← Back to ప · Booklets 31–40 (digitized file 4)

పృధివీ గుణములు pṛdhivī guṇamulu

Original — తెలుగు

శబ్ద స్పర్శ రూప రస గంధాః పృధివీ గుణాః.

"ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, ఆగ్నే రూపః, అభ్యః పృధివీ"

(ఆకాశములోనుండి వాయువు, వాయువులోనుండి అగ్ని, అగ్నిలోనుండి జలము, జలములోనుండి పృధివి కలిగినవి. అందుచేత ఆకాశము, వాయువు, అగ్ని, జలము యుక్క గుణములయిన శబ్ద స్పర్శ రూప రసములున్నూ - వీటిని ఒకదానితో ఒకటిని కలపగాగా - పంచీకరణము చేయగా - ఒక్కొక్క భూతము ఘనీ భూతమై, ఒక్కొక్క దానిలోను మిగిలిన నాలుగు భూతములయొక్క గుణములున్నూ కలిసి యున్నవి. ఉదాహరణకు - భూమిలో 1/2 భాగము గంధము, 1/8 భాగము శబ్దము, 1/8 భాగము స్పర్శ, 1/8 భాగము రూపము, 1/8 భాగము రసము కలిసి స్థూల రూపములోనున్న భూమి అయినది. ఇట్లే మిగిలిన నాలుగు భూతముల స్థూలరూపము లోని అయిదు భూతముల అంశలను ఊహించుకొనవలెను). (చూడుము – పంచీకరణము).

Transliteration

śabda sparśa rūpa rasa gaṃdhāḥ pṛdhivī guṇāḥ.

"ākāśādvāyuḥ, vāyōragniḥ, āgnē rūpaḥ, abhyaḥ pṛdhivī"

(ākāśamulōnuṃḍi vāyuvu, vāyuvulōnuṃḍi agni, agnilōnuṃḍi jalamu, jalamulōnuṃḍi pṛdhivi kaliginavi. aṃducēta ākāśamu, vāyuvu, agni, jalamu yukka guṇamulayina śabda sparśa rūpa rasamulunnū - vīṭini okadānitō okaṭini kalapagāgā - paṃcīkaraṇamu cēyagā - okkokka bhūtamu ghanī bhūtamai, okkokka dānilōnu migilina nālugu bhūtamulayokka guṇamulunnū kalisi yunnavi. udāharaṇaku - bhūmilō 1/2 bhāgamu gaṃdhamu, 1/8 bhāgamu śabdamu, 1/8 bhāgamu sparśa, 1/8 bhāgamu rūpamu, 1/8 bhāgamu rasamu kalisi sthūla rūpamulōnunna bhūmi ayinadi. iṭlē migilina nālugu bhūtamula sthūlarūpamu lōni ayidu bhūtamula aṃśalanu ūhiṃcukonavalenu). (cūḍumu – paṃcīkaraṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.