← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రాణమయ కోశము prāṇamaya kōśamu

Original — తెలుగు
  1. “కర్మేంద్రియైః సహ ప్రాణాది పంచకం ప్రాణమయకోశః” (పైంగలోపనిషత్)

(కర్మేంద్రియములతో పంచప్రానములు కలిసినది ప్రాణమయ కోశము).

  1. ప్రాణమయ కోశస్తు కేవల రజో గుణస్య అవస్థా విశేషః. ప్రాణాదయః వాయవః అపాదమస్తకం స్థూలదేహం వ్యాప్య తస్య బలం ఆధాయ ఇంద్రియాణి స్వస్వ వ్యాపారేషు ప్రవర్తయంతి.

(ప్రాణమయకోశము కేవలము రజోగుణము యొక్క ఒక్క అవస్థ. ప్రాణము మొదలగు వాయువులు స్థూలదేహములో పాదము మొదలు శిరస్సు వరకు వ్యాపించి దానికి బలమునిచ్చి ఇంద్రియములను వాటి వాటి వ్యాపారములలో ప్రవర్తింపచేయును -

  1. ప్రాణాది దశ వాయవః అన్నమయ కోశే యదా వర్తంతే తథా ప్రాణమయకోశః ఇత్యుచ్యతే.

(ప్రాణము మొదలగు పది వాయువులు - పంచ ప్రాణములు, పంచ ఉపప్రాణములు కలిసి పది వాయువులు - అన్నమయ కోశమనదు వర్తించునపుడు ప్రాణమయ కోశమని చెప్పబడుచున్నది).

  1. “సూక్ష్మ తనువందు ప్రాణమారుతంబును కర్మేంద్రియంబులు గూడి ప్రాణమయకోశమనంబడు” (వివేకచింతామణి)
Transliteration
  1. “karmēṃdriyaiḥ saha prāṇādi paṃcakaṃ prāṇamayakōśaḥ” (paiṃgalōpaniṣat)

(karmēṃdriyamulatō paṃcaprānamulu kalisinadi prāṇamaya kōśamu).

  1. prāṇamaya kōśastu kēvala rajō guṇasya avasthā viśēṣaḥ. prāṇādayaḥ vāyavaḥ apādamastakaṃ sthūladēhaṃ vyāpya tasya balaṃ ādhāya iṃdriyāṇi svasva vyāpārēṣu pravartayaṃti.

(prāṇamayakōśamu kēvalamu rajōguṇamu yokka okka avastha. prāṇamu modalagu vāyuvulu sthūladēhamulō pādamu modalu śirassu varaku vyāpiṃci dāniki balamunicci iṃdriyamulanu vāṭi vāṭi vyāpāramulalō pravartiṃpacēyunu -

  1. prāṇādi daśa vāyavaḥ annamaya kōśē yadā vartaṃtē tathā prāṇamayakōśaḥ ityucyatē.

(prāṇamu modalagu padi vāyuvulu - paṃca prāṇamulu, paṃca upaprāṇamulu kalisi padi vāyuvulu - annamaya kōśamanadu vartiṃcunapuḍu prāṇamaya kōśamani ceppabaḍucunnadi).

  1. “sūkṣma tanuvaṃdu prāṇamārutaṃbunu karmēṃdriyaṃbulu gūḍi prāṇamayakōśamanaṃbaḍu” (vivēkaciṃtāmaṇi)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.