← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణ పంచకము prāṇa paṃcakamu

Original — తెలుగు
  1. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను అయిదు ప్రాణములు.

  2. ఇతశ్చాస్తి ముఖ్య ప్రాణస్య వైశేషికం కార్యం యత్కారణం పంచవృత్తిరయం వ్యపదిశ్యతే శ్రుతిషు - ప్రాణాపానో వ్యాన ఉదాన స్సమానః “ఇతి వృత్తి భేదాశ్చాయం కార్య భేదాపేక్షం - ప్రాణః ప్రాగ్వ్రుత్తి రుచ్ఛ్వాసాది కర్మా, అపానో వాగ్వృత్తి ర్నిశ్వాసాదికర్మా వ్యాన స్త యోస్సంధౌ వర్తమానో వీర్యవత్కర్మ హేతుః; ఉదాన ఊర్థ్వ వృత్తి రుత్క్రాంత్యాది హేతుః | సమానస్సమం సర్వేష్వంగేషుయో(అ)న్న రసాన్నయ తీతి. ఏవం పంచ వృత్తిః ప్రాణః మనోవత్ యథా మనసః పంచవృత్త యః ఏవం ప్రాణస్యాపి”. (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(ముఖ్యప్రాణము యొక్క విశేషకర్మవలన అది అయిదు విధములుగా చెప్పబడుచున్నది - ప్రాణము, అపానము,వ్యానము, ఉదానము, సమానము - అని అయిదు విధములని శ్రుతి చెప్పుచున్నది. ప్రాణము చేయు వేఱు వేఱు పనులు బట్టియే వృత్తి భేదము - ప్రాణము ఉచ్ఛ్వాసాది పనులు - ఊపిరి తీయుట మొదలగు పనులు - చేయును - అపానము వాగ్వృత్తి గలది - నిశ్వాసము మొదలగు పనులు చేయును - ఈ రెండింటికీ సంధి యందుండి వీర్యవంతముగా చేయుటకు కారణమైనది. ఉదానము మీదకు తీసుకోపోవు కర్మ - అనగా, శరీరమునుండి ప్రాణము జీవునితోకూడ పైకి పోవుట మొదలగు కర్మ చేయును - సమానము శరీరములోని అన్ని భాగములకు (అంగములకు) అన్నరసమును సమానముగ వ్యాపింపచేయును - మనస్సు ఒకటే అయినను అది అయిదు వృత్తులను చేయునట్లు ప్రాణము కూడ ఒకటే అయినను అయిదు వృత్తులు కలది).

  1. “కేవలం దేహ ధారణమే వాస్యా సాధారణం - యథా మనః అనేక వృత్త్యాఖ్యా సాధారణ వ్యాపారాపేక్షయా అనేక థా వ్యపదిశ్యతే - ఏవ ముచ్ఛ్వాస నిశ్వాస సర్వ శరీరక్రియో త్యాభ్యా శ్చత్వారో వ్యాపారాః, భక్షితాన్నాది రసానాం సమత్వేన సర్వాంగేషు నయనం పంచమో వ్యాపారః. తానపేక్ష్య పంచవృత్తిః ప్రాణో వ్యపదిశ్యతే - క్రమేణ ప్రాణో(అ)పానో వ్యానః ఉదానః సమాన ఇతి. తద సాధారణ వ్యాపారాపేక్షయా జీవోపకరణత్వం మనోవదిత సిద్ధం -”. (బ్రహ్మ సూత్ర భాష్యే - బ్రహ్మ తత్వ ప్రకాశికా - 2 - 4 - 12)

(దేహ ధారణమొక్కటే ఈ ప్రాణము యొక్క అసాధారణ కర్మ - దేహమును జీవ వంతముగా చేయుట ఒక్కటే ఈ ప్రాణము యొక్క కర్మకాదు - మనస్సు ఒకటే అయినను దాని యొక్క అనేక వృత్తులబట్టి అనేక వ్యాపారములు చేయుచు అనేకముగా తెలియబడుచున్నది. ఆ ప్రకారముగానే ప్రాణము ఉచ్ఛ్వాసము, నిశ్వాసము కలిగించుట, శరీరమంతటను సంచరించుట, శరీరమునుండి ఉత్క్రమించుట అను నాలుగు వ్యాపారములు, తినిన అన్నము యొక్క రసమును (సారమును) శరీరము యొక్క అన్ని అవయవములకు సమానముగా వ్యాపింపచేయుట - అనునది అయిదవ వ్యాపారము - ఇట్లు అయిదు విధములైన వ్యాపారములు కలిగియుండుటవలన ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను అయిదు వృత్తులు గలది ప్రాణమని చెప్పబడుచున్నది. దాని యొక్క అసాధారణ వృత్తి జీవించి యుండునట్లు చేయుట).

Transliteration
  1. prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu anu ayidu prāṇamulu.

  2. itaścāsti mukhya prāṇasya vaiśēṣikaṃ kāryaṃ yatkāraṇaṃ paṃcavṛttirayaṃ vyapadiśyatē śrutiṣu - prāṇāpānō vyāna udāna ssamānaḥ “iti vṛtti bhēdāścāyaṃ kārya bhēdāpēkṣaṃ - prāṇaḥ prāgvrutti rucchvāsādi karmā, apānō vāgvṛtti rniśvāsādikarmā vyāna sta yōssaṃdhau vartamānō vīryavatkarma hētuḥ; udāna ūrthva vṛtti rutkrāṃtyādi hētuḥ | samānassamaṃ sarvēṣvaṃgēṣuyō(a)nna rasānnaya tīti. ēvaṃ paṃca vṛttiḥ prāṇaḥ manōvat yathā manasaḥ paṃcavṛtta yaḥ ēvaṃ prāṇasyāpi”. (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(mukhyaprāṇamu yokka viśēṣakarmavalana adi ayidu vidhamulugā ceppabaḍucunnadi - prāṇamu, apānamu,vyānamu, udānamu, samānamu - ani ayidu vidhamulani śruti ceppucunnadi. prāṇamu cēyu vēṟu vēṟu panulu baṭṭiyē vṛtti bhēdamu - prāṇamu ucchvāsādi panulu - ūpiri tīyuṭa modalagu panulu - cēyunu - apānamu vāgvṛtti galadi - niśvāsamu modalagu panulu cēyunu - ī reṃḍiṃṭikī saṃdhi yaṃduṃḍi vīryavaṃtamugā cēyuṭaku kāraṇamainadi. udānamu mīdaku tīsukōpōvu karma - anagā, śarīramunuṃḍi prāṇamu jīvunitōkūḍa paiki pōvuṭa modalagu karma cēyunu - samānamu śarīramulōni anni bhāgamulaku (aṃgamulaku) annarasamunu samānamuga vyāpiṃpacēyunu - manassu okaṭē ayinanu adi ayidu vṛttulanu cēyunaṭlu prāṇamu kūḍa okaṭē ayinanu ayidu vṛttulu kaladi).

  1. “kēvalaṃ dēha dhāraṇamē vāsyā sādhāraṇaṃ - yathā manaḥ anēka vṛttyākhyā sādhāraṇa vyāpārāpēkṣayā anēka thā vyapadiśyatē - ēva mucchvāsa niśvāsa sarva śarīrakriyō tyābhyā ścatvārō vyāpārāḥ, bhakṣitānnādi rasānāṃ samatvēna sarvāṃgēṣu nayanaṃ paṃcamō vyāpāraḥ. tānapēkṣya paṃcavṛttiḥ prāṇō vyapadiśyatē - kramēṇa prāṇō(a)pānō vyānaḥ udānaḥ samāna iti. tada sādhāraṇa vyāpārāpēkṣayā jīvōpakaraṇatvaṃ manōvadita siddhaṃ -”. (brahma sūtra bhāṣyē - brahma tatva prakāśikā - 2 - 4 - 12)

(dēha dhāraṇamokkaṭē ī prāṇamu yokka asādhāraṇa karma - dēhamunu jīva vaṃtamugā cēyuṭa okkaṭē ī prāṇamu yokka karmakādu - manassu okaṭē ayinanu dāni yokka anēka vṛttulabaṭṭi anēka vyāpāramulu cēyucu anēkamugā teliyabaḍucunnadi. ā prakāramugānē prāṇamu ucchvāsamu, niśvāsamu kaligiṃcuṭa, śarīramaṃtaṭanu saṃcariṃcuṭa, śarīramunuṃḍi utkramiṃcuṭa anu nālugu vyāpāramulu, tinina annamu yokka rasamunu (sāramunu) śarīramu yokka anni avayavamulaku samānamugā vyāpiṃpacēyuṭa - anunadi ayidava vyāpāramu - iṭlu ayidu vidhamulaina vyāpāramulu kaligiyuṃḍuṭavalana prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu anu ayidu vṛttulu galadi prāṇamani ceppabaḍucunnadi. dāni yokka asādhāraṇa vṛtti jīviṃci yuṃḍunaṭlu cēyuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.