← Back to ప · Booklets 31–40 (digitized file 4)

ప్రవృత్తి pravṛtti

Original — తెలుగు
  1. వ్యాపారః; చేష్టా. (వ్యాపారము; చేష్ట; నడక; వ్యవహరించుట).

  2. ప్రవర్తనం; (ప్రవర్తించుట).

  3. “ప్రవర్తనం; బంధహేతుః; కర్మమార్గః; శాస్త్రవిహిత విధయః” (శ్రీశంకరః)

(శాస్త్రములో విధించిన ప్రకారము కర్మచేయుటలో ప్రవర్తించుట; కర్మ చేయుట - ఇది బంధమునకు కారణము - అట్టి కర్మఫలమనుభవించవలసి యుండును -).

  1. “ప్రయోజనమనుద్దిశ్యాపి చాలన స్వభావతా -”. (శ్రీరామానుజః)

(ప్రయోజనము కలుగునను ఉద్దేశము లేనప్పటికీ, స్వభావమువలన చేయుట).

  1. ప్రవర్తనం యస్మిన్ పురుషార్థసాదనే కర్తవ్యే ప్రవృత్తిః.

(పురుషార్థమును సాధించుటలో చేయవలసిన ప్రవర్తన). .

  1. ‘ఐహికము’ -

(ఈ లోకమునకు సంబంధించిన ప్రవర్తన, కర్మచేయుట - స్వర్గాదిభోగముల కొఱకు చేయు ప్రవృత్తి).

  1. ఉత్పత్తిః -. (శ్రీశంకరః)

(పుట్టించుట).

  1. “అభ్యుదయ సాధన భూతో ధర్మః” (శ్రీమాన్ రామానుజః)

(ఈ లోకములో శ్రేయస్సు కలుగుటకు సాధనమైన ధర్మము).

  1. కామ్యకర్మ - కర్మమార్గము; స్వభావము -

  2. కర్మలు చేయుటలో మనస్సు లగ్నమై యుండుట.

  3. చేయతగిన కార్యమును చేయుట.

  4. గృహస్థాశ్రమమందుండి చేయతగిన కార్యమును, ఆసక్తిని వదలి భగవదర్పణముగ లోక సంగ్రహము కొఱకు జనకమహారాజు మొదలగువారివలె ప్రవర్తించుట.

  5. “జాతకర్మ, నామకరణాన్నప్రాశన, చౌలోపనయనాదులు కలిగిన బ్రహ్మచారికి అధ్యయన, పఠన, బైక్షా చరణాదులును, గృహస్థునకు శ్రౌత స్మార్త రూపాదులైన సకలాగ్నిహోత్రాదులున్నూ, వానప్రస్థునికి కందమూల వాతాధ్యాహార అరణ్యవాసధ్యాన తీర్థయాత్రాదులును, ఈ ఆశ్రమ నిష్టకర్మలున్నూ ప్రవృత్తి కర్మలని పించు కొనును” (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 4)

  6. “ప్రవృత్త కర్మంబులోన నిష్టాపూర్తంబులన రెండు మార్గంబులు గలవు. అందు హింస, ద్రవ్యమయకామ్యరూపంబులైన దర్శ, పూర్ణమాస, పశుసోమయాగ, వైశ్యదేవ బలిహరణ ప్రముఖంబులయిన యాగాది కంబులిష్టంబులు. దేవతాలయ, వన, కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు. ప్రవృత్తికర్మంబునదేహంబు విడిచి దేహాంతరారంభంబునొందు దేహి హృదయాగ్రంబు వెలుంగ వానితోడ నింద్రియంబులంగూడిభూతసూక్ష్మయుక్తుండై, ధూమ దక్షిణాయన కృష్ణపక్ష రాత్రి దర్శంబులవలన సోమలోకంబు చేరి, భోగావసానంబున విలీన దేహుండై వృష్టి ద్వారంబున భూమియందు జన్మించు. ఇది పునర్భవరూపంబయిన పితృమార్గంబు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 457)

  1. “వైదిక ధర్మో ద్వివిధః - ప్రవృత్తిర్నివృత్తిశ్చ ఇతి - తత్ర బ్రాహ్మణాదిభిః - శ్రుతిస్మృత్యుక్తరీత్యా స్వస్వ వర్ణాశ్రమాచారేణ అనుష్టీయ ధర్మో ప్రవృత్తిరిత్యుచ్యతే. ప్రవృత్తి ధర్మరతానాం యజ్ఞాది ద్వారా స్వర్గాదిషు పుణ్యఫలానుభవం - తథాచోక్తం మనునా –

ప్రవృత్తిం సేవ మానస్తు దేవానామేతి సామ్యతాం |

నివృత్తిం సేవమానస్తు భూతాన్యత్యేతి పంచనై ||“.

(వేదములో చెప్పిన ధర్మము రెండువిధములుగా నున్నది - ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. శ్రుతి స్మృతులలో చెప్పిన ప్రకారము బ్రాహ్మణులు మొదలగువారిచే వారి వారి వర్ణాశ్రమాచారముల ప్రకారము అనుష్టించ వలసిన ధర్మము ప్రవృత్తి ధర్మము).

  1. “యావజ్జీవమగ్నిహోత్రం నిత్యం సంధ్యాముపాసయేత్ |

ప్రవృత్తిరూపో ధర్మో(అ)యం శ్రుత్యా, స్మృత్యా చ చోదితః” (యోగవాసిష్టము -1 - 14)

(బ్రతికి యున్నంతకాలము అగ్నిహోత్రము, సంధ్యావందనమును ఉపాసించవలెను - ఇదియే ప్రవృత్తిరూపమని శ్రుతిలోను, స్మృతులలోను చెప్పబడియున్నది).

  1. “స సృష్ట్వేదం జగత్సర్వం చికర్షుస్తస్య చ స్థితిం |

నసర్జ బ్రహ్మరూపేణ మరీచ్యాది ప్రజాపతీన్ ||

ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాన తన్మునీన్ |

న సంసార స్థితేర్హేతుర్థర్మః స్వర్గాది సాధనం ||“. (గీతాభావప్రకాశము - 1 - 7, 8)

(పరబ్రహ్మ, నారాయణుడు అను పరమాత్మ యీ జగత్తు అంతటిని సృష్టించి, దాని స్థితి కొరకు - పోషణ కొఱకు - చతుర్ముఖబ్రహ్మరూపముతో మరీచి మొదలగు ప్రజాపతులను సృష్టించి వారిచేత ప్రవృత్తి లక్షణమైన ధర్మమును స్వీకరింపచేసెను - ధర్మము రెండు విధములు - ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము - ఈ రెండింటిలోను ప్రవఋత్తి లక్షణము సంసారమునకు - జననమరణములు మరల మరల కలుగు స్థితికి - కారణము, స్వర్గము మొదలైనవాటికి సాధనమైనది - కాని.మోక్షమునకు కానిది).

  1. “యథా అయస్కాంతో మణిః స్వయం ప్రవృత్తిరహితోపి అయసః ప్రవర్తకో భవతి, యథాచ, రూపాదయః విషయాః స్వయం ప్రవృత్తిరహితాః అపి చక్షురాదినాం ప్రవర్తకో భవంతి ఏవం ప్రవృత్తిరహితోపి ఈశ్వర ః సర్వగతస్సర్వాత్మా సర్వజ్ఞ ః సర్వ శక్తిశ్చసన్ సర్వం ప్రవర్తయేత్ ఇత్త్యుపపన్నం - - - సంభవైతి ప్రవృత్తిః సర్వజ్ఞ కారణత్వే, నతు అచేతన కారణత్వే” (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(అయస్కాంతమణి స్వయముగా ప్రవృత్తి లేనిదైనను యినుమును ఆకర్షించడానికి ప్రవృత్తి కలుగచేయుచున్నది. రూపము మొదలగు విషయములు స్వయముగా ప్రవృత్తి లేనివైనను కన్ను మొదలగు ఇంద్రియములకు వాటియందు ప్రవృత్తి కలుగ చేయుచున్నవి. ఆ ప్రకారముగానే సర్వగతుడు, (అన్నింటిలోను ఉన్నవాడు) సర్వాత్మ (అన్నింటికి ఆత్మ అయినవాడు), సర్వజ్ఞుడు, సమస్త శక్తులు గలవాడు అయిన పరమాత్మ ప్రవృత్తిలేని వాడైనను అన్నింటినీ ప్రవర్తింపచేయుచున్నాడు).

  1. “ఉత్సాహము, తేజస్సు, ఉద్యోగము, సాహసము అనునవి ప్రవృత్తి లక్షణములు”-
Transliteration
  1. vyāpāraḥ; cēṣṭā. (vyāpāramu; cēṣṭa; naḍaka; vyavahariṃcuṭa).

  2. pravartanaṃ; (pravartiṃcuṭa).

  3. “pravartanaṃ; baṃdhahētuḥ; karmamārgaḥ; śāstravihita vidhayaḥ” (śrīśaṃkaraḥ)

(śāstramulō vidhiṃcina prakāramu karmacēyuṭalō pravartiṃcuṭa; karma cēyuṭa - idi baṃdhamunaku kāraṇamu - aṭṭi karmaphalamanubhaviṃcavalasi yuṃḍunu -).

  1. “prayōjanamanuddiśyāpi cālana svabhāvatā -”. (śrīrāmānujaḥ)

(prayōjanamu kalugunanu uddēśamu lēnappaṭikī, svabhāvamuvalana cēyuṭa).

  1. pravartanaṃ yasmin puruṣārthasādanē kartavyē pravṛttiḥ.

(puruṣārthamunu sādhiṃcuṭalō cēyavalasina pravartana). .

  1. ‘aihikamu’ -

(ī lōkamunaku saṃbaṃdhiṃcina pravartana, karmacēyuṭa - svargādibhōgamula koṟaku cēyu pravṛtti).

  1. utpattiḥ -. (śrīśaṃkaraḥ)

(puṭṭiṃcuṭa).

  1. “abhyudaya sādhana bhūtō dharmaḥ” (śrīmān rāmānujaḥ)

(ī lōkamulō śrēyassu kaluguṭaku sādhanamaina dharmamu).

  1. kāmyakarma - karmamārgamu; svabhāvamu -

  2. karmalu cēyuṭalō manassu lagnamai yuṃḍuṭa.

  3. cēyatagina kāryamunu cēyuṭa.

  4. gṛhasthāśramamaṃduṃḍi cēyatagina kāryamunu, āsaktini vadali bhagavadarpaṇamuga lōka saṃgrahamu koṟaku janakamahārāju modalaguvārivale pravartiṃcuṭa.

  5. “jātakarma, nāmakaraṇānnaprāśana, caulōpanayanādulu kaligina brahmacāriki adhyayana, paṭhana, baikṣā caraṇādulunu, gṛhasthunaku śrauta smārta rūpādulaina sakalāgnihōtrādulunnū, vānaprasthuniki kaṃdamūla vātādhyāhāra araṇyavāsadhyāna tīrthayātrādulunu, ī āśrama niṣṭakarmalunnū pravṛtti karmalani piṃcu konunu” (brahmavidyāsudhārṇavamu - 4)

  6. “pravṛtta karmaṃbulōna niṣṭāpūrtaṃbulana reṃḍu mārgaṃbulu galavu. aṃdu hiṃsa, dravyamayakāmyarūpaṃbulaina darśa, pūrṇamāsa, paśusōmayāga, vaiśyadēva baliharaṇa pramukhaṃbulayina yāgādi kaṃbuliṣṭaṃbulu. dēvatālaya, vana, kūpa taṭāka pramukhaṃbulu pūrtaṃbulu. pravṛttikarmaṃbunadēhaṃbu viḍici dēhāṃtarāraṃbhaṃbunoṃdu dēhi hṛdayāgraṃbu veluṃga vānitōḍa niṃdriyaṃbulaṃgūḍibhūtasūkṣmayuktuṃḍai, dhūma dakṣiṇāyana kṛṣṇapakṣa rātri darśaṃbulavalana sōmalōkaṃbu cēri, bhōgāvasānaṃbuna vilīna dēhuṃḍai vṛṣṭi dvāraṃbuna bhūmiyaṃdu janmiṃcu. idi punarbhavarūpaṃbayina pitṛmārgaṃbu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 457)

  1. “vaidika dharmō dvividhaḥ - pravṛttirnivṛttiśca iti - tatra brāhmaṇādibhiḥ - śrutismṛtyuktarītyā svasva varṇāśramācārēṇa anuṣṭīya dharmō pravṛttirityucyatē. pravṛtti dharmaratānāṃ yajñādi dvārā svargādiṣu puṇyaphalānubhavaṃ - tathācōktaṃ manunā –

pravṛttiṃ sēva mānastu dēvānāmēti sāmyatāṃ |

nivṛttiṃ sēvamānastu bhūtānyatyēti paṃcanai ||“.

(vēdamulō ceppina dharmamu reṃḍuvidhamulugā nunnadi - pravṛtti dharmamu, nivṛtti dharmamu. śruti smṛtulalō ceppina prakāramu brāhmaṇulu modalaguvāricē vāri vāri varṇāśramācāramula prakāramu anuṣṭiṃca valasina dharmamu pravṛtti dharmamu).

  1. “yāvajjīvamagnihōtraṃ nityaṃ saṃdhyāmupāsayēt |

pravṛttirūpō dharmō(a)yaṃ śrutyā, smṛtyā ca cōditaḥ” (yōgavāsiṣṭamu -1 - 14)

(bratiki yunnaṃtakālamu agnihōtramu, saṃdhyāvaṃdanamunu upāsiṃcavalenu - idiyē pravṛttirūpamani śrutilōnu, smṛtulalōnu ceppabaḍiyunnadi).

  1. “sa sṛṣṭvēdaṃ jagatsarvaṃ cikarṣustasya ca sthitiṃ |

nasarja brahmarūpēṇa marīcyādi prajāpatīn ||

pravṛtti lakṣaṇaṃ dharmaṃ grāhayāmāna tanmunīn |

na saṃsāra sthitērhēturtharmaḥ svargādi sādhanaṃ ||“. (gītābhāvaprakāśamu - 1 - 7, 8)

(parabrahma, nārāyaṇuḍu anu paramātma yī jagattu aṃtaṭini sṛṣṭiṃci, dāni sthiti koraku - pōṣaṇa koṟaku - caturmukhabrahmarūpamutō marīci modalagu prajāpatulanu sṛṣṭiṃci vāricēta pravṛtti lakṣaṇamaina dharmamunu svīkariṃpacēsenu - dharmamu reṃḍu vidhamulu - pravṛtti dharmamu, nivṛtti dharmamu - ī reṃḍiṃṭilōnu pravaṛtti lakṣaṇamu saṃsāramunaku - jananamaraṇamulu marala marala kalugu sthitiki - kāraṇamu, svargamu modalainavāṭiki sādhanamainadi - kāni.mōkṣamunaku kānidi).

  1. “yathā ayaskāṃtō maṇiḥ svayaṃ pravṛttirahitōpi ayasaḥ pravartakō bhavati, yathāca, rūpādayaḥ viṣayāḥ svayaṃ pravṛttirahitāḥ api cakṣurādināṃ pravartakō bhavaṃti ēvaṃ pravṛttirahitōpi īśvara ḥ sarvagatassarvātmā sarvajña ḥ sarva śaktiścasan sarvaṃ pravartayēt ittyupapannaṃ - - - saṃbhavaiti pravṛttiḥ sarvajña kāraṇatvē, natu acētana kāraṇatvē” (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(ayaskāṃtamaṇi svayamugā pravṛtti lēnidainanu yinumunu ākarṣiṃcaḍāniki pravṛtti kalugacēyucunnadi. rūpamu modalagu viṣayamulu svayamugā pravṛtti lēnivainanu kannu modalagu iṃdriyamulaku vāṭiyaṃdu pravṛtti kaluga cēyucunnavi. ā prakāramugānē sarvagatuḍu, (anniṃṭilōnu unnavāḍu) sarvātma (anniṃṭiki ātma ayinavāḍu), sarvajñuḍu, samasta śaktulu galavāḍu ayina paramātma pravṛttilēni vāḍainanu anniṃṭinī pravartiṃpacēyucunnāḍu).

  1. “utsāhamu, tējassu, udyōgamu, sāhasamu anunavi pravṛtti lakṣaṇamulu”-
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.