(స్వయముగా ప్రకాశించు రూపము గలవాడు, అన్నింటినీ ప్రకర్షముగా (ప్రఖ్యాతముగా) (ఎక్కునగా) ప్రకాశింపచేయువాడు).
ప్రకృష్టం ద్యుమ్నం ప్రకాశః బలం యస్య సః. (గొప్ప ప్రకాశము కలవాడు).
“ప్రకృష్ట ద్యుమ్నం ద్రవిణం అస్య ఇతి ప్రద్యుమ్నః.చతుర్వూహాత్మావా” (శ్రీశంకరః)
(ఎక్కువ ధనము గలవాడు - వాసుదేవ వ్యూహము, ప్రద్యుమ్న వ్యూహము, అనిరుద్ధవ్యూహము, సంకర్షణవ్యూహము అను నాలుగు వ్యూహములలో నొకటి - (చూడుము చాతుర్వ్యూహము).
(కర్తయగు సంకర్షణుడను పేరుగల జీవుడు ప్రద్యుమ్నుడనుపేరుగల ఇంద్రియమైన మనస్సు కలిగినది. కర్తయగు సంకర్షనునివలన కలిగిన (పుట్టిన) ప్రద్యుమ్నుని వలన అనిరుద్దుడని పేరుగల అహంకారము కలిగినది - అని భాగవతులు - భగవద్భక్తులనుచున్నారు - అనగా ఈ వ్యూహములు ఒకదనిలోనుండి ఒకటి పుట్టినవి - కాని కర్త అయిన జీవునివలన జీవుడు పుట్టుట అసంగతము - పుట్టుటకు అవకాశము లేదు).
“కర్తుః దేవదత్తా దేః సకాశాత్ కారణస్య కుఠారాదేః ఉత్పత్య దర్శనాత్ జీవాత్ కర్తుః కరణం మనో జన్యతే - ఇత్యేతత్ అసంగతమిత్యర్థః -”
(కర్త అయిన దేవదత్తుడు మొదలగువాటివలన కారణమైన కుఠారము మొదలగునవి పుటినవి అని చెప్పుటవలన కర్త అయిన జీవునివలన ఇంద్రియమైన మనస్సు పుట్టినదనుట అసంగతము
(తైజసాహంకాకారమువలన అంతఃకరణమందు సంకల్ప వికల్పములు పుట్టుచున్నవి. ఆ ప్రకారముగానే అంతఃకరణమే మనస్సు. దాని అధిష్టాత - అనగా, మనస్సునకు కారణమైన వైకారికాహంకారమునకు అధిష్టాత ప్రద్యుమ్నుడు).
(svayamugā prakāśiṃcu rūpamu galavāḍu, anniṃṭinī prakarṣamugā (prakhyātamugā) (ekkunagā) prakāśiṃpacēyuvāḍu).
prakṛṣṭaṃ dyumnaṃ prakāśaḥ balaṃ yasya saḥ. (goppa prakāśamu kalavāḍu).
“prakṛṣṭa dyumnaṃ draviṇaṃ asya iti pradyumnaḥ.caturvūhātmāvā” (śrīśaṃkaraḥ)
(ekkuva dhanamu galavāḍu - vāsudēva vyūhamu, pradyumna vyūhamu, aniruddhavyūhamu, saṃkarṣaṇavyūhamu anu nālugu vyūhamulalō nokaṭi - (cūḍumu cāturvyūhamu).
(kartayagu saṃkarṣaṇuḍanu pērugala jīvuḍu pradyumnuḍanupērugala iṃdriyamaina manassu kaliginadi. kartayagu saṃkarṣanunivalana kaligina (puṭṭina) pradyumnuni valana anirudduḍani pērugala ahaṃkāramu kaliginadi - ani bhāgavatulu - bhagavadbhaktulanucunnāru - anagā ī vyūhamulu okadanilōnuṃḍi okaṭi puṭṭinavi - kāni karta ayina jīvunivalana jīvuḍu puṭṭuṭa asaṃgatamu - puṭṭuṭaku avakāśamu lēdu).
“kartuḥ dēvadattā dēḥ sakāśāt kāraṇasya kuṭhārādēḥ utpatya darśanāt jīvāt kartuḥ karaṇaṃ manō janyatē - ityētat asaṃgatamityarthaḥ -”
(karta ayina dēvadattuḍu modalaguvāṭivalana kāraṇamaina kuṭhāramu modalagunavi puṭinavi ani ceppuṭavalana karta ayina jīvunivalana iṃdriyamaina manassu puṭṭinadanuṭa asaṃgatamu
(taijasāhaṃkākāramuvalana aṃtaḥkaraṇamaṃdu saṃkalpa vikalpamulu puṭṭucunnavi. ā prakāramugānē aṃtaḥkaraṇamē manassu. dāni adhiṣṭāta - anagā, manassunaku kāraṇamaina vaikārikāhaṃkāramunaku adhiṣṭāta pradyumnuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.