- ప్రకృతిః కారణం, తత్సంబధినః ప్రాకృతాః, తాదృశాః సర్గాః, జగత్సృష్టేః కారణీ భూతానాం ప్రజాపతీనాం
సర్గాః ప్రాకృత సర్గాః - తది తరేషాం సర్గాః వైకృత సర్గాః.
(ప్రకృతి కారణము - సృష్టికి కారణము - ప్రకృతికి సంబంధించినవి ప్రాకృతములు - అటువంటి
సర్గలు ప్రాకృత సర్గలు - జగత్సృష్టికి కారణమైన ప్రజాపతుల సర్గలు ప్రాకృత సర్గలు).
- “మహతత్వంబు ప్రధమసర్గంబు, ద్రవ్య జ్ఞానక్రియాత్మకంబైన యహంకారతత్వంబు ద్వితీయ సర్గంబు శబ్ద
స్పర్శ రస గంధంబులను పంచ తన్మాత్రద్రవ్య శక్తి యుక్తి యుక్తంబైన పృధివ్యాది భూతసర్గంబు మూడవది
యై యుండు. జ్ఞానేద్రియంబులైన త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణంబులు గర్మేంద్రియంబులైన వాక్పాణి పాద
పాయాపస్థములునను దశేంద్రియ జననంబు చతుర్ధ సర్గంబు, సాత్వికాహంకార జనితంబైన సుమనో గణ సర్గం
బైదవ సర్గంబై యొప్పు, అది మనోమయంబైయుండు. జీవలోకంబునకు నబుద్ధి కృతంబులైన యావరణ విక్షేపంబులం
జేయు తామస సర్గంబు ఆఱవదై యుండు - ఇయ్యారు నీశ్వరునకు లీలార్థంబులైన ప్రాకృత
సర్గంబులయ్యె”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 10 - 344)
Transliteration
- prakṛtiḥ kāraṇaṃ, tatsaṃbadhinaḥ prākṛtāḥ, tādṛśāḥ sargāḥ,
jagatsṛṣṭēḥ kāraṇī bhūtānāṃ prajāpatīnāṃ sargāḥ prākṛta sargāḥ - tadi
tarēṣāṃ sargāḥ vaikṛta sargāḥ.
(prakṛti kāraṇamu - sṛṣṭiki kāraṇamu - prakṛtiki saṃbaṃdhiṃcinavi
prākṛtamulu - aṭuvaṃṭi sargalu prākṛta sargalu - jagatsṛṣṭiki
kāraṇamaina prajāpatula sargalu prākṛta sargalu).
- “mahatatvaṃbu pradhamasargaṃbu, dravya jñānakriyātmakaṃbaina
yahaṃkāratatvaṃbu dvitīya sargaṃbu śabda sparśa rasa gaṃdhaṃbulanu paṃca
tanmātradravya śakti yukti yuktaṃbaina pṛdhivyādi bhūtasargaṃbu mūḍavadi
yai yuṃḍu. jñānēdriyaṃbulaina tvakcakṣuśrōtra jihvāghrāṇaṃbulu
garmēṃdriyaṃbulaina vākpāṇi pāda pāyāpasthamulunanu daśēṃdriya jananaṃbu
caturdha sargaṃbu, sātvikāhaṃkāra janitaṃbaina sumanō gaṇa sargaṃ
baidava sargaṃbai yoppu, adi manōmayaṃbaiyuṃḍu. jīvalōkaṃbunaku nabuddhi
kṛtaṃbulaina yāvaraṇa vikṣēpaṃbulaṃ jēyu tāmasa sargaṃbu āṟavadai yuṃḍu
- iyyāru nīśvarunaku līlārthaṃbulaina prākṛta sargaṃbulayye”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 10 - 344)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.