తెలియని పదార్థమును తెలియచేయునది.
“జ్ఞానసాధనం” (శ్రీశంకరః)
(ఏదేని ఒక వస్తువుగుఱించి తెలుసుకొనుటకు సాధనమైనది, ఉపయోగపడునది).
వస్తువు కలదని నిర్థారణచేయుటకు తగిన ఉపాయము.
ఏ మాటకు ఏది అర్థమును తెలియచేయునో ఆ అర్థమునకామాట ప్రమాణము.
దృష్టాంతరూపః (దృష్టాంతముగా నుండునది).
యస్య వాక్యస్య తాత్పర్యవిష యీభూత సంసర్గోమానాంతరేణ న భాద్యతే తవ్వాక్యం ప్రమాణం.
(ఒక వాక్యముయొక్క అర్థము ఇంకొక ప్రమాణముచేత బాధింపబడకుండునట్లు చెప్పునది ప్రమాణము).
బోధయంతి శ్రుతిః కేన స ప్రామాణ్య మితీర్యతే ||“.
(ఇంకొక ప్రమాణముచేత తెలియబడని ఆత్మను స్పష్టముగా బోధించు శ్రుతిప్రమాణముకాదని ఎవరు చెప్పగలరు ?).
యస్య ప్రమాణం న భవేత్ ప్రమాణం కిం తస్య వాక్యస్య భవేత్ ప్రమాణం ||“.
(వేదములు స్మృతులు, ధర్మముతోకూడిన వచనములు - ఇవి ప్రణాములు. ఇవి యే వాక్యమునకు - ప్రమాణములు కావో అట్టి వాక్యమునకు ప్రమాణమన్నదిలేదు).
“ప్రమాణం పరమం శ్రుతిః”. (వేదమే పరమ ప్రమాణము).
ఉపషద్వాక్యాని శబ్ద ప్రమాణం. (ఉపనిషత్తులలో చెప్పబడినది శబ్ద ప్రమాణము).
“సాంఖ్యయోగః పాంచరాత్రం వేదాః పాశుపతం తథా ఆత్మ ప్రమాణ్యాన్యేతాని న హంతవ్యాని హేతుభిః”.
(సాంఖ్యాయోగము, పాంచరాత్రాగమము, వేదము, పాశుపతము - ఇవి ఆత్మతత్వమును తెలియచేయుటలో ప్రమాణములు - ఇవి హేతువాదముచేత తిరస్కరింపబడనేరవు).
తన్మూలత్వే ప్రమాణం స్యాన్నాన్యధాతు కదాచన ||“.
(శ్రుతియే ప్రమాణము - పురాణముగాని, తంత్రముగాని, ఇతర శాస్త్రములుగాని శ్రుతిమూలములగుటచేత ప్రమాణములగుచున్నవి. మఱియొక విధముగా ఇవి ప్రమాణములుకావు).
ప్రత్యక్షశ్రుతి విరుద్ధయత్ ప్రమాణం నభనేన్నిచ |
సర్వదా వేద ఏవాసౌ ధర్మమార్గ ప్రమాణకః |
తేనా విరుద్ధం యత్కించిత్ తత్ప్రమాణం నచాన్యధా |
వేదా విరోధియోం శస్తు సైవ గ్రాహ్యో ద్విజోత్తమైః ||.
(వేదముతో విరోధములేని తంత్రము ప్రమాణము. ఇందుకు సందేహములేదు. ప్రత్యక్షముగా వేదముతో విరోధించునది ప్రమాణము కాదు - ఎల్లపుడు వేదమే ధర్మమార్గమందు ప్రమాణము - వేదముతో విరోధములేని దే కొంచెమైనను అది ప్రమాణము. అట్లు కానిది ప్రమాణము కాదు - పండితోత్తములు వేదముతో విరోధము లేని యంశమునే ప్రమాణముగా గ్రహించుదురు).
(ప్రత్యక్షములు, ఆగమములు మొదలగునవి ప్రమాణములు. ప్రత్యక్షములనగా కండ్లు మొదలగు ఇంద్రియములు, ఆగమములనగా తర్కము, మీమాంస మొదలగునవి).
(వేదము - సంశయించతగినది కాక - అవగాహనము చేసుకొనునట్లు బోధచేయునది).
(ప్రత్యక్షము, అనుమానము, ఆగమములు - ఇవి ప్రమాణములు. శాస్త్రములు ప్రమాణములు, వాటికన్న వేదములు ప్రబలమైన ప్రమాణములు. వాటిలోని సారాంశమైన ఉపనిషత్తులు ప్రమాణములు - వాటిలోని మహావాక్యములు ప్రమాణములు).
(“ఉపనిషత్తులలో చెప్పబడిన ఆ పురుషుని గుఱించియే చెప్పవలెను” అని చెప్పుటచేత పరమ పురుషుడగు పరబ్రహ్మ గుఱించి చెప్పుటకు ఉపనిషత్తులే ప్రమాణము).
(ప్రమతి, సంవిత్ అనుటవలన పరమాత్మయే స్వయముగా జ్ఞానస్వరూపుడగుటచేత అతనే ప్రమాణము - ప్రజ్ఞానము అనగా అన్ని బుద్ధీంద్రియములను ప్రకాశింపచేయునదిగాన బ్రహ్మమే ప్రమాణము).
“వేదానిసారి శాస్త్రమేవ ప్రమాణం, వేద విరుద్ధం అప్రమాణమేవ. పంచాపి శాస్త్రాణి అప్రమాణాని, వేదమరుద్ధత్వాత్, వేద విరోధిత్వం తేషాం విసృష్టం నిరూపితం. ఉత్తరమీమాంసాతు న కస్మింశ్చిదవ్యంశే వేద విరుద్ధా భవతి. అత ఏవ సా సర్వథా ప్రమాణం”.
(ఉత్తరమీమాంసలో చెప్పబడిన విషయము వేదమునకు విరుద్ధముగాలేదు. ఇతర శాస్త్రములు వేదమునకు విరుద్ధమైన ఉపదేశము చేయునవిగాన అశుద్ధములు, అప్రమాణములు. సాంఖ్య శాస్త్రమును రచించినవాడు కపిలమహర్షి. యోగసూత్రములను రచించినవాడు పతంజలి. న్యాయశాస్త్రమును రచించినవాడు గౌతముడు. వైశేషికశాస్త్రకర్త కణాదుడు. జైమిని పూర్వమీమాంసను రచించెను. ఉత్తరమీమాంసను వ్యాసమహర్షి రచించెను. ఈ గ్రంధముల మహాత్మ్యము ఎల్లరకును సుప్రసిద్ధమే. అందుచేత వీరియొక్క వచనరూపమైన యీ శాస్త్రములన్నియు సమముగానే ప్రమాణ గ్రంధములు - అయినను వీటి అన్నింటికంటెను వేదమే ప్రబలమైన ప్రమాణము - వేదమును సృష్టించినవాడు సాక్షాత్తు పరమేశ్వరుడే - అందుచేత వేదములో భ్రమగాని, సంశయముగాని, మఱి యే విషయమైన దోషములుగాని లేవు. ఇతర శాస్త్రములు రచించినవారు మానవులు. మానవమాత్రులు రచించినవగుటచేత నా గ్రంధములలో భ్రమ మొదలగు దోషములుండును).
(వేదమును అనుసరించి బోధించు శాస్త్రములే ప్రమాణములు. వేదమునకు విరుద్ధముగా బోధించునవి అప్రమాణములు (ప్రమాణములుకావు), పైన చెప్పబడిన శాస్త్రములలో మొదటి అయిదు శాస్త్రములు వేదవిరుద్ధములగుటవలన ప్రమాణములు కావు. ఆరవదియైన ఉత్తరమీమాంసా శాస్త్రము ఏ విషయములోనైనను వేద విరుద్ధముకాదు. అందుచేత ఈ శాస్త్రము అన్ని ప్రకారముల ప్రమాణగ్రంధమే యగుచున్నది).
అజ్ఞానస్య మమాభావాత్ అప్రమాణా న చ శ్రుతిః |
స్మతయశ్చ శ్రుతేరర్థం గృహీత్వైవచ నిర్గతాః |
మన్వా దీనాం స్మృతీనాంచ తతః ప్రామాణ్యమిష్యతే |
క్వచిత్కధా చిత్ తంత్రార్థ కటాక్షేణ పరోదితం |
ధర్మం వదంతి నోంశస్తు నైవ గ్రాహ్యోస్తి వైదికైః |
అన్యేషాం శాస్త్రకర్తృణాం అజ్ఞాన ప్రభవత్వతః |
అజ్ఞానదోష దుష్టత్వాత్ తదుక్తేర్నప్రమాణతా |
తస్మాత్ ముముక్షుర్థర్మార్థం సర్వధా వేదమాశ్రయేత్ || (దేవీ భాగవతం)
“వేదోక్త ఏవ ధర్మః నాన్య శస్త్రో దితః, సర్వ శక్తేః మత్తః మత్స్వరూపాత్ వేదః సముత్థితః |
తదా మమా జ్ఞానభావాత్ యన్మయోక్తం తత్ సత్యమేవ, ఇతి శ్రుతిః న అప్రమాణం |
వేదాతిరిక్త శ్వాస్త్రాణి తు ఆజ్ఞపురుష బుద్ధికల్పితాని తతశ్చ అజ్ఞ ప్రణీతత్వాత్ అప్రామాణ్యాన్యేవ ఇతి. తదుక్తో ధర్మః ధర్మాభాసః వేదోక్తః ఏవ ధర్మః ఇతి శృత్యర్థ ఏవతు స్మృతి భిరుచ్యతే. తతో మూల భూత శ్రుతేః ప్రామాణ్యాత్ తన్మూలక స్మృతీనామపి ప్రామాణ్యం అవ్యాహతమేవ. తంత్రార్థావ లోకనేన పరోదితం వేదాతిరిక్తశాస్తోదితం అపి ధర్మం వదంతి. సధర్మః ప్రత్యక్షశ్రుతి విరుద్ధత్వాత్ తైరుక్తోపి న వైదికైః గ్రాహ్యః - మమసా శ్రుతిః ఆజ్ఞాస్తి –
“మమైవాజ్ఞా పరాశక్తిః వేదసంజ్ఞా పురాతనీ |
ఋగ్యజుస్సామ రూపేణ సర్గాదౌ సం ప్రవర్తతే ||“. (కూర్మపురాణము)
(సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయిన నానుండి వేదములు పుట్టినవి. అందుచేత వేదము అప్రమాణముకాదు - వేదార్థమును గ్రహించుటయే స్మృతులు పుట్టినవి. అందుచేత మనుస్మృతి మొదలగు స్మృతులు ప్రమాణములు - ఇతర శాస్త్రకర్తలు అజ్ఞానులగుటవలన - పరమాత్మవలె సర్వజ్ఞులు కాకపోవుటవలన వైదికులు వాటిని గ్రహించరు - వారు అజ్ఞానులను దోషము కలిగియున్నవారుకనుక వారు చెప్పినది ప్రమాణముకాదు. అందుచేత ముముక్షువులగువారలు -మోక్షముకోరువారు - ధర్మమును గుఱించి వేదమునే ఆశ్రయించవలెను - పాటించ వలెను. అదియే ప్రమాణము).
(వేదములో చెప్పినదే ధర్మము, ఇతర శాస్త్రములలో చెప్పినది కాదు - సర్వశక్తిమంతుడనైన నానుండి - నా శరీరమునుండి - వేదములు పుట్టినవి. అందుచేత నేను అజ్ఞానుడను కాకపోవుటవలన నేను వేదములో చెప్పినదంతయు సత్యమే కనుక శ్రుతి ప్రమాణము, అప్రమాణముకాదు. వేదముకాక ఇతర శాస్త్రములు అజ్ఞానులగు పురుషుల బుద్ధివలన కల్పించబడినవి. అజ్ఞానపురుషులు చేసినవి కనుక ఆ గ్రంధములు ప్రమాణములు కావు, వాటిలో చెప్పబడిన ధర్మము ధర్మముకాదు, ధర్మమువలె కనుపించునది. వేదములో చెప్పబడినదే ధర్మము. శ్రుతులలోని అర్థమే స్మృతులు చెప్పుచున్నవి. అందుచేత ఈ స్మృతులకు మూలము వేదమగుటచేత స్మృతులుకూడా ప్రమాణములే. వేదములో చెప్పినదికాని విషయములు చెప్పు తంత్రములలో ఇతర శాస్త్రములలో చెప్పబడినవి ధర్మమని కొందఱు చెప్పుదురు. కాని ఆ ధర్మము శ్రుతిలో చెప్పినదానికి విరుద్ధముగానుండుటవలన వాటిలో చెప్పబడిన ధర్మము వైదికులు గ్రహించరు - నా ఆజ్ఞయే శ్రుతి - ” నా పరాశక్తి సనాతనమైనది. అది నా ఆజ్ఞరూపముగా - వేదముగా పరిణమించినది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను రూపముతో సృష్టికి పూర్వమునుండి యుండెను).
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం |
తస్మాత్ ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ |
జ్ఞాత్వా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మహార్హసి ||“. (శ్రీమద్భగవద్గీత - 16 - 23, 24)
(శాస్త్రములో చెప్పినవి విడిచిపెట్టి తన ఇష్టమొచ్చినట్లు ఎవడు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని, సుఖమునుగాని, ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందలేడు. అందుచేత, చేయతగినదేది, చేయరానిదేది అను విషయమును నిర్ణయించవలసివచ్చినపుడు శాస్త్రము ప్రమాణముగా నున్నది. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దాని ననుసరించి కర్మ చేయవలయును. “తతో యావత్ప్రమాణ సిద్ధం తావనేవ అంగీకర్తవ్యం” (పైన చెప్పినదానివలన ఏది ప్రమాణసిద్ధమో దానినే యంగీకరించవలెను).
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||. (శ్రీమద్భగవద్గీత - 3 - 21)
(శ్రేష్టుడు ఏది ఆచరించునో ఇతరులు దానినే ఆచరింతురు - అతను ఏది పమాణముగా ఆచరించునో లోకులు దానినే ఆచరించెదరు).
(ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని ప్రమాణములు నాలుగు).
(ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, ఆగమము, అర్థాపత్తి, అనుపలబ్ధి అని ప్రమాణములు ఆరు విధములు).
“ప్రత్యక్షమేకమితి చార్వాకః, ప్రత్యక్షానుమానే ఇతికాణాదిమతానుయాయినః. శబ్దేన సహత్రీణీతి సాంఖ్యాః. ప్రత్యక్షానుమానోపమాన శబ్దాః ప్రమాణా నీతి నైయాయికాః. అర్థాపత్యాసహ పంచేతి ప్రాభకరాః. తేషాం నిరాకరణాయోక్తం షడితి” శివదత్తః -
(ప్రత్యక్షమొక్కటే ప్రమాణమని చార్వాకుల అభిప్రాయము - ప్రత్యక్షము, అనుమానము అను రెండు ప్రమాణములు అని కాణాదిమతమువారి అభిప్రాయము. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని ప్రమాణములు మూడు విధములని సాంఖ్యులమతము. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అని ప్రమాణములు నాలుగు అని నైయాయికులభిప్రాయపడుచున్నారు - అర్థాపత్తితో కలిపి ప్రమాణములు అయిదు విధములని ప్రాభాకరులనుచున్నారు).
ప్రత్యక్షానుమానంచ శబ్దం చైవ తృతీయకం |
చత్వా రేవేతరే ప్రాహుః ఉపమాని యుతాని చ |
అర్థాపత్తి యుతాన్యన్యే పంచప్రాహుః మహాధియః |
సప్తపౌరాణికాశ్చైవ ప్రవదంతి మనీషిణః |
ఏతైః ప్రమాణైః దుర్జ్ఙేయం యద్బ్రహ్మ పరమం చ తత్||“. (దేవీభాగవతము)
“పూర్వోక్తాని పంచ, సాక్షిరూపం షష్టం ఐతిహ్యం సప్తం ఇతి సప్తప్రమాణాని”.
(ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అని మూడే ప్రమాణములని పండితులు చెప్పుదురు. ఉపమానముతో కలిసి ప్రమాణములు నాలుగు అని ఇతరులు కొందఱు చెప్పుదురు. అర్థాపత్తితో కలిసి ప్రమాణములు అయిదు అని మఱికొందఱు చెప్పుదురు. ఈ ప్రమాణముల చేత కూడ తెలియబడనివాడె పరబ్రహ్మ - అందుచేతనే అగమ్యుడు, అగోచరుడు అని చెప్పబడుచున్నాడు). మీద చెప్పబడిన ప్రమాణములు అయిదు, సాక్షిరూపం ఆరవది, ఇతిహాసములు ఏడవది అని ప్రమాణములు ఏడు).
(ఘటము, పటము మొదలగునవి విషయములు, ఇవి జడములగుటవలన స్వయంప్రకాశములుకావు. ఇవి ప్రమాణములచేత తెలియబడును - పరమాత్మ విషయముకాదు, విషయములకన్న వేరైనవాడు, స్వయముగ ప్రకాశించువాడు. అందుచేత ఆత్మని ప్రమాణములు తెలియచేయలేవు - అందుచేత అగోచరుడు).
వేదములనేక విధములుగా అనేకులచేత అర్థము చెప్పబడుచున్నవి. వేదములన్నింటి సారాంశము ఉపనిషత్తులలో పొందపఱచబడియున్నది. అందుచేత ఉపనిషత్తులు ప్రమాణము - ప్రత్యక్ష ప్రమాణమువలన, అనుమానప్రపమాణము వలన, భగవంతుడున్నాడని తెలియనగును - కాని అతను ఎటువంటివాడో, ఎట్టి లక్షణములుగలవాడో వాటివలన తెలియదు - ఈ విషయము తెలియచేయునది వేదమే. వేదము లో చెప్పినదానికి వేదమే ప్రమాణము).
ప్రమాణము ఆరు విధములు. ఎట్లనగా : -
(1). ప్రత్యక్షము - కన్ను, చెవులు మొదలగు ఇంద్రియములతో ఏ వస్తువునైనను తెలుసుకొనుట.
(2). అనుమానము - ఏదియైన గుఱుతునిబట్టి యీ వస్తువు కలదని నిర్ణయించుట - దూరముగా పొగను చూచి అచ్చట అగ్ని యున్నదని తెలుసుకొనుట.
(3). ఉపమానము - ఒకమారుచూచిన వస్తువునుబట్టి దానిని పోలియున్న మఱియొక వస్తువును గ్రహించుట.
(4) శబ్దము - వేదము, ఉపనిషత్తులు - వాతిలోను విషయమునే చెప్పు శాస్త్రములు - ఆప్తులగువారు, లేకసర్వజ్ఞులైనవారలు చెప్పినదానిని బట్టి వస్తు తత్వమును తెలుసుకొనుట.
(5). అర్థాపత్తి - కారణమునకు విరుద్ధమగు కార్యమును చూచి దానికి తగిన కారణమూహించుట - దేవదత్తుడు బలముకలిగి యున్నాడు - వాడు పగలు భోజనలు చేయడు - అనగా రాత్రి భోజనము చేయును కనుక బలముగానున్నాడని ఊహించుట.
(6). అనుపలబ్ది - ఈ వస్తువులేదు కనుక ఇచట కానరాదు.
(7). సాక్షి - బ్రహ్మవేత్తలు - బ్రహ్మ సాక్షాత్కారము పొందినవారు.
(ఉపక్రమము, ఉపసంహారము, అభ్యాసము, అపూర్వత్వము, ఫలము, అర్థవాదము, ఉపపత్తి - అను ఆరును తాత్పర్య నిర్ణయమందు ప్రమాణములు).
teliyani padārthamunu teliyacēyunadi.
“jñānasādhanaṃ” (śrīśaṃkaraḥ)
(ēdēni oka vastuvuguṟiṃci telusukonuṭaku sādhanamainadi, upayōgapaḍunadi).
vastuvu kaladani nirthāraṇacēyuṭaku tagina upāyamu.
ē māṭaku ēdi arthamunu teliyacēyunō ā arthamunakāmāṭa pramāṇamu.
dṛṣṭāṃtarūpaḥ (dṛṣṭāṃtamugā nuṃḍunadi).
yasya vākyasya tātparyaviṣa yībhūta saṃsargōmānāṃtarēṇa na bhādyatē tavvākyaṃ pramāṇaṃ.
(oka vākyamuyokka arthamu iṃkoka pramāṇamucēta bādhiṃpabaḍakuṃḍunaṭlu ceppunadi pramāṇamu).
bōdhayaṃti śrutiḥ kēna sa prāmāṇya mitīryatē ||“.
(iṃkoka pramāṇamucēta teliyabaḍani ātmanu spaṣṭamugā bōdhiṃcu śrutipramāṇamukādani evaru ceppagalaru ?).
yasya pramāṇaṃ na bhavēt pramāṇaṃ kiṃ tasya vākyasya bhavēt pramāṇaṃ ||“.
(vēdamulu smṛtulu, dharmamutōkūḍina vacanamulu - ivi praṇāmulu. ivi yē vākyamunaku - pramāṇamulu kāvō aṭṭi vākyamunaku pramāṇamannadilēdu).
“pramāṇaṃ paramaṃ śrutiḥ”. (vēdamē parama pramāṇamu).
upaṣadvākyāni śabda pramāṇaṃ. (upaniṣattulalō ceppabaḍinadi śabda pramāṇamu).
“sāṃkhyayōgaḥ pāṃcarātraṃ vēdāḥ pāśupataṃ tathā ātma pramāṇyānyētāni na haṃtavyāni hētubhiḥ”.
(sāṃkhyāyōgamu, pāṃcarātrāgamamu, vēdamu, pāśupatamu - ivi ātmatatvamunu teliyacēyuṭalō pramāṇamulu - ivi hētuvādamucēta tiraskariṃpabaḍanēravu).
tanmūlatvē pramāṇaṃ syānnānyadhātu kadācana ||“.
(śrutiyē pramāṇamu - purāṇamugāni, taṃtramugāni, itara śāstramulugāni śrutimūlamulaguṭacēta pramāṇamulagucunnavi. maṟiyoka vidhamugā ivi pramāṇamulukāvu).
pratyakṣaśruti viruddhayat pramāṇaṃ nabhanēnnica |
sarvadā vēda ēvāsau dharmamārga pramāṇakaḥ |
tēnā viruddhaṃ yatkiṃcit tatpramāṇaṃ nacānyadhā |
vēdā virōdhiyōṃ śastu saiva grāhyō dvijōttamaiḥ ||.
(vēdamutō virōdhamulēni taṃtramu pramāṇamu. iṃduku saṃdēhamulēdu. pratyakṣamugā vēdamutō virōdhiṃcunadi pramāṇamu kādu - ellapuḍu vēdamē dharmamārgamaṃdu pramāṇamu - vēdamutō virōdhamulēni dē koṃcemainanu adi pramāṇamu. aṭlu kānidi pramāṇamu kādu - paṃḍitōttamulu vēdamutō virōdhamu lēni yaṃśamunē pramāṇamugā grahiṃcuduru).
(pratyakṣamulu, āgamamulu modalagunavi pramāṇamulu. pratyakṣamulanagā kaṃḍlu modalagu iṃdriyamulu, āgamamulanagā tarkamu, mīmāṃsa modalagunavi).
(vēdamu - saṃśayiṃcataginadi kāka - avagāhanamu cēsukonunaṭlu bōdhacēyunadi).
(pratyakṣamu, anumānamu, āgamamulu - ivi pramāṇamulu. śāstramulu pramāṇamulu, vāṭikanna vēdamulu prabalamaina pramāṇamulu. vāṭilōni sārāṃśamaina upaniṣattulu pramāṇamulu - vāṭilōni mahāvākyamulu pramāṇamulu).
(“upaniṣattulalō ceppabaḍina ā puruṣuni guṟiṃciyē ceppavalenu” ani ceppuṭacēta parama puruṣuḍagu parabrahma guṟiṃci ceppuṭaku upaniṣattulē pramāṇamu).
(pramati, saṃvit anuṭavalana paramātmayē svayamugā jñānasvarūpuḍaguṭacēta atanē pramāṇamu - prajñānamu anagā anni buddhīṃdriyamulanu prakāśiṃpacēyunadigāna brahmamē pramāṇamu).
“vēdānisāri śāstramēva pramāṇaṃ, vēda viruddhaṃ apramāṇamēva. paṃcāpi śāstrāṇi apramāṇāni, vēdamaruddhatvāt, vēda virōdhitvaṃ tēṣāṃ visṛṣṭaṃ nirūpitaṃ. uttaramīmāṃsātu na kasmiṃścidavyaṃśē vēda viruddhā bhavati. ata ēva sā sarvathā pramāṇaṃ”.
(uttaramīmāṃsalō ceppabaḍina viṣayamu vēdamunaku viruddhamugālēdu. itara śāstramulu vēdamunaku viruddhamaina upadēśamu cēyunavigāna aśuddhamulu, apramāṇamulu. sāṃkhya śāstramunu raciṃcinavāḍu kapilamaharṣi. yōgasūtramulanu raciṃcinavāḍu pataṃjali. nyāyaśāstramunu raciṃcinavāḍu gautamuḍu. vaiśēṣikaśāstrakarta kaṇāduḍu. jaimini pūrvamīmāṃsanu raciṃcenu. uttaramīmāṃsanu vyāsamaharṣi raciṃcenu. ī graṃdhamula mahātmyamu ellarakunu suprasiddhamē. aṃducēta vīriyokka vacanarūpamaina yī śāstramulanniyu samamugānē pramāṇa graṃdhamulu - ayinanu vīṭi anniṃṭikaṃṭenu vēdamē prabalamaina pramāṇamu - vēdamunu sṛṣṭiṃcinavāḍu sākṣāttu paramēśvaruḍē - aṃducēta vēdamulō bhramagāni, saṃśayamugāni, maṟi yē viṣayamaina dōṣamulugāni lēvu. itara śāstramulu raciṃcinavāru mānavulu. mānavamātrulu raciṃcinavaguṭacēta nā graṃdhamulalō bhrama modalagu dōṣamuluṃḍunu).
(vēdamunu anusariṃci bōdhiṃcu śāstramulē pramāṇamulu. vēdamunaku viruddhamugā bōdhiṃcunavi apramāṇamulu (pramāṇamulukāvu), paina ceppabaḍina śāstramulalō modaṭi ayidu śāstramulu vēdaviruddhamulaguṭavalana pramāṇamulu kāvu. āravadiyaina uttaramīmāṃsā śāstramu ē viṣayamulōnainanu vēda viruddhamukādu. aṃducēta ī śāstramu anni prakāramula pramāṇagraṃdhamē yagucunnadi).
ajñānasya mamābhāvāt apramāṇā na ca śrutiḥ |
smatayaśca śrutērarthaṃ gṛhītvaivaca nirgatāḥ |
manvā dīnāṃ smṛtīnāṃca tataḥ prāmāṇyamiṣyatē |
kvacitkadhā cit taṃtrārtha kaṭākṣēṇa parōditaṃ |
dharmaṃ vadaṃti nōṃśastu naiva grāhyōsti vaidikaiḥ |
anyēṣāṃ śāstrakartṛṇāṃ ajñāna prabhavatvataḥ |
ajñānadōṣa duṣṭatvāt taduktērnapramāṇatā |
tasmāt mumukṣurtharmārthaṃ sarvadhā vēdamāśrayēt || (dēvī bhāgavataṃ)
“vēdōkta ēva dharmaḥ nānya śastrō ditaḥ, sarva śaktēḥ mattaḥ matsvarūpāt vēdaḥ samutthitaḥ |
tadā mamā jñānabhāvāt yanmayōktaṃ tat satyamēva, iti śrutiḥ na apramāṇaṃ |
vēdātirikta śvāstrāṇi tu ājñapuruṣa buddhikalpitāni tataśca ajña praṇītatvāt aprāmāṇyānyēva iti. taduktō dharmaḥ dharmābhāsaḥ vēdōktaḥ ēva dharmaḥ iti śṛtyartha ēvatu smṛti bhirucyatē. tatō mūla bhūta śrutēḥ prāmāṇyāt tanmūlaka smṛtīnāmapi prāmāṇyaṃ avyāhatamēva. taṃtrārthāva lōkanēna parōditaṃ vēdātiriktaśāstōditaṃ api dharmaṃ vadaṃti. sadharmaḥ pratyakṣaśruti viruddhatvāt tairuktōpi na vaidikaiḥ grāhyaḥ - mamasā śrutiḥ ājñāsti –
“mamaivājñā parāśaktiḥ vēdasaṃjñā purātanī |
ṛgyajussāma rūpēṇa sargādau saṃ pravartatē ||“. (kūrmapurāṇamu)
(sarvajñuḍu, sarvaśaktimaṃtuḍu ayina nānuṃḍi vēdamulu puṭṭinavi. aṃducēta vēdamu apramāṇamukādu - vēdārthamunu grahiṃcuṭayē smṛtulu puṭṭinavi. aṃducēta manusmṛti modalagu smṛtulu pramāṇamulu - itara śāstrakartalu ajñānulaguṭavalana - paramātmavale sarvajñulu kākapōvuṭavalana vaidikulu vāṭini grahiṃcaru - vāru ajñānulanu dōṣamu kaligiyunnavārukanuka vāru ceppinadi pramāṇamukādu. aṃducēta mumukṣuvulaguvāralu -mōkṣamukōruvāru - dharmamunu guṟiṃci vēdamunē āśrayiṃcavalenu - pāṭiṃca valenu. adiyē pramāṇamu).
(vēdamulō ceppinadē dharmamu, itara śāstramulalō ceppinadi kādu - sarvaśaktimaṃtuḍanaina nānuṃḍi - nā śarīramunuṃḍi - vēdamulu puṭṭinavi. aṃducēta nēnu ajñānuḍanu kākapōvuṭavalana nēnu vēdamulō ceppinadaṃtayu satyamē kanuka śruti pramāṇamu, apramāṇamukādu. vēdamukāka itara śāstramulu ajñānulagu puruṣula buddhivalana kalpiṃcabaḍinavi. ajñānapuruṣulu cēsinavi kanuka ā graṃdhamulu pramāṇamulu kāvu, vāṭilō ceppabaḍina dharmamu dharmamukādu, dharmamuvale kanupiṃcunadi. vēdamulō ceppabaḍinadē dharmamu. śrutulalōni arthamē smṛtulu ceppucunnavi. aṃducēta ī smṛtulaku mūlamu vēdamaguṭacēta smṛtulukūḍā pramāṇamulē. vēdamulō ceppinadikāni viṣayamulu ceppu taṃtramulalō itara śāstramulalō ceppabaḍinavi dharmamani koṃdaṟu ceppuduru. kāni ā dharmamu śrutilō ceppinadāniki viruddhamugānuṃḍuṭavalana vāṭilō ceppabaḍina dharmamu vaidikulu grahiṃcaru - nā ājñayē śruti - ” nā parāśakti sanātanamainadi. adi nā ājñarūpamugā - vēdamugā pariṇamiṃcinadi. ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu anu rūpamutō sṛṣṭiki pūrvamunuṃḍi yuṃḍenu).
na sa siddhimavāpnōti na sukhaṃ na parāṃ gatiṃ |
tasmāt pramāṇaṃ tē kāryā kārya vyavasthitau |
jñātvā cchāstraṃ pramāṇaṃ tē kāryākāryavyavasthitau |
jñātvā śāstravidhānōktaṃ karma kartu mahārhasi ||“. (śrīmadbhagavadgīta - 16 - 23, 24)
(śāstramulō ceppinavi viḍicipeṭṭi tana iṣṭamoccinaṭlu evaḍu pravartiṃcunō aṭṭivāḍu puruṣārtha siddhini gāni, sukhamunugāni, uttamagatiyagu mōkṣamunugāni poṃdalēḍu. aṃducēta, cēyataginadēdi, cēyarānidēdi anu viṣayamunu nirṇayiṃcavalasivaccinapuḍu śāstramu pramāṇamugā nunnadi. śāstramunaṃdu ceppabaḍina dānini telusukoni dāni nanusariṃci karma cēyavalayunu. “tatō yāvatpramāṇa siddhaṃ tāvanēva aṃgīkartavyaṃ” (paina ceppinadānivalana ēdi pramāṇasiddhamō dāninē yaṃgīkariṃcavalenu).
sa yatpramāṇaṃ kurutē lōkastadanuvartatē ||. (śrīmadbhagavadgīta - 3 - 21)
(śrēṣṭuḍu ēdi ācariṃcunō itarulu dāninē ācariṃturu - atanu ēdi pamāṇamugā ācariṃcunō lōkulu dāninē ācariṃcedaru).
(pratyakṣamu, anumānamu, upamānamu, śabdamu ani pramāṇamulu nālugu).
(pratyakṣamu, anumānamu, upamānamu, āgamamu, arthāpatti, anupalabdhi ani pramāṇamulu āru vidhamulu).
“pratyakṣamēkamiti cārvākaḥ, pratyakṣānumānē itikāṇādimatānuyāyinaḥ. śabdēna sahatrīṇīti sāṃkhyāḥ. pratyakṣānumānōpamāna śabdāḥ pramāṇā nīti naiyāyikāḥ. arthāpatyāsaha paṃcēti prābhakarāḥ. tēṣāṃ nirākaraṇāyōktaṃ ṣaḍiti” śivadattaḥ -
(pratyakṣamokkaṭē pramāṇamani cārvākula abhiprāyamu - pratyakṣamu, anumānamu anu reṃḍu pramāṇamulu ani kāṇādimatamuvāri abhiprāyamu. pratyakṣamu, anumānamu, śabdamu ani pramāṇamulu mūḍu vidhamulani sāṃkhyulamatamu. pratyakṣamu, anumānamu, upamānamu, śabdamu ani pramāṇamulu nālugu ani naiyāyikulabhiprāyapaḍucunnāru - arthāpattitō kalipi pramāṇamulu ayidu vidhamulani prābhākarulanucunnāru).
pratyakṣānumānaṃca śabdaṃ caiva tṛtīyakaṃ |
catvā rēvētarē prāhuḥ upamāni yutāni ca |
arthāpatti yutānyanyē paṃcaprāhuḥ mahādhiyaḥ |
saptapaurāṇikāścaiva pravadaṃti manīṣiṇaḥ |
ētaiḥ pramāṇaiḥ durjṅēyaṃ yadbrahma paramaṃ ca tat||“. (dēvībhāgavatamu)
“pūrvōktāni paṃca, sākṣirūpaṃ ṣaṣṭaṃ aitihyaṃ saptaṃ iti saptapramāṇāni”.
(pratyakṣamu, anumānamu, śabdamu ani mūḍē pramāṇamulani paṃḍitulu ceppuduru. upamānamutō kalisi pramāṇamulu nālugu ani itarulu koṃdaṟu ceppuduru. arthāpattitō kalisi pramāṇamulu ayidu ani maṟikoṃdaṟu ceppuduru. ī pramāṇamula cēta kūḍa teliyabaḍanivāḍe parabrahma - aṃducētanē agamyuḍu, agōcaruḍu ani ceppabaḍucunnāḍu). mīda ceppabaḍina pramāṇamulu ayidu, sākṣirūpaṃ āravadi, itihāsamulu ēḍavadi ani pramāṇamulu ēḍu).
(ghaṭamu, paṭamu modalagunavi viṣayamulu, ivi jaḍamulaguṭavalana svayaṃprakāśamulukāvu. ivi pramāṇamulacēta teliyabaḍunu - paramātma viṣayamukādu, viṣayamulakanna vērainavāḍu, svayamuga prakāśiṃcuvāḍu. aṃducēta ātmani pramāṇamulu teliyacēyalēvu - aṃducēta agōcaruḍu).
vēdamulanēka vidhamulugā anēkulacēta arthamu ceppabaḍucunnavi. vēdamulanniṃṭi sārāṃśamu upaniṣattulalō poṃdapaṟacabaḍiyunnadi. aṃducēta upaniṣattulu pramāṇamu - pratyakṣa pramāṇamuvalana, anumānaprapamāṇamu valana, bhagavaṃtuḍunnāḍani teliyanagunu - kāni atanu eṭuvaṃṭivāḍō, eṭṭi lakṣaṇamulugalavāḍō vāṭivalana teliyadu - ī viṣayamu teliyacēyunadi vēdamē. vēdamu lō ceppinadāniki vēdamē pramāṇamu).
pramāṇamu āru vidhamulu. eṭlanagā : -
(1). pratyakṣamu - kannu, cevulu modalagu iṃdriyamulatō ē vastuvunainanu telusukonuṭa.
(2). anumānamu - ēdiyaina guṟutunibaṭṭi yī vastuvu kaladani nirṇayiṃcuṭa - dūramugā poganu cūci accaṭa agni yunnadani telusukonuṭa.
(3). upamānamu - okamārucūcina vastuvunubaṭṭi dānini pōliyunna maṟiyoka vastuvunu grahiṃcuṭa.
(4) śabdamu - vēdamu, upaniṣattulu - vātilōnu viṣayamunē ceppu śāstramulu - āptulaguvāru, lēkasarvajñulainavāralu ceppinadānini baṭṭi vastu tatvamunu telusukonuṭa.
(5). arthāpatti - kāraṇamunaku viruddhamagu kāryamunu cūci dāniki tagina kāraṇamūhiṃcuṭa - dēvadattuḍu balamukaligi yunnāḍu - vāḍu pagalu bhōjanalu cēyaḍu - anagā rātri bhōjanamu cēyunu kanuka balamugānunnāḍani ūhiṃcuṭa.
(6). anupalabdi - ī vastuvulēdu kanuka icaṭa kānarādu.
(7). sākṣi - brahmavēttalu - brahma sākṣātkāramu poṃdinavāru.
(upakramamu, upasaṃhāramu, abhyāsamu, apūrvatvamu, phalamu, arthavādamu, upapatti - anu ārunu tātparya nirṇayamaṃdu pramāṇamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.