← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రపంచము prapaṃcamu

Original — తెలుగు
  1. జగత్తు.

  2. దృశ్యం.

(ఈ కనబడు వస్తువులన్నియుకలిసి ఒకటిగా నున్నదే ప్రపంచము).

  1. ప్రకర్షేణ పంచీకృతమితి ప్రపంచం.

(అత్యంత ఉత్కృష్టమైన స్థితిలో పంచభూతములు కలియుటవలన కలిగినది కనుక ప్రపంచము అని చెప్పబడుచున్నది - పృధివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము - ఈ అయిదు భూతములు ఒకదానిలోనొకటి కలియుటవలన ఆ కలిసిన వస్తువు పాంచభౌతికము. అట్లు పాంచ భౌతికములగు వస్తువులన్నియు కలిసి ప్రపంచమని చెప్పబడుచున్నది).

  1. ఈ ప్రపంచమంతయు భగవంతునివలన - భగవంతునిలోనుండి - ఒకవస్తువులోనుండి ఇంకొకటి పుట్టినట్లు - పుట్టినది. అది యెట్లనగా : -

    1. “సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్” (ఛాందోగ్యోపనిషత్ - 6 - 2 - 1)

(ఈ ప్రపంచము పుట్టకముందు - సృష్టికిముందు - ఇప్పుడు కనబడు ఈ ప్రపంచమంతయు ఒకటే అయిన ఆత్మగా నుండెను). (సత్పద్ఫార్థముగానే యుండెను).

  1. “ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్” - “నాన్యత్ కించన మిషత్” (ఐతరేయోపనిషత్ - 2 - 4 - 1 - 1)

(ఈ ప్రపంచము పుట్టకముందు ఇది అంతయూ - ఈ కనబడు ప్రపంచమంతయు ఒక్క ఆత్మగానే ఉండెను - ఈ ఆత్మ తప్ప ఇంకేమియును లేదు).

  1. “బ్రహ్మవా ఇదం అగ్ర ఆసీత్” (బృహదారణ్యకోపనిషత్ - 1 - 4 - 10)

(ఈ ప్రపంచము పుట్టకముందు ఈ ప్రపంచమంతయు ఒక్క బ్రహ్మమాత్రముగానే యుండెను).

(పైన చెప్పబడిన వాక్యములవలన పరమాత్మ ఒక్కడే సృష్టికిముందు ఉండెననియు, అతనే సృష్టిలోని వస్తువులన్నింటిగా మారెననియు, - ప్రపంచముగా మారెననియు, అందువలన ప్రపంచమునకు మూలము - కారణము - పరమాత్మయే అనియు తెలియుచున్నది. ఘటము - కుండ - తయారుకాకముందు అది మట్టిగానే యుండెను - ఆ మన్నే కుండగా మారెను - అందుచేత కారణమైన మట్టి కార్యమైన మట్టికంటె వేరుకాదు -

“యధా చ కారణం బ్రహ్మ త్రిషు కాలేషు సత్వం న వ్యభిచరతి, ఏకం చ, పునస్సత్వం అతో అస్యనన్యత్వం కారణా త్కార్యస్య -”

(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 6 - 17)

(ప్రపంచమునకు కారణమైన పరబ్రహ్మకు మూడు కాలములందును తన సత్వగుణములో మార్పులేదు - ఒకటే సత్వముగలవాడుగా నున్నాడు - అట్లే పరబ్రహ్మ తనయొక్క కార్యమైన ప్రపంచముగా మారినను దానిలోని పర బ్రహ్మయొక్క సత్వగుణము మారలేదు - అందుచేత కారణమైన పరబ్రహ్మ కంటె కార్యమైన ప్రపంచము వేఱుకాదు. పరబ్రహ్మమే ప్రపంచము, ప్రపంచమే పరబ్రహ్మము).

    1. దధిఘట రుచకార్యర్థిభిః ప్రతినియతాని కారణాని క్షీరమృత్తికా సువర్ణా దీన్యుపాదీయ మానాని లోకేదృశ్యంతే నహిదద్ధ్యర్థిభిః మృత్తికోపాదీయతే, నఘటాద్యర్థిభిః -క్షీరం - - - కస్మాత్? క్షీరాదేవ దధ్యుత్పద్యతే, న మృత్తి కాయాః? మృత్తికయా ఏవ చ ఘట ఉత్పద్యతే, న క్షీరాత్ (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే - 2 - 1 - 18)

(లోకములో పెరుగు, కుండ, బంగారపు ఆభరణములు కావలసినవారికి, వాటికి కావలసిన ఉపాదానకారణము (ముడి వస్తువు - raw material) అయిన పాలు, మన్ను, బంగారము కావలసి యుండుట తెలిసిన విషయమే - పెరుగు చేయువారు మట్టితో పెరుగు తయారుచేయ లేరు - ఆ ప్రకారమే కుండచేయువారు పాలతో కుండ తయారు చేయ లేరు - ఎందుచేతననగా పాలతో పెరుగు చేయడమగును, మట్టితో కాదు. మట్టితో కుండ చేయనగును - పాలతో కాదు, పరబ్రహ్మయే ప్రపంచమునకు నిమిత్తకారణము - ఆ ప్రపంచము సృష్టించుటకు కావలసిన ఉపాదానము తానే కనుక ప్రపంచము నకు ఉపాదానకారణము; నిమిత్తకారణము కూడా భగవంతుడే).

  1. “ఆత్మతః ఏ వేదం సర్వం” (ఈ ప్రపంచమంతయు ఆత్మవలననే కలిగినది).

  2. “తథాత్మానం స్వయమ కురుత”. (ఆ పరబ్రహ్మ తననే ఈ ప్రపంచముగా చేసెను).

  3. “తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ - తదనుప్రవిశ్య సచ్చత్యచ్చా భవత్”.

(ఆ పరబ్రహ్మ లోకములను సృష్టించి అందులో ప్రవేశించెను. అట్లు ప్రవేశించి తానే ఆత్మ, అనాత్మవస్తువులుగా ఆయెను - అనగా, సూక్ష్మములైన ఆకాశము, వాయువులు గాను, స్థూలములైన అగ్ని, జలము, భూమి భగవంతుడే మారెను - ప్రతి వస్తువునకును తానే నిమిత్తకారణము, ఉపాదానకారణము ఆయెను – ప్రతివస్తువు లోనున్న, ఉపాదాన కారణము, నిమిత్తకారణము తానే ఆయెను - అందుచేత ప్రతి వస్తువు తానే ఆయెను).

  1. “ఉపాదానం ప్రపంచస్య బ్రహ్మణో అన్యన్న విద్యతే |

తసాత్ సర్వ ప్రపంచోయం బ్రహ్మై వాస్తి న చేతరత్ |

బ్రహ్మణః సర్వభూతాని జాయంతే పరమాత్మనః |

తస్మాదేతాని బ్రహ్మైవ భవంతీతి విచింతయ |

బ్రహ్మైవ సర్వనామాని రూపాణి వివిధాని చ |

కర్మాణ్యపి సమగ్రాణి భి భర్తీతి విభావయ |

సువర్ణాజ్జాయ మానస్య సువర్ణత్వం చ శశ్వతం |

బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్ ||” (యోగశిఖోపనిషత్)

(ప్రపంచమునకు ఉపాదానకారణము పరబ్రహ్మకాక మఱియొకటి కానరాదు - అందుచేత ఈ ప్రపంచమంతా బ్రహ్మమే కాని మఱియొకటి కానేరదు - పరమాత్మ అయిన పరబ్రహ్మవలన (పరబ్రహ్మలోనుండి) ఈ సమస్త భూతములు పుట్టుచున్నవి. అందుచేత నివి యన్నియు బ్రహ్మమేయని తెలుసుకొనుము - అనేక విధములయిన నామము లన్నియు, రూపములన్నియు, బ్రహ్మమే. అతనే యీ సమస్త కర్మలను భరించువాడు. బంగారముతో చేయబడిన ఆభరణములు ఎప్పటికీ బంగారమే. ఆ ప్రకారము గానే పరబ్రహ్మనుండిపుట్టిన వస్తువులన్నియు - (వస్తువులన్నియు కలిసి అయిన ప్రపంచము కూడా) - పరబ్రహ్మమే).

  1. “వాసుదేవస్సర్వం”. (ఇదంతా - ఈ ప్రపంచమంతయు వాసుదేవుడే).

  2. “ఏకస్స దేకః పరమః పరేశః స వాసుదేవో న తదన్యదస్తి |

ఏకస్సమస్తం యదిహాస్తి కించిత్ న తదుచ్యతో నాస్తి పరం తతో(అ)న్యత్ |

సోహం సచత్వం నచ సర్వమేతత్ ఆత్మస్వరూపం త్యజ భేదమోహం ||“. (శ్రీ విష్ణుపురాణే)

(సత్ అనునది, పరముడు, పరేశుడు అయినవాడు వాసుదేవుడొక్కడే - అతనికంటె వేరైనది లేదు - ఇక్కడ ఉన్నదీ సమస్తము అతనే, ఆ అచ్యుతునికంటె ఇతరమైనది యే కొంచెము లేదు, అతనికంటె ఉత్కృష్టమైనదియు లేదు - నేనే అతను, నీవే అతను, అన్నియు అతనే, ఆత్మ స్వరూపుడు అతనే - ఇవన్నియు వేఱు అను భేద బుద్ధి యను మోహము వదలివేయుము).

  1. “ఆద్యంతాలు వడ్లై నా నడుమ కసవు కలిగినట్లే ఆద్యంతాన బ్రహ్మమైనా నడుమ ప్రపంచావారం భాసిస్తునది, గనుక సర్వమున్నూ బ్రహ్మమనే చెప్పవలెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

(విత్తనము నాటినప్పుడు ధాన్యము, చేను పంటకు వచ్చినపుడు ధాన్యము - కాని, ఈ మధ్యకాలములో - చేను పంటకు వచ్చేవరకు - అది మొక్కగానే యుండును - ఆ మొక్క ధాన్యపుగింజ యొక్క వికారమే, దాని శరీరమే, దాని రసమే - ఆ ప్రకారముగానే సృష్టికి పూర్వము పరబ్రహ్మ ఒక్కడే ఉండెను. సృష్టి లయమైన తర్వాత మిగిలి యుండునది పరబ్రహ్మ ఒక్కడే - (ఆది శేషువు) - ఈ మధ్యకాలములో ప్రపంచమనునది తోచుచున్నది - కాని అది అతని రూపమే).

  1. “విశ్వమే వేదం పురుషః” (మంత్ర పుష్పము)

(ఈ ప్రపంచమంతయు పురుషుడే - పరమాత్మయే).

  1. “ఒకటే వాయువు స్థానభేదముచే ప్రాణాపానాది పంచభేదములను బొంది యెట్లు వేర్వేరుప్రవృత్తులు కలదగుచున్నదో, యటులనే ఒక్కటగు బ్రహ్మమును మాయోపాధులచే నానాత్వమును బొంది ప్రపంచభావము కలదగుచున్నది. ప్రాణాపానాదులెట్లు వాయ్వనన్యములో, యటులనే ప్రపంచమును బ్రహ్మ నన్యమై యున్నది”.

  2. “సర్వం ఖిల్విదం బ్రహ్మ -” “తజ్జలానీతి శాంత ఉపాసీత”.

(ఈ ప్రపంచమంతయు పరబ్రహ్మమే - బ్రహ్మలోనుండి పుట్టినది కనుక బ్రహ్మమే - బంగారముతో చేయబడినవస్తువులన్నియు బంగారు వస్తువులే - ఇది యెట్లంటే - తజ్జలానీతి శాంత ఉపాసీత” తత్ = ఆబ్రహ్మనుండి, జ = పుట్టినవి; ల = అందులోనే లయమగుచున్నవి; అన్ - అతనియందే చలించుచున్నవి - అతని చేతనే పోషింప బడుచున్నవి - అనగా, - పరబ్రహ్మలోనుండి పుట్టి, పరబ్రహ్మచేతనే చలించుచు, పరబ్రహ్మలోనే లయమగుచున్నవి. అందుచేత ఈ ప్రపంచము పరబ్రహ్మకన్న వేఱుకాదు, ఇది యంతయు పరబ్రహ్మమే, పరబ్రహ్మరూపమే అని శాంతుడగువాడు, రాగద్వేషములు లేనివాడు ఉపాసించవలెను. ప్రపంచములోని వస్తువులన్నియు పరబ్రహ్మ స్వరూపములేకనుక అందులో ఏ వస్తువునైనను పరబ్రహ్మముగానే భావించి ఉపాసించవలెను - ఇట్టి ప్రతీకోపాసనలో దోషములేదని తెలియవలెను).

  1. “పరమేశ్వరా! నీవు రజోగుణంబున నఖిలంబును సృజియించి కారణరూపంబున తదను ప్రవిష్టుండవై కృతదృష్ట కార్యరూప ప్రపంచాకారంబున దీపించుచుందువు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1504)

  2. “అధ్యాత్మ తత్వంబవన్నం బరంజ్యోతివన్నం బ్రపంచంబవన్నన్నధిష్టాతవన్నన్, సదా సాక్షిపన్నం గుణాతీత నీవేకదా” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 203)

  1. పరబ్రహ్మ తానే ఈ పదులాలుగు లోకములుగల ప్రపంచముగా మారెనను విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో క్రింద విధముగా వర్ణింపబడినది -

“కాలకర్మస్వభావ ప్రేరకుండయిన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్యస్థితంబైన బ్రహ్మాండంబులోను సొచ్చి, సవిస్తారంబు గావించి, యట్టి యండంబు భేదించి నిర్గమించె నెట్లంటేని -

“క. భువనాత్మకుడా ఈశుడు

భవనాకృతితోడనుండు బ్రహ్మాండంబున్

వివరముతో బదునాలుగు

వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్“.

“మ.బహుపాదోరు భుజాన సేక్షణ శిరః ఫాలశ్రవో యుక్తుడై

విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాన్సులూహించి, త

ద్బహురూపావయవంబులన్ భువనపంక్తిన్ విచారింతురు - -”

- - -

“చతుర్దశ లోకంబులందు మీది ఏడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటి ప్రదేశంబుననుండి యూర్ధ్వ దేహమనియును, గ్రింద ఏడు లోకంబులు జఘనంబు నుండి యధో దేహమనియును బలుకుదురు - - - భూలోకంబు కటి పర్యంత ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబుస్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మనివాసంబునునైన సత్యలోకంబు శిరంబు, కటి ప్రదేశంబతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు దలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబునని లోకమయుంగా భావింతురు-”. (శ్రీమదాంధ్రమహాభాగవతం ఉ - 1 - 5 - 86 to 88, - 2 - 5 - 89)

  1. సృష్టికి ముందు, స్థితికాలములోను ఈ ప్రపంచమంతయును బ్రహ్మలోనే యుండును -

“సీ. - - -

సలిల నభస్థల చరములు మొదలైన వివిధజీవులతోడి విశ్వమెల్ల

ఆ. విష్ణు మయము, పుత్రః వేయేల, బ్రహ్మాండ

మతని జేనలోన నడగియుండు,

బుద్ధి నెఱుగరాదు భూత భవద్భావి

లోకమెల్ల విష్ణులోననుండు “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 90, 91)

  1. “చిచ్ఛక్తిః పరమేశ్వరస్య విమలం చైతన్యమేవోచ్యతే |

తస్యైవాస జడా పరాభగవత శ్శక్తిస్త్వవిద్యాత్మికా |

సంసర్గాచ్చవిధ స్తయోర్భగవత శ్శక్త్యోర్జగ జ్జా యతే ||“. (సంక్షేప శారీరకము)

(పరబ్రహ్మకు రెండు శక్తులున్నవి - చైతన్యశక్తి లేక పరాశక్తి, రెండవది జడశక్తి - లేక అపరాశక్తి.ఈ అపరాశక్తియే అవిద్యయని చెప్పబడుచున్నది. పరబ్రహ్మయొక్క ఈ రెండు శక్తులు కలియుటచేతనే - అపరాశక్తి లేక అపరాప్రకృతితో భగవంతుడు తన చైతన్యశక్తితో - పరాశక్తితో ప్రవేశించగానే జడమైన అపరాశక్తికి చైతన్యము కలిగి అది తనలోనుండి యింకొక వస్తువును పుట్టించుచున్నది. ఈ ప్రకారముగా ప్రపంచ ములోని వస్తువులన్నియు అపరాశక్తి రూపములు - అపరశక్తి వికారములు - ప్రకృతి యొక్క వికారములు - ఆ వస్తువులోనున్న చైతన్య శక్తి - ENERGY - పరమాత్మ అంశయే - అందుచేతనే ప్రకృతి పురుష సం యోగము వలననే సృష్టి జరుగుచున్నదని చెప్పబడినది - (creation is the result of the combination of matter and ENERGY).

  1. ప్రపంచము పరబ్రహ్మలోనుండి పుట్టినది - ఎట్లనగా పరబ్రహ్మలోనుండి మహత్తత్వము, దానిలోనుండి అహంకారము - దానిలోనుండి పంచతన్మాత్రలు, వాటిలోనుండి పంచభూతములు - వాటి కలియుటవలన ప్రపంచములోని వస్తువులన్నియు పుట్టినవి - పరబ్రహ్మలోనుండి ఇవన్నియు పుట్టినవి కనుక ఇవన్నియు పరబ్రహ్మరూపములే - అందుచేత ప్రపంచమంతయు మరబ్రహ్మమే. ప్రపంచమనునది పరమార్థ దృష్టిలో లేదు. ప్రపంచమనునది - దానిలోని వస్తువులు - వేరువేరుగా కనబడుట మాయయే - మాయ యనగా ‘యామా సా మాయా’ (ఏది లేదో అదే మాయ). అంతా పరబ్రహ్మమే అయినప్పుడు ప్రపంచము లేనిదే పరబ్రహ్మకాక ఇది ప్రపంచము అనేక వస్తువులు కలిసియున్నవి యని మనమనుకొనుట భ్రాంతి, అనేకవస్తువులుగల యీ ప్రపంచము మాయ. మాయయే ప్రకృతి - అపరా ప్రకృతి. ఈ అపరాప్రకృతియే అనేక రూపములుగా మారుచున్నది. ఉన్నదంతా పరబ్రహ్మమే కనుక అతను అద్వయుడు - అందుచేత ఈ ప్రపంచము అద్వైతము - ఎట్లంటే–

    1. “ప్రపంచో యది విద్యేత నివర్తత న సంశయః |

మాయామాత్రమిదం ద్వైతమద్వైతం పరమార్థతః ||“. (గౌదపాదకారిక - 1 - 17)

(ప్రపంచము కనబడుచున్నట్లు - ఉన్నట్లు - తోచును. కాని యది లేకుండ పోవును - ద్వైతము అని - బ్రహ్మ కాక రెండవ వస్తువుగా - తోచినను. ఆ అభిప్రాయము తొలగిపోవును - ద్వైతవస్తువుగా కనబడునది మాయా మాత్రము - మాయవలన ఉన్నట్లు తోచును, కాని పరమార్థ దృష్టిలో లేనిదే - అద్వైతమే.

  1. “ఇదం ప్రపంచం యత్కించిత్ యద్యత్ జగతి వీక్ష్యతే| దృశ్యరూపం, దృగ్రూపం సర్వం శశవిషాణవత్ ||”.

ఇతి శ్రుత్యనురోధేన ప్రపంచస్య నిష్ప్రతియోగికా భావరూపత్వం సిద్ధం“.

(ఈ ప్రపంచము - దృక్ రూపము, దృశ్యరూపము - కలదంతయు కుందేటికొమ్మువలె లేనిదే అని శ్రుతి చెప్పుటవలన ప్రపంచము లేనిదే, పరబ్రహ్మకంటె రెండవ వస్తువులేదు కనుక ప్రపంచము లేనిదే).

  1. “రజ్జువునందు సర్పభ్రాంతి కలుగునట్లు ద్రవ్యాంతరంబులచేత బ్రహ్మంబయిన నీ యందు ప్రపంచభ్రాంతి గలిగెడిని”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 9 - 343)

(చీకటిలో త్రాడును చూచి అది పాము అని అనుకొనినట్లే అజ్ఞానముచేత ఈ ప్రపంచము పరబ్రహ్మమే అయినను అతనికంటె వేరుగా కనబడుచున్నది).

  1. “ఘటమందు తోచిన భావమెల్లాను మృత్తికేగాని ఘటమనేది లేదు. చిన్మాత్రమైన తనయందు ప్రపంచకము లేదనేదే సత్యం - ఇందుకు శ్రుతి -”నామరూపే వ్యాకరవాణి - వాచారంభణం వికారో నామధేయం మృత్తికాత్యేవ సత్యం“;”ఏకం సత్యం బహుథా కల్పయంతి” అని ఛాందోగ్యము” - (బ్రహ్మవిద్యాసుధార్ణవము)

(కుండను చూచిన దానిలోని మట్టియే స్ఫురణకు వచ్చును, అది మట్టియే యనిపించును, దాని నిజస్థితి మట్టియే. ఇది అంతయు సత్యస్వరూపుడు, సన్మాత్రుడు అయిన పరబ్రహ్మమే అనుటయే సత్యమైనది. అందులో - పరబ్రహ్మ విశ్వరూపములో – కనుపించి నట్లుండు ప్రపంచము లేనిదే. ఈ విషయముగుఱించి శ్రుతి యిట్లు చెప్పుచున్నది. - “నామరూపములుగలవి చేసెదను - నామరూపములుగలవిగా నేనే మారెదను. వేఱువేఱు నామరూపములు కలిగియున్నను, మట్టికుండ, మూకుడు మొదలగు అనేక రూపములు, నామములు రూపములు అనేకములు కలిగియున్నను అసలు అవి మట్టి మాత్రమే యనునదియే సత్యము. అట్లే ప్రపంచరూపముతోను, అనేకనామములతోను మారినను అంతయు, అవన్నియు భగవంతుడే యనునదియే సత్యము”).

  1. రజ్జువని యెఱింగెడి యెఱుకలేకుండ నయ్యెఱుంగమినది సర్పరూపంబై తోచిన పిదప నెఱింగిన వారివలన రజ్జువు రజ్జువని యెఱుంగుచుండ సర్పరూపంబు లేకుండు కైవడి, యప్పరమాత్మ యని యెవ్వఱెఱుంగరు వారి కయ్యెఱుంగమి వలన సకల ప్రపంచంబు గలిగి తోచు - ఆత్మయ ప్పరమాత్మ యని యెవ్వరెఱుంగుదురు వారికయ్యెఱుక వలన బ్రపంచంబు లేకుండు.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ - భా - 569)

  1. “మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా విజృంభితంబు” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 3 - 64)

  1. “ఓకటే యగు పృధివికి ఉత్తమ మధ్యమాధమ భేదములుగల మణి, సూర్యకాంతపాషాణాది వైచిత్ర్యము కలుగుచున్నది. ఏక పృధివ్యాశ్రయములగు బీజములకు చందన, కింపాక, చంపక గుల్మలతాది రూపము కలిగి బహువిధ పత్రపుష్ప ఫల గంధ రసాది వైచిత్ర్యము కలుగుచున్నది. మరియు నొక్కటగు నన్న రసమునకు నఖ కేశ దంత రక్తమాంసాది వైచిత్ర్యము కలుగుచున్నది. అటులనే యేకమగు బ్రహ్మమునకుజీవ ప్రపంచ వైచిత్ర్యములు కలుగుచున్నవి”.

  2. “యోయం సంసారీ జీవః స ఉభయలక్షణేన తత్వప్రతిబోధ రూపేణ బీజాత్మనా అన్యథా గ్రహణ లక్షణేన చ, అనాదికాల ప్రవృత్తేన మాయా లక్షణేన, స్వాపం మమాయం పితా, పుత్రో అయం, ఇమాని గృహ క్షేత్రాదీని అహ మేషాం స్వామీ, సుఖీ, దుఃఖీ, క్షుభితోహం, వర్థితశ్చాహమనే నేత్యేవం ప్రకారాన్ స్వప్నాన్ స్థానద్వయే పశ్యన్ సుప్తః యథా - వేదాంతార్థ తత్వాభి జ్ఞానేన పరమకారుణికేన గురుణా”నాసిత్వం సంసారీ, కింతు “తత్వమసీతి” ప్రతిబోధ్యమానో భవతి. తథా ఏవం బుద్ధ్యతే - కథం? జన్మాది భావ వికార రహితం నివృత్తాజ్ఞాన తత్కార్యం తురీయ మద్వైత మాత్మానం బుద్ధ్యతే ఇతి. ప్రపంచః నత్వస్తి, రజ్వాం సర్ప ఇవ కల్పిత్వాత్ నహి రజ్జ్వాం కల్పిత సర్పోవిద్యమానః సన్ వివేకతో నివృత్తః; స చ మాయా మాయావినా కల్పితా విద్యమానా స పునర్నివృత్తా - తదుత్తం -“.

” ప్రపంచో యధి విద్యేత నివర్తేతన సంశయః |

మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః ||“.

(సంసారి యైన ఈ జీవుడు అనాదికాలమునుండియున్న మాయవలన స్వప్నమందువలె - “ఇతను నా తండ్రి,ఈతను నాకొడుకు, ఇవన్నీ నా గృహములు, భూములు, వీటికి నేను అధికారిని, నాకు దుఃఖము కలుగుచున్నది; నాకు సుఖము కలుగుచున్నది; నేను నీరసించిపోవుచున్నాను; వృద్ధిపొందుచున్నాను - అని యీప్రకారముగా స్వప్నములను కనుచుండువాడు. ఉపనిషత్తులలోని తత్వార్థమును తెలిసినటువంటిన్నీ, గొప్ప దయకలిగినటువంటిన్నీ గురువు -”నీవు సంసారివికావు, కాని యా పరబ్రహ్మవే నీవు” అని చెప్పగా జ్ఞానోదయము గలవాడగుచున్నాడు. అది ఎట్లనగా - పుట్టినది మొదలుగా వికారములు లేనటువంటిన్నీ, అజ్ఞానముకాని కార్యములు మొదలగువాటి ప్రభావము లేనటువంటిన్నీ, తురీయము, అద్వైతము అయిన ఆత్మజ్ఞానము కలిగియుండును - ప్రపంచమనునది లేదు, చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనినట్లే. త్రాడు పామువలె కనుపించెనేగాని అది నిజముగా పాముకాదు, అక్కడ పాము లేదు అని వివేకమువలన తెలుసుకొనును - మాయావి చేత కల్పించబడిన మాయ కానరాదు - ఆ మాయ మరల మాయమగును - ఈ విషయము ఇట్లు చెప్పబడినది : -” ప్రపంచము ఉన్నట్లు కనబడినను, తప్పక మాయావి మాయవలె మాయమగు నదే, అందుచేత పరమాత్మకాని యీ రెండవ వస్తువువలె కనుపించు ఈ ద్వైతప్రపంచము మాయా మాత్రము - పరమార్థ దృష్టిలో ఇదంతయు అద్వైతమే - రెండవ వస్తువులేని పరమాత్మయే).

  1. “అస్మన్మతేతు ప్రపంచో న సన్, నాసన్, కింతు అనిర్వచనీయః ఏవ” -

(కనబడు ప్రపంచమంతయు అనిర్వచనీయము అని మా అభిప్రాయము - ఇది ఇట్టిదని చెప్పుటకు వలను పడదు - సద్రూపమనికాని, అసద్రూపమనిగాని - ఉన్నదనికాని, లేనిదనికాని -, సదసద్రూపమనిగాని చెప్పుటకు వీలుకానిది. “నేహ నానాస్తి కించన” ఈ బ్రహ్మమునందు ఏ విధమైన భేదము కనబడలేదు - ఇది అంతయు ఒకటిగానే యున్నది. ‘దీనిలో మఱియొక వస్తువులేదు’ అని ఉపనిషత్తులు చెప్పు చున్నందున ప్రపంచము సద్రూపమనుటకు వీలులేదు, సద్రూపమనునది ఒకటే, అది బ్రహ్మ్నమే కనుక కుందేటికొమ్ము అసత్ (లేనిదే). దానివలె ప్రపంచము అసత్ అనినయడల ప్రపంచము లేకపోలేదు - కనబడుచున్నది. అందుచేత ప్రపంచము అసద్రూపముకాదు. సత్తుకాదు, అసత్తుకాదు అని కూడ చెప్పలేము - చెప్పుటకు వీలులేదు - అందుచేత అనిర్వాచ్యము - ఇంద్రజాలికుని పనులవలె మిధ్యాభూతము - అందుచేతనే ప్రపంచమును ‘మిధ్య’ - ఏమిటో తెలియనిది – అని చెప్పుచున్నారు - ఇదియే మాయ - “వాచారంభణం వికారో నామధేయం, మృత్తికేత్యేవ సత్యం” (వాక్కుచే వేఱువేఱుగా చెప్పబడుచున్నవి. మట్టి కుండగాను, మూకుడుగాను మారుచున్నది. ఇది మట్టియొక్క వికారములే, మార్పులే, పేర్లు (తేడా) వేరుకాని ఆ కుండ మూకుడు మొదలగునవన్నియు వాస్తవముగా మట్టియే. వాటికి కారణమైన మట్టివలె ప్రపంచమునకు కారణమైన పరబ్రహ్మయే సత్యము. కార్యవస్తువులైన కుండ,మూకుడువలె బ్రహ్మ కార్యవస్తువైన ప్రపంచము మిథ్యాభూతము).

  1. “ఉ. వాయువశంబులై యెగసి వారిధరంబులు మింట గూడుచున్

బాయుచునుండు కైవడి బ్రపంచము సర్వము గాల తంత్రమై

పాయుచు గూడుచుండు - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 9 - 173)

(ఆకాశములో మేఘములు గాలివలన ఒకచోట కలియుచు, విడిపోవునట్లు ఈ ప్రపంచము కాలము నడ చుటవలన ఒకప్పుడు ప్రపంచమువలె రూపముతో కనబడును - ఇంకనొకప్పుడు అవి విడిచిపోయి లేకుండపోవును. కాలము జరుగుచుండుట వల్లనే ప్రపంచముయొక్క సృష్టిలయములు జరుగుచున్నవి - ఈ సృష్టిలోని ప్రతివస్తువు కాలముగడిచినకొలది మార్పు చెందుచుండును - జన్మమొదలు మరణమువరకు గల మార్పులు క్షణక్షణము జరుగుచునే యుండును - ఈ మార్పు కంటికి కనబడకుండ గనే విరామములేకుండ జరుగుచున్నది. ఇట్లు మార్పులు జరుగుచున్నది కనుకనే ఈ ప్రపంచమును ‘జగత్’ అని చెప్పియున్నారు - (That which undergoes a change almost every moment without pause). - “కాలవేగంబున సర్వ ప్రపంచంబునకు నవస్థాంత రంబులు గల్గుచుండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 12 - 24 -)

(It is a continuous process from సృష్టి to ప్రళయం and from ప్రళయం to సృష్టి - one follows the other as day follows night and night follows day).

Transliteration
  1. jagattu.

  2. dṛśyaṃ.

(ī kanabaḍu vastuvulanniyukalisi okaṭigā nunnadē prapaṃcamu).

  1. prakarṣēṇa paṃcīkṛtamiti prapaṃcaṃ.

(atyaṃta utkṛṣṭamaina sthitilō paṃcabhūtamulu kaliyuṭavalana kaliginadi kanuka prapaṃcamu ani ceppabaḍucunnadi - pṛdhivi, nīru, agni, vāyuvu, ākāśamu - ī ayidu bhūtamulu okadānilōnokaṭi kaliyuṭavalana ā kalisina vastuvu pāṃcabhautikamu. aṭlu pāṃca bhautikamulagu vastuvulanniyu kalisi prapaṃcamani ceppabaḍucunnadi).

  1. ī prapaṃcamaṃtayu bhagavaṃtunivalana - bhagavaṃtunilōnuṃḍi - okavastuvulōnuṃḍi iṃkokaṭi puṭṭinaṭlu - puṭṭinadi. adi yeṭlanagā : -

    1. “sadēva sōmya idamagra āsīt” (chāṃdōgyōpaniṣat - 6 - 2 - 1)

(ī prapaṃcamu puṭṭakamuṃdu - sṛṣṭikimuṃdu - ippuḍu kanabaḍu ī prapaṃcamaṃtayu okaṭē ayina ātmagā nuṃḍenu). (satpadphārthamugānē yuṃḍenu).

  1. “ātmāvā idamēka ēvāgra āsīt” - “nānyat kiṃcana miṣat” (aitarēyōpaniṣat - 2 - 4 - 1 - 1)

(ī prapaṃcamu puṭṭakamuṃdu idi aṃtayū - ī kanabaḍu prapaṃcamaṃtayu okka ātmagānē uṃḍenu - ī ātma tappa iṃkēmiyunu lēdu).

  1. “brahmavā idaṃ agra āsīt” (bṛhadāraṇyakōpaniṣat - 1 - 4 - 10)

(ī prapaṃcamu puṭṭakamuṃdu ī prapaṃcamaṃtayu okka brahmamātramugānē yuṃḍenu).

(paina ceppabaḍina vākyamulavalana paramātma okkaḍē sṛṣṭikimuṃdu uṃḍenaniyu, atanē sṛṣṭilōni vastuvulanniṃṭigā mārenaniyu, - prapaṃcamugā mārenaniyu, aṃduvalana prapaṃcamunaku mūlamu - kāraṇamu - paramātmayē aniyu teliyucunnadi. ghaṭamu - kuṃḍa - tayārukākamuṃdu adi maṭṭigānē yuṃḍenu - ā mannē kuṃḍagā mārenu - aṃducēta kāraṇamaina maṭṭi kāryamaina maṭṭikaṃṭe vērukādu -

“yadhā ca kāraṇaṃ brahma triṣu kālēṣu satvaṃ na vyabhicarati, ēkaṃ ca, punassatvaṃ atō asyananyatvaṃ kāraṇā tkāryasya -”

(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 6 - 17)

(prapaṃcamunaku kāraṇamaina parabrahmaku mūḍu kālamulaṃdunu tana satvaguṇamulō mārpulēdu - okaṭē satvamugalavāḍugā nunnāḍu - aṭlē parabrahma tanayokka kāryamaina prapaṃcamugā mārinanu dānilōni para brahmayokka satvaguṇamu māralēdu - aṃducēta kāraṇamaina parabrahma kaṃṭe kāryamaina prapaṃcamu vēṟukādu. parabrahmamē prapaṃcamu, prapaṃcamē parabrahmamu).

    1. dadhighaṭa rucakāryarthibhiḥ pratiniyatāni kāraṇāni kṣīramṛttikā suvarṇā dīnyupādīya mānāni lōkēdṛśyaṃtē nahidaddhyarthibhiḥ mṛttikōpādīyatē, naghaṭādyarthibhiḥ -kṣīraṃ - - - kasmāt? kṣīrādēva dadhyutpadyatē, na mṛtti kāyāḥ? mṛttikayā ēva ca ghaṭa utpadyatē, na kṣīrāt (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē - 2 - 1 - 18)

(lōkamulō perugu, kuṃḍa, baṃgārapu ābharaṇamulu kāvalasinavāriki, vāṭiki kāvalasina upādānakāraṇamu (muḍi vastuvu - raw material) ayina pālu, mannu, baṃgāramu kāvalasi yuṃḍuṭa telisina viṣayamē - perugu cēyuvāru maṭṭitō perugu tayārucēya lēru - ā prakāramē kuṃḍacēyuvāru pālatō kuṃḍa tayāru cēya lēru - eṃducētananagā pālatō perugu cēyaḍamagunu, maṭṭitō kādu. maṭṭitō kuṃḍa cēyanagunu - pālatō kādu, parabrahmayē prapaṃcamunaku nimittakāraṇamu - ā prapaṃcamu sṛṣṭiṃcuṭaku kāvalasina upādānamu tānē kanuka prapaṃcamu naku upādānakāraṇamu; nimittakāraṇamu kūḍā bhagavaṃtuḍē).

  1. “ātmataḥ ē vēdaṃ sarvaṃ” (ī prapaṃcamaṃtayu ātmavalananē kaliginadi).

  2. “tathātmānaṃ svayama kuruta”. (ā parabrahma tananē ī prapaṃcamugā cēsenu).

  3. “tat sṛṣṭvā tadēvānuprāviśat - tadanupraviśya saccatyaccā bhavat”.

(ā parabrahma lōkamulanu sṛṣṭiṃci aṃdulō pravēśiṃcenu. aṭlu pravēśiṃci tānē ātma, anātmavastuvulugā āyenu - anagā, sūkṣmamulaina ākāśamu, vāyuvulu gānu, sthūlamulaina agni, jalamu, bhūmi bhagavaṃtuḍē mārenu - prati vastuvunakunu tānē nimittakāraṇamu, upādānakāraṇamu āyenu – prativastuvu lōnunna, upādāna kāraṇamu, nimittakāraṇamu tānē āyenu - aṃducēta prati vastuvu tānē āyenu).

  1. “upādānaṃ prapaṃcasya brahmaṇō anyanna vidyatē |

tasāt sarva prapaṃcōyaṃ brahmai vāsti na cētarat |

brahmaṇaḥ sarvabhūtāni jāyaṃtē paramātmanaḥ |

tasmādētāni brahmaiva bhavaṃtīti viciṃtaya |

brahmaiva sarvanāmāni rūpāṇi vividhāni ca |

karmāṇyapi samagrāṇi bhi bhartīti vibhāvaya |

suvarṇājjāya mānasya suvarṇatvaṃ ca śaśvataṃ |

brahmaṇō jāyamānasya brahmatvaṃ ca tathā bhavēt ||” (yōgaśikhōpaniṣat)

(prapaṃcamunaku upādānakāraṇamu parabrahmakāka maṟiyokaṭi kānarādu - aṃducēta ī prapaṃcamaṃtā brahmamē kāni maṟiyokaṭi kānēradu - paramātma ayina parabrahmavalana (parabrahmalōnuṃḍi) ī samasta bhūtamulu puṭṭucunnavi. aṃducēta nivi yanniyu brahmamēyani telusukonumu - anēka vidhamulayina nāmamu lanniyu, rūpamulanniyu, brahmamē. atanē yī samasta karmalanu bhariṃcuvāḍu. baṃgāramutō cēyabaḍina ābharaṇamulu eppaṭikī baṃgāramē. ā prakāramu gānē parabrahmanuṃḍipuṭṭina vastuvulanniyu - (vastuvulanniyu kalisi ayina prapaṃcamu kūḍā) - parabrahmamē).

  1. “vāsudēvassarvaṃ”. (idaṃtā - ī prapaṃcamaṃtayu vāsudēvuḍē).

  2. “ēkassa dēkaḥ paramaḥ parēśaḥ sa vāsudēvō na tadanyadasti |

ēkassamastaṃ yadihāsti kiṃcit na taducyatō nāsti paraṃ tatō(a)nyat |

sōhaṃ sacatvaṃ naca sarvamētat ātmasvarūpaṃ tyaja bhēdamōhaṃ ||“. (śrī viṣṇupurāṇē)

(sat anunadi, paramuḍu, parēśuḍu ayinavāḍu vāsudēvuḍokkaḍē - atanikaṃṭe vērainadi lēdu - ikkaḍa unnadī samastamu atanē, ā acyutunikaṃṭe itaramainadi yē koṃcemu lēdu, atanikaṃṭe utkṛṣṭamainadiyu lēdu - nēnē atanu, nīvē atanu, anniyu atanē, ātma svarūpuḍu atanē - ivanniyu vēṟu anu bhēda buddhi yanu mōhamu vadalivēyumu).

  1. “ādyaṃtālu vaḍlai nā naḍuma kasavu kaliginaṭlē ādyaṃtāna brahmamainā naḍuma prapaṃcāvāraṃ bhāsistunadi, ganuka sarvamunnū brahmamanē ceppavalenu”. (brahmavidyāsudhārṇavamu - 6)

(vittanamu nāṭinappuḍu dhānyamu, cēnu paṃṭaku vaccinapuḍu dhānyamu - kāni, ī madhyakālamulō - cēnu paṃṭaku vaccēvaraku - adi mokkagānē yuṃḍunu - ā mokka dhānyapugiṃja yokka vikāramē, dāni śarīramē, dāni rasamē - ā prakāramugānē sṛṣṭiki pūrvamu parabrahma okkaḍē uṃḍenu. sṛṣṭi layamaina tarvāta migili yuṃḍunadi parabrahma okkaḍē - (ādi śēṣuvu) - ī madhyakālamulō prapaṃcamanunadi tōcucunnadi - kāni adi atani rūpamē).

  1. “viśvamē vēdaṃ puruṣaḥ” (maṃtra puṣpamu)

(ī prapaṃcamaṃtayu puruṣuḍē - paramātmayē).

  1. “okaṭē vāyuvu sthānabhēdamucē prāṇāpānādi paṃcabhēdamulanu boṃdi yeṭlu vērvērupravṛttulu kaladagucunnadō, yaṭulanē okkaṭagu brahmamunu māyōpādhulacē nānātvamunu boṃdi prapaṃcabhāvamu kaladagucunnadi. prāṇāpānāduleṭlu vāyvananyamulō, yaṭulanē prapaṃcamunu brahma nanyamai yunnadi”.

  2. “sarvaṃ khilvidaṃ brahma -” “tajjalānīti śāṃta upāsīta”.

(ī prapaṃcamaṃtayu parabrahmamē - brahmalōnuṃḍi puṭṭinadi kanuka brahmamē - baṃgāramutō cēyabaḍinavastuvulanniyu baṃgāru vastuvulē - idi yeṭlaṃṭē - tajjalānīti śāṃta upāsīta” tat = ābrahmanuṃḍi, ja = puṭṭinavi; la = aṃdulōnē layamagucunnavi; an - ataniyaṃdē caliṃcucunnavi - atani cētanē pōṣiṃpa baḍucunnavi - anagā, - parabrahmalōnuṃḍi puṭṭi, parabrahmacētanē caliṃcucu, parabrahmalōnē layamagucunnavi. aṃducēta ī prapaṃcamu parabrahmakanna vēṟukādu, idi yaṃtayu parabrahmamē, parabrahmarūpamē ani śāṃtuḍaguvāḍu, rāgadvēṣamulu lēnivāḍu upāsiṃcavalenu. prapaṃcamulōni vastuvulanniyu parabrahma svarūpamulēkanuka aṃdulō ē vastuvunainanu parabrahmamugānē bhāviṃci upāsiṃcavalenu - iṭṭi pratīkōpāsanalō dōṣamulēdani teliyavalenu).

  1. “paramēśvarā! nīvu rajōguṇaṃbuna nakhilaṃbunu sṛjiyiṃci kāraṇarūpaṃbuna tadanu praviṣṭuṃḍavai kṛtadṛṣṭa kāryarūpa prapaṃcākāraṃbuna dīpiṃcucuṃduvu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1504)

  2. “adhyātma tatvaṃbavannaṃ baraṃjyōtivannaṃ brapaṃcaṃbavannannadhiṣṭātavannan, sadā sākṣipannaṃ guṇātīta nīvēkadā” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 203)

  1. parabrahma tānē ī padulālugu lōkamulugala prapaṃcamugā mārenanu viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō kriṃda vidhamugā varṇiṃpabaḍinadi -

“kālakarmasvabhāva prērakuṃḍayina paramēśvaruṃḍu jīvarūpaṃbuna mahāvaraṇa jalamadhyasthitaṃbaina brahmāṃḍaṃbulōnu socci, savistāraṃbu gāviṃci, yaṭṭi yaṃḍaṃbu bhēdiṃci nirgamiṃce neṭlaṃṭēni -

“ka. bhuvanātmakuḍā īśuḍu

bhavanākṛtitōḍanuṃḍu brahmāṃḍaṃbun

vivaramutō badunālugu

vivaraṃbulugā nonarce viśadaṃbulugan”.

“ma.bahupādōru bhujāna sēkṣaṇa śiraḥ phālaśravō yuktuḍai

vihariṃcun bahudēhi dēhagatuḍai vidvānsulūhiṃci, ta

dbahurūpāvayavaṃbulan bhuvanapaṃktin vicāriṃturu - -”

- - -

“caturdaśa lōkaṃbulaṃdu mīdi ēḍu lōkaṃbulu śrīmahāviṣṇuvunakuṃ gaṭi pradēśaṃbunanuṃḍi yūrdhva dēhamaniyunu, griṃda ēḍu lōkaṃbulu jaghanaṃbu nuṃḍi yadhō dēhamaniyunu balukuduru - - - bhūlōkaṃbu kaṭi paryaṃta pradēśaṃbu, bhuvarlōkaṃbu nābhi, suvarlōkaṃbu hṛdayaṃbu, maharlōkaṃbu vakṣaṃbu, janalōkaṃbu grīvaṃbu, tapōlōkaṃbustanadvayaṃbu, sanātanaṃbunu brahmanivāsaṃbununaina satyalōkaṃbu śiraṃbu, kaṭi pradēśaṃbatalaṃbu, toḍalu vitalaṃbu, jānuvulu sutalaṃbu, jaṃghalu dalātalaṃbu, gulphaṃbulu mahātalaṃbu, pādāgraṃbulu rasātalaṃbu, pādatalaṃbu pātāḷaṃbunani lōkamayuṃgā bhāviṃturu-”. (śrīmadāṃdhramahābhāgavataṃ u - 1 - 5 - 86 to 88, - 2 - 5 - 89)

  1. sṛṣṭiki muṃdu, sthitikālamulōnu ī prapaṃcamaṃtayunu brahmalōnē yuṃḍunu -

“sī. - - -

salila nabhasthala caramulu modalaina vividhajīvulatōḍi viśvamella

ā. viṣṇu mayamu, putraḥ vēyēla, brahmāṃḍa

matani jēnalōna naḍagiyuṃḍu,

buddhi neṟugarādu bhūta bhavadbhāvi

lōkamella viṣṇulōnanuṃḍu “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 90, 91)

  1. “cicchaktiḥ paramēśvarasya vimalaṃ caitanyamēvōcyatē |

tasyaivāsa jaḍā parābhagavata śśaktistvavidyātmikā |

saṃsargāccavidha stayōrbhagavata śśaktyōrjaga jjā yatē ||“. (saṃkṣēpa śārīrakamu)

(parabrahmaku reṃḍu śaktulunnavi - caitanyaśakti lēka parāśakti, reṃḍavadi jaḍaśakti - lēka aparāśakti.ī aparāśaktiyē avidyayani ceppabaḍucunnadi. parabrahmayokka ī reṃḍu śaktulu kaliyuṭacētanē - aparāśakti lēka aparāprakṛtitō bhagavaṃtuḍu tana caitanyaśaktitō - parāśaktitō pravēśiṃcagānē jaḍamaina aparāśaktiki caitanyamu kaligi adi tanalōnuṃḍi yiṃkoka vastuvunu puṭṭiṃcucunnadi. ī prakāramugā prapaṃca mulōni vastuvulanniyu aparāśakti rūpamulu - aparaśakti vikāramulu - prakṛti yokka vikāramulu - ā vastuvulōnunna caitanya śakti - ENERGY - paramātma aṃśayē - aṃducētanē prakṛti puruṣa saṃ yōgamu valananē sṛṣṭi jarugucunnadani ceppabaḍinadi - (creation is the result of the combination of matter and ENERGY).

  1. prapaṃcamu parabrahmalōnuṃḍi puṭṭinadi - eṭlanagā parabrahmalōnuṃḍi mahattatvamu, dānilōnuṃḍi ahaṃkāramu - dānilōnuṃḍi paṃcatanmātralu, vāṭilōnuṃḍi paṃcabhūtamulu - vāṭi kaliyuṭavalana prapaṃcamulōni vastuvulanniyu puṭṭinavi - parabrahmalōnuṃḍi ivanniyu puṭṭinavi kanuka ivanniyu parabrahmarūpamulē - aṃducēta prapaṃcamaṃtayu marabrahmamē. prapaṃcamanunadi paramārtha dṛṣṭilō lēdu. prapaṃcamanunadi - dānilōni vastuvulu - vēruvērugā kanabaḍuṭa māyayē - māya yanagā ‘yāmā sā māyā’ (ēdi lēdō adē māya). aṃtā parabrahmamē ayinappuḍu prapaṃcamu lēnidē parabrahmakāka idi prapaṃcamu anēka vastuvulu kalisiyunnavi yani manamanukonuṭa bhrāṃti, anēkavastuvulugala yī prapaṃcamu māya. māyayē prakṛti - aparā prakṛti. ī aparāprakṛtiyē anēka rūpamulugā mārucunnadi. unnadaṃtā parabrahmamē kanuka atanu advayuḍu - aṃducēta ī prapaṃcamu advaitamu - eṭlaṃṭē–

    1. “prapaṃcō yadi vidyēta nivartata na saṃśayaḥ |

māyāmātramidaṃ dvaitamadvaitaṃ paramārthataḥ ||“. (gaudapādakārika - 1 - 17)

(prapaṃcamu kanabaḍucunnaṭlu - unnaṭlu - tōcunu. kāni yadi lēkuṃḍa pōvunu - dvaitamu ani - brahma kāka reṃḍava vastuvugā - tōcinanu. ā abhiprāyamu tolagipōvunu - dvaitavastuvugā kanabaḍunadi māyā mātramu - māyavalana unnaṭlu tōcunu, kāni paramārtha dṛṣṭilō lēnidē - advaitamē.

  1. “idaṃ prapaṃcaṃ yatkiṃcit yadyat jagati vīkṣyatē| dṛśyarūpaṃ, dṛgrūpaṃ sarvaṃ śaśaviṣāṇavat ||”.

iti śrutyanurōdhēna prapaṃcasya niṣpratiyōgikā bhāvarūpatvaṃ siddhaṃ”.

(ī prapaṃcamu - dṛk rūpamu, dṛśyarūpamu - kaladaṃtayu kuṃdēṭikommuvale lēnidē ani śruti ceppuṭavalana prapaṃcamu lēnidē, parabrahmakaṃṭe reṃḍava vastuvulēdu kanuka prapaṃcamu lēnidē).

  1. “rajjuvunaṃdu sarpabhrāṃti kalugunaṭlu dravyāṃtaraṃbulacēta brahmaṃbayina nī yaṃdu prapaṃcabhrāṃti galigeḍini”

(śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 9 - 343)

(cīkaṭilō trāḍunu cūci adi pāmu ani anukoninaṭlē ajñānamucēta ī prapaṃcamu parabrahmamē ayinanu atanikaṃṭe vērugā kanabaḍucunnadi).

  1. “ghaṭamaṃdu tōcina bhāvamellānu mṛttikēgāni ghaṭamanēdi lēdu. cinmātramaina tanayaṃdu prapaṃcakamu lēdanēdē satyaṃ - iṃduku śruti -”nāmarūpē vyākaravāṇi - vācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ mṛttikātyēva satyaṃ”; “ēkaṃ satyaṃ bahuthā kalpayaṃti” ani chāṃdōgyamu” - (brahmavidyāsudhārṇavamu)

(kuṃḍanu cūcina dānilōni maṭṭiyē sphuraṇaku vaccunu, adi maṭṭiyē yanipiṃcunu, dāni nijasthiti maṭṭiyē. idi aṃtayu satyasvarūpuḍu, sanmātruḍu ayina parabrahmamē anuṭayē satyamainadi. aṃdulō - parabrahma viśvarūpamulō – kanupiṃci naṭluṃḍu prapaṃcamu lēnidē. ī viṣayamuguṟiṃci śruti yiṭlu ceppucunnadi. - “nāmarūpamulugalavi cēsedanu - nāmarūpamulugalavigā nēnē māredanu. vēṟuvēṟu nāmarūpamulu kaligiyunnanu, maṭṭikuṃḍa, mūkuḍu modalagu anēka rūpamulu, nāmamulu rūpamulu anēkamulu kaligiyunnanu asalu avi maṭṭi mātramē yanunadiyē satyamu. aṭlē prapaṃcarūpamutōnu, anēkanāmamulatōnu mārinanu aṃtayu, avanniyu bhagavaṃtuḍē yanunadiyē satyamu”).

  1. rajjuvani yeṟiṃgeḍi yeṟukalēkuṃḍa nayyeṟuṃgaminadi sarparūpaṃbai tōcina pidapa neṟiṃgina vārivalana rajjuvu rajjuvani yeṟuṃgucuṃḍa sarparūpaṃbu lēkuṃḍu kaivaḍi, yapparamātma yani yevvaṟeṟuṃgaru vāri kayyeṟuṃgami valana sakala prapaṃcaṃbu galigi tōcu - ātmaya pparamātma yani yevvareṟuṃguduru vārikayyeṟuka valana brapaṃcaṃbu lēkuṃḍu.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū - bhā - 569)

  1. “mahāścaryakaraṃbai guṇatrayātmakaṃbagu prapaṃcaṃbu bhavadīya māyā vijṛṃbhitaṃbu” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 3 - 64)

  1. “ōkaṭē yagu pṛdhiviki uttama madhyamādhama bhēdamulugala maṇi, sūryakāṃtapāṣāṇādi vaicitryamu kalugucunnadi. ēka pṛdhivyāśrayamulagu bījamulaku caṃdana, kiṃpāka, caṃpaka gulmalatādi rūpamu kaligi bahuvidha patrapuṣpa phala gaṃdha rasādi vaicitryamu kalugucunnadi. mariyu nokkaṭagu nanna rasamunaku nakha kēśa daṃta raktamāṃsādi vaicitryamu kalugucunnadi. aṭulanē yēkamagu brahmamunakujīva prapaṃca vaicitryamulu kalugucunnavi”.

  2. “yōyaṃ saṃsārī jīvaḥ sa ubhayalakṣaṇēna tatvapratibōdha rūpēṇa bījātmanā anyathā grahaṇa lakṣaṇēna ca, anādikāla pravṛttēna māyā lakṣaṇēna, svāpaṃ mamāyaṃ pitā, putrō ayaṃ, imāni gṛha kṣētrādīni aha mēṣāṃ svāmī, sukhī, duḥkhī, kṣubhitōhaṃ, varthitaścāhamanē nētyēvaṃ prakārān svapnān sthānadvayē paśyan suptaḥ yathā - vēdāṃtārtha tatvābhi jñānēna paramakāruṇikēna guruṇā”nāsitvaṃ saṃsārī, kiṃtu “tatvamasīti” pratibōdhyamānō bhavati. tathā ēvaṃ buddhyatē - kathaṃ? janmādi bhāva vikāra rahitaṃ nivṛttājñāna tatkāryaṃ turīya madvaita mātmānaṃ buddhyatē iti. prapaṃcaḥ natvasti, rajvāṃ sarpa iva kalpitvāt nahi rajjvāṃ kalpita sarpōvidyamānaḥ san vivēkatō nivṛttaḥ; sa ca māyā māyāvinā kalpitā vidyamānā sa punarnivṛttā - taduttaṃ -“.

” prapaṃcō yadhi vidyēta nivartētana saṃśayaḥ |

māyāmātramidaṃ dvaitaṃ advaitaṃ paramārthataḥ ||“.

(saṃsāri yaina ī jīvuḍu anādikālamunuṃḍiyunna māyavalana svapnamaṃduvale - “itanu nā taṃḍri,ītanu nākoḍuku, ivannī nā gṛhamulu, bhūmulu, vīṭiki nēnu adhikārini, nāku duḥkhamu kalugucunnadi; nāku sukhamu kalugucunnadi; nēnu nīrasiṃcipōvucunnānu; vṛddhipoṃducunnānu - ani yīprakāramugā svapnamulanu kanucuṃḍuvāḍu. upaniṣattulalōni tatvārthamunu telisinaṭuvaṃṭinnī, goppa dayakaliginaṭuvaṃṭinnī guruvu -”nīvu saṃsārivikāvu, kāni yā parabrahmavē nīvu” ani ceppagā jñānōdayamu galavāḍagucunnāḍu. adi eṭlanagā - puṭṭinadi modalugā vikāramulu lēnaṭuvaṃṭinnī, ajñānamukāni kāryamulu modalaguvāṭi prabhāvamu lēnaṭuvaṃṭinnī, turīyamu, advaitamu ayina ātmajñānamu kaligiyuṃḍunu - prapaṃcamanunadi lēdu, cīkaṭilō trāḍunu cūci pāmu anukoninaṭlē. trāḍu pāmuvale kanupiṃcenēgāni adi nijamugā pāmukādu, akkaḍa pāmu lēdu ani vivēkamuvalana telusukonunu - māyāvi cēta kalpiṃcabaḍina māya kānarādu - ā māya marala māyamagunu - ī viṣayamu iṭlu ceppabaḍinadi : -” prapaṃcamu unnaṭlu kanabaḍinanu, tappaka māyāvi māyavale māyamagu nadē, aṃducēta paramātmakāni yī reṃḍava vastuvuvale kanupiṃcu ī dvaitaprapaṃcamu māyā mātramu - paramārtha dṛṣṭilō idaṃtayu advaitamē - reṃḍava vastuvulēni paramātmayē).

  1. “asmanmatētu prapaṃcō na san, nāsan, kiṃtu anirvacanīyaḥ ēva” -

(kanabaḍu prapaṃcamaṃtayu anirvacanīyamu ani mā abhiprāyamu - idi iṭṭidani ceppuṭaku valanu paḍadu - sadrūpamanikāni, asadrūpamanigāni - unnadanikāni, lēnidanikāni -, sadasadrūpamanigāni ceppuṭaku vīlukānidi. “nēha nānāsti kiṃcana” ī brahmamunaṃdu ē vidhamaina bhēdamu kanabaḍalēdu - idi aṃtayu okaṭigānē yunnadi. ‘dīnilō maṟiyoka vastuvulēdu’ ani upaniṣattulu ceppu cunnaṃduna prapaṃcamu sadrūpamanuṭaku vīlulēdu, sadrūpamanunadi okaṭē, adi brahmnamē kanuka kuṃdēṭikommu asat (lēnidē). dānivale prapaṃcamu asat aninayaḍala prapaṃcamu lēkapōlēdu - kanabaḍucunnadi. aṃducēta prapaṃcamu asadrūpamukādu. sattukādu, asattukādu ani kūḍa ceppalēmu - ceppuṭaku vīlulēdu - aṃducēta anirvācyamu - iṃdrajālikuni panulavale midhyābhūtamu - aṃducētanē prapaṃcamunu ‘midhya’ - ēmiṭō teliyanidi – ani ceppucunnāru - idiyē māya - “vācāraṃbhaṇaṃ vikārō nāmadhēyaṃ, mṛttikētyēva satyaṃ” (vākkucē vēṟuvēṟugā ceppabaḍucunnavi. maṭṭi kuṃḍagānu, mūkuḍugānu mārucunnadi. idi maṭṭiyokka vikāramulē, mārpulē, pērlu (tēḍā) vērukāni ā kuṃḍa mūkuḍu modalagunavanniyu vāstavamugā maṭṭiyē. vāṭiki kāraṇamaina maṭṭivale prapaṃcamunaku kāraṇamaina parabrahmayē satyamu. kāryavastuvulaina kuṃḍa,mūkuḍuvale brahma kāryavastuvaina prapaṃcamu mithyābhūtamu).

  1. “u. vāyuvaśaṃbulai yegasi vāridharaṃbulu miṃṭa gūḍucun

bāyucunuṃḍu kaivaḍi brapaṃcamu sarvamu gāla taṃtramai

pāyucu gūḍucuṃḍu - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 9 - 173)

(ākāśamulō mēghamulu gālivalana okacōṭa kaliyucu, viḍipōvunaṭlu ī prapaṃcamu kālamu naḍa cuṭavalana okappuḍu prapaṃcamuvale rūpamutō kanabaḍunu - iṃkanokappuḍu avi viḍicipōyi lēkuṃḍapōvunu. kālamu jarugucuṃḍuṭa vallanē prapaṃcamuyokka sṛṣṭilayamulu jarugucunnavi - ī sṛṣṭilōni prativastuvu kālamugaḍicinakoladi mārpu ceṃducuṃḍunu - janmamodalu maraṇamuvaraku gala mārpulu kṣaṇakṣaṇamu jarugucunē yuṃḍunu - ī mārpu kaṃṭiki kanabaḍakuṃḍa ganē virāmamulēkuṃḍa jarugucunnadi. iṭlu mārpulu jarugucunnadi kanukanē ī prapaṃcamunu ‘jagat’ ani ceppiyunnāru - (That which undergoes a change almost every moment without pause). - “kālavēgaṃbuna sarva prapaṃcaṃbunaku navasthāṃta raṃbulu galgucuṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 12 - 24 -)

(It is a continuous process from sṛṣṭi to praḷayaṃ and from praḷayaṃ to sṛṣṭi - one follows the other as day follows night and night follows day).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.