← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాదేశిక మాత్రః prādēśika mātraḥ

Original — తెలుగు
  1. తర్జస్యంగుష్ట యోః విస్తారః ప్రాదేశః

(ప్రాదేశమనగా బొటనవ్రేలు, చూపుడు వ్రేలు చాపగా వాటి మధ్యనుండు పరిమాణము - మేర, లొడితెడు మేర. అంత ప్రదేశములో నుండువాడు. ప్రాదేశమాత్రుడు).

  1. ప్రాదేశ విశేషేషు హృదాయాదిస్థానే షూప లబ్ది స్థానేషు విశేషేణాభివ్యజ్యతే. ప్రాదేశమాత్ర ప్రతిష్టితేన వా(అ)యం మనసాను స్మర్యతే. తేన ప్రాదేశమాత్ర ఇత్యుచ్యతే.

(హృదయము మొదలగు అతి చిన్న ప్రదేశములందు ముఖ్యముగా నుండువాడు. ప్రాదేశమందు ప్రతిష్టకలవాడు అనగా మనసుచేత స్మరింపబడు చున్నాడు - అందుచేత ప్రాదేశమాత్రుడని చెప్పబడుచున్నాడు).

  1. ప్రదేశేషు వా మీయతే అభివ్యజ్యతే ఇతి ప్రాదేశమాత్రః అతిమాత్రోపి పరమేశ్వరః ఉపాసకానాం కృతే అనుగ్రహాయ ప్రాదేశమాత్రో అభివ్యజ్యతే ప్రదేశ విశేషేషు హృదయాదిషు ఉపలబ్ధి స్థానేషు విశేషేణ అభివ్యజ్యతే.

(కొన్ని ప్రదేశములందుండువాడు కనుక ప్రాదేశమాత్రుడు - భగవంతుడు అపరిచ్చిన్నుడు. కొన్ని ప్రదేశములలోనే ఉండును అను నియమము లేక అన్నింటిలోను అన్ని ప్రదేశములందును ఉండువాడు. ఉపాసకులను అనుగ్రహించుటకు ప్రాదేశ మాత్రుడై యుండును - అనగా కొన్ని ప్రదేశములందుండును. అట్టి ప్రదేశము హృదయము మొదలగునవి. హృదయము ప్రాదేశమాత్రము. మనస్సు కూడ ప్రాదేశమాత్రము. అటువంటి వాటిలో భగవంతు డున్నాడని ఉపాసించెదరు కనుక అతను ప్రాదేశమాత్రుడు - ఇట్లు ప్రాదేశము లందుండుటవలన భగవంతుని పూర్ణత్వమునకు - అంతటను నిండియుండుననుటకు - హాని లేదు.

(“అవిచ్ఛిన్నస్యాపి పరమాత్మనః ప్రాదేశమాత్రత్వముపపద్యతే. ఉపాసకానా మనుగ్రహాయ పరమేశ్వరో హృదయాదిస్థానేషు ప్రాదేశ పరిమాణో అభివ్యజ్యతే”) (శ్రీశంకరః)

(భగవంతుడు పూర్ణుడయ్యును - అంతటను నిండియుండువాడైనను, చిన్న చిన్న ప్రదేశములఓ ఉండుననుట దోషముకాదు. ఉపాసకుల ననుగ్రహించుటకు పరమేశ్వరుడు హృదయము మొదలగు స్థానములందు ప్రాదేశ పరిమాణము గలవాడై - చిన్నవాడై యుండును)

  1. ప్రాదేశేన మనసామితః ప్రాదేశమాత్రః ఇత్యర్థః. ప్రాదేశమాత్ర హృదయ పుండరీకస్థేన మనసా అనుస్మృతేర్థ్యానాత్ ప్రాదేశమాత్రః ఇత్యుపచర్యతే.

(భగవంతుడు ప్రాదేశమగు మనస్సునకు మితమై యున్నాడు కనుక ప్రాదేశమాత్రుడు. ప్రాదేశమాత్రమగు హృదయపద్మమందు మనసునందు ధ్యానింప బడుచుండువాడు కనుక ప్రాదేశమాత్రుడని చెప్పబడు చున్నాడు).

  1. ప్రాదేశైః ద్యుమూర్థాదిభిః పృధివీపాదాం తైః అధ్యాత్మం మీయతే ఇతి ప్రాదేశమాత్రః ముఖాదిషు వా కరణేషు ప్రదేశేషు అత్యత్వేన మీయతే ఇతి ప్రాదేశమాత్రః. ద్యులోకాది పృధివ్యంత ప్రదేశ పరిమాణ మాత్రో వా ప్రాదేశమాత్రః. ప్రకర్షేణ శాస్త్రేణ ఆదిశ్యంత దేశా ఇతి ప్రాదేశాః ద్యులోకాదయః ఏవ తావత్పరిమాణో వా ప్రాదేశ మాత్రః - మూర్థాది చుబుకాంత ప్రతిష్టితః.

(ఆకాశము మొదలు పృధివి వరకు, శిరస్సు మొదలు పాదములవరకు గల ప్రదేశములు ప్రాదేశములు,వాటిలోనుండువాడు ప్రాదేసమాత్రుడు. ముఖము మొదలగు ఇంద్రియములను ప్రదేశములందు ప్రకాశించి యుండువాడు - కనుక ప్రాదేశమాత్రుడు - ద్యులోకము మొదలు భూలోకమువరకు గల ప్రదేశము పరిమాణముగా గలవాడు కనుక ప్రాదేశమత్రుడు). శాస్త్రముచే బాగా ఆదేశించబడుచున్నది - ద్యులోకము మొదలగునవి, వాటి మాత్రపు పరిమాణము గలవాడు ప్రాదేశమాత్రుడు. శిరస్సు మొదలు గెడ్డము వరకు గల ప్రదేశముల లో నుండువాడు ప్రాదేశమాత్రుడు).

  1. “య ఏషో అనంతో అవ్యక్తః ఆత్మా సో అవిముక్తే ప్రతిష్టితః ఇతి పరణాయాం నాశ్యాంచమధ్యే ప్రతిష్టితః”

(అంతము లేక అంటటను ఉండునటువంటివాడున్నూ, కంటికి కనబడనివాడున్నూ అయిన ఈ ఆత్మ అవిముక్తమందు ప్రతిష్టింపబడియున్నది. వరణకు నాశికకు మధ్య ప్రతిష్టించియున్నది. అవిముక్తము వరణకును నాసికకును మధ్యనున్నది. వరుణ అనగా కనుబొమలు, నాసి యనగా నాసిక. ఈ రెండింటికిని మధ్యనున్న ప్రదేశము వారణాసి. సర్వ పాపములను నివారించునది కనుక వరుణ. ఇంద్రియములవలన కలుగు సర్వ దోషములను నాశము చేయునది కనుక నాశియనియు చెప్ప బడినది. “కతమశ్చాస్య స్థానం భవతీతి ?”; “భృవోర్ఘ్రాణస్య చ యస్సంధిః స ఏష ద్యులోకస్య పరస్య చ సంధిర్భవ తీతి”.

(ఆ అవిముక్తము ఎక్కడ నున్నది యనగా కనుబొమలకునూ, ముక్కునకు సంధిలోనున్నది. అదియే ద్యులోకమునకు, దానిమీదనుండు బ్రహ్మలోకమునకును సంధి, అవిముక్తమనగా ముక్తుడు కాని జీవుడు. జీవుని యందు కూడా పరమాత్మ యున్నాడు).

  1. “తన్మాత్రం సర్వ జగచ్ఛరీరతయా జగద్రూపత్వేన జగత్పరిమాణం యావాన్ వా”.

(అంతమాత్రమే అయిన వాడు - ఎందులో ఉండిన అంతమాత్రమే అయినవాడు. జగత్తు అంతయు భగవంతుని శరీరమే యగుటవలన జగద్రూపముగానున్న పరమాత్మ జగత్పరిమాణము కలవాడు - జగత్తంత పరిమాణము గలవాడు - అప్పుడు జగత్తు ప్రాదేశము, అందులోనున్నవాడు ప్రాదేశమాత్రుడు).

Transliteration
  1. tarjasyaṃguṣṭa yōḥ vistāraḥ prādēśaḥ

(prādēśamanagā boṭanavrēlu, cūpuḍu vrēlu cāpagā vāṭi madhyanuṃḍu parimāṇamu - mēra, loḍiteḍu mēra. aṃta pradēśamulō nuṃḍuvāḍu. prādēśamātruḍu).

  1. prādēśa viśēṣēṣu hṛdāyādisthānē ṣūpa labdi sthānēṣu viśēṣēṇābhivyajyatē. prādēśamātra pratiṣṭitēna vā(a)yaṃ manasānu smaryatē. tēna prādēśamātra ityucyatē.

(hṛdayamu modalagu ati cinna pradēśamulaṃdu mukhyamugā nuṃḍuvāḍu. prādēśamaṃdu pratiṣṭakalavāḍu anagā manasucēta smariṃpabaḍu cunnāḍu - aṃducēta prādēśamātruḍani ceppabaḍucunnāḍu).

  1. pradēśēṣu vā mīyatē abhivyajyatē iti prādēśamātraḥ atimātrōpi paramēśvaraḥ upāsakānāṃ kṛtē anugrahāya prādēśamātrō abhivyajyatē pradēśa viśēṣēṣu hṛdayādiṣu upalabdhi sthānēṣu viśēṣēṇa abhivyajyatē.

(konni pradēśamulaṃduṃḍuvāḍu kanuka prādēśamātruḍu - bhagavaṃtuḍu apariccinnuḍu. konni pradēśamulalōnē uṃḍunu anu niyamamu lēka anniṃṭilōnu anni pradēśamulaṃdunu uṃḍuvāḍu. upāsakulanu anugrahiṃcuṭaku prādēśa mātruḍai yuṃḍunu - anagā konni pradēśamulaṃduṃḍunu. aṭṭi pradēśamu hṛdayamu modalagunavi. hṛdayamu prādēśamātramu. manassu kūḍa prādēśamātramu. aṭuvaṃṭi vāṭilō bhagavaṃtu ḍunnāḍani upāsiṃcedaru kanuka atanu prādēśamātruḍu - iṭlu prādēśamu laṃduṃḍuṭavalana bhagavaṃtuni pūrṇatvamunaku - aṃtaṭanu niṃḍiyuṃḍunanuṭaku - hāni lēdu.

(“avicchinnasyāpi paramātmanaḥ prādēśamātratvamupapadyatē. upāsakānā manugrahāya paramēśvarō hṛdayādisthānēṣu prādēśa parimāṇō abhivyajyatē”) (śrīśaṃkaraḥ)

(bhagavaṃtuḍu pūrṇuḍayyunu - aṃtaṭanu niṃḍiyuṃḍuvāḍainanu, cinna cinna pradēśamulaō uṃḍunanuṭa dōṣamukādu. upāsakula nanugrahiṃcuṭaku paramēśvaruḍu hṛdayamu modalagu sthānamulaṃdu prādēśa parimāṇamu galavāḍai - cinnavāḍai yuṃḍunu)

  1. prādēśēna manasāmitaḥ prādēśamātraḥ ityarthaḥ. prādēśamātra hṛdaya puṃḍarīkasthēna manasā anusmṛtērthyānāt prādēśamātraḥ ityupacaryatē.

(bhagavaṃtuḍu prādēśamagu manassunaku mitamai yunnāḍu kanuka prādēśamātruḍu. prādēśamātramagu hṛdayapadmamaṃdu manasunaṃdu dhyāniṃpa baḍucuṃḍuvāḍu kanuka prādēśamātruḍani ceppabaḍu cunnāḍu).

  1. prādēśaiḥ dyumūrthādibhiḥ pṛdhivīpādāṃ taiḥ adhyātmaṃ mīyatē iti prādēśamātraḥ mukhādiṣu vā karaṇēṣu pradēśēṣu atyatvēna mīyatē iti prādēśamātraḥ. dyulōkādi pṛdhivyaṃta pradēśa parimāṇa mātrō vā prādēśamātraḥ. prakarṣēṇa śāstrēṇa ādiśyaṃta dēśā iti prādēśāḥ dyulōkādayaḥ ēva tāvatparimāṇō vā prādēśa mātraḥ - mūrthādi cubukāṃta pratiṣṭitaḥ.

(ākāśamu modalu pṛdhivi varaku, śirassu modalu pādamulavaraku gala pradēśamulu prādēśamulu,vāṭilōnuṃḍuvāḍu prādēsamātruḍu. mukhamu modalagu iṃdriyamulanu pradēśamulaṃdu prakāśiṃci yuṃḍuvāḍu - kanuka prādēśamātruḍu - dyulōkamu modalu bhūlōkamuvaraku gala pradēśamu parimāṇamugā galavāḍu kanuka prādēśamatruḍu). śāstramucē bāgā ādēśiṃcabaḍucunnadi - dyulōkamu modalagunavi, vāṭi mātrapu parimāṇamu galavāḍu prādēśamātruḍu. śirassu modalu geḍḍamu varaku gala pradēśamula lō nuṃḍuvāḍu prādēśamātruḍu).

  1. “ya ēṣō anaṃtō avyaktaḥ ātmā sō avimuktē pratiṣṭitaḥ iti paraṇāyāṃ nāśyāṃcamadhyē pratiṣṭitaḥ”

(aṃtamu lēka aṃṭaṭanu uṃḍunaṭuvaṃṭivāḍunnū, kaṃṭiki kanabaḍanivāḍunnū ayina ī ātma avimuktamaṃdu pratiṣṭiṃpabaḍiyunnadi. varaṇaku nāśikaku madhya pratiṣṭiṃciyunnadi. avimuktamu varaṇakunu nāsikakunu madhyanunnadi. varuṇa anagā kanubomalu, nāsi yanagā nāsika. ī reṃḍiṃṭikini madhyanunna pradēśamu vāraṇāsi. sarva pāpamulanu nivāriṃcunadi kanuka varuṇa. iṃdriyamulavalana kalugu sarva dōṣamulanu nāśamu cēyunadi kanuka nāśiyaniyu ceppa baḍinadi. “katamaścāsya sthānaṃ bhavatīti ?”; “bhṛvōrghrāṇasya ca yassaṃdhiḥ sa ēṣa dyulōkasya parasya ca saṃdhirbhava tīti”.

(ā avimuktamu ekkaḍa nunnadi yanagā kanubomalakunū, mukkunaku saṃdhilōnunnadi. adiyē dyulōkamunaku, dānimīdanuṃḍu brahmalōkamunakunu saṃdhi, avimuktamanagā muktuḍu kāni jīvuḍu. jīvuni yaṃdu kūḍā paramātma yunnāḍu).

  1. “tanmātraṃ sarva jagaccharīratayā jagadrūpatvēna jagatparimāṇaṃ yāvān vā”.

(aṃtamātramē ayina vāḍu - eṃdulō uṃḍina aṃtamātramē ayinavāḍu. jagattu aṃtayu bhagavaṃtuni śarīramē yaguṭavalana jagadrūpamugānunna paramātma jagatparimāṇamu kalavāḍu - jagattaṃta parimāṇamu galavāḍu - appuḍu jagattu prādēśamu, aṃdulōnunnavāḍu prādēśamātruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.