అంతము, మరణము, శరీరత్యాగము, కల్పాంతము, వినాశము, విలయము.
జగత్సంహారకాలము.
(సృష్టికర్తయగు పరమాత్మ జగత్తును సంహరించుకాలము).
(కార్య వస్తువులు వాటి వాటి కారణవస్తువులలో లీనమగుట).
“శ్లో||. తథా జగత్పతిష్టా దేవర్షే; పృధివ్యప్సు ప్రలీయతే |
తేజస్యాపః ప్రలీయంతే, తేజోవాయే ప్రలీయతే ||
వాయుః ప్రలీయతే వ్యోమ్ని, తదవ్యక్తే ప్రలీయతే ||
అవ్యక్తం పురుషే బ్రహ్మాన్ నిష్కలే సం ప్రలీయతే ||“.
(భూమి నీటిలో లయమగును, నీరు అగ్నిలో లీనమగును, అగ్ని వాయువులో లీనమగును, వాయువు ఆకాశములో లయమగును, ఆకాశము అవ్యక్తములో (ప్రకృతిలో) లీనమగును. అవ్యక్తము. పరపురుషుడగు పరమాత్మయందు లయమగును).
యదా స్వజితి శాంతాత్మా తదా సర్వం ప్రలీయతే ||”
(చతుర్ముఖబ్రహ్మ జాగ్రదవస్థలోనుండగా - అతనికి పగటికాలమందు జగత్తు పుట్ట చేష్ట కలిగియుండును. అతను శాంతరూపుడై - ప్రకృతిలో భగవంతునియొక్క చిచ్ఛక్తిచే క్షోభము కలుగునపుడు - నిద్రించువేళ జగత్తు అతనిలో లయమై యుండును).
రాత్రిం యుగసహస్రాంతం తే (అ)హోరాత్రి విదోజనాః |
అవ్యక్తాద్వ్యక్త యస్సర్వాః ప్రభవంత్యహ రాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే |
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే (అ)వశః పార్థ ప్రభవత్యహరాగమే ||“.
(కాలతత్వమును తెలిసిన మునులు చతుర్ముఖబ్రహ్మకు పగలు సహస్ర యుగములనియు, రాత్రి సహస్రయుగములనియు తెలుసుకొనిరి. పగలు రాగానే - చతుర్ముఖ బ్రహ్మ మేలుకొనగా - అవ్యక్తమని చెప్పబడు ఆ చతుర్ముఖ బ్రహ్మనుండి, నామరూపములులేని స్థితిలోనుండుటవలన అవ్యక్తముగానున్న వస్తువులన్నియు పుట్టుచున్నవి - వ్యక్తమగుచున్నవి. చతుర్ముఖబ్రహ్మకు రాత్రి అవగానే యీ వ్యక్తమైన వస్తువులన్నియు అతనిలోనే లయమగుచు, మరల పగటివేళ ఆ అవ్యక్తమునుండియే పుట్టుచున్నవి. వాటికి స్వతంత్రములేకపోవుటచే ఈ ప్రకారముగా జరుగుచు వచ్చుచుండును - ఈ ప్రకారముగా సృష్టి ప్రళయములు - ఒకదానితరువాత నొకటి - జరుగుచునే యుండును).
“క. సరోజగర్భుడు దివసాం
తమున దమః విహిత పరా
క్రముడై శయనించి నిద్రగైకొనియుండన్
“సీ. ఆ రాత్రి భువన త్రయము దమః విహితమై భాను చంద్రులలో విలీనమైన
సర్వాత్ముడగు హరి శక్తి రూపంబయి కడగి వెలుగు సంకర్షణాగ్ని
భువన త్రయంబును దవిలి దహింప, నయ్యనలకీలల బొడమినమహోష్మ
మలమిన గమలి మహర్లోకవాసులు జనలోకమునకును జనుదురపుడు
విలయ సమయ సముత్కట విపుల చండవాత దూతోర్మి జాల దుర్వార వార్థి
భునములు ముంచు నమ్మూడు భువనములను
తద్పయోరాశి మీద బద్మవిభుండు –”
“ఉ. చారు - - - భుజంగమ తల్పమునందు యోగని
ద్రారుతి చెందియుండు జఠరస్థిత భూర్భువరాదిలోకుడై“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 11 -)
(“ఈశ్వరుడు పంచీకృతమైన భూతములను - ఒకదానితోనొకటి కలిసియున్నవాటిని - అపంచీకృతముగా(వేటికవి వేఱు వేఱుగా) నుండునట్లు చేయుటకు నిశ్చయించుకొనెను. బ్రహ్మాండమును దానిలో కార్యరూపములోనున్న లోకములను కారణరూపములుగా పొందింపచేసి, సూక్ష్మరూపములోనున్న కర్మేంద్రియములను, పంచప్రాణములను, పంచ జ్ఞానేంద్రియములను, అంతఃకరణ చతుష్టయమును (చిత్తమనోబద్ధ్యహంకారములను నాలుగువిధములైన వాటిని) ఒకటిగా కలిపి, భూతములవలన పుట్టిన సమస్త వస్తువులను సూక్ష్మ భూతములందు కలిపి, భూమిని జలమందు, జలమును అగ్నియందు, అగ్నిని వాయువునందు, వాయువునాకాశమునందు, ఆకాశమునహంకారమునందు, అహంకారమును మహత్తత్త్వమునందు, మహత్తత్త్వమును అవ్యక్తమునందు, అవ్యక్తమును పురుషుడను పరమాత్మయందు క్రమముగా లయమును పొందించెను - సమష్టి స్వరూపుడైన విరాట్ హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు, వారి వారి ఉపాధులు లయమగుటవలన, పర మాత్మయందు లయమగుదురు - పంచీకృతమైన మహాభూతములవలన కలిగిన కర్మతో కూడిన స్థూలదేహము కర్మ పరిపాకము వలన - కర్మ ఫలముననుభవింప చేయుటకు సిద్ధముగా నుండుటవలన పుణ్యకర్మ పరిపాకమువలన పంచీకరణమునుండి విడువడి సూక్ష్మరూపములో ఏకమై, కారణరూపమునుపొంది, ఆ కారణరూపములో కూటస్థుడైన ప్రత్య్తగాత్మ యందు లయమగుచున్నారు - వ్యష్టిరూపుడైన విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, వారి వారి ఉపాధులు లయమైనందున ప్రత్యగాత్మలో లీనమగుదురు - అప్పుడు ప్రహ్మాండము జ్ఞానాగ్నిలో దగ్ధమై దానిలోని కారణరూపములతోకూడ పరమాత్మలో లీనమగును.”)
“వ. - - - అంత్యకాలంబాసన్నంబైన ద్రవ్యగుణ స్వరూపంబగు జగంబు ననాది నిధనంబగు కాలంబు ప్రకృతిం బొందించు, నటమీద శతవర్షంబులు. వర్షంబులు లేమిచేత నత్యుగ్ర లోక లోచను తేజంబున సకల లోకంబులు దహింపబడు, నంత నధోలోకంబుననుండి సంకర్షణ ముఖ జనితా నలంబూర్థ్వశిఖా జాలంబుల వాయుసహాయంబై దిక్కులయందెల్ల బ్రవర్తించు, నటమీద సంవర్తక వలాహకగణంబులు నూరు హాయనంబులు సలిల ధారా పాతంబుగా వర్షంబు గుఱియు, నందు విరాడ్రూపంబు లీనంబగు, నంత నీశ్వరుండింధనాగ్ని చందంబున నవ్యక్తంబు ప్రవేశించు. తదనంతరంబ ధరణీమండలంబు వాయు హృతగంధంబై కబంధరూపంబు దాల్చు, నా జలంబు హృతరసంబై తేజోరూపంబునొందు, నా తేజంబు తమోనిరస్తంబై వాయువందడంగు, నా గంధవహుండు స్పర్సరహితుండై యాకాశంబు నందు సంక్రమించు, నావిష్ణుపదంబును విగతశబ్దగుణంబుగలదై యాత్మయందడంగు, నింద్రియంబులును, మనంబును, బుద్ధియు వికారంబులతోడ నహంకారంబు ప్రవేశించు, నాయహంకారంబును స్వగుణ యుక్తంబై పరమాత్మనింజేరు - - -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 52)
కార్యవస్తువులు వాటి కారణవస్తువులందు లీనమై వాటితో ఏకరూపమగుట - సముద్రజలములవలన కలిగిన నదులు మరల సముద్రములో కలిసి సముద్రమే యగునట్లు.
సృష్టిలోని వస్తువులన్నియు భగవంతునిలో లీనమగుట.
“ఆ. విలయకాలమందు విశ్వంబు నీ పెద్ద
కడుపులోన దాచు కడిమి మేటి
నటుడవు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 129)
(మనస్సు ఉత్కృష్టమైనస్థితిలో భగవంతునియందు లయమగుట).
అవిద్య సమూలముగా నశించుటచే దానివలన కలిగిన అధ్యాస నశించి, తన్మూలక జగద్రూపము నివర్తింపగా బ్రహ్మకు స్వస్వరూపాపత్తి కలుగుట.
“సృష్టిప్రలయ సద్భావే కిం ప్రమాణం? -” ధాతా యథా పూర్వమకల్పయత్ “ఇతి శ్రుతిరేవ ప్రమాణం సర్వకార్యద్రవ్య ధ్వంసో (అ)వాంతరప్రలయం, సర్వ భావకార్య ధ్వంసో మహాప్రలయః ఇతి వివేకః” (తర్కసంగ్రహ దీపిక)
(సృష్టి ప్రలయములు జరుగుచున్నవనుటకు ఏమిటి ప్రమాణము? ధాత – చతుర్ముఖ బ్రహ్మ - ఇదివరకువలెనే కల్పించెను - సృష్టిచేసెను - ఇదివరకు చేసిన సృష్టి లయమైపోగా తిరిగి అప్పటివలనే సృష్టిచేసెను - అని శ్రుతి చెప్పుచున్నది. అదియే ప్రమాణము - శ్రుతిలో చెప్పినదానికి శ్రుతియే ప్రమాణము. సమస్తమైన కార్యవస్తువులు నశించిపోవుట అవాంతర ప్రలయము - సర్వభావకార్యవస్తువులు ద్వంసమగుట మహాప్రలయము).
(ఈ సృష్టికి ప్రలయము కాలము మొదలగువాటిచే మూడు విధములుగా నగుచున్నది. కేవలము కాలముచేత కలుగుచున్నది నిత్య ప్రళయము - వాటి వాటి కాలము తీరగనే వస్తువులు నశించుట నిత్యము జరుగుచునే యున్నది - వెళ్ళిపోయిన కాలము - క్షణమైనను తిరిగిరాదు - ఏ వస్తువున కైనను ఒక కాలములో జరిగిన స్థితి మరొక కాలములో రాదు - మార్పు చెందును - పగలు వస్తుంది, వెళ్ళిపోతుంది, రాత్రి వచ్చింది, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన రాత్రిగాని, పగలుగాని మరల అనుభవించుదమన్న రాదు - ఇది నిత్య ప్రళయము. సంకర్షణాగ్నియను నిమిత్తమువలన కలిగిన ప్రళయము నైమిత్తిక ప్రళయము - ఒక నిమిత్తముగా - ఒక కారణముగా కలిగిన ప్రళయము - కారణ వస్తువులు కార్యవస్తువులను తమలోనికి గ్రసించుట ప్రాకృతిక ప్రళయము - కారణవస్తువులోనుండి పుట్టిన కార్యవస్తువు కారణములోనే లయమగును - కారణ కార్యములు ప్రకృతియొక్క పరిణామములే. అందుచేత అవి లయించుట ప్రకృతి మార్పుచెంది లయించుటయే - అందుచేత అది ప్రాకృతిక ప్రళయము.
(ప్రళయము మూడు విధములు - నిత్యప్రళయము, మహా ప్రళయం, ఆత్యంతికప్రళయము - అని కొందఱిమతము).
(ప్రలయమనగా మూడు లోకములు - పదునాలుగు భువనములు - నశించుట. అది నాలుగు విధములు - నిత్యప్రళయము, ప్రాకృతప్రళయము, నైమిత్తికప్రళయము, ఆత్యంతికప్రళయము).
“నిత్యనైమిత్తిక ప్రాకౄతికాత్యంతికంబులని ప్రళయములు చతుర్విధంబులై పరగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 24 -)
(ప్రాకృత ప్రళయము, నైమిత్తిక ప్రలయము, ఆత్యంతికప్రలయము, నిత్యప్రలయము అని ప్రళయము నాలుగు విధములు - ప్రకృతి కార్యమైన బ్రహ్మాండము ప్రకృతిలో లయమగుట ప్రాకృతప్రలయము - చతుర్ముఖ బ్రహ్మ నిద్రించుట యను కారణముగా - నిమిత్తముగా - కలుగు ప్రళయము నైమిత్తిక ప్రళయము - అవిద్యను దాని కార్యమును ఛేదించి - పోగొట్టుకొని, నశింపచేసుకొని - స్వస్వరూపముతోనుండుట - అనగా, అవిద్యవలన కలుగు అజ్ఞానమును బ్రహ్మజ్ఞానము పొందుటచేత పోగొట్టుకొని, తాను పరమాత్మ స్వరూపమే అని తెలుసుకొనుట - ఆత్యంతికప్రళయము, - తనకు మరల జన్మలేనట్లు చేసుకొనుట ఆత్యంతిక ప్రళయము. దేహములో భగవంతుని సత్తాస్ఫూర్తి యుండుటవలన క్షణక్షణమునకు మార్పు కలుగుచుండుటవలన ఒక్క క్షణమున నుండిన దేహస్థితి మరుచటి క్షణమున లేకుండుట ఆ మొదటిస్థితియొక్క లయము. ఇది నిత్యము ప్రతివస్తువు లోను జరుగుచున్న లయము - ఈ ప్రకారముగా ప్రతివస్తువులోను క్షణక్షణమునకు మార్పు కలుగుచుండుటవలననే ఈ వస్తువులన్నియు కలిసినదానిని జగత్తు అని చెప్పుదురు).
aṃtamu, maraṇamu, śarīratyāgamu, kalpāṃtamu, vināśamu, vilayamu.
jagatsaṃhārakālamu.
(sṛṣṭikartayagu paramātma jagattunu saṃhariṃcukālamu).
(kārya vastuvulu vāṭi vāṭi kāraṇavastuvulalō līnamaguṭa).
“ślō||. tathā jagatpatiṣṭā dēvarṣē; pṛdhivyapsu pralīyatē |
tējasyāpaḥ pralīyaṃtē, tējōvāyē pralīyatē ||
vāyuḥ pralīyatē vyōmni, tadavyaktē pralīyatē ||
avyaktaṃ puruṣē brahmān niṣkalē saṃ pralīyatē ||“.
(bhūmi nīṭilō layamagunu, nīru agnilō līnamagunu, agni vāyuvulō līnamagunu, vāyuvu ākāśamulō layamagunu, ākāśamu avyaktamulō (prakṛtilō) līnamagunu. avyaktamu. parapuruṣuḍagu paramātmayaṃdu layamagunu).
yadā svajiti śāṃtātmā tadā sarvaṃ pralīyatē ||”
(caturmukhabrahma jāgradavasthalōnuṃḍagā - ataniki pagaṭikālamaṃdu jagattu puṭṭa cēṣṭa kaligiyuṃḍunu. atanu śāṃtarūpuḍai - prakṛtilō bhagavaṃtuniyokka cicchakticē kṣōbhamu kalugunapuḍu - nidriṃcuvēḷa jagattu atanilō layamai yuṃḍunu).
rātriṃ yugasahasrāṃtaṃ tē (a)hōrātri vidōjanāḥ |
avyaktādvyakta yassarvāḥ prabhavaṃtyaha rāgamē |
rātryāgamē pralīyaṃtē tatraivāvyakta saṃjñikē |
bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē |
rātryāgamē (a)vaśaḥ pārtha prabhavatyaharāgamē ||“.
(kālatatvamunu telisina munulu caturmukhabrahmaku pagalu sahasra yugamulaniyu, rātri sahasrayugamulaniyu telusukoniri. pagalu rāgānē - caturmukha brahma mēlukonagā - avyaktamani ceppabaḍu ā caturmukha brahmanuṃḍi, nāmarūpamululēni sthitilōnuṃḍuṭavalana avyaktamugānunna vastuvulanniyu puṭṭucunnavi - vyaktamagucunnavi. caturmukhabrahmaku rātri avagānē yī vyaktamaina vastuvulanniyu atanilōnē layamagucu, marala pagaṭivēḷa ā avyaktamunuṃḍiyē puṭṭucunnavi. vāṭiki svataṃtramulēkapōvuṭacē ī prakāramugā jarugucu vaccucuṃḍunu - ī prakāramugā sṛṣṭi praḷayamulu - okadānitaruvāta nokaṭi - jarugucunē yuṃḍunu).
“ka. sarōjagarbhuḍu divasāṃ
tamuna damaḥ vihita parā
kramuḍai śayaniṃci nidragaikoniyuṃḍan
“sī. ā rātri bhuvana trayamu damaḥ vihitamai bhānu caṃdrulalō vilīnamaina
sarvātmuḍagu hari śakti rūpaṃbayi kaḍagi velugu saṃkarṣaṇāgni
bhuvana trayaṃbunu davili dahiṃpa, nayyanalakīlala boḍaminamahōṣma
malamina gamali maharlōkavāsulu janalōkamunakunu janudurapuḍu
vilaya samaya samutkaṭa vipula caṃḍavāta dūtōrmi jāla durvāra vārthi
bhunamulu muṃcu nammūḍu bhuvanamulanu
tadpayōrāśi mīda badmavibhuṃḍu –”
“u. cāru - - - bhujaṃgama talpamunaṃdu yōgani
drāruti ceṃdiyuṃḍu jaṭharasthita bhūrbhuvarādilōkuḍai”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 11 -)
(“īśvaruḍu paṃcīkṛtamaina bhūtamulanu - okadānitōnokaṭi kalisiyunnavāṭini - apaṃcīkṛtamugā(vēṭikavi vēṟu vēṟugā) nuṃḍunaṭlu cēyuṭaku niścayiṃcukonenu. brahmāṃḍamunu dānilō kāryarūpamulōnunna lōkamulanu kāraṇarūpamulugā poṃdiṃpacēsi, sūkṣmarūpamulōnunna karmēṃdriyamulanu, paṃcaprāṇamulanu, paṃca jñānēṃdriyamulanu, aṃtaḥkaraṇa catuṣṭayamunu (cittamanōbaddhyahaṃkāramulanu nāluguvidhamulaina vāṭini) okaṭigā kalipi, bhūtamulavalana puṭṭina samasta vastuvulanu sūkṣma bhūtamulaṃdu kalipi, bhūmini jalamaṃdu, jalamunu agniyaṃdu, agnini vāyuvunaṃdu, vāyuvunākāśamunaṃdu, ākāśamunahaṃkāramunaṃdu, ahaṃkāramunu mahattattvamunaṃdu, mahattattvamunu avyaktamunaṃdu, avyaktamunu puruṣuḍanu paramātmayaṃdu kramamugā layamunu poṃdiṃcenu - samaṣṭi svarūpuḍaina virāṭ hiraṇyagarbhuḍu, īśvaruḍu, vāri vāri upādhulu layamaguṭavalana, para mātmayaṃdu layamaguduru - paṃcīkṛtamaina mahābhūtamulavalana kaligina karmatō kūḍina sthūladēhamu karma paripākamu valana - karma phalamunanubhaviṃpa cēyuṭaku siddhamugā nuṃḍuṭavalana puṇyakarma paripākamuvalana paṃcīkaraṇamunuṃḍi viḍuvaḍi sūkṣmarūpamulō ēkamai, kāraṇarūpamunupoṃdi, ā kāraṇarūpamulō kūṭasthuḍaina pratytagātma yaṃdu layamagucunnāru - vyaṣṭirūpuḍaina viśvuḍu, taijasuḍu, prājñuḍu, vāri vāri upādhulu layamainaṃduna pratyagātmalō līnamaguduru - appuḍu prahmāṃḍamu jñānāgnilō dagdhamai dānilōni kāraṇarūpamulatōkūḍa paramātmalō līnamagunu.”)
“va. - - - aṃtyakālaṃbāsannaṃbaina dravyaguṇa svarūpaṃbagu jagaṃbu nanādi nidhanaṃbagu kālaṃbu prakṛtiṃ boṃdiṃcu, naṭamīda śatavarṣaṃbulu. varṣaṃbulu lēmicēta natyugra lōka lōcanu tējaṃbuna sakala lōkaṃbulu dahiṃpabaḍu, naṃta nadhōlōkaṃbunanuṃḍi saṃkarṣaṇa mukha janitā nalaṃbūrthvaśikhā jālaṃbula vāyusahāyaṃbai dikkulayaṃdella bravartiṃcu, naṭamīda saṃvartaka valāhakagaṇaṃbulu nūru hāyanaṃbulu salila dhārā pātaṃbugā varṣaṃbu guṟiyu, naṃdu virāḍrūpaṃbu līnaṃbagu, naṃta nīśvaruṃḍiṃdhanāgni caṃdaṃbuna navyaktaṃbu pravēśiṃcu. tadanaṃtaraṃba dharaṇīmaṃḍalaṃbu vāyu hṛtagaṃdhaṃbai kabaṃdharūpaṃbu dālcu, nā jalaṃbu hṛtarasaṃbai tējōrūpaṃbunoṃdu, nā tējaṃbu tamōnirastaṃbai vāyuvaṃdaḍaṃgu, nā gaṃdhavahuṃḍu sparsarahituṃḍai yākāśaṃbu naṃdu saṃkramiṃcu, nāviṣṇupadaṃbunu vigataśabdaguṇaṃbugaladai yātmayaṃdaḍaṃgu, niṃdriyaṃbulunu, manaṃbunu, buddhiyu vikāraṃbulatōḍa nahaṃkāraṃbu pravēśiṃcu, nāyahaṃkāraṃbunu svaguṇa yuktaṃbai paramātmaniṃjēru - - -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 52)
kāryavastuvulu vāṭi kāraṇavastuvulaṃdu līnamai vāṭitō ēkarūpamaguṭa - samudrajalamulavalana kaligina nadulu marala samudramulō kalisi samudramē yagunaṭlu.
sṛṣṭilōni vastuvulanniyu bhagavaṃtunilō līnamaguṭa.
“ā. vilayakālamaṃdu viśvaṃbu nī pedda
kaḍupulōna dācu kaḍimi mēṭi
naṭuḍavu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 129)
(manassu utkṛṣṭamainasthitilō bhagavaṃtuniyaṃdu layamaguṭa).
avidya samūlamugā naśiṃcuṭacē dānivalana kaligina adhyāsa naśiṃci, tanmūlaka jagadrūpamu nivartiṃpagā brahmaku svasvarūpāpatti kaluguṭa.
“sṛṣṭipralaya sadbhāvē kiṃ pramāṇaṃ? -” dhātā yathā pūrvamakalpayat “iti śrutirēva pramāṇaṃ sarvakāryadravya dhvaṃsō (a)vāṃtarapralayaṃ, sarva bhāvakārya dhvaṃsō mahāpralayaḥ iti vivēkaḥ” (tarkasaṃgraha dīpika)
(sṛṣṭi pralayamulu jarugucunnavanuṭaku ēmiṭi pramāṇamu? dhāta – caturmukha brahma - idivarakuvalenē kalpiṃcenu - sṛṣṭicēsenu - idivaraku cēsina sṛṣṭi layamaipōgā tirigi appaṭivalanē sṛṣṭicēsenu - ani śruti ceppucunnadi. adiyē pramāṇamu - śrutilō ceppinadāniki śrutiyē pramāṇamu. samastamaina kāryavastuvulu naśiṃcipōvuṭa avāṃtara pralayamu - sarvabhāvakāryavastuvulu dvaṃsamaguṭa mahāpralayamu).
(ī sṛṣṭiki pralayamu kālamu modalaguvāṭicē mūḍu vidhamulugā nagucunnadi. kēvalamu kālamucēta kalugucunnadi nitya praḷayamu - vāṭi vāṭi kālamu tīraganē vastuvulu naśiṃcuṭa nityamu jarugucunē yunnadi - veḷḷipōyina kālamu - kṣaṇamainanu tirigirādu - ē vastuvuna kainanu oka kālamulō jarigina sthiti maroka kālamulō rādu - mārpu ceṃdunu - pagalu vastuṃdi, veḷḷipōtuṃdi, rātri vacciṃdi, veḷḷipōtuṃdi, veḷḷipōyina rātrigāni, pagalugāni marala anubhaviṃcudamanna rādu - idi nitya praḷayamu. saṃkarṣaṇāgniyanu nimittamuvalana kaligina praḷayamu naimittika praḷayamu - oka nimittamugā - oka kāraṇamugā kaligina praḷayamu - kāraṇa vastuvulu kāryavastuvulanu tamalōniki grasiṃcuṭa prākṛtika praḷayamu - kāraṇavastuvulōnuṃḍi puṭṭina kāryavastuvu kāraṇamulōnē layamagunu - kāraṇa kāryamulu prakṛtiyokka pariṇāmamulē. aṃducēta avi layiṃcuṭa prakṛti mārpuceṃdi layiṃcuṭayē - aṃducēta adi prākṛtika praḷayamu.
(praḷayamu mūḍu vidhamulu - nityapraḷayamu, mahā praḷayaṃ, ātyaṃtikapraḷayamu - ani koṃdaṟimatamu).
(pralayamanagā mūḍu lōkamulu - padunālugu bhuvanamulu - naśiṃcuṭa. adi nālugu vidhamulu - nityapraḷayamu, prākṛtapraḷayamu, naimittikapraḷayamu, ātyaṃtikapraḷayamu).
“nityanaimittika prākṝtikātyaṃtikaṃbulani praḷayamulu caturvidhaṃbulai paragu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 24 -)
(prākṛta praḷayamu, naimittika pralayamu, ātyaṃtikapralayamu, nityapralayamu ani praḷayamu nālugu vidhamulu - prakṛti kāryamaina brahmāṃḍamu prakṛtilō layamaguṭa prākṛtapralayamu - caturmukha brahma nidriṃcuṭa yanu kāraṇamugā - nimittamugā - kalugu praḷayamu naimittika praḷayamu - avidyanu dāni kāryamunu chēdiṃci - pōgoṭṭukoni, naśiṃpacēsukoni - svasvarūpamutōnuṃḍuṭa - anagā, avidyavalana kalugu ajñānamunu brahmajñānamu poṃduṭacēta pōgoṭṭukoni, tānu paramātma svarūpamē ani telusukonuṭa - ātyaṃtikapraḷayamu, - tanaku marala janmalēnaṭlu cēsukonuṭa ātyaṃtika praḷayamu. dēhamulō bhagavaṃtuni sattāsphūrti yuṃḍuṭavalana kṣaṇakṣaṇamunaku mārpu kalugucuṃḍuṭavalana okka kṣaṇamuna nuṃḍina dēhasthiti marucaṭi kṣaṇamuna lēkuṃḍuṭa ā modaṭisthitiyokka layamu. idi nityamu prativastuvu lōnu jarugucunna layamu - ī prakāramugā prativastuvulōnu kṣaṇakṣaṇamunaku mārpu kalugucuṃḍuṭavalananē ī vastuvulanniyu kalisinadānini jagattu ani ceppuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.