(ప్రేమరూపమైన భక్తి - కర్మయోగముకంటె - నిష్కామకర్మయోగము కంటె - శ్రేష్టమైనది)
(భగవంతుని యడల కలుగు ప్రేమ రూపమైన భక్తి - నారదముని చెప్పినది (నారదభక్తిసూత్రములలో చెప్పినది) - ఇది ప్రేమభక్తి - ఎల్లపుడు త్యాగరూపమైనది. అది కోరికతో కూడినదికాదు - ఏ భక్తియందు కోరిక కలుగునో అది కామనాయుక్తము - కోరిక గలది - ఒక ఆశకలిగి చేయుభక్తి - దానిలో స్వార్థమున్నది. ప్రేమభక్తి గలవాడు తనకు ప్రియమైన భగవంతునిగాని, అతని సేవనుగాని విడిచిపెట్టి ఇతర వస్తువును కోరడు. యధార్థభక్తి కలుగగనే కామనాభక్తి నష్టమై పోవును. అందుచేత ఆ భక్తి నిరోధరూపము - త్యాగమయము).
"తీర్థేషు భ్రమణం నిత్యం సాధనానాం చ సంచయః |
వైరాగ్య యధవా యోగో జ్ఞానే నిపుణతా తథా |
నానా కర్మాణి ధర్మాశ్చ దానాని స వ్రత్రానిచ |
సం యదుశ్చ దయశ్చైవ జపోనానా మఖా స్తపః |
భూతేషు కర్మణా సేవా బ్రాహ్మణానాం గురోస్తధా |
విద్యా వినయ సం యుక్తా మహత్తాచ వివేకతా |
యావంతి సాధనానీహ వేదైరుక్తా స్తా చాఖిలైః |
ఫలమేషాం తు సర్వేషాం హరిభక్తి ర్మహేశ్వరీ ".
(ప్రేమీ భక్తి ఫలరూపమైనది; సాధనరూపమైనదికాదు. జ్ఞానమునకు సాధనమగు భక్తి గౌణీభక్తి యనబడును - సాధారణమైన ఉపాసనయైనది, ప్రేమరూపమైన భక్తికాదు - అన్ని విధములైన సాధనముల యొక్క ఫలమే ప్రేమ రూప భక్తి).
(తీర్థయాత్రలు చేయుట, సాధనములు చేయుట, వైరాగ్యము, లేక, యోగాభ్యాసము, జ్ఞానమందు నైపుణ్యము, అన్ని విధములైన కర్మలు, ధర్మములు, దానములు, వ్రతములు, సం యమము, దమము, జపము, యజ్ఞములు, తపము, బ్రాహ్మణులకు గురువునకు, భూతములకు సేవచేయుట, విద్యా వినయములు, వివేకము కలిగి యుండుట - ఇవన్నియు సాధనములని వేదములో చెప్పబడినవి. వీటి అన్నింటికీ ఫలము, ఓ మహేశ్వరీ, హరి భక్తియే).
1. గుణమహాత్మ్యాసక్తిః
2. రూపాసక్తిః
3. పూజాసక్తిః
4. స్మరణాసక్తిః
5. దాస్యాసక్తిః
6. సఖ్యాసక్తిః
7. కాంతాసక్తిః
8. వాత్సల్యాసక్తిః
9. ఆత్మనివేదనాసక్తిః
10. తన్మయతాసక్తిః
ఉదాహరణ –
1. నారదాః, వ్యాసః,
2. రాజా జనకో –
3. శ్రీ లక్ష్మీ, అంబరీషః
4. ప్రహ్లాదో, ధ్రువః
5. శ్రీహనుమానక్రూరోవిదురాదయశ్చ
6. అర్జున, ఉద్భివ, సంజయః
7. అష్టమహిషీ ప్రభృతయః
8. కశ్యపః అదితిః, దశరధః, కౌసల్యో, నందో, యశోదా,వాసుదేవ దేవకీ ప్రభృతయః
9. శ్రీ హనుమాన్, అంబరీషో, బలిః విభీషణః
10. యాజ్ఞవల్క్యః, శుకదేవ సనకాదయః
11. ఉద్ధవో, అర్జునో ప్రజవాసి నరనార్యాః.
(ప్రేమరూపమైన భక్తి ఒకటే అయినను 11 విధములుగా నున్నది : -
1. గుణమాహాత్మ్య మందాసక్తి
2. రూపమందాసక్తి
3. పూజ చేయుటయందాసక్తి
4, స్మరించుటయందాసక్తి
5. దాసుడుగా నుండుంటయందాసక్తి
6. స్నేహము కలిగియుండుట యందాసక్తి
7.కాంతాసక్తి
8. వాత్సల్యాసక్తి
9. ఆత్మనివేదనాసక్తి
10. తన్మయాతాసక్తి.
11.ఈ విధములగు భక్తికి ఉదాహరణము –
1. నారదుడు, వ్యాసుడు
2. జనకమహారాజు
3. శ్రీ లక్ష్మి,అంబరీషుడు,
4. ప్రహ్లాదుడు, ధ్రువుడు
5. శ్రీ హనుమంతుడు, అక్రూరుడు, విదురుడు, మొదలగువారు
6. అర్జనుడు, ఉద్ధవుడు, సంజయుడు.
7. శ్రీ కృష్ష్ణుని అష్టపట్టమహిషలు
8. కశ్యపుడు, అదితి, దశరధుడు, కౌసల్య, నందుడు, యశోద, వసుదేవుడు, దేవకి, మొదలగువారు
9. శ్రీ హనుమంతుడు, అంబరీషుడు, బలిచక్రవర్తి, విభీషణుడు
10. యాజ్ఞవల్క్యుడు శుకదేవుడు, సనకసనందాదులు
11. ఉద్ధవుడు, అర్జునుడు, గోప గోపికలు).
(prēmarūpamaina bhakti - karmayōgamukaṃṭe - niṣkāmakarmayōgamu kaṃṭe - śrēṣṭamainadi)
(bhagavaṃtuni yaḍala kalugu prēma rūpamaina bhakti - nāradamuni ceppinadi (nāradabhaktisūtramulalō ceppinadi) - idi prēmabhakti - ellapuḍu tyāgarūpamainadi. adi kōrikatō kūḍinadikādu - ē bhaktiyaṃdu kōrika kalugunō adi kāmanāyuktamu - kōrika galadi - oka āśakaligi cēyubhakti - dānilō svārthamunnadi. prēmabhakti galavāḍu tanaku priyamaina bhagavaṃtunigāni, atani sēvanugāni viḍicipeṭṭi itara vastuvunu kōraḍu. yadhārthabhakti kalugaganē kāmanābhakti naṣṭamai pōvunu. aṃducēta ā bhakti nirōdharūpamu - tyāgamayamu).
"tīrthēṣu bhramaṇaṃ nityaṃ sādhanānāṃ ca saṃcayaḥ |
vairāgya yadhavā yōgō jñānē nipuṇatā tathā |
nānā karmāṇi dharmāśca dānāni sa vratrānica |
saṃ yaduśca dayaścaiva japōnānā makhā stapaḥ |
bhūtēṣu karmaṇā sēvā brāhmaṇānāṃ gurōstadhā |
vidyā vinaya saṃ yuktā mahattāca vivēkatā |
yāvaṃti sādhanānīha vēdairuktā stā cākhilaiḥ |
phalamēṣāṃ tu sarvēṣāṃ haribhakti rmahēśvarī ".
(prēmī bhakti phalarūpamainadi; sādhanarūpamainadikādu. jñānamunaku sādhanamagu bhakti gauṇībhakti yanabaḍunu - sādhāraṇamaina upāsanayainadi, prēmarūpamaina bhaktikādu - anni vidhamulaina sādhanamula yokka phalamē prēma rūpa bhakti).
(tīrthayātralu cēyuṭa, sādhanamulu cēyuṭa, vairāgyamu, lēka, yōgābhyāsamu, jñānamaṃdu naipuṇyamu, anni vidhamulaina karmalu, dharmamulu, dānamulu, vratamulu, saṃ yamamu, damamu, japamu, yajñamulu, tapamu, brāhmaṇulaku guruvunaku, bhūtamulaku sēvacēyuṭa, vidyā vinayamulu, vivēkamu kaligi yuṃḍuṭa - ivanniyu sādhanamulani vēdamulō ceppabaḍinavi. vīṭi anniṃṭikī phalamu, ō mahēśvarī, hari bhaktiyē).
1. guṇamahātmyāsaktiḥ
2. rūpāsaktiḥ
3. pūjāsaktiḥ
4. smaraṇāsaktiḥ
5. dāsyāsaktiḥ
6. sakhyāsaktiḥ
7. kāṃtāsaktiḥ
8. vātsalyāsaktiḥ
9. ātmanivēdanāsaktiḥ
10. tanmayatāsaktiḥ
udāharaṇa –
1. nāradāḥ, vyāsaḥ,
2. rājā janakō –
3. śrī lakṣmī, aṃbarīṣaḥ
4. prahlādō, dhruvaḥ
5. śrīhanumānakrūrōvidurādayaśca
6. arjuna, udbhiva, saṃjayaḥ
7. aṣṭamahiṣī prabhṛtayaḥ
8. kaśyapaḥ aditiḥ, daśaradhaḥ, kausalyō, naṃdō, yaśōdā,vāsudēva dēvakī prabhṛtayaḥ
9. śrī hanumān, aṃbarīṣō, baliḥ vibhīṣaṇaḥ
10. yājñavalkyaḥ, śukadēva sanakādayaḥ
11. uddhavō, arjunō prajavāsi naranāryāḥ.
(prēmarūpamaina bhakti okaṭē ayinanu 11 vidhamulugā nunnadi : -
1. guṇamāhātmya maṃdāsakti
2. rūpamaṃdāsakti
3. pūja cēyuṭayaṃdāsakti
4, smariṃcuṭayaṃdāsakti
5. dāsuḍugā nuṃḍuṃṭayaṃdāsakti
6. snēhamu kaligiyuṃḍuṭa yaṃdāsakti
7.kāṃtāsakti
8. vātsalyāsakti
9. ātmanivēdanāsakti
10. tanmayātāsakti.
11.ī vidhamulagu bhaktiki udāharaṇamu –
1. nāraduḍu, vyāsuḍu
2. janakamahārāju
3. śrī lakṣmi,aṃbarīṣuḍu,
4. prahlāduḍu, dhruvuḍu
5. śrī hanumaṃtuḍu, akrūruḍu, viduruḍu, modalaguvāru
6. arjanuḍu, uddhavuḍu, saṃjayuḍu.
7. śrī kṛṣṣṇuni aṣṭapaṭṭamahiṣalu
8. kaśyapuḍu, aditi, daśaradhuḍu, kausalya, naṃduḍu, yaśōda, vasudēvuḍu, dēvaki, modalaguvāru
9. śrī hanumaṃtuḍu, aṃbarīṣuḍu, balicakravarti, vibhīṣaṇuḍu
10. yājñavalkyuḍu śukadēvuḍu, sanakasanaṃdādulu
11. uddhavuḍu, arjunuḍu, gōpa gōpikalu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.