← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రభువు prabhuvu

Original — తెలుగు
  1. నియంతుం సమర్థత్వాత్ ప్రభుః.

(నియమించు సామర్థ్యముకలవాడు కనుక ప్రభువు - సకల వస్తువులలోను, సకల ప్రాణులలోను తానుండి, వాటికి తన చిచ్ఛక్తి - (చైతన్య శక్తి) నిచ్చి వాటిని వాటి వాటి పనులలో నియమించువాడు, వాటిచే వాటి వాటి పనులను చేయించువాడు).

  1. సర్వప్రపంచనియమన భరణ సమర్థః.

(సమస్త ప్రపంచమును నియమించి భరించువాడు - పోషించువాడు).

  1. సమర్థః

(ఏ పనినైనను చేయుటకు సమర్థుడైనవాడు, చేతనైనవాడు).

  1. నిగ్రహానుగ్రహ సమర్థః.

(పాపాత్ములను నిగ్రహించుటకు, పుణ్యాత్ములను అనుగ్రహించుటకు - రక్షించుటకు - సమర్థుడైనవాడు - కావలసిన శక్తిగలవాడు - “పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం| ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||”. (శ్రీమద్భగవద్గీత - 4 - 8)

(సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు, ధర్మమును సంస్థాపించుటకు ప్రతియుగమందు అవతరించుదును).

  1. ‘సర్వ సమర్థః’. (శ్రీశంకరః)

(అన్నింటికీ సమర్థుడైనవాడు - ఏ పనినైనను చేయుటకు శక్తిగలవాడు).

  1. సర్వార్థఘటన సమర్థః.

(ధర్మార్థ కామమోక్షములను నాలుగు విధముల పురుషార్థములను చేకూర్చుటకు శక్తిగలవాడు).

  1. నియామకః -

(ప్రపంచమునంతటినీ - దానిలోనుండు సమస్త వస్తువులలోను తానుండి వాటిని వాటివాటి పనులలో నియమించువాడు - నియమించి చేయించువాడు).

  1. శాసితా -

(శాసించువాడు - ఇది ఇటుల జరుగవలెను - ఇతను ఇది చేయవలెను - అని శాసించువాడు).

  1. సర్వసు క్రియాసు సామర్థ్యాతిశయాత్ ప్రభుః -

(సమస్త కార్యములను చేయుటయందు గొప్ప సామర్థ్యము గలవాడగుటచేత ప్రభువు).

  1. ప్రభావతి సృష్ట్యాది కర్మకర్తుం శక్నోతి ఇతి ప్రభుః

(సృష్టి స్థితిలయములు చేయు శక్తి కలవాడగుటచేత ప్రభువు).

  1. ప్రకర్షేణ స్వశక్తి వైభవేన సకల ప్రపంచాత్మనా భవతి ఇతి ప్రభుః - సకల ప్రపంచస్య అధిష్టా -

(తనయొక్క గొప్పదైన శక్తి వైభవముచేత సకల ప్రపంచము తానే యగుట చేతను, ప్రపంచమునకు ఆత్మ తానే యగుటచేతను - ప్రభువు).

  1. ప్రకర్షేణ భవనాత్ ప్రభుః

(ఒక్కడే అయినను ఉత్కృష్టమైన వాటినిగా తానే యగుచుండుటవలన ప్రభువు).

  1. అఖిల షితకర్మకరణ సమర్థః.

(తను కోరినప్రకారము పనులను చేయగలవాడు - స ఆకామయత - కోరినంత మాత్రమున సృష్టి చేయగల సామర్థ్యము గలవాడు).

  1. సర్వ వస్తు పరిణామ సంపాదకత్వాత్ ప్రభుః.

(సమస్త వస్తువులు ప్రతిక్షణము మార్పును చెందుచుండు - వాటిలో భగవంతుడుండి తన చైతన్యశక్తితో వాటికి ఆ మార్పులు కలుగునట్లు చేయును కనుక ప్రభువు - ఒక్క చిన్న మొక్క పెద్దదిగా పెరుగుట, ఆకులు, పువ్వులు, కాయలు కలుగుట మార్పులు. చిన్నబాలుడు పెద్దమనిషిగా అగుట మార్పు - మరణము మార్పు - బాల్య కౌమార యవ్వన వార్థక్యములు మనిషిలో గలుగు మార్పులు - ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారుట మార్పు - ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువు పుట్టుట మార్పు).

  1. జగచ్ఛక్ర చాలకత్వేన నియంతృత్వాత్ ప్రభుః -

(జగత్తును సృష్టించుచు, పోషించుచు, సంహరించుచు మరల మరల యీ ప్రకారముగా చక్రమువలె జరిగించుచు దానికి నియంత (అన్ని విధముల నియమించువాడు) - కనుక ప్రభువు).

  1. కర్తుమకర్తు మన్యథా కర్తుమపి సమర్థః. (కప్ప విప్ప సమర్థుడైనవాడు).

  2. “అకర్మ వశ్యః” (శ్రీరామానుజః)

(కర్మకు - కర్మఫలమునకు - వశుడుకానివాడు).

  1. జగదింద్రియః. (ఇంద్రియములను జయించినవాడు, తన స్వాధీనములో నుంచుకొనినవాడు).

  2. సర్వస్వామీ - ఈశ్వరః; అధ్యక్షః, నిర్వాహకః, సకలస్వామీ.

(సమస్తమునకు - సర్వమునకు - స్వామి (అధికారి అయినవాడు; ఈశ్వరుడు; అధ్యక్షః, అన్నిపనులు నిర్వహించువాడు).

  1. ప్రభవతీతి ప్రభుః (చూడుము - ప్రభవః - 2).

  2. “వ. అప్పరమాత్మయైన బ్రహ్మంబునకు దక్క కాలదేశ, సత్వ, రజస్తమో గుణాహంకార మహత్తత్వ ప్రథానంబులకు ప్రభుత్వంబు లేదు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 28)

  1. “భీషాస్మాత్, వాతఃపవతే, భీషోదేతి సూర్యః భీషాస్మా దగ్నిశ్యేంద్రశ్చ మృత్యుర్భావతి పంచమ ఇతి”.

(భగవంతుని భయమువలననే వాయువు వీచుచున్నది. అగ్ని, ఇంద్రుడు, మృత్యువు వారి వారి పనులు చేయుచున్నారు - వాయువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, మొగలగువారిలో పరమాత్మ యుండి వాటికి తన చైతన్యశక్తినిచ్చి వాటిచేత వాటివాటి పనులు చేయించుచున్నాడు. అందుచేత పరమాత్మ ప్రభువు).

  1. సకల భూతంబులకు నాశ్రయంబగుచు నంతర్గతంబై భూతంబులచేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫలప్రదాతగావున వశీకృత భూతుండై ప్రభుత్వంబు భజియించి విష్ణుండు ప్రకాశించుచుండు. అతనికి మిత్రుండును, శత్రుండును, బంధుండును లేడు. అట్టి విష్ణుండు సకలజనంబులందావేశించి యప్రమత్తుడై ప్రమత్తులయిన జనంబులకు సంహారకుండై యుండు. అతనివలన భయంబునంజేసి వాయువు వీచు, సూర్యుడు దపియించు, నింద్రుడు వర్షించు, నక్షత్రగణంబు వెలుంగు, చంద్రుండు ప్రకాశించు, తత్తత్కాలంబుల వృక్షలతాదు లోషధుల తోడం గూడి పుష్ప ఫల భరితంబులగు సరిత్తులు ప్రవహించు సముద్రంబులు మేరలు దప్పకయుండు, నగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతో గూడ బరువున గ్రుంగ వెఱచు, ఆకాశంబు సకల జనంబులకు నవకాశంబిచ్చు మహత్తత్త్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబుగావున సప్తావరణావృతంబగు లోకంబను స్వదేహంబు విస్తరింపజేయు, గుణాభిమానులగు బ్రహ్మాదులు సర్వేశ్వరునిచేత జగత్సర్గంబునందు నియోగింపబడి ప్రతిదినంబు నయ్యై సర్గంబుసేయ విప్రమత్తులై యుండుదురు. పిత్రాదులు పుత్రోత్పత్తి చేయుదురు, కాలుండు మృత్యుసహాయుండై మారకుండై యుండు. చరాచరాత్మకంబగు సకల ప్రపంచంబు భగవదధీనంబైయుండు“.

(శ్రీమదాంధ్రమహాభాగవతం,ఉ - 3 - 29 - 969)

  1. “బ్రహ్మాద్యు స్థావరాంతాశ్చ దేవ దేవస్య శూలినః |

పశవః పరికీర్త్యంతే సంసారవశ వర్తినః |

తేషాం దతిత్వాద్దేవేశః శివః పశుపతి స్మృతిః |

మలమాయావిభిః పాశైః స బధ్నాతి పశూన్ పతిః |

స ఏవ మోచకస్తేషాం భక్త్యా సమ్యగుపాసితః |

చతుర్వింశతి తత్వాని మాయా కర్మగుణా అపి |

విషయాః ఇతి కథ్యతే పాశాః జీవ నిబంధనాః |

బ్రహ్మాది స్తంబపర్యంతాన్ పశూన్ బధ్వామహేశ్వరః |

పాశైరేతైః పతిర్దేవో కార్యం కారయతి స్వయం |

తస్యాజ్ఞయామహేశస్య ప్రకృతిః పురుషో పి తాం |

బుద్ధింప్రసూతే సా బుద్ధిరహంకారమహంకృతిః |

ఇంద్రియాణి తన్మాత్రా పంచకం తథా |

శాసనాద్దేవ దేవస్య శివదాయినః |

తన్మాత్రాణ్యపి తస్యైవ శాసనేన మహీ యసా |

మహాభూతాన్యశేషాణి భావయంత్యనుపూర్వశః |

బ్రహ్మాదీనాం తృణాం తానాం దేహినాం దేవ సంగతం |

మహాభూతన్యశేషాణి జనయంతి శివాజ్ఞయా |

అధ్యనస్యతి వై బుద్ధిరహంకారో(అ)భిమన్యతే |

చిత్తం చేతయితే చాపి మనస్సంకల్ప యత్యపి |

శ్రోత్రాదీనిచ గృహ్ణాంతి శబ్దాది విషయాన్ పృధక్ |

స్వానేవ నాన్యాన్ దేవస్య దివ్యేనాజ్ఞ చిలేనవై |

వాగాద్యాని చ యాన్యా సంస్తాని కర్మేంద్రియాణి చ |

యథాస్వం కర్మకుర్వంతి నాన్యత్ కించిత్ శివాజ్ఞయా |

శబ్దాదయోపి గృహ్యంతే ప్రియంతే వచనాదయః |

అవకాశమశేషాణాం భూతానాం సంప్రయచ్ఛతి.

ఆకాశః పరమేశస్య శాసనాదేవ సర్వగః |

ప్రాణాద్యైరావ హాగ్యైశ్చ భేదై రంతర్బహిర్జగత్ |

బిభర్తి సర్వం శర్వస్య శాసనేన ప్రభంజనః |

హవ్యం వహతి దేవానాం కస్యం కశినామపి |

పాకాద్యం చ కరోత్యగ్నిః పరమేశ్వర శాసనాత్ |

సంజీవనాది సర్వస్య కుర్వం త్యాపస్తదాజ్ఞయా |

విశ్వం విశ్వంభరానిత్యం ధత్తే విశ్వేశ్వరాజ్ఞయం |

- - - ధత్తేతు ధరణీం మూర్థ్నా శేషశ్శివ నియోగతః |

- - - సృజత్యశేషమీశస్య శాసనాచ్చతురాననః |

విష్ణుః పాలయతే విశ్వం విశ్వేశ్వర నియోగతః |

హరత్యంతే జగత్సర్వం హరస్త స్యైవశాసనాత్ |

కాలః కరోతి సకలం కాలస్సంహరతి ప్రజాః |

కాలః పాలయతే విశ్వం కాలకాలస్య శాసనాత్ |

ఆదిత్యా వసవో రుద్రా అశ్వినౌ మరుతస్తథా |

ఖేచరాః ఋషయస్సిద్దాః యోగినో మనుజామృతాః |

- - - బ్రహ్మాండాన్యప్య సంఖ్యాని తేషామావరణాని చ |

- - - యచ్చకించిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా |

తత్సర్వం శంకరస్యాజ్ఞా బలేన సమథిష్ఠితం ||. (వాయవీయ సంహితాయాం)

(బ్రహ్మ మొదలు స్థావరములువరకు గలవన్నియు సంసారమునకు వశమై యుండుటవలన దేవతులకు దేవుడైన శివునికి పశువులేయని చెప్పబడుచున్నారు. వారందఱికి శివుడు పతి - పాలించువాడగుటవలన శివుడు పతి యని చెప్పబడుచున్నాడు - పశువులను తాళ్ళతోకట్టి ఉంచినట్లే శివుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ మొదలగు పశువులను మలము, మాయ మొదలగు త్రాళ్ళతో కట్టి ఉంచుచున్నాడు. తనను భక్తితో ఉపాసించిన వారికి ఆ పశుపతి అయిన శివుడే యీ మాయ యను సంసారమునుండి ముక్తి నిచ్చును - మాయా కర్మలైన ప్రకృతిగుణములవలన కలిగి యిరువది నాలుగు తత్వములు విషయములు జీవుని బంధించుటవలన పాశములని చెప్పబడుచున్నవి. బ్రహ్మ మొదలు స్థావరములవరకు గల పశువులన్నింటినీ యీ పాశములచేత మహేశ్వరుడు కట్టివైచి పని చేయుచుండును - మహేశ్వరుని ఆజ్ఞ వల్లనే ప్రకృతి పురుషులు, బుద్ధి, అహంకారము, పది ఇంద్రియములు, అయిదు తన్మాత్రలు కలుగుచున్నవి - శుభమును కలుగ చేయుచున్నవి. శివుడు అధిష్టించి యుండుటవలన చిత్తము పనిచేయుచున్నది, మనస్సు సంకల్పించుచున్నది. శ్రోత్రము మొదలగు ఇంద్రియములు శబ్దము మొదలగు విషయములను గ్రహించుచున్నవి. మహేశ్వరుని ఆజ్ఞవలన సమస్త భూతములు ఉండుటకు ఆకాశము అవకాశమి చ్చు చున్నది. వాయువు అతని శాసనమువలననే అంతటను లోపల పైన వ్యాపించి ప్రపంచమును భరించుచున్నది. హవ్యమును దేవతలకు కవ్యమును కవ్యాశనులకు నిచ్చుచున్నది. అగ్ని పాకముచేయుచున్నది; అట్లే జలము జీవనము పోయుచున్నది. మహేశ్వరుని ఆజ్ఞవననే చతుర్ముఖబ్రహ్మ సృష్టి నంతయు చేయుచున్నాడు, విష్ణువు పాలించు చున్నాడు; ప్రళయకాలమందు హరుడు ప్రపంచము నంతము చేయుచున్నాడు. కాలమునకుకూడా కాలుడైన మహేశ్వరుని ఆజ్ఞవలననే కాలము అన్నింటిని వాటివాటి అవసానకాలమందు సంహరించుచున్నది. ఆదిత్యులను, వసువులను, రుద్రులను. అశ్వనీదేవతులను, మురుక్తులను, ఖేచరులను, సిద్ధులను, ఋషులను, యోగులను, మనుష్యులను, దేవతలను, లెక్కలేనన్ని బ్రహ్మాండములను, వాటి ఆవరణములను, ఆ కాలమే మహేశ్వరుని ఆజ్ఞచే పాలించుచున్నవి. మనకు కనబడుచున్న యేకొద్ది ప్రపంచముకలదో దానినంతటిని మహేశ్వరుడు తన ఆజ్ఞా బలముచేత అధిష్టించియున్నాడు - ప్రపంచమంతయు, దానిలోనుండు ప్రతివస్తువు పరమేశ్వరుని శక్తివలననే - చిచ్ఛక్తి వలననే - పనిచేయుచున్నది అని స్పష్టమగుచున్నది. అందుచేత పరమేశ్వరుడు - పరమాత్మ, పరబ్రహ్మ ఈ ప్రపంచమంతటికీ - సృష్టి అంతటికీ ప్రభువు).

(త్వవధీనమిదం సర్వం జగద్ధి నసూసరం |

అతస్తద్విహితామాజ్ఞాం క్షమతే కే (అ)తివర్తితుం ||). (వాయువీయ సంహితాయాం)

(సురాసురలతోనిండిన జగత్తంతయు నీ (పరమేశ్వరుని) అధీనములోనున్నది. అందుచేత నీ ఆజ్ఞ నతిక్రమించుటకు - దాటుటకు - ఎవడు సమర్థుడు ? - ఎవడునూకాడు. అందుచేత పరమాత్మయే అన్నింటికి ప్రభువు).

  1. “సర్వాత్మా సర్వ కర్తాచ ప్రవర్తక నివర్తకః |

స్థిర ధన్వా క్షయద్వరో రుద్రో విశ్వాధికః ప్రభుః |

శాస్తా (అ)శేషస్య జగతో, సత్వం, న చతుర్ముఖః ||“. (బ్రహ్మాండపురాణే)

(అన్నింటికి ఆత్మ అయినవాడు, అన్ని పనులు చేయువాడు, ప్రవర్తింపచేయువాడు, నివర్తింపచేయువాడు - ప్రవృత్తిమార్గములోను, నివృత్తిమార్గములోను పెట్టువాడు - జగత్తు అంతటిని శాసించువాడు - పరమేశ్వరుడే - అందుచేత పరమేశ్వరుడే ప్రభువు - నీవు కాదు, (విష్ణువుకాదు) - చతుర్ముఖబ్రహ్మ కాదు).

(పరమాత్మ పరబ్రహ్మ అయినవాడే ప్రభువు - త్రిమూర్తులలో ఎవరైనను సరియే - పరమాత్మ, పరబ్రహ్మ అయినవాడు - త్రిగుణములు కలిసిన ప్రకృతిలో చేరగానే మూర్తులు - రూపములు - వచ్చినవి).

  1. “వ. వాది వాక్య భేదంబుల (యోగీశ్వరులు) గొందఱు మోహితులై భేదంబునాచ్ఛాదించి తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభువని చెప్పుదురు. కొందఱు (దైవజ్ఞులు) గ్రహదేవతాదులకు ప్రభుత్వంబు సంపాదింతురు. కొందఱు (మీమాన్సకులు) గర్మంబునకుం బ్రభావంబుం బ్రకటింతురు - కొందఱు (లోకాయతికులు) స్వభావంబు ప్రభువని పలుకుదురు - ఇందెవ్వరికిని సుఖ ప్రదానంబు సేయ (ఆత్యంతికసుఖరూపమగు మోక్షమునిచ్చుటకు) బ్రభుత్వంబులేదు - పరులవలన దుఃఖంబు వచ్చిన ధర్మపరులధర్మంబు చేసిరని విచారింప వలదు. తర్కింపను, నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వంబునగుచుండు” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 16 - 424)

  1. “సీ. యోగీశరూపుడై యోగంబు జూపుచు, మేనిరూపమున గర్మంబు దాల్చు

సర్గంబు సేయు ప్రజాపతిరూపుడై ఇంద్రుడై దైత్యులనేపడంచు

జ్ఞానంబు నెఱిగించు జతురసిద్ధాకృతి గాలరూపమున బాకంబు సేయు

నానావిధాకార నామరూపంబుల గర్మలోచనులకు గానబడడు

ఆ. చనిన రూపములను జనురూపముల, నింక

జనగనున్న రూపచయము నతడు

వివిధుడై యనేక వృత్తుల వెలిగించు

విష్ణుడవ్యయుండు విమలచరిత”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 14 - 433 to 435)

Transliteration
  1. niyaṃtuṃ samarthatvāt prabhuḥ.

(niyamiṃcu sāmarthyamukalavāḍu kanuka prabhuvu - sakala vastuvulalōnu, sakala prāṇulalōnu tānuṃḍi, vāṭiki tana cicchakti - (caitanya śakti) nicci vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcuvāḍu, vāṭicē vāṭi vāṭi panulanu cēyiṃcuvāḍu).

  1. sarvaprapaṃcaniyamana bharaṇa samarthaḥ.

(samasta prapaṃcamunu niyamiṃci bhariṃcuvāḍu - pōṣiṃcuvāḍu).

  1. samarthaḥ

(ē paninainanu cēyuṭaku samarthuḍainavāḍu, cētanainavāḍu).

  1. nigrahānugraha samarthaḥ.

(pāpātmulanu nigrahiṃcuṭaku, puṇyātmulanu anugrahiṃcuṭaku - rakṣiṃcuṭaku - samarthuḍainavāḍu - kāvalasina śaktigalavāḍu - “paritrāṇāya sādhūnāṃ, vināśāya ca duṣkṛtāṃ| dharmasaṃsthāpanārthāya saṃbhavāmi yugē yugē ||”. (śrīmadbhagavadgīta - 4 - 8)

(sādhuvulanu rakṣiṃcuṭaku, durmārgulanu naśiṃpacēyuṭaku, dharmamunu saṃsthāpiṃcuṭaku pratiyugamaṃdu avatariṃcudunu).

  1. ‘sarva samarthaḥ’. (śrīśaṃkaraḥ)

(anniṃṭikī samarthuḍainavāḍu - ē paninainanu cēyuṭaku śaktigalavāḍu).

  1. sarvārthaghaṭana samarthaḥ.

(dharmārtha kāmamōkṣamulanu nālugu vidhamula puruṣārthamulanu cēkūrcuṭaku śaktigalavāḍu).

  1. niyāmakaḥ -

(prapaṃcamunaṃtaṭinī - dānilōnuṃḍu samasta vastuvulalōnu tānuṃḍi vāṭini vāṭivāṭi panulalō niyamiṃcuvāḍu - niyamiṃci cēyiṃcuvāḍu).

  1. śāsitā -

(śāsiṃcuvāḍu - idi iṭula jarugavalenu - itanu idi cēyavalenu - ani śāsiṃcuvāḍu).

  1. sarvasu kriyāsu sāmarthyātiśayāt prabhuḥ -

(samasta kāryamulanu cēyuṭayaṃdu goppa sāmarthyamu galavāḍaguṭacēta prabhuvu).

  1. prabhāvati sṛṣṭyādi karmakartuṃ śaknōti iti prabhuḥ

(sṛṣṭi sthitilayamulu cēyu śakti kalavāḍaguṭacēta prabhuvu).

  1. prakarṣēṇa svaśakti vaibhavēna sakala prapaṃcātmanā bhavati iti prabhuḥ - sakala prapaṃcasya adhiṣṭā -

(tanayokka goppadaina śakti vaibhavamucēta sakala prapaṃcamu tānē yaguṭa cētanu, prapaṃcamunaku ātma tānē yaguṭacētanu - prabhuvu).

  1. prakarṣēṇa bhavanāt prabhuḥ

(okkaḍē ayinanu utkṛṣṭamaina vāṭinigā tānē yagucuṃḍuṭavalana prabhuvu).

  1. akhila ṣitakarmakaraṇa samarthaḥ.

(tanu kōrinaprakāramu panulanu cēyagalavāḍu - sa ākāmayata - kōrinaṃta mātramuna sṛṣṭi cēyagala sāmarthyamu galavāḍu).

  1. sarva vastu pariṇāma saṃpādakatvāt prabhuḥ.

(samasta vastuvulu pratikṣaṇamu mārpunu ceṃducuṃḍu - vāṭilō bhagavaṃtuḍuṃḍi tana caitanyaśaktitō vāṭiki ā mārpulu kalugunaṭlu cēyunu kanuka prabhuvu - okka cinna mokka peddadigā peruguṭa, ākulu, puvvulu, kāyalu kaluguṭa mārpulu. cinnabāluḍu peddamaniṣigā aguṭa mārpu - maraṇamu mārpu - bālya kaumāra yavvana vārthakyamulu maniṣilō galugu mārpulu - oka vastuvu iṃkoka vastuvugā māruṭa mārpu - okavastuvulōnuṃḍi iṃkoka vastuvu puṭṭuṭa mārpu).

  1. jagacchakra cālakatvēna niyaṃtṛtvāt prabhuḥ -

(jagattunu sṛṣṭiṃcucu, pōṣiṃcucu, saṃhariṃcucu marala marala yī prakāramugā cakramuvale jarigiṃcucu dāniki niyaṃta (anni vidhamula niyamiṃcuvāḍu) - kanuka prabhuvu).

  1. kartumakartu manyathā kartumapi samarthaḥ. (kappa vippa samarthuḍainavāḍu).

  2. “akarma vaśyaḥ” (śrīrāmānujaḥ)

(karmaku - karmaphalamunaku - vaśuḍukānivāḍu).

  1. jagadiṃdriyaḥ. (iṃdriyamulanu jayiṃcinavāḍu, tana svādhīnamulō nuṃcukoninavāḍu).

  2. sarvasvāmī - īśvaraḥ; adhyakṣaḥ, nirvāhakaḥ, sakalasvāmī.

(samastamunaku - sarvamunaku - svāmi (adhikāri ayinavāḍu; īśvaruḍu; adhyakṣaḥ, annipanulu nirvahiṃcuvāḍu).

  1. prabhavatīti prabhuḥ (cūḍumu - prabhavaḥ - 2).

  2. “va. apparamātmayaina brahmaṃbunaku dakka kāladēśa, satva, rajastamō guṇāhaṃkāra mahattatva prathānaṃbulaku prabhutvaṃbu lēdu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 28)

  1. “bhīṣāsmāt, vātaḥpavatē, bhīṣōdēti sūryaḥ bhīṣāsmā dagniśyēṃdraśca mṛtyurbhāvati paṃcama iti”.

(bhagavaṃtuni bhayamuvalananē vāyuvu vīcucunnadi. agni, iṃdruḍu, mṛtyuvu vāri vāri panulu cēyucunnāru - vāyuvu, agni, sūryuḍu, iṃdruḍu, mogalaguvārilō paramātma yuṃḍi vāṭiki tana caitanyaśaktinicci vāṭicēta vāṭivāṭi panulu cēyiṃcucunnāḍu. aṃducēta paramātma prabhuvu).

  1. sakala bhūtaṃbulaku nāśrayaṃbagucu naṃtargataṃbai bhūtaṃbulacēta bhūtaṃbula grasiṃcucu yajñaphalapradātagāvuna vaśīkṛta bhūtuṃḍai prabhutvaṃbu bhajiyiṃci viṣṇuṃḍu prakāśiṃcucuṃḍu. ataniki mitruṃḍunu, śatruṃḍunu, baṃdhuṃḍunu lēḍu. aṭṭi viṣṇuṃḍu sakalajanaṃbulaṃdāvēśiṃci yapramattuḍai pramattulayina janaṃbulaku saṃhārakuṃḍai yuṃḍu. atanivalana bhayaṃbunaṃjēsi vāyuvu vīcu, sūryuḍu dapiyiṃcu, niṃdruḍu varṣiṃcu, nakṣatragaṇaṃbu veluṃgu, caṃdruṃḍu prakāśiṃcu, tattatkālaṃbula vṛkṣalatādu lōṣadhula tōḍaṃ gūḍi puṣpa phala bharitaṃbulagu sarittulu pravahiṃcu samudraṃbulu mēralu dappakayuṃḍu, nagni prajvaliṃcu, bhūmi girulatō gūḍa baruvuna gruṃga veṟacu, ākāśaṃbu sakala janaṃbulaku navakāśaṃbiccu mahattattvaṃbu jagattunaku naṃkura svarūpaṃbugāvuna saptāvaraṇāvṛtaṃbagu lōkaṃbanu svadēhaṃbu vistariṃpajēyu, guṇābhimānulagu brahmādulu sarvēśvarunicēta jagatsargaṃbunaṃdu niyōgiṃpabaḍi pratidinaṃbu nayyai sargaṃbusēya vipramattulai yuṃḍuduru. pitrādulu putrōtpatti cēyuduru, kāluṃḍu mṛtyusahāyuṃḍai mārakuṃḍai yuṃḍu. carācarātmakaṃbagu sakala prapaṃcaṃbu bhagavadadhīnaṃbaiyuṃḍu”.

(śrīmadāṃdhramahābhāgavataṃ,u - 3 - 29 - 969)

  1. “brahmādyu sthāvarāṃtāśca dēva dēvasya śūlinaḥ |

paśavaḥ parikīrtyaṃtē saṃsāravaśa vartinaḥ |

tēṣāṃ datitvāddēvēśaḥ śivaḥ paśupati smṛtiḥ |

malamāyāvibhiḥ pāśaiḥ sa badhnāti paśūn patiḥ |

sa ēva mōcakastēṣāṃ bhaktyā samyagupāsitaḥ |

caturviṃśati tatvāni māyā karmaguṇā api |

viṣayāḥ iti kathyatē pāśāḥ jīva nibaṃdhanāḥ |

brahmādi staṃbaparyaṃtān paśūn badhvāmahēśvaraḥ |

pāśairētaiḥ patirdēvō kāryaṃ kārayati svayaṃ |

tasyājñayāmahēśasya prakṛtiḥ puruṣō pi tāṃ |

buddhiṃprasūtē sā buddhirahaṃkāramahaṃkṛtiḥ |

iṃdriyāṇi tanmātrā paṃcakaṃ tathā |

śāsanāddēva dēvasya śivadāyinaḥ |

tanmātrāṇyapi tasyaiva śāsanēna mahī yasā |

mahābhūtānyaśēṣāṇi bhāvayaṃtyanupūrvaśaḥ |

brahmādīnāṃ tṛṇāṃ tānāṃ dēhināṃ dēva saṃgataṃ |

mahābhūtanyaśēṣāṇi janayaṃti śivājñayā |

adhyanasyati vai buddhirahaṃkārō(a)bhimanyatē |

cittaṃ cētayitē cāpi manassaṃkalpa yatyapi |

śrōtrādīnica gṛhṇāṃti śabdādi viṣayān pṛdhak |

svānēva nānyān dēvasya divyēnājña cilēnavai |

vāgādyāni ca yānyā saṃstāni karmēṃdriyāṇi ca |

yathāsvaṃ karmakurvaṃti nānyat kiṃcit śivājñayā |

śabdādayōpi gṛhyaṃtē priyaṃtē vacanādayaḥ |

avakāśamaśēṣāṇāṃ bhūtānāṃ saṃprayacchati.

ākāśaḥ paramēśasya śāsanādēva sarvagaḥ |

prāṇādyairāva hāgyaiśca bhēdai raṃtarbahirjagat |

bibharti sarvaṃ śarvasya śāsanēna prabhaṃjanaḥ |

havyaṃ vahati dēvānāṃ kasyaṃ kaśināmapi |

pākādyaṃ ca karōtyagniḥ paramēśvara śāsanāt |

saṃjīvanādi sarvasya kurvaṃ tyāpastadājñayā |

viśvaṃ viśvaṃbharānityaṃ dhattē viśvēśvarājñayaṃ |

- - - dhattētu dharaṇīṃ mūrthnā śēṣaśśiva niyōgataḥ |

- - - sṛjatyaśēṣamīśasya śāsanāccaturānanaḥ |

viṣṇuḥ pālayatē viśvaṃ viśvēśvara niyōgataḥ |

haratyaṃtē jagatsarvaṃ harasta syaivaśāsanāt |

kālaḥ karōti sakalaṃ kālassaṃharati prajāḥ |

kālaḥ pālayatē viśvaṃ kālakālasya śāsanāt |

ādityā vasavō rudrā aśvinau marutastathā |

khēcarāḥ ṛṣayassiddāḥ yōginō manujāmṛtāḥ |

- - - brahmāṃḍānyapya saṃkhyāni tēṣāmāvaraṇāni ca |

- - - yaccakiṃcijjagatyasmin dṛśyatē śrūyatēpi vā |

tatsarvaṃ śaṃkarasyājñā balēna samathiṣṭhitaṃ ||. (vāyavīya saṃhitāyāṃ)

(brahma modalu sthāvaramuluvaraku galavanniyu saṃsāramunaku vaśamai yuṃḍuṭavalana dēvatulaku dēvuḍaina śivuniki paśuvulēyani ceppabaḍucunnāru. vāraṃdaṟiki śivuḍu pati - pāliṃcuvāḍaguṭavalana śivuḍu pati yani ceppabaḍucunnāḍu - paśuvulanu tāḷḷatōkaṭṭi uṃcinaṭlē śivuḍu ā caturmukha brahma modalagu paśuvulanu malamu, māya modalagu trāḷḷatō kaṭṭi uṃcucunnāḍu. tananu bhaktitō upāsiṃcina vāriki ā paśupati ayina śivuḍē yī māya yanu saṃsāramunuṃḍi mukti niccunu - māyā karmalaina prakṛtiguṇamulavalana kaligi yiruvadi nālugu tatvamulu viṣayamulu jīvuni baṃdhiṃcuṭavalana pāśamulani ceppabaḍucunnavi. brahma modalu sthāvaramulavaraku gala paśuvulanniṃṭinī yī pāśamulacēta mahēśvaruḍu kaṭṭivaici pani cēyucuṃḍunu - mahēśvaruni ājña vallanē prakṛti puruṣulu, buddhi, ahaṃkāramu, padi iṃdriyamulu, ayidu tanmātralu kalugucunnavi - śubhamunu kaluga cēyucunnavi. śivuḍu adhiṣṭiṃci yuṃḍuṭavalana cittamu panicēyucunnadi, manassu saṃkalpiṃcucunnadi. śrōtramu modalagu iṃdriyamulu śabdamu modalagu viṣayamulanu grahiṃcucunnavi. mahēśvaruni ājñavalana samasta bhūtamulu uṃḍuṭaku ākāśamu avakāśami ccu cunnadi. vāyuvu atani śāsanamuvalananē aṃtaṭanu lōpala paina vyāpiṃci prapaṃcamunu bhariṃcucunnadi. havyamunu dēvatalaku kavyamunu kavyāśanulaku niccucunnadi. agni pākamucēyucunnadi; aṭlē jalamu jīvanamu pōyucunnadi. mahēśvaruni ājñavananē caturmukhabrahma sṛṣṭi naṃtayu cēyucunnāḍu, viṣṇuvu pāliṃcu cunnāḍu; praḷayakālamaṃdu haruḍu prapaṃcamu naṃtamu cēyucunnāḍu. kālamunakukūḍā kāluḍaina mahēśvaruni ājñavalananē kālamu anniṃṭini vāṭivāṭi avasānakālamaṃdu saṃhariṃcucunnadi. ādityulanu, vasuvulanu, rudrulanu. aśvanīdēvatulanu, muruktulanu, khēcarulanu, siddhulanu, ṛṣulanu, yōgulanu, manuṣyulanu, dēvatalanu, lekkalēnanni brahmāṃḍamulanu, vāṭi āvaraṇamulanu, ā kālamē mahēśvaruni ājñacē pāliṃcucunnavi. manaku kanabaḍucunna yēkoddi prapaṃcamukaladō dāninaṃtaṭini mahēśvaruḍu tana ājñā balamucēta adhiṣṭiṃciyunnāḍu - prapaṃcamaṃtayu, dānilōnuṃḍu prativastuvu paramēśvaruni śaktivalananē - cicchakti valananē - panicēyucunnadi ani spaṣṭamagucunnadi. aṃducēta paramēśvaruḍu - paramātma, parabrahma ī prapaṃcamaṃtaṭikī - sṛṣṭi aṃtaṭikī prabhuvu).

(tvavadhīnamidaṃ sarvaṃ jagaddhi nasūsaraṃ |

atastadvihitāmājñāṃ kṣamatē kē (a)tivartituṃ ||). (vāyuvīya saṃhitāyāṃ)

(surāsuralatōniṃḍina jagattaṃtayu nī (paramēśvaruni) adhīnamulōnunnadi. aṃducēta nī ājña natikramiṃcuṭaku - dāṭuṭaku - evaḍu samarthuḍu ? - evaḍunūkāḍu. aṃducēta paramātmayē anniṃṭiki prabhuvu).

  1. “sarvātmā sarva kartāca pravartaka nivartakaḥ |

sthira dhanvā kṣayadvarō rudrō viśvādhikaḥ prabhuḥ |

śāstā (a)śēṣasya jagatō, satvaṃ, na caturmukhaḥ ||“. (brahmāṃḍapurāṇē)

(anniṃṭiki ātma ayinavāḍu, anni panulu cēyuvāḍu, pravartiṃpacēyuvāḍu, nivartiṃpacēyuvāḍu - pravṛttimārgamulōnu, nivṛttimārgamulōnu peṭṭuvāḍu - jagattu aṃtaṭini śāsiṃcuvāḍu - paramēśvaruḍē - aṃducēta paramēśvaruḍē prabhuvu - nīvu kādu, (viṣṇuvukādu) - caturmukhabrahma kādu).

(paramātma parabrahma ayinavāḍē prabhuvu - trimūrtulalō evarainanu sariyē - paramātma, parabrahma ayinavāḍu - triguṇamulu kalisina prakṛtilō cēragānē mūrtulu - rūpamulu - vaccinavi).

  1. “va. vādi vākya bhēdaṃbula (yōgīśvarulu) goṃdaṟu mōhitulai bhēdaṃbunācchādiṃci tamaku nātma sukhaduḥkhaṃbula niccu prabhuvani ceppuduru. koṃdaṟu (daivajñulu) grahadēvatādulaku prabhutvaṃbu saṃpādiṃturu. koṃdaṟu (mīmānsakulu) garmaṃbunakuṃ brabhāvaṃbuṃ brakaṭiṃturu - koṃdaṟu (lōkāyatikulu) svabhāvaṃbu prabhuvani palukuduru - iṃdevvarikini sukha pradānaṃbu sēya (ātyaṃtikasukharūpamagu mōkṣamuniccuṭaku) brabhutvaṃbulēdu - parulavalana duḥkhaṃbu vaccina dharmaparuladharmaṃbu cēsirani vicāriṃpa valadu. tarkiṃpanu, nirdēśiṃpanu rāni paramēśvarunivalana sarvaṃbunagucuṃḍu” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 16 - 424)

  1. “sī. yōgīśarūpuḍai yōgaṃbu jūpucu, mēnirūpamuna garmaṃbu dālcu

sargaṃbu sēyu prajāpatirūpuḍai iṃdruḍai daityulanēpaḍaṃcu

jñānaṃbu neṟigiṃcu jaturasiddhākṛti gālarūpamuna bākaṃbu sēyu

nānāvidhākāra nāmarūpaṃbula garmalōcanulaku gānabaḍaḍu

ā. canina rūpamulanu janurūpamula, niṃka

janaganunna rūpacayamu nataḍu

vividhuḍai yanēka vṛttula veligiṃcu

viṣṇuḍavyayuṃḍu vimalacarita”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 14 - 433 to 435)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.