“సీ. ఎల్లకార్యములకు నేను ప్రథానకారణము” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. -)
(కారణమువలన కార్యము కలుగును. ఆ కార్యవస్తువులోనుండి మఱియొక వస్తువు పుట్టినపుడు మొదటి కార్యవస్తువు తరువాత దానికి కారణమగును - ఈ ప్రకారముగ నీ సృష్టిలోని సమస్త వస్తువులు కార్యములు, కారణములు కూడ అగుచున్నవి. కారణవస్తువులో భగవంతుని శక్తి (చిచ్ఛక్తి, చైతన్యశక్తి, లేక పరాశక్తి, పరాప్రకృతి) ఉండి దానిలోనుండి కార్యవస్తువును ఆవిర్భవింప చేయును - పుట్టినట్లు చేయును. భగవంతుడు లోన లేనిదే యే వస్తువైనను ఇంకొక వస్తువును పుట్టింపజాలదు. అందుచేత కారణవస్తువులన్నింటికి కారణమైనవాడు భగవంతుడే. భగవంతుని లోనుండి అన్ని వస్తువులు - ఒకదానిలోనుండి ఒకటిగా - పుట్టినవి. అందుచేత కారణవస్తువు లన్నింటికి అతను కారణమైనవాడు - మూలకారణము, మొదటికారణము - ” కారణ కార్య హేతువగు కంజదళాక్షునికంటె అన్యు లెవ్వారును లేరు
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 211)
“sī. ellakāryamulaku nēnu prathānakāraṇamu” (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. -)
(kāraṇamuvalana kāryamu kalugunu. ā kāryavastuvulōnuṃḍi maṟiyoka vastuvu puṭṭinapuḍu modaṭi kāryavastuvu taruvāta dāniki kāraṇamagunu - ī prakāramuga nī sṛṣṭilōni samasta vastuvulu kāryamulu, kāraṇamulu kūḍa agucunnavi. kāraṇavastuvulō bhagavaṃtuni śakti (cicchakti, caitanyaśakti, lēka parāśakti, parāprakṛti) uṃḍi dānilōnuṃḍi kāryavastuvunu āvirbhaviṃpa cēyunu - puṭṭinaṭlu cēyunu. bhagavaṃtuḍu lōna lēnidē yē vastuvainanu iṃkoka vastuvunu puṭṭiṃpajāladu. aṃducēta kāraṇavastuvulanniṃṭiki kāraṇamainavāḍu bhagavaṃtuḍē. bhagavaṃtuni lōnuṃḍi anni vastuvulu - okadānilōnuṃḍi okaṭigā - puṭṭinavi. aṃducēta kāraṇavastuvu lanniṃṭiki atanu kāraṇamainavāḍu - mūlakāraṇamu, modaṭikāraṇamu - ” kāraṇa kārya hētuvagu kaṃjadaḷākṣunikaṃṭe anyu levvārunu lēru
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 211)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.