← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లింగశరీరము liṃgaśarīramu

Original — తెలుగు
  1. లింగదేహము; సూక్ష్మదేహము -

  2. “స్థూల శరీరమునకు లోనైన ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మనెడి కోశ త్రయాత్మకమైన లింగ శరీరము - -”

(బ్రహ్మ విద్యా సుధార్ణవము - 6)

  1. “ఈ స్థూల శరీరం యొక్క వాసనావశమైన సూక్ష్మశరీరలక్షణ మెలాగంటే - అష్టపురాలతో గూడింది లింగదేహము. అష్టపురాలెలాగంటే - జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్దాది విషయాలు, పంచ ప్రాణములు, కరణ చతుష్టయం, కర్మ, కామనువిద్య - యీ యెనిమిదింటకూడింది లింగదేహం. దీని అభిమాని తైజసుడు, ఇందు వ్యాపకమైన ఆత్మ అంతరాత్మ, ఆతడే ప్రాతిభాసిక జీవుండు:”.

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 6)

  1. “పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రీయ సమన్వితం |

అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగసాధనం ||“.

(పంచప్రాణములు, మనస్సు, బుద్ధి, దశేంద్రియములు - వీటితో కూడి, పంచీకృతముకాని భూతములవలన కలిగినదిన్నీ, భోగ సాధనమైనదిన్నీ అయిన సూక్ష్మ శరీరము) - (చూడుము - లింగము - 7).

  1. “శబ్దాది విషయోపలబ్ది హేతుత్వాత్ లక్షణయా ఆత్మావ బోధకత్వాత్ చ లింగదేహః - ఇతి కీర్త్యతే.

(శబ్దము మొదలగు విషయములకు కారణమైనదగుటవలనను, లక్షణద్వారా ఆత్మజ్ఞానమును కలిగించినదగుటవలనను లింగదేహము అని చెప్పబడినది)

  1. “లింగదేహమే పునర్జన్మబీజము. ఆ లింగదేహంబే పర్యాంతం చెడకుండునో ఆ పర్యాంతమున్నూ జననమరణాదులు జీవులకు కలుగుచుండును - వివేకం చేత, బ్రహ్మజ్ఞానంచేతగాని లింగదేహం బంగంకాదు - అప్పుడుగాని మోక్షం లేదు-”

(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 2)

  1. “స్థూల దేహ సంబంధంబు జీవుని యందు బుద్ధి మనో మోక్షార్థ గుణ వ్యూహ రూపాది లింగశరీర భంగపర్యంతంబు గలుగుచుండు - - - పంచతన్మాత్రకంబును త్రిగుణాత్మకంబును, షోడశనికారాత్మ విస్తృతంబును నయిన లింగశరీరంబు నధిష్టించి, చేతనాయుక్తుండైన జీవుండని చెప్పంబడు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 28 -)

  2. “లింగ దేహంబెంత దడవుండు నంత దడవును మనంబు కర్మవశంబై జ్ఞావంతంబుగాక యవిద్యం బాయకుండు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 - 6)

  1. “ప్రాణమయ మనోమయ, విజ్ఞానమయ, కోశత్రయం లింగశరీరం”

(ప్రాణమయకోశము,మనోమయకోశము,విజ్ఞానమయకోశము అను నీ మూడుకోశముల సమూహము లింగశరీరము).

  1. “మన ఆది ఏకాదశేంద్రియ గణః సూక్ష్మభూత పంచకం, తన్మాత్రాణి ఏవ షోడశకం లింగశరీరం”

(మనస్సు మొదలు పదునొకండు ఇంద్రియములు, తన్మాత్రలు, అనగ, పంచీకరణముకాని సూక్ష్మపంచభూతములు, అను నీ పదియారు, అను నీ పదియారు కలిసి లింగశరీరము).

“కర్మేంద్రియః సహప్రాణాది పంచకం ప్రాణమయకోశః, జ్ఞానేంద్రియైః సహ బుద్ధిః విజ్ఞానమయకోశః, ఏ తత్కోశత్రయం లింగశరీరం” (పైంగలోపనిషత్)

  1. “పంచభూతాత్మకే దేహే దగ్ధే అపి అంగుష్టపరిమితో లింగదేహో మోక్షపర్యంతం వహ్న్యాది కుండేషు పతితోపి న నశ్యతి. తేన దేహేన భోదః సంభవతి.”

(పంచభూతముల సమ్మేళనము వలన కలిగిన దేహము దహింపబడినప్పటికీ - కాలిపోయినను - అంగుష్టమాత్ర పరిమితమైన లింగదేహము (సూక్ష్మ శరీరము) మోక్షముకలుగువఱకు అగ్నికుండము మొదలగు వాటిలో పడినప్పటికీ నశింపదు - ఆ లింగదేహముతోనే అనుభవము - కర్మఫలమైన సుఖదుఃఖములను అనుభవించుట - కలుగును)

  1. “నాశస్యా పరిహార్యత్వాత్ స్థూలస్యా శోచ్య తేరితా |

లింగస్యా శోచితాచాత్మవ దవధ్యత్స హేతునా |

ఆమోక్షం న వినాశో(అ)స్య లింగదేహస్య సంభవేత్ |

సుషుప్పౌ ప్రలయే చాస్య సూక్ష్మరూపేణ సంస్థితిః |

న స్థూలస్య న సూక్ష్మస్య నాత్మనో వాస్తి శోచ్యతా ||“. (గీతాభావప్రకాశము - 2 - 370 to 372)

(స్థూలదేహము నశించుట తప్పదుకనుక దానిని గుఱించి విచారించవలసిన పనిలేదు. ఆత్మ నశింపనిది -“దేహీ నిత్యమవధ్యేయం”

(శ్రీమద్భగవద్గీత - 2 - 30)

దేహముకల ఆత్మ - దేహములోనుండు ఆత్మ నిత్యమైనది - నశింపచేయుటకు వీలుకానిది. అట్టి ఆత్మవలనే లింగదేహము కూడ (సూక్ష్మదేహముకూడ) నాశములేనిది. మోక్షముకలుగువఱకు లింగదేహమునకు నాశములేదు. సుషుప్తియందు ప్రలయమందుకూడ ఈ లింగదేహము సూక్ష్మరూపములో నుండును. అందుచేత స్థూలదేహము గుఱించికాని - సూక్ష్మ దేహము గుఇంచికాని - ఆత్మగుఱించికాని విచారించవలసిన పనిలేదు).

  1. “పూర్వోక్తైర్లింగ శరీరం పరలోక యాత్రా నిర్వాహకం మోక్ష పర్యంతం స్థాయి, మనో బుద్ధిభ్యాముపేతం, జ్ఞానేంద్రియ పంచ, కర్మేంద్రియ పంచక, ప్రాణాది పంచక సం యుక్తం జాయతే - తదుక్తం -”పంచప్రాణమనోబుద్ధి దశేంద్రియ సమన్వితం | అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగసాధనం ||“. (మైత్రేయ శ్రుతిః). (చూడుము - లింగశరీరము - 4)

“తచ్చద్వివిధం, పరమపరంచ - తత్ర పరం హిరణ్యగర్భ లింగశరీరం, అపరం అస్మదాది లీంగశరీరం. తత్ర హిరణ్యగర్భ లింగశరీరం మహత్తత్త్వం. అస్మదాది లింగశరీరం అహంకారః ఇత్యాఖ్యాయతే.” (వేదాంతపరిభాషా - ధర్మరాజాధ్విరేందిః)

(పైన చెప్పబడిన పంచీకృతముకాని (సూక్ష్మమైన) పంచభూతములు మొదలగువాటివలన లింగశరీరము పరలోకమునకు పోవునదిన్నీ, మోక్షము కలుగువఱకు నశింపకయుండునదిన్నీ, మనస్సు బుద్ధులతోకలిసి, అయిదు జ్ఞానేంద్రియములు, అయిఉ కర్మేంద్రియములు అయిదు ప్రాణములు కలిసి లింగదేహమగుచున్నది)

(లింగదేహము రెండువిధములు - పరము, అపరము అని. పరము హిరణ్యగర్భుని లింగశరీరము, అపరము మనవంటివారి లింగశరీరము. హిరణ్యగర్భుని లింగశరీరమనగా మహత్తత్త్వము. మనవంటివారి లింగశరీరమనగా అహంకారము అని చెప్పబడినది).

“తత్ర బ్రహ్మాండవ్యాపిత్వాత్ ఆద్యం పరం, దేహమాత్ర వ్యాపిత్వాత్ ద్వితీయం అపరిమిత్యా శయం” (శివదత్తః)

(హిరణ్యగర్భుని లింగశరీరమగు మహత్తత్త్వము బ్రహ్మాండమంతటను వ్యాపించియుండుటచేత ‘పరము’ అని చెప్పబడినది. మనవంటివారి లింగశరీరము ఒక్క దేహమందే వ్యాపించియుండునది కనుక ‘అపరము’ అని చెప్పబడినది)

  1. “మనోవ్యాపార రూపంబగు లింగశరీరంబునకు మహామహిముని హృదయంబు స్వర్గభూమియగు”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 - 89)

  1. “లీనం శబ్దాది అర్థం గమయతి”

(తాను వ్యక్తముగాక శబ్దాదులను పొందించునది - శబ్దాదులతో చేర్చునది - లింగశరీరము).

  1. “దాన ప్రతిగ్రహాదులయందు స్థూల దేహంబునకుం గర్తృత్వంబు గలదంటివేని నహంకార, మమకార యుక్తుండైన పురుషుండు మనంబునం జేసి యేయే దేహంబు పరిగ్రహించు నాయా దేహంబున సిద్ధంబైన కర్మం బా జీవుండనుభవించు. అట్లు గాకున్న గర్మంబు పునర్భవ కారణంబగుట యుపపన్నంబుగాకుండు, కావున మనః ప్రధానంబైన లింగ శరీరంబునకే కర్తృత్వం బుపపన్నంబగు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం. - 4 -)
  1. “శుభాశుభ కర్మ కర్తృత్వం, సుఖదుఃఖాది ఫలభోక్తృత్వం, ఇహలోక పరలోకాది గమనాగమనే, రాగద్వేషాది, శమదమాది ఆంధ్యామాంధ్య పటుత్వాది చ సర్వం లింగశరీరధర్మాః”.

(పుణ్యపాప కర్మలుచేయుట, సుఖదుఃఖములు మొదలగు కర్మల ఫలమనుభవించుట, ఈ లోకమునుండి పరలోకమునకు, పరలోకమునుండి యీ లోకమునకు వచ్చుచు పోవుచు నుండుట, రాగద్వేషములు, శమదమాదులు మొదలగునవి కలిగియుండుట మొదలగునవి లింగశరీర ధర్మములు).

Transliteration
  1. liṃgadēhamu; sūkṣmadēhamu -

  2. “sthūla śarīramunaku lōnaina prāṇamaya, manōmaya, vijñānamaya maneḍi kōśa trayātmakamaina liṃga śarīramu - -”

(brahma vidyā sudhārṇavamu - 6)

  1. “ī sthūla śarīraṃ yokka vāsanāvaśamaina sūkṣmaśarīralakṣaṇa melāgaṃṭē - aṣṭapurālatō gūḍiṃdi liṃgadēhamu. aṣṭapurālelāgaṃṭē - jñānēṃdriyālu, karmēṃdriyālu, śabdādi viṣayālu, paṃca prāṇamulu, karaṇa catuṣṭayaṃ, karma, kāmanuvidya - yī yenimidiṃṭakūḍiṃdi liṃgadēhaṃ. dīni abhimāni taijasuḍu, iṃdu vyāpakamaina ātma aṃtarātma, ātaḍē prātibhāsika jīvuṃḍu:”.

(brahmavidyāsudhārṇavamu - 6)

  1. “paṃcaprāṇa manōbuddhi daśēṃdrīya samanvitaṃ |

apaṃcīkṛta bhūtōtthaṃ sūkṣmāṃgaṃ bhōgasādhanaṃ ||“.

(paṃcaprāṇamulu, manassu, buddhi, daśēṃdriyamulu - vīṭitō kūḍi, paṃcīkṛtamukāni bhūtamulavalana kaliginadinnī, bhōga sādhanamainadinnī ayina sūkṣma śarīramu) - (cūḍumu - liṃgamu - 7).

  1. “śabdādi viṣayōpalabdi hētutvāt lakṣaṇayā ātmāva bōdhakatvāt ca liṃgadēhaḥ - iti kīrtyatē.

(śabdamu modalagu viṣayamulaku kāraṇamainadaguṭavalananu, lakṣaṇadvārā ātmajñānamunu kaligiṃcinadaguṭavalananu liṃgadēhamu ani ceppabaḍinadi)

  1. “liṃgadēhamē punarjanmabījamu. ā liṃgadēhaṃbē paryāṃtaṃ ceḍakuṃḍunō ā paryāṃtamunnū jananamaraṇādulu jīvulaku kalugucuṃḍunu - vivēkaṃ cēta, brahmajñānaṃcētagāni liṃgadēhaṃ baṃgaṃkādu - appuḍugāni mōkṣaṃ lēdu-”

(brahmavidyāsudhārṇavamu - 2)

  1. “sthūla dēha saṃbaṃdhaṃbu jīvuni yaṃdu buddhi manō mōkṣārtha guṇa vyūha rūpādi liṃgaśarīra bhaṃgaparyaṃtaṃbu galugucuṃḍu - - - paṃcatanmātrakaṃbunu triguṇātmakaṃbunu, ṣōḍaśanikārātma vistṛtaṃbunu nayina liṃgaśarīraṃbu nadhiṣṭiṃci, cētanāyuktuṃḍaina jīvuṃḍani ceppaṃbaḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 28 -)

  2. “liṃga dēhaṃbeṃta daḍavuṃḍu naṃta daḍavunu manaṃbu karmavaśaṃbai jñāvaṃtaṃbugāka yavidyaṃ bāyakuṃḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 - 6)

  1. “prāṇamaya manōmaya, vijñānamaya, kōśatrayaṃ liṃgaśarīraṃ”

(prāṇamayakōśamu,manōmayakōśamu,vijñānamayakōśamu anu nī mūḍukōśamula samūhamu liṃgaśarīramu).

  1. “mana ādi ēkādaśēṃdriya gaṇaḥ sūkṣmabhūta paṃcakaṃ, tanmātrāṇi ēva ṣōḍaśakaṃ liṃgaśarīraṃ”

(manassu modalu padunokaṃḍu iṃdriyamulu, tanmātralu, anaga, paṃcīkaraṇamukāni sūkṣmapaṃcabhūtamulu, anu nī padiyāru, anu nī padiyāru kalisi liṃgaśarīramu).

“karmēṃdriyaḥ sahaprāṇādi paṃcakaṃ prāṇamayakōśaḥ, jñānēṃdriyaiḥ saha buddhiḥ vijñānamayakōśaḥ, ē tatkōśatrayaṃ liṃgaśarīraṃ” (paiṃgalōpaniṣat)

  1. “paṃcabhūtātmakē dēhē dagdhē api aṃguṣṭaparimitō liṃgadēhō mōkṣaparyaṃtaṃ vahnyādi kuṃḍēṣu patitōpi na naśyati. tēna dēhēna bhōdaḥ saṃbhavati.”

(paṃcabhūtamula sammēḷanamu valana kaligina dēhamu dahiṃpabaḍinappaṭikī - kālipōyinanu - aṃguṣṭamātra parimitamaina liṃgadēhamu (sūkṣma śarīramu) mōkṣamukaluguvaṟaku agnikuṃḍamu modalagu vāṭilō paḍinappaṭikī naśiṃpadu - ā liṃgadēhamutōnē anubhavamu - karmaphalamaina sukhaduḥkhamulanu anubhaviṃcuṭa - kalugunu)

  1. “nāśasyā parihāryatvāt sthūlasyā śōcya tēritā |

liṃgasyā śōcitācātmava davadhyatsa hētunā |

āmōkṣaṃ na vināśō(a)sya liṃgadēhasya saṃbhavēt |

suṣuppau pralayē cāsya sūkṣmarūpēṇa saṃsthitiḥ |

na sthūlasya na sūkṣmasya nātmanō vāsti śōcyatā ||“. (gītābhāvaprakāśamu - 2 - 370 to 372)

(sthūladēhamu naśiṃcuṭa tappadukanuka dānini guṟiṃci vicāriṃcavalasina panilēdu. ātma naśiṃpanidi -“dēhī nityamavadhyēyaṃ”

(śrīmadbhagavadgīta - 2 - 30)

dēhamukala ātma - dēhamulōnuṃḍu ātma nityamainadi - naśiṃpacēyuṭaku vīlukānidi. aṭṭi ātmavalanē liṃgadēhamu kūḍa (sūkṣmadēhamukūḍa) nāśamulēnidi. mōkṣamukaluguvaṟaku liṃgadēhamunaku nāśamulēdu. suṣuptiyaṃdu pralayamaṃdukūḍa ī liṃgadēhamu sūkṣmarūpamulō nuṃḍunu. aṃducēta sthūladēhamu guṟiṃcikāni - sūkṣma dēhamu guiṃcikāni - ātmaguṟiṃcikāni vicāriṃcavalasina panilēdu).

  1. “pūrvōktairliṃga śarīraṃ paralōka yātrā nirvāhakaṃ mōkṣa paryaṃtaṃ sthāyi, manō buddhibhyāmupētaṃ, jñānēṃdriya paṃca, karmēṃdriya paṃcaka, prāṇādi paṃcaka saṃ yuktaṃ jāyatē - taduktaṃ -”paṃcaprāṇamanōbuddhi daśēṃdriya samanvitaṃ | apaṃcīkṛta bhūtōtthaṃ sūkṣmāṃgaṃ bhōgasādhanaṃ ||“. (maitrēya śrutiḥ). (cūḍumu - liṃgaśarīramu - 4)

“taccadvividhaṃ, paramaparaṃca - tatra paraṃ hiraṇyagarbha liṃgaśarīraṃ, aparaṃ asmadādi līṃgaśarīraṃ. tatra hiraṇyagarbha liṃgaśarīraṃ mahattattvaṃ. asmadādi liṃgaśarīraṃ ahaṃkāraḥ ityākhyāyatē.” (vēdāṃtaparibhāṣā - dharmarājādhvirēṃdiḥ)

(paina ceppabaḍina paṃcīkṛtamukāni (sūkṣmamaina) paṃcabhūtamulu modalaguvāṭivalana liṃgaśarīramu paralōkamunaku pōvunadinnī, mōkṣamu kaluguvaṟaku naśiṃpakayuṃḍunadinnī, manassu buddhulatōkalisi, ayidu jñānēṃdriyamulu, ayiu karmēṃdriyamulu ayidu prāṇamulu kalisi liṃgadēhamagucunnadi)

(liṃgadēhamu reṃḍuvidhamulu - paramu, aparamu ani. paramu hiraṇyagarbhuni liṃgaśarīramu, aparamu manavaṃṭivāri liṃgaśarīramu. hiraṇyagarbhuni liṃgaśarīramanagā mahattattvamu. manavaṃṭivāri liṃgaśarīramanagā ahaṃkāramu ani ceppabaḍinadi).

“tatra brahmāṃḍavyāpitvāt ādyaṃ paraṃ, dēhamātra vyāpitvāt dvitīyaṃ aparimityā śayaṃ” (śivadattaḥ)

(hiraṇyagarbhuni liṃgaśarīramagu mahattattvamu brahmāṃḍamaṃtaṭanu vyāpiṃciyuṃḍuṭacēta ‘paramu’ ani ceppabaḍinadi. manavaṃṭivāri liṃgaśarīramu okka dēhamaṃdē vyāpiṃciyuṃḍunadi kanuka ‘aparamu’ ani ceppabaḍinadi)

  1. “manōvyāpāra rūpaṃbagu liṃgaśarīraṃbunaku mahāmahimuni hṛdayaṃbu svargabhūmiyagu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 - 89)

  1. “līnaṃ śabdādi arthaṃ gamayati”

(tānu vyaktamugāka śabdādulanu poṃdiṃcunadi - śabdādulatō cērcunadi - liṃgaśarīramu).

  1. “dāna pratigrahādulayaṃdu sthūla dēhaṃbunakuṃ gartṛtvaṃbu galadaṃṭivēni nahaṃkāra, mamakāra yuktuṃḍaina puruṣuṃḍu manaṃbunaṃ jēsi yēyē dēhaṃbu parigrahiṃcu nāyā dēhaṃbuna siddhaṃbaina karmaṃ bā jīvuṃḍanubhaviṃcu. aṭlu gākunna garmaṃbu punarbhava kāraṇaṃbaguṭa yupapannaṃbugākuṃḍu, kāvuna manaḥ pradhānaṃbaina liṃga śarīraṃbunakē kartṛtvaṃ bupapannaṃbagu” (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ. - 4 -)
  1. “śubhāśubha karma kartṛtvaṃ, sukhaduḥkhādi phalabhōktṛtvaṃ, ihalōka paralōkādi gamanāgamanē, rāgadvēṣādi, śamadamādi āṃdhyāmāṃdhya paṭutvādi ca sarvaṃ liṃgaśarīradharmāḥ”.

(puṇyapāpa karmalucēyuṭa, sukhaduḥkhamulu modalagu karmala phalamanubhaviṃcuṭa, ī lōkamunuṃḍi paralōkamunaku, paralōkamunuṃḍi yī lōkamunaku vaccucu pōvucu nuṃḍuṭa, rāgadvēṣamulu, śamadamādulu modalagunavi kaligiyuṃḍuṭa modalagunavi liṃgaśarīra dharmamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.