శరణాగతః, శరణం గతః. (శరణు పొందినవాడు, ఆశ్రయించినవాడు).
భక్తః; ప్రపత్తి ధర్మేణ భగవతః శరణాగతః.
(భగవద్భక్తుడు, ప్రపత్తి మార్గముద్వారా భగవంతుని శరణు పొందినవాడు).
(సంసారమను సముద్రమును దాటుటకు - తిరిగి జన్మ లేకుండుటకు - ఉపాయమును పొందినవాడు).
లోకించు ప్రపన్నులకును లోబడి కరుణా
లోకముల బోషింతును
నాకాశ్రితరక్షణములు నైసర్గికముల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1439)
“నీవే తప్ప ఇతః పరంబెరుగ, మన్నింపందగున్ దీనునిన్” అని భగవంతుని ఆశ్రయించుట
అకించిన్యో అనన్యగతిత్వ ధర్మ విశిష్టో భగవంతమాశ్రితః ప్రసన్నః - సోపిద్వివిధిః - త్రైసర్గిక పరో మోక్షపరో త్వితి. త్రైవర్గిక పరోనామ భగవంతః ఏవ ధర్మార్థకామాభిలాషీ; మోక్షపరస్తు సత్సంగ నిత్యానిత్య వివేకీ సతి సంసారే నిర్వేదాత్ వైరాగ్యే ఉత్పన్నే మోక్షేచ్ఛాయాం జాతాయాం తత్సిధ్ధ్యర్థం ఆచార్యో వేదసంపన్నం ఆచారలక్షిత గురుం సంశ్రిత్య తద్ద్వారా పురుషాకారభూతం శ్రియం ప్రతిపద్య భక్త్యాద్యుపాయాతురే అరక్తః, అత ఏవ కించినానన్యగతిః శ్రీమన్నారాయాణ చరణావేవ ఉపాయత్వేన యః స్వీకరోతి స ప్రపన్నః ప్రపత్తిః సర్వాధికారః -“.
(అకించనుడై - ఏమియు లేనివాడై, ఏదియు కోరనివాడై ఇంకొకగతిలేక - రక్షణలేక - భగవంతుని ఆశ్రయించినవాడు ప్రపన్నుడు. ప్రపన్నుడు రెండు విధములు - త్రైవర్గికపరుడు, మోక్షపరుడు. త్రైవర్గిక పరుడనగా – భగవంతుని వలన ధర్మార్థకామములను మూడువిధముల పురుషార్థములను కోరువాడు - మోక్షపరుడనగా సత్పురుషుల సంగము కలిగి ఏది నిత్యమైనదో, ఏది అనిత్యమైనదో అను వివేకముకలిగి, సంసారమందు నిర్వేదము కలిగి, వైరాగ్యము పుట్టుటవలన మోక్షము పొందుటకు కోరిక కలిగి అదిసిద్ధించుకొఱకు ఆచార్య లక్షణములుగల గురువును ఆశ్రయించి అతనిద్వారా పురుషాకారరూపమై ఐశ్వర్యమును పొంది భక్తియోగము మొదలగు ఉపాయములందాసక్తి లేనివాడై - ఇట్లుండుటవలన కించనుడు అనన్య గణకుడు - ఇంకొక గతిలేనివాడై - శ్రీమన్నారాయణుని పాదములే ఉపాయములని ఎవడు వాటిని స్వీకరించునో అట్టివాడు ప్రపన్నుడు. ప్రపన్నతకు అధికారి యగుట అవసరములేదు).
మత్తాతం మమసద్గురుం మమపరం మోహాంధ విచ్ఛేదనం |
మత్పుణ్యం మదనేక బాంధవజనం మజ్జీవనం మన్నిధిం |
మత్సిద్థిం మమ సర్వకర్మ సుకృతం రామం భజే తారకం ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 38)
(నా ప్రాణము, నన్ను అనుగ్రహించువాడు, నన్ను పాలించువాడు, నా ధ్యానములో నుండువాడు, నా సౌఖ్యమైనవాడు, నా తండ్రి, నా గురువు, నాకు పరమపదమైన వాడు, మోహమనెడి నా అంధకారమును పోగొట్టువాడు, నా పుణ్యమే అయినవాడు, నా బంధువులు తానే అయినవాడు, నా జీవనము - బ్రతుకుతెరవు - అయినవాడు, నాకు అన్నివిధముల నిధి అయినవాడు, నేను సిద్ధిని పొందుస్థానమైనవాడు, నా సమస్త కర్మల పుణ్యఫలమైనవాడు, నన్ను సంసారమునుండి తరింపచేయువాడు - అయిన శ్రీరామచంద్రుని భజించెదను - నాకు అన్నియు శ్రీరామచంద్రుడే).
śaraṇāgataḥ, śaraṇaṃ gataḥ. (śaraṇu poṃdinavāḍu, āśrayiṃcinavāḍu).
bhaktaḥ; prapatti dharmēṇa bhagavataḥ śaraṇāgataḥ.
(bhagavadbhaktuḍu, prapatti mārgamudvārā bhagavaṃtuni śaraṇu poṃdinavāḍu).
(saṃsāramanu samudramunu dāṭuṭaku - tirigi janma lēkuṃḍuṭaku - upāyamunu poṃdinavāḍu).
lōkiṃcu prapannulakunu lōbaḍi karuṇā
lōkamula bōṣiṃtunu
nākāśritarakṣaṇamulu naisargikamul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1439)
“nīvē tappa itaḥ paraṃberuga, manniṃpaṃdagun dīnunin” ani bhagavaṃtuni āśrayiṃcuṭa
akiṃcinyō ananyagatitva dharma viśiṣṭō bhagavaṃtamāśritaḥ prasannaḥ - sōpidvividhiḥ - traisargika parō mōkṣaparō tviti. traivargika parōnāma bhagavaṃtaḥ ēva dharmārthakāmābhilāṣī; mōkṣaparastu satsaṃga nityānitya vivēkī sati saṃsārē nirvēdāt vairāgyē utpannē mōkṣēcchāyāṃ jātāyāṃ tatsidhdhyarthaṃ ācāryō vēdasaṃpannaṃ ācāralakṣita guruṃ saṃśritya taddvārā puruṣākārabhūtaṃ śriyaṃ pratipadya bhaktyādyupāyāturē araktaḥ, ata ēva kiṃcinānanyagatiḥ śrīmannārāyāṇa caraṇāvēva upāyatvēna yaḥ svīkarōti sa prapannaḥ prapattiḥ sarvādhikāraḥ -“.
(akiṃcanuḍai - ēmiyu lēnivāḍai, ēdiyu kōranivāḍai iṃkokagatilēka - rakṣaṇalēka - bhagavaṃtuni āśrayiṃcinavāḍu prapannuḍu. prapannuḍu reṃḍu vidhamulu - traivargikaparuḍu, mōkṣaparuḍu. traivargika paruḍanagā – bhagavaṃtuni valana dharmārthakāmamulanu mūḍuvidhamula puruṣārthamulanu kōruvāḍu - mōkṣaparuḍanagā satpuruṣula saṃgamu kaligi ēdi nityamainadō, ēdi anityamainadō anu vivēkamukaligi, saṃsāramaṃdu nirvēdamu kaligi, vairāgyamu puṭṭuṭavalana mōkṣamu poṃduṭaku kōrika kaligi adisiddhiṃcukoṟaku ācārya lakṣaṇamulugala guruvunu āśrayiṃci atanidvārā puruṣākārarūpamai aiśvaryamunu poṃdi bhaktiyōgamu modalagu upāyamulaṃdāsakti lēnivāḍai - iṭluṃḍuṭavalana kiṃcanuḍu ananya gaṇakuḍu - iṃkoka gatilēnivāḍai - śrīmannārāyaṇuni pādamulē upāyamulani evaḍu vāṭini svīkariṃcunō aṭṭivāḍu prapannuḍu. prapannataku adhikāri yaguṭa avasaramulēdu).
mattātaṃ mamasadguruṃ mamaparaṃ mōhāṃdha vicchēdanaṃ |
matpuṇyaṃ madanēka bāṃdhavajanaṃ majjīvanaṃ mannidhiṃ |
matsidthiṃ mama sarvakarma sukṛtaṃ rāmaṃ bhajē tārakaṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 38)
(nā prāṇamu, nannu anugrahiṃcuvāḍu, nannu pāliṃcuvāḍu, nā dhyānamulō nuṃḍuvāḍu, nā saukhyamainavāḍu, nā taṃḍri, nā guruvu, nāku paramapadamaina vāḍu, mōhamaneḍi nā aṃdhakāramunu pōgoṭṭuvāḍu, nā puṇyamē ayinavāḍu, nā baṃdhuvulu tānē ayinavāḍu, nā jīvanamu - bratukuteravu - ayinavāḍu, nāku annividhamula nidhi ayinavāḍu, nēnu siddhini poṃdusthānamainavāḍu, nā samasta karmala puṇyaphalamainavāḍu, nannu saṃsāramunuṃḍi tariṃpacēyuvāḍu - ayina śrīrāmacaṃdruni bhajiṃcedanu - nāku anniyu śrīrāmacaṃdruḍē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.