← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రత్యాహారః pratyāhāraḥ

Original — తెలుగు
  1. “విషయేషు విచరతాం ఇంద్రియాణాం తేభ్యో నిరర్గళం నిర్విఘ్నం యదా హరణం స ప్రత్యాహారః”

(విషయముల గుఱించి పఱుగిడుచుండు ఇంద్రియములను అడ్డులేకుండునట్లు, విఘ్నము లేకుండునట్లు - లాగి పట్టి తనవశములో నుంచుకొనుట).

  1. “విషయేభ్య ఇంద్రియార్ధేభ్యః మనోనిరోధనం ప్రత్యాహారః”. (మండలబ్రాహ్మణోపనిషత్)

(ఇంద్రియార్థములైన విషయములనుండి మనస్సును నిరోధించుట).

  1. “స్వస్వ విష్యేభ్యః సకలేంద్రియ నిరోధిః ప్రత్యాహారః”

(ఇంద్రియములన్నింటిని వాటి వాటి విషయములనుండి నిరోధించుట).

  1. “శబ్దాది విషయంబులం బ్రవణంబులగు నింద్రియంబులంద్రిప్పి మానసంబున కధీనంబులు సేయుట ప్రత్యాహారంబు”. (ఆముక్తమాల్యద)

  2. “విషయేషు ఆత్మతాః దృష్ట్వా మనసశ్చిత్తమజ్జనం |

ప్రత్యాహారః సవిజ్ఞేయో అభ్యాసనీయో ముముక్షుభిః ||“.

(విషయములందు ఆత్మయని దృష్టి పెట్టుకొని మనస్సు చిత్తములో అణచియుంచుట ప్రత్యాహారము) - (దీనిని మోక్షము కోరువారు అభ్యాసము చేసుకోవలెను).

  1. “పంచవిధః ప్రత్యాహారః –

(1). విషయేషు విచరతామింద్రియాణాం బలాదాహరణం ప్రత్యాహారః

(2). యద్యత్పశ్యతి తత్సర్వమితి ప్రత్యాహారః

(3). నిత్యవిహితకర్మ ఫలత్యాగః ప్రత్యాహారః.

(4). సర్వ విషయ పరాఙ్ముఖత్వం ప్రత్యాహారః.

(5). “అష్టాదశసు మర్మస్థానేషు క్రమాద్ధారణం ప్రత్యాహారః”.

(క్రమాద్ధారణం = ధారణం హారణం, సంక్రమణం - పాదాంగుష్ట గుల్ఫ జంఘా జానూరు పాయుమేఢ్ర నాభి హృదయ కంఠ కూపతాలు నాసాక్షి భ్రూమధ్య లలాట మూర్థ్నాం స్థానాని. తేషు క్రమాత్ ఆరోహవరోహ క్రమేణ ప్రత్యాహరేత్. (శాండిల్యోపనిషత్)

(ప్రత్యాహారము అయిదు విధములు –

1. విషయములగుఱించి పరుగెత్తు ఇంద్రియము లను బలవంతముగా ఆహరించుట - లాగి పట్టి స్వధానములో నుంచుకొనుట.

2. చూచినదంతయు ఆత్మయేయని భావించుట.

3. నిత్యకర్మలందు, శాస్త్రములో విధించిన కర్మలఫలమందు, ఆశలేకుండుట.

4. విషయములన్నింటి యందు విముఖత కలిగియుండుట.

5. పదునెనిమిది మర్మస్థానములందు క్రమముగా ధారణకలిగియుండుట - క్రమముగా అనగా - పాదము, బొటనవ్రేలు, మడమలు, పిక్కలు, ముణుకులు, తొడలు, పాయువు, మేఢ్రము, బొడ్డు, హృదయము, కంఠము, తాలువ, ముక్కు, కండ్లు, కనుబొమలమధ్యమము, లలాటము, మూర్థ్నము (శిరస్సు) - ఈ స్థానములలో ఒకదానితర్వాత నొకదానిలో శిరస్సువరకు ధారణ చేయవలెను).

6. అనాత్మదేహాది గతాహం భావం ప్రతీచి ప్రత్యాహరణం ప్రత్యాహారః -

(ఆత్మగానిదేహము మొదలగువాటియందు అవి ‘నేనే’ యను అహంభావము లేకుండుట ప్రత్యాహారము).

  1. ఇంద్రియాణాం విచరతాం విషయేషు స్వభావతః |

బలాదా హరణం తేషాం ప్రత్యాహారస్స ఉచ్యతే |

యత్పశ్యతి తు తత్సర్వం బ్రహ్మ పశ్యన్సమాహితః |

ప్రత్యాహారో భవేదేషః బ్రహ్మ విద్భిః పురోదితః |

యద్యత్సుద్ధ మశుద్ధంవా కరోత్యా మరణాంతకం |

తత్సర్వం బ్రహ్మణే కుర్యాత్ ప్రత్యాహారస్స ఉచ్యతే |

అదవా నిత్యకర్మాణి బ్రహ్మారాధన బుద్ధితః |

కామ్యానిచ తథా కుర్వాత్ ప్రత్యాహారస్స ఉచ్యతే |

అధవా వాయుమాకృష్య స్థానాత్ స్థానం నిరోధయేత్ |

దంతమూలాత్తథా కంఠే కంఠాదురసి మారుతం |

ఉరోదేశాత్సమాకృష్య నాభిదేశే నిరోధయేత్ |

నాభిదేశాత్సమాకృష్య కుండల్యాం తు నిరోధయేత్ |

అదాపానాత్కటి ద్వంద్వే తదోరౌచ సుమధ్యమే |

తస్మాత్ జానుద్వయే జంఘే పాదాంగుష్టే నిరోధయేత్ |

ప్రత్యాహరమయముక్తస్తు ప్రత్యాహారపరైః పరా ||“. (దర్శనోపనిషత్)

(విషయములయడల వాటి వాటి నైజముననుసరించు ఇంద్రియములను బలవంతముగా లాగిపట్టి తన వశములోనుంచుకొనుట ప్రత్యాహారము. చూచినదంతయు పరబ్రహ్మయే యను భావము కలిగియుండుట ప్రత్యాహార మని బ్రహ్మ జ్ఞానముకలవారు చెప్పిరి. చనిపోవునంతవఱకు, మంచిదికాని, చెడ్డదికాని ఏ పని చేసినను అది పరబ్రహ్మకొఱకేయని భావించుట ప్రత్యాహారము - చేసిన కామ్యకర్మలుకాని, నిత్యకర్మలుకాని, పరబ్రహ్మారాధన కొఱకే చేసితినని తలచుట - ఆ బుద్ధితో ఆ పనులు చేయుట - ప్రత్యాహారము. వాయువుని లోనికి పీల్చి, ఒక స్థానములో నిరోధించియుంచి, ఆ స్థానమునుండి ఇంకొక స్థానములోనికి తెచ్చి అక్కడ దానిని నిరోధించి, ఈ ప్రకారము ఒకస్థానమునుండి ఇంకొక స్థానమునకు తెచ్చి, నిరోధించుచు ఉండవలెను - దంతమూలమునుండి కంఠమునకు, కంఠమునుండి హృదయమునకు వాయువును తీసుకొని వచ్చి అచ్చటనుండి బొడ్డునకు తీసుకొనిరావలెను - నాభినుండి కుండలీ ప్రదేశమునకు (మూలాధారమునకు) తీసుకొని రావలెను. అపానప్రదేశమునుండి కటి ప్రదేశమునకు అక్కడనుండి తొడలకు, పిక్కలకు, పాదాంగుష్టమునకు క్రమముగా తీసుకొనివచ్చి వాయువును నిరోధించవలెను. ఇట్లు చేయుట ప్రత్యాహారమని ప్రత్యాహారపరులైనవారు - ప్రత్యాహారము చేయుటయందే మనస్సుకలవారు - చెప్పుచున్నారు).

  1. “స్వవిషయ సంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః -”. (పతంజలి యోగసూత్రములు)

(ఆసనము స్థిరము చేసుకొని ప్రాణాయామము చేసినతర్వాత - వాయువును తన స్వాధీనములోనుంచుకొనిన తర్వాత ఇంద్రియములను వాటివాటి విషయములనుండి మరలించి, చిత్తమును దాని వృత్తులనుండి మరలించి లాగి అరికట్టియుంచుట ప్రత్యాహారము).

  1. (వర్ణరూప ధ్వనిరూపములయిన సకల శబ్దములను తెలుసుకొనుట మృద్వు కఠినము, ఉష్ణము శీతలము, మొదలగు స్పర్శలను తెలుసుకొనుట, పొట్టి, పొడుగు, లావు, సన్నము, నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ మిశ్రములు అను పది విధము లయిన రూపములను చూచుట, ఉప్పు, పులుసు, కారము, తీపు, చేదు, ఒగరు అను షడ్రసములను ఎరుగుట, సుగంధము, దుర్గంధము, మిశ్రగంధము అను మూడింటిని మూర్కొనుట, సుశబ్దములను అపశబ్దములను పలుకుట, ఇచ్చుట, పుచ్చుకొనుట, లోనగు పనులను చేయుట, నడచుట, ఎగురుట, పరుగెత్తుట మొదలగు పనులను గావించుట, మ లవిసర్జనము చేయుట, సురతాదులచేత నానందించుట, సంశయించుట, నిశ్చయించుట, చంచలించుట, అభిమానించుట, అను గుణములనుండి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ,ఘ్రాణము, వాక్కు, హస్తము, పాదము, పాయువు, గుహ్యము అనెడి పదునాలుగు ఇంద్రియములను మరలించుట).
Transliteration
  1. “viṣayēṣu vicaratāṃ iṃdriyāṇāṃ tēbhyō nirargaḷaṃ nirvighnaṃ yadā haraṇaṃ sa pratyāhāraḥ”

(viṣayamula guṟiṃci paṟugiḍucuṃḍu iṃdriyamulanu aḍḍulēkuṃḍunaṭlu, vighnamu lēkuṃḍunaṭlu - lāgi paṭṭi tanavaśamulō nuṃcukonuṭa).

  1. “viṣayēbhya iṃdriyārdhēbhyaḥ manōnirōdhanaṃ pratyāhāraḥ”. (maṃḍalabrāhmaṇōpaniṣat)

(iṃdriyārthamulaina viṣayamulanuṃḍi manassunu nirōdhiṃcuṭa).

  1. “svasva viṣyēbhyaḥ sakalēṃdriya nirōdhiḥ pratyāhāraḥ”

(iṃdriyamulanniṃṭini vāṭi vāṭi viṣayamulanuṃḍi nirōdhiṃcuṭa).

  1. “śabdādi viṣayaṃbulaṃ bravaṇaṃbulagu niṃdriyaṃbulaṃdrippi mānasaṃbuna kadhīnaṃbulu sēyuṭa pratyāhāraṃbu”. (āmuktamālyada)

  2. “viṣayēṣu ātmatāḥ dṛṣṭvā manasaścittamajjanaṃ |

pratyāhāraḥ savijñēyō abhyāsanīyō mumukṣubhiḥ ||“.

(viṣayamulaṃdu ātmayani dṛṣṭi peṭṭukoni manassu cittamulō aṇaciyuṃcuṭa pratyāhāramu) - (dīnini mōkṣamu kōruvāru abhyāsamu cēsukōvalenu).

  1. “paṃcavidhaḥ pratyāhāraḥ –

(1). viṣayēṣu vicaratāmiṃdriyāṇāṃ balādāharaṇaṃ pratyāhāraḥ

(2). yadyatpaśyati tatsarvamiti pratyāhāraḥ

(3). nityavihitakarma phalatyāgaḥ pratyāhāraḥ.

(4). sarva viṣaya parāṅmukhatvaṃ pratyāhāraḥ.

(5). “aṣṭādaśasu marmasthānēṣu kramāddhāraṇaṃ pratyāhāraḥ”.

(kramāddhāraṇaṃ = dhāraṇaṃ hāraṇaṃ, saṃkramaṇaṃ - pādāṃguṣṭa gulpha jaṃghā jānūru pāyumēḍhra nābhi hṛdaya kaṃṭha kūpatālu nāsākṣi bhrūmadhya lalāṭa mūrthnāṃ sthānāni. tēṣu kramāt ārōhavarōha kramēṇa pratyāharēt. (śāṃḍilyōpaniṣat)

(pratyāhāramu ayidu vidhamulu –

1. viṣayamulaguṟiṃci parugettu iṃdriyamu lanu balavaṃtamugā āhariṃcuṭa - lāgi paṭṭi svadhānamulō nuṃcukonuṭa.

2. cūcinadaṃtayu ātmayēyani bhāviṃcuṭa.

3. nityakarmalaṃdu, śāstramulō vidhiṃcina karmalaphalamaṃdu, āśalēkuṃḍuṭa.

4. viṣayamulanniṃṭi yaṃdu vimukhata kaligiyuṃḍuṭa.

5. padunenimidi marmasthānamulaṃdu kramamugā dhāraṇakaligiyuṃḍuṭa - kramamugā anagā - pādamu, boṭanavrēlu, maḍamalu, pikkalu, muṇukulu, toḍalu, pāyuvu, mēḍhramu, boḍḍu, hṛdayamu, kaṃṭhamu, tāluva, mukku, kaṃḍlu, kanubomalamadhyamamu, lalāṭamu, mūrthnamu (śirassu) - ī sthānamulalō okadānitarvāta nokadānilō śirassuvaraku dhāraṇa cēyavalenu).

6. anātmadēhādi gatāhaṃ bhāvaṃ pratīci pratyāharaṇaṃ pratyāhāraḥ -

(ātmagānidēhamu modalaguvāṭiyaṃdu avi ‘nēnē’ yanu ahaṃbhāvamu lēkuṃḍuṭa pratyāhāramu).

  1. iṃdriyāṇāṃ vicaratāṃ viṣayēṣu svabhāvataḥ |

balādā haraṇaṃ tēṣāṃ pratyāhārassa ucyatē |

yatpaśyati tu tatsarvaṃ brahma paśyansamāhitaḥ |

pratyāhārō bhavēdēṣaḥ brahma vidbhiḥ purōditaḥ |

yadyatsuddha maśuddhaṃvā karōtyā maraṇāṃtakaṃ |

tatsarvaṃ brahmaṇē kuryāt pratyāhārassa ucyatē |

adavā nityakarmāṇi brahmārādhana buddhitaḥ |

kāmyānica tathā kurvāt pratyāhārassa ucyatē |

adhavā vāyumākṛṣya sthānāt sthānaṃ nirōdhayēt |

daṃtamūlāttathā kaṃṭhē kaṃṭhādurasi mārutaṃ |

urōdēśātsamākṛṣya nābhidēśē nirōdhayēt |

nābhidēśātsamākṛṣya kuṃḍalyāṃ tu nirōdhayēt |

adāpānātkaṭi dvaṃdvē tadōrauca sumadhyamē |

tasmāt jānudvayē jaṃghē pādāṃguṣṭē nirōdhayēt |

pratyāharamayamuktastu pratyāhāraparaiḥ parā ||“. (darśanōpaniṣat)

(viṣayamulayaḍala vāṭi vāṭi naijamunanusariṃcu iṃdriyamulanu balavaṃtamugā lāgipaṭṭi tana vaśamulōnuṃcukonuṭa pratyāhāramu. cūcinadaṃtayu parabrahmayē yanu bhāvamu kaligiyuṃḍuṭa pratyāhāra mani brahma jñānamukalavāru ceppiri. canipōvunaṃtavaṟaku, maṃcidikāni, ceḍḍadikāni ē pani cēsinanu adi parabrahmakoṟakēyani bhāviṃcuṭa pratyāhāramu - cēsina kāmyakarmalukāni, nityakarmalukāni, parabrahmārādhana koṟakē cēsitinani talacuṭa - ā buddhitō ā panulu cēyuṭa - pratyāhāramu. vāyuvuni lōniki pīlci, oka sthānamulō nirōdhiṃciyuṃci, ā sthānamunuṃḍi iṃkoka sthānamulōniki tecci akkaḍa dānini nirōdhiṃci, ī prakāramu okasthānamunuṃḍi iṃkoka sthānamunaku tecci, nirōdhiṃcucu uṃḍavalenu - daṃtamūlamunuṃḍi kaṃṭhamunaku, kaṃṭhamunuṃḍi hṛdayamunaku vāyuvunu tīsukoni vacci accaṭanuṃḍi boḍḍunaku tīsukonirāvalenu - nābhinuṃḍi kuṃḍalī pradēśamunaku (mūlādhāramunaku) tīsukoni rāvalenu. apānapradēśamunuṃḍi kaṭi pradēśamunaku akkaḍanuṃḍi toḍalaku, pikkalaku, pādāṃguṣṭamunaku kramamugā tīsukonivacci vāyuvunu nirōdhiṃcavalenu. iṭlu cēyuṭa pratyāhāramani pratyāhāraparulainavāru - pratyāhāramu cēyuṭayaṃdē manassukalavāru - ceppucunnāru).

  1. “svaviṣaya saṃprayōgē cittasvarūpānukāra ivēṃdriyāṇāṃ pratyāhāraḥ -”. (pataṃjali yōgasūtramulu)

(āsanamu sthiramu cēsukoni prāṇāyāmamu cēsinatarvāta - vāyuvunu tana svādhīnamulōnuṃcukonina tarvāta iṃdriyamulanu vāṭivāṭi viṣayamulanuṃḍi maraliṃci, cittamunu dāni vṛttulanuṃḍi maraliṃci lāgi arikaṭṭiyuṃcuṭa pratyāhāramu).

  1. (varṇarūpa dhvanirūpamulayina sakala śabdamulanu telusukonuṭa mṛdvu kaṭhinamu, uṣṇamu śītalamu, modalagu sparśalanu telusukonuṭa, poṭṭi, poḍugu, lāvu, sannamu, nalupu, telupu, erupu, ākupacca miśramulu anu padi vidhamu layina rūpamulanu cūcuṭa, uppu, pulusu, kāramu, tīpu, cēdu, ogaru anu ṣaḍrasamulanu eruguṭa, sugaṃdhamu, durgaṃdhamu, miśragaṃdhamu anu mūḍiṃṭini mūrkonuṭa, suśabdamulanu apaśabdamulanu palukuṭa, iccuṭa, puccukonuṭa, lōnagu panulanu cēyuṭa, naḍacuṭa, eguruṭa, parugettuṭa modalagu panulanu gāviṃcuṭa, ma lavisarjanamu cēyuṭa, suratādulacēta nānaṃdiṃcuṭa, saṃśayiṃcuṭa, niścayiṃcuṭa, caṃcaliṃcuṭa, abhimāniṃcuṭa, anu guṇamulanuṃḍi śrōtramu, tvakku, cakṣuvu, jihva,ghrāṇamu, vākku, hastamu, pādamu, pāyuvu, guhyamu aneḍi padunālugu iṃdriyamulanu maraliṃcuṭa).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.