← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రపత్తి prapatti

Original — తెలుగు
  1. శరణాగతి - ఆత్మార్పణము -

  2. ప్రకర్షేణ అర్థభావాత్ సర్వభావేన పత్తిః, భగవత్సన్నిదౌ ఆగతః -

(విషయములకు సంబంధించినవాటియందు అన్నివిధముల సంపర్కము పూర్తిగా వదలుకొని, నాకు అన్నీ భగవంతుడే అని ఆత్మ నివేదన చేయుట).

“పరిత్యక్తా మయా లంకా మిత్రాణి చ, ధనాని చ |

భవద్గతం హి రాజ్యం మే జీవితంచ సుఖాని చ ||” (శ్రీ వాల్మీకిరామాయణము)

(నేను నా నివాసస్థలమైన లంకను, నామిత్రులను, ధనమును - భోగభాగ్యములను - వదలివేసితిని. నా జీవితము, నా రాజ్యము సర్వ సుఖములు నీవే). ఈ ప్రకారముగా విభీషణునివలె భగవంతునియందు భక్తి కలిగి యుండుట).

  1. “భక్తి యొక్కటియే శ్రీమన్నారాయణుని చేరు మార్గము - తైల ధారవలె నవిచ్ఛిన్నముగ భగవంతుని దెసకు ప్రవహించు భావ ధారయే భక్తి. అట్టి భక్తియే పరిపక్వమై ప్రపత్తిరూపము దాల్చును - స్వప్రవృత్తి నివృత్తియేప్రపత్తి - అనగా భగవంతుని చేరుట నా చేతిలోని పని అను భావము వీడుటే ప్రపత్తి. భగవంతుని శరణు జొచ్చుటయే ప్రపత్తి”.

“భగవత్పవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తిః”

(భగవంతుని యడల కలుగు ప్రవృత్తికి విరోధి అయిన ప్రవృత్తి యొక్క నివృత్తియే ప్రపత్తి).

  1. తృప్త ప్రపత్తియు, నార్త ప్రపత్తియు ననన్ బ్రపత్తి యోగంబు ద్వివిధంబై యుండు. ముకుంద భక్తి పరిపాకంబువలన దేహ దేశకాలాదుల వైరాగ్యంబువలనను. నిత్య యుక్తంబులగు తాపత్రయ జనిత దుఃఖమ్ము వలనను సహిష్ణుతంజేసి విష్ణుదేవునిం గూర్చి యాక్రోశించునది యార్త ప్రపత్తియనం జనునది. గజేంద్రముఖ్యులందు విఖ్యాతంబయ్యె” (కులశేఖరమహీపాలచరిత్ర - 2 - 122)

  2. ప్రపత్తి రెండు విధములు - మానసిక ప్రపత్తి, వాచిక ప్రపత్తి. తన పడగల మీద తాండవమాడు శ్రీకృష్ణుని పద తాడనముచే వాక్కుచే పలుకలేక మనసులో అతనిని గుఱించి కాళీయుడు చేసినది మానసిక ప్రపత్తి. పూర్వ జన్మలో చేసిన పుణ్యమువలన కలిగిన భగవత్ జ్ఞానముతో గజేంద్రుడు భగవంతుని గుఱించి చేసిన స్తోత్రము - వాచిక ప్రపత్తి –

“నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్

రావే ఈశ్వర కావవే వరద, సం రక్షింపు భద్రాత్మికా“. (గజేంద్రమోక్షము - 8 - 4 - 90)

“హా కౄష్ణాచ్యుత హా కృపాలయ హరే హా పాండవానాం సఖే |

క్వాసి,క్వాసి, సుయోధనాధ్యపగతాం హా రక్షమాం ద్రౌపదీం |

ఇత్యుక్తో(అ)క్షయ వస్త్ర రక్షణతనుర్యో(అ)రక్షదాయ శుక్షణే |

ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతిః ||“. (శ్రీరామకర్ణామృతం - 4 - 79)

Transliteration
  1. śaraṇāgati - ātmārpaṇamu -

  2. prakarṣēṇa arthabhāvāt sarvabhāvēna pattiḥ, bhagavatsannidau āgataḥ -

(viṣayamulaku saṃbaṃdhiṃcinavāṭiyaṃdu annividhamula saṃparkamu pūrtigā vadalukoni, nāku annī bhagavaṃtuḍē ani ātma nivēdana cēyuṭa).

“parityaktā mayā laṃkā mitrāṇi ca, dhanāni ca |

bhavadgataṃ hi rājyaṃ mē jīvitaṃca sukhāni ca ||” (śrī vālmīkirāmāyaṇamu)

(nēnu nā nivāsasthalamaina laṃkanu, nāmitrulanu, dhanamunu - bhōgabhāgyamulanu - vadalivēsitini. nā jīvitamu, nā rājyamu sarva sukhamulu nīvē). ī prakāramugā vibhīṣaṇunivale bhagavaṃtuniyaṃdu bhakti kaligi yuṃḍuṭa).

  1. “bhakti yokkaṭiyē śrīmannārāyaṇuni cēru mārgamu - taila dhāravale navicchinnamuga bhagavaṃtuni desaku pravahiṃcu bhāva dhārayē bhakti. aṭṭi bhaktiyē paripakvamai prapattirūpamu dālcunu - svapravṛtti nivṛttiyēprapatti - anagā bhagavaṃtuni cēruṭa nā cētilōni pani anu bhāvamu vīḍuṭē prapatti. bhagavaṃtuni śaraṇu joccuṭayē prapatti”.

“bhagavatpavṛtti virōdhi svapravṛtti nivṛtti prapattiḥ”

(bhagavaṃtuni yaḍala kalugu pravṛttiki virōdhi ayina pravṛtti yokka nivṛttiyē prapatti).

  1. tṛpta prapattiyu, nārta prapattiyu nanan brapatti yōgaṃbu dvividhaṃbai yuṃḍu. mukuṃda bhakti paripākaṃbuvalana dēha dēśakālādula vairāgyaṃbuvalananu. nitya yuktaṃbulagu tāpatraya janita duḥkhammu valananu sahiṣṇutaṃjēsi viṣṇudēvuniṃ gūrci yākrōśiṃcunadi yārta prapattiyanaṃ janunadi. gajēṃdramukhyulaṃdu vikhyātaṃbayye” (kulaśēkharamahīpālacaritra - 2 - 122)

  2. prapatti reṃḍu vidhamulu - mānasika prapatti, vācika prapatti. tana paḍagala mīda tāṃḍavamāḍu śrīkṛṣṇuni pada tāḍanamucē vākkucē palukalēka manasulō atanini guṟiṃci kāḷīyuḍu cēsinadi mānasika prapatti. pūrva janmalō cēsina puṇyamuvalana kaligina bhagavat jñānamutō gajēṃdruḍu bhagavaṃtuni guṟiṃci cēsina stōtramu - vācika prapatti –

“nīvē tappa itaḥparaṃberuga manniṃpaṃdagun dīnunin

rāvē īśvara kāvavē varada, saṃ rakṣiṃpu bhadrātmikā”. (gajēṃdramōkṣamu - 8 - 4 - 90)

“hā kṝṣṇācyuta hā kṛpālaya harē hā pāṃḍavānāṃ sakhē |

kvāsi,kvāsi, suyōdhanādhyapagatāṃ hā rakṣamāṃ draupadīṃ |

ityuktō(a)kṣaya vastra rakṣaṇatanuryō(a)rakṣadāya śukṣaṇē |

ārtatrāṇa parāyaṇassa bhagavān nārāyaṇō mē gatiḥ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 79)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.