇచ్ఛాది రహితో యోగీ జీవన్నేవ వి ముచ్యతే||“.

(ఇంద్రియములచేత లోపల - బుద్ధి యందు ప్రవేశింప చేయబడినటువంటి బాహ్య విషయములైన శబ్ద స్పర్శ రూప రస గంధములను ప్రయత్నముచేత, వైరాగ్యముచేత - వాటియందు అనురాగము లేకుండునటుల చేసుకొనుటచేత) బాగా కనులు మూసుకొనుటచేత నిద్ర, విభ్రమము కలుగుటకవకాశమున్నదికనుక, కన్నులను సగము మూసియుంచి భ్రూమధ్యమందు దృష్టి నిలిపి, ప్రాణవాయువును అపానవాయువును క్రిందకు - మీదకు - లోపలికి, పైకి - పోవుట అరికట్టుటచేత సమానముగనుండునట్లు కుంభకము చేసి, ఇంద్రియములను మనస్సును వశములోనుంచుకొని, విషయములను విషమువలె వదలిపెట్టి మోక్షమందు తత్పరుడైన ముని ఏ విధమైన కోరికలు లేనివాడై జీవించియున్నను ముక్తుడే యగును -).

  1. “సంసార సర్ప సందష్ట నష్ట చేష్టైక భేషజం |

కృష్ణే వైష్ణవం మంత్రం శృత్వాముక్తో భవేన్నరః ||“.

(జననమరణరూపమైన సంసారము అను సర్పముచేత కరవబడి చేష్టలు లేకయుండువానికి ‘కృష్ణా’ అను వైష్ణవమంత్రము ఔషధము. దానిని వినంత మాత్రమున నరుడు ముక్తుడగును).

  1. “క. వాదములు వేయునేటికి

వేదోక్తవిధిం జరించు విభుడు గృహమం

దాదరమున నారాయణ

పాదంబులు గొలిచి ముక్తి పదమునకేగున్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 470)

Transliteration
  1. muktini - mōkṣamunu poṃdinavāḍu.

  2. vimukta baṃdhaḥ

(baṃdhamunuṃḍi - karmabaṃdhamunuṃḍi viḍuvabaḍinavāḍu).

  1. dēhānu baṃdhibhiḥ duḥkhaiḥ kāmādhibhiḥ muktaḥ -

(dēhamutō baṃdhiṃcunavi yagu - janma kalugunaṭlu cēyunavi yagu - duḥkhamulanuṃḍi (kāmamu modalagu vāṭinuṃḍi) viḍuvabaḍinavāḍu)

  1. avidyākṛta kāma karma baṃdhanaiḥ muktaḥ -

(avidyākāryamulaina kāma karmala baṃdhamuvalana viḍuvabaḍinavāḍu).

  1. tyakta saṃsāraḥ -

(saṃsāramunu viḍicinavāḍu - jananamui, karaṇamu modalaguvāṭivalana kalugu saṃbaṃdhamulu lēnivāḍu).

(rāga dvēṣamulu, kāma krōdhamulu modalagunavi gala baṃdhamulanuṃḍi viḍuva baḍinavāḍu)

  1. “nivṛtta dharmādharmādi baṃdhaḥ” (śrīśaṃkaraḥ)

(dharmamu, adharmamu - puṇyamu, pāpamu anu modalagu baṃdhamulu lēnivāḍu).

  1. kartṛtva bhōktṛtvādi athyāsa śūnyaḥ - (madhusūdhanī vyākhya)

(kartṛtvamu, bhōktṛtvamu modalagu athyāsa lēnivāḍu - annī bhagavaṃtuḍē ayinappuḍu kartaṃ bhōkta anuvāru vēṟugānunnāru anukonuṭa adyāsa - aṭṭi adhyāsa lēnivāḍu)

  1. śarīrādyanabhimānaḥ -

(śarīramu modalagunavi tānē anu abhimānamu lēnivāḍu).

  1. anāsaktaḥ svāvidyā dvayatō muktaḥ.

(dēniyaṃdunu āsakti lēnivāḍu - aṃtā brahmamē ayinappuḍu reṃḍava vastuvulēdu. reṃḍava vastuvu unnadi anu avidya valana - ajñānamuvalana viḍudalapoṃdinavāḍu).

  1. “vivēkī sarva dā mukta saṃsāra bhrama varkitaḥ” (yōgaśikhōpaniṣat)

(jananamaraṇa rūpamaina saṃsāramu oka bhrama. aṃtā bhagavaṃtudē, saṃsāramanunadi lēnēlēdu anu vivēkamu - jñānamu - galavāḍu ellapuḍū muktuḍē)

  1. paramārthataḥ bhēda darśana janmādi rahitaḥ, mukta śabdō avidyākṛta janmādi rāhitya paraḥ.

(paramārtha dṛṣṭilō bhēdamulu - jīvuḍu vēṟu, ātma vēru anu modalagu abhiprāyamulu kalugacēyu janma modalagunavi lēnivāḍu - muktuḍaguṭa yanagā avidyākāryamulagu - ajñānamucē kalugu - jananamaraṇamulu lēkuṃḍuṭa).

  1. saṃcinna saṃskṛtipāśō muktaḥ -

(jananamaraṇamulu gala saṃsāramanu pāśamunuṃḍi - trāḍunuṃḍi - baṃdhamunuṃḍi - viḍuvabaḍinavāḍu).

  1. pāravaśyarahitaṃ, ata ēva śuddhaṃ buddhaṃca.

(paravaśuḍu kākuṃḍuṭa. aṃducēta śuddhuḍu, ē vidhamaina dōṣamu lēnivāḍu, buddhuḍu, jñānamu kalavāḍu - ātmavale svataṃtruḍainavāḍu).

  1. baṃdha kālēpi svataḥ baṃdhā bhāvō muktatvaṃca pratīyatē -

(baddhuḍai yunnappaṭikī - saṃsāramulōnunnappaṭikī baṃdhamu lēnaṭluṃḍuvādu).

  1. “muktābhimānī muktōhi, baddō baddhāpimānyapi |

kiṃ vadaṃtīhasatyēyaṃ yā matiḥ sāgatirbhavēt ||” (aṣṭāvakragīta - 1 - 9)

(dēhamu modalaguvāṭiyaṃdu, nēnu, nāyadi yanu abhimānamulēnivāḍumuktuḍu - aṭṭi abhimānamu galavāḍu baddhuḍu - aṃducēta, manassunu baṭṭiyē baṃdhamugāni, mōkṣamugāni kalugunu).- “yaccittaṃ tanmayō bhavati pūruṣaḥ” (manassu ē prakāramuganuṃḍunō - dēnini guṟiṃci dīrghamugā nālōciṃcu cuṃḍunō, puruṣuḍu adiyē yagunu. mukti guṟiṃci ālōciṃcuvāḍu muktuḍagunu). “mana ēva kāraṇaṃ baṃdha mōkṣa yōḥ”’ (baṃdhamunakugāni, mōkṣamunaku gāni kāraṇamu manassē).

  1. ” punaśśarīraṃ na gṛhṇātīti muktaḥ.

(marala śarīramunu poṃdanivāḍu muktuḍu)

  1. muktaḥ brahmābhinnatvēna avibhāgēna niratiśayānaṃda brahmātmanā ēva avatiṣṭatē - “brahmaiva san brahmāpyēti”, “tatvamasi” ityādi śrutiṣu abhēdasyaiva dṛṣṭatvāt.

(muktuḍainavāḍu brahmakaṃṭe vērugāka niratiśayamaina ānaṃdamu - mōkṣamu - tāne ayina brahmavale nuṃḍunu. aṭluṃḍuvāḍē muktuḍu - eṃducētananagā - “brahmavale nuṃḍucu brahmamē yagunu” aninnī, “ā parabrahma nīvē ayitivi” aninnī, ī modalagu śruti vākyamulu (jīva brahmalaku) abhēdamunē ceppucunnavi).

  1. “sthūla sūkṣma kāraṇātmaka śarīra traya vilakṣaṇaṃ, paṃcakōśa vilakṣaṇaṃca, svasvarūpaṃ akhaṃḍā dvitīya svayaṃ jyōti svabhāvānaṃda ghana brahma rūpēṇa yaḥ sākṣāt aparōkṣī karōti, karatalāmalakavat, sa ēva muktaḥ - ityucyatē.”

(sthūlaśarīramu, sūkṣmaśarīramu, kāraṇaśarīramu anu śarīra trayamu - mūḍu śarīramulu - kaṃṭe vērai paṃca kōśamulakaṃṭe vērainaṭu vaṃṭi svasvarūpamu (brahmayokka yathārtha svarūpamu) - tana modaṭi rūpamu -, akhaṃḍamu (pūrṇamu - anniṃṭilōnu pūrtigā niṃḍiyuṃḍunadi), advitīyamu (tanakaṃṭe vērē maṟiyoka vastuvu lēnidi, aṃtayu tānē ayunadi), svayamugā prakāśiṃcunadi (prakāśiṃcuṭaku itara vastuvumīda ādhārapaḍi yuṃḍunadi), ānaṃdaghanamu (ghanībhaviṃcina ānaṃdamu kaladi, unnadaṃtā ānaṃdamē ayinadi). ayinaṭuvaṃṭidigā parabrahma rūpamunu, cētilōni usirikāyavale, evaḍu sākṣātkariṃcukonunō (sākṣāttugā cūci anubhaviṃcunō, aṭṭivāḍu muktuḍu ani ceppabaḍucunnāḍu).

  1. “pūrvamavasthātraya kaluṣitaḥ saṃsārīva tiṣṭamānōpi sarva saṃsārānartha mātrān muktaḥ paritaḥ pradyōtamāna pūrṇā naṃdātmanā avatiṣṭatē - mahān ayaṃ viśēṣaḥ.”

jāgratsvapnasuṣuptulanu mūḍu avasthalu kaligiyunnavāḍainappaṭikī, anni vidhamulaina anarthamulatō kūḍina saṃsāramunuṃḍi muktuḍai (viḍudala poṃdina vāḍai) aṃtaṭanu vyāpiṃciyuṃḍi prakāśiṃcu pūrṇānaṃda rūpuḍagu parabrahmavale uṃḍuṭayē muktuni yokka goppa viśēṣamu).

  1. “dēhātmajñānad jñānaṃ dēhātmājñāna bādhakaṃ |

ātmanyēva bhavēdyasya sa nēcchannapi mucyatē ||“.

(dēhamē ātma yanu ajñānamu, dēhātmala yokka tatvajñānamu kaligina tarvāta pōvunu. tana nija svarūpamagu paramātmayaṃdē nimagnuḍaiyuṃḍu tānu kōrakapōyinanu muktuḍagunu).

  1. “ahamēkō na mēkaścinnāha manyasya kasyacit |

nataḥ paśyāmi yasyāhan taṃ na paśyāmi yō mama ||

ahamēva parabrahma jagannādhō hamīśvaraḥ |

iti syānniścitō muktō baddjassyādanathā pumān ||“.

(nēnu okkaḍinē, nāku evarū lēru - nēnevarivāḍanukānu, evarivāḍanō nāku teliyadu. nēnē parabrahmanu, nēnē ī jagattunakukīśvaruḍanu, nādhuḍanu - ī jagattunu śāsiṃcuvāḍanu, naḍipiṃcuvāḍanu nēnē - iṭuvaṃṭi niścayamunnavāḍu muktuḍu - aṭlukānivāḍu baddhuḍē).

“sī. evvanivāḍanaṃ cēmani nuḍuvudu, nāyaṃtavāḍanai naḍuvanērtu

- - - norulu kāru nāku, norulaku nēnaudu

noṃṭivāḍa cuṭtamokaḍulēdu - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 19 - 552) (vāmanāvatāramu)

  1. vidvān (muktaḥ) saṃskāra vaśēna dēhasthōpi dēhasdō na bhavati - yathā svapnāt utthitaḥ smaryamāṇaḥ svapnasthitōpi tatrasthō na bhavati, tadgata sukhaduḥkhādya bāvāt, tadvat.

(muktuḍainavāḍu saṃskāravaśamuna dēhamu kaligi yunnavāḍainanu - dānivalana kalugu duḥkhamulu ataniki kalugucunnanu - dēhamutōnuṃḍuvāḍu kānaṭlē - eṭlaṃṭē, svapnamulō sukhaduḥkhamula nanubhaviṃcinaṭlu anipiṃcinanu, mēlkonina tarvāta vāṭini smariṃcukoni, ā sukhaduḥkhamulu tānu anubhaviṃcinavi kāvu ani telusukoninaṭlē. muktuḍainavāḍu dēhamutōnuṃḍiyu dānivalana kalugu sukhaduḥkhamulananubhaviṃcaḍu.)

  1. “sparśān kṛtvā bahirbāhyāṃścakṣuścaivāṃtarē bruvōḥ |

prāṇāpānau samau kṛtvā nāsābhyāṃtara cāriṇau |

yatēṃdriyamanō buddhirmōkṣa parāyaṇaḥ |

vigatēcchā bhayakrōdhō yaḥ sadā mukta ēva saḥ ||” (śrīmadbhagavadgīta - 5 - 27, 28)

“bāhyāḥ śabdādayō buddhā miṃdriyaiḥ saṃpravēśitāḥ |

vairāgyēṇaivatān bāhyān mahiḥ kṛtvā prayatnataḥ |

yadyētē aṃtarāsyurvai tadōpāya sahasra kaiḥ |

bahirnasyuḥ svabhāvasya bhaṃgaḥ kartuṃ na śakyatē |

bahyaṃ stvaṃtaḥ praviṣṭāṃ stā nrāgāvēśā dbahistathā |

kartuṃ śakyānvirāgēṇa bāhyāniti viśēṣaṇāt |

vairāgyaṃ tadanē nōktvāprāhābhyāsa mathōkṣajaḥ |

atyaṃtamīlanē nidrā prasārē vibhramāda yaḥ |

atō arthamīlanē naiva bhrūmadhyē cikṣusōḥ sthitiḥ |

ūrthvādhōgati niccēdānnā sābhyaṃtara cāriṇau |

kuṃbhakēna samēkṛtvā prāṇā pānau vicakṣaṇaḥ |

saṃ yatā ityupāyēna yasyēṃdriya manōdhiyaḥ |

viṣayān viṣavattyaktvā samu nirmōkṣa tatparaḥ |

icchādi rahitō yōgī jīvannēva vi mucyatē||“.

(iṃdriyamulacēta lōpala - buddhi yaṃdu pravēśiṃpa cēyabaḍinaṭuvaṃṭi bāhya viṣayamulaina śabda sparśa rūpa rasa gaṃdhamulanu prayatnamucēta, vairāgyamucēta - vāṭiyaṃdu anurāgamu lēkuṃḍunaṭula cēsukonuṭacēta) bāgā kanulu mūsukonuṭacēta nidra, vibhramamu kaluguṭakavakāśamunnadikanuka, kannulanu sagamu mūsiyuṃci bhrūmadhyamaṃdu dṛṣṭi nilipi, prāṇavāyuvunu apānavāyuvunu kriṃdaku - mīdaku - lōpaliki, paiki - pōvuṭa arikaṭṭuṭacēta samānamuganuṃḍunaṭlu kuṃbhakamu cēsi, iṃdriyamulanu manassunu vaśamulōnuṃcukoni, viṣayamulanu viṣamuvale vadalipeṭṭi mōkṣamaṃdu tatparuḍaina muni ē vidhamaina kōrikalu lēnivāḍai jīviṃciyunnanu muktuḍē yagunu -).

  1. “saṃsāra sarpa saṃdaṣṭa naṣṭa cēṣṭaika bhēṣajaṃ |

kṛṣṇē vaiṣṇavaṃ maṃtraṃ śṛtvāmuktō bhavēnnaraḥ ||“.

(jananamaraṇarūpamaina saṃsāramu anu sarpamucēta karavabaḍi cēṣṭalu lēkayuṃḍuvāniki ‘kṛṣṇā’ anu vaiṣṇavamaṃtramu auṣadhamu. dānini vinaṃta mātramuna naruḍu muktuḍagunu).

  1. “ka. vādamulu vēyunēṭiki

vēdōktavidhiṃ jariṃcu vibhuḍu gṛhamaṃ

dādaramuna nārāyaṇa

pādaṃbulu golici mukti padamunakēgun ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 470)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.