← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రపంచవాసనలు prapaṃcavāsanalu

Original — తెలుగు
  1. సంస్కారములు -

  2. ఒక సృష్టి యందుండు ప్రపంచమువలెనే తర్వాత సృష్టియందుండు ప్రపంచముకూడా యుండును - “థాతా యథా పూర్వమకల్పయత్ - దివంచ పృద్వీం చాంతరిక్షం చాధోస్వః” (పూర్వపు సృష్టిలో వలెనే తర్వాత సృష్టి - అందులో దివము, భూమి, అంతరిక్షము, అధోలోకములు, స్వర్లోకము - మొదలగువాటితో – చతుర్ముఖ బ్రహ్మ కల్పించెను) అని శ్రుతి చెప్పుచున్నది. దీనిని బట్టి తెలియునదేమనగా - పూర్వము సృష్టి చేయబడిన ప్రపంచము - ప్రళయము సమయములో లయమైపోగా దానికి కారణ మైన ప్రకృతిలో లయమైన ప్రపంచముయొక్క సంస్కారము - సూక్ష్మ రూపములోనున్న ప్రపంచము - ప్రకృతిలో కలిసి యుండును. అందువలన ఆ సూక్ష్మరూపములోనున్న ప్రపంచమే మరల సృష్టి ప్రారంభసమయమపుడు స్థూలరూపము గైకొని స్థూల ప్రపంచరూపముగా మారును - కార్య వస్తువులు వాటి కారణవస్తువులలోనే లయమగును కనుక మొదటి ప్రపంచమునకు కారణము ప్రకృతి. అందుచేత అది ప్రకృతిలో లయమై మరల దానినుండియే ఉద్భవించును - ఈ ప్రకారముగా సృష్టి ప్రళయములు వాటి వాటి వాసనలతో మరలమరల ప్రవాహరూపముగా కలుగుచుండును).

Transliteration
  1. saṃskāramulu -

  2. oka sṛṣṭi yaṃduṃḍu prapaṃcamuvalenē tarvāta sṛṣṭiyaṃduṃḍu prapaṃcamukūḍā yuṃḍunu - “thātā yathā pūrvamakalpayat - divaṃca pṛdvīṃ cāṃtarikṣaṃ cādhōsvaḥ” (pūrvapu sṛṣṭilō valenē tarvāta sṛṣṭi - aṃdulō divamu, bhūmi, aṃtarikṣamu, adhōlōkamulu, svarlōkamu - modalaguvāṭitō – caturmukha brahma kalpiṃcenu) ani śruti ceppucunnadi. dīnini baṭṭi teliyunadēmanagā - pūrvamu sṛṣṭi cēyabaḍina prapaṃcamu - praḷayamu samayamulō layamaipōgā dāniki kāraṇa maina prakṛtilō layamaina prapaṃcamuyokka saṃskāramu - sūkṣma rūpamulōnunna prapaṃcamu - prakṛtilō kalisi yuṃḍunu. aṃduvalana ā sūkṣmarūpamulōnunna prapaṃcamē marala sṛṣṭi prāraṃbhasamayamapuḍu sthūlarūpamu gaikoni sthūla prapaṃcarūpamugā mārunu - kārya vastuvulu vāṭi kāraṇavastuvulalōnē layamagunu kanuka modaṭi prapaṃcamunaku kāraṇamu prakṛti. aṃducēta adi prakṛtilō layamai marala dāninuṃḍiyē udbhaviṃcunu - ī prakāramugā sṛṣṭi praḷayamulu vāṭi vāṭi vāsanalatō maralamarala pravāharūpamugā kalugucuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.