గ్రధితం - (వస్త్రము వలె నేయబడినది - కుట్ట బడినది)
ప్రకర్షేణ ఓతం - (బాగుగా అల్లినట్లుండుట).
సర్వత్ర కార్యే అధిష్టాత్వత్వేన అనుస్యూతః - "స ఓతశ్చ ప్రోతశ్చ విభుః ప్రజాసు" ఇతి శ్రుతిః.
(అంతట కార్యవస్తువునందు అధిష్టించి యుండుటచేత అన్నింటిలోను ప్రవేశించి అల్లుకొనినట్లున్నది - నిలువుగా అడ్డుగా పూర్తిగా వ్యాపించియున్నది. విభుడైన పరమాత్మ ప్రజలలో అడ్డుగాను, నిలువుగాను పూర్తిగా వ్యాపించి యున్నాడు). బట్టలోని దారము వలె బట్ట అంతట వ్యాపించియున్నాడు అని శ్రుతి చెప్పుచున్నది).
(సృష్టిలోనున్న వస్తువులన్నింటిలోను - బట్టలోని దారములు నిలువుగా, అడ్డుగా పూర్తిగా బట్ట అంతటిని వ్యాపించి యున్నట్లు - భగవంతుడు - (శ్రీరామచంద్ర పరబ్రహ్మ) వ్యాపించి యున్నాడు) (ప్రోతం = నిలువుగా, జాతం = అడ్డుగా).
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ". (శ్రీమద్భగవద్గీత - 7 - 7)
(నేను ఈ జగత్తు అంతటికీ సృష్టి స్థితి లయములు చేయువాడను - నాలోనుండియే యీజగత్తులోని వస్తువులన్నియు పుట్టుచున్నవి. కనుక అన్ని వస్తువులు నేనే - నేను కానివస్తువేదియును లేదు. నాకన్న వేరైన వస్తువు లేదు - నా కంటె ఉత్కృష్టమైన వస్తువు లేదు. దారముతో మణులు గ్రుచ్చి యున్నట్లు - దారము నాశ్రయించి మణులున్నట్లు - ఈ ప్రపంచమంతయు, ఈ ప్రపంచములోని వస్తువులన్నియు నాయందే పట్టి యున్నవి - నేనే వాటికి ఆధారముగా నున్నవి. దారముతో గ్రుచ్చిన మణులను ఆ దారము ఏ రీతిగ పట్టియుంచునో అట్లే యీ వస్తువులన్నింటినీ నేను నా శక్తితో పట్టియుంచినాను - నాశక్తి వాటిలోపల పైన ఉండుటచేత - నా అకర్షణ శక్తి చేత వాటిని నాలో పట్టియుంచినాను - అందుచేత యీ వస్తువులన్నియు కలిసి ప్రపంచము అను పెద్ద వస్తువు నేనే).
gradhitaṃ - (vastramu vale nēyabaḍinadi - kuṭṭa baḍinadi)
prakarṣēṇa ōtaṃ - (bāgugā allinaṭluṃḍuṭa).
sarvatra kāryē adhiṣṭātvatvēna anusyūtaḥ - "sa ōtaśca prōtaśca vibhuḥ prajāsu" iti śrutiḥ.
(aṃtaṭa kāryavastuvunaṃdu adhiṣṭiṃci yuṃḍuṭacēta anniṃṭilōnu pravēśiṃci allukoninaṭlunnadi - niluvugā aḍḍugā pūrtigā vyāpiṃciyunnadi. vibhuḍaina paramātma prajalalō aḍḍugānu, niluvugānu pūrtigā vyāpiṃci yunnāḍu). baṭṭalōni dāramu vale baṭṭa aṃtaṭa vyāpiṃciyunnāḍu ani śruti ceppucunnadi).
(sṛṣṭilōnunna vastuvulanniṃṭilōnu - baṭṭalōni dāramulu niluvugā, aḍḍugā pūrtigā baṭṭa aṃtaṭini vyāpiṃci yunnaṭlu - bhagavaṃtuḍu - (śrīrāmacaṃdra parabrahma) vyāpiṃci yunnāḍu) (prōtaṃ = niluvugā, jātaṃ = aḍḍugā).
mayi sarvamidaṃ prōtaṃ sūtrē maṇigaṇā iva ". (śrīmadbhagavadgīta - 7 - 7)
(nēnu ī jagattu aṃtaṭikī sṛṣṭi sthiti layamulu cēyuvāḍanu - nālōnuṃḍiyē yījagattulōni vastuvulanniyu puṭṭucunnavi. kanuka anni vastuvulu nēnē - nēnu kānivastuvēdiyunu lēdu. nākanna vēraina vastuvu lēdu - nā kaṃṭe utkṛṣṭamaina vastuvu lēdu. dāramutō maṇulu grucci yunnaṭlu - dāramu nāśrayiṃci maṇulunnaṭlu - ī prapaṃcamaṃtayu, ī prapaṃcamulōni vastuvulanniyu nāyaṃdē paṭṭi yunnavi - nēnē vāṭiki ādhāramugā nunnavi. dāramutō gruccina maṇulanu ā dāramu ē rītiga paṭṭiyuṃcunō aṭlē yī vastuvulanniṃṭinī nēnu nā śaktitō paṭṭiyuṃcinānu - nāśakti vāṭilōpala paina uṃḍuṭacēta - nā akarṣaṇa śakti cēta vāṭini nālō paṭṭiyuṃcinānu - aṃducēta yī vastuvulanniyu kalisi prapaṃcamu anu pedda vastuvu nēnē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.