← Back to ల · Booklets 41–50 (digitized file 5)

లోకః lōkaḥ

Original — తెలుగు
  1. లోక్యతే, ఆలోక్యతే, దృశ్యతే, సాక్షాత్క్రియతే ఇతి లోకః, దృశ్యవర్గః

(చూడబడుచున్నది, కంటికి కనబడుచున్నది, లోకము. కనబడుచున్నదంతయు, చరాచర రూపములు కలదంతయు లోకము - కనబడు ప్రపంచము)

  1. లోక్యతే, ప్రకాశ్యతే ఇతి లోకః, జడవర్గః.

(చూడబడుచున్నది, ప్రకాశముగా కనబడుచున్నది, జడరూపమైన ప్రపంచము).

  1. లోక్యతే, భుజ్యతే ఇతి లోకః, ఫలం ఇత్యర్థః -

(కర్మల ఫలములను అనుభవించుటకు కలిగిన జన్మలు.)

  1. లోకన హేతుభూతం

(చూడడానికి, పరిశీలించడానికి కారణమైనది లోకము -)

  1. భోగ్య ప్రపంచము -

(అనుభవించవలసిన చోటు - ప్రపంచము - సుఖముగాని దుఃఖముకాని అనుభవించవలసిన స్థానము)

  1. ప్రాణిజాతః, ప్రాణి నికాయం, జనః, ప్రాణినః.

(ప్రాణులు, అన్నివిధములైన ప్రాణుల సముదాయము, లోకములోని జనులు, లోకులు).

  1. లోక్యతే. అనుభూయతే, స్వాత్మత్వేన యోగిభిరితి లోకః -

(యోగులు ఈ దృశ్యప్రపంచమునంతను తమ ఆత్మగానే - పరమాత్మగానే, పరమాత్మ రూపముగానే చూచి అనుభవించెదరు - అట్టి భావననుసరించియే ప్రవర్తించెదరు)

  1. “కర్మఫలాని లోక్యంతే, దృశ్యంతే, భుజ్యంతే ఇతి లోకాః” (శ్రీ శంకరః)

(కర్మ ఫలములను చూచుచున్నాము, కర్మ ఫలములు ఇక్కడ అనుభవించబడుచున్నవి - కనుక ఇది లోకము).

  1. లోక్యంతే ఇతి లోకాః విషయాః ఇత్యర్థః -

(చూడబడుచుండునవి - విషయములు)

లోక్యమానాః విషయాః -

  1. ప్రాణికర్మోప భోగస్థాన భూతాః -

(ప్రాణులు చేసిన కర్మల ననుభవించు స్థానములు)

  1. కార్యము, దేహము -

(భగవంతుడు అను కారణమువలన సృష్టింపబడిన కార్యవస్తువు - దేహము).

  1. “లోకాన్ సంసారగతి భూతాన్ అవక్తాది స్థావరాం తాన్ వ్యాకృతా వ్యాకృత లక్షణాత్ బీజాంకురవత్, ఇతరేత రోత్పత్తి నిమిత్తానేకానర్థ శతసహస్ర సంకులాన్, కదళీగర్భవదసారాన్, మాయా మరీచ్యుదక, గంధర్వ నగరాకార స్వప్న జలబుద్బుదఫేనసమాన్ ప్రతిక్షణ ప్రధ్వన్సాన్” (శ్రీశంకరః)

(సంసారము - (పుట్టుట, చనిపోవుట, మరల పుట్టుట, మరల చనిపోవుట) - అను ప్రవాహములో పడి కొట్టుకొనిపోవునది, అవ్యక్తము (ప్రకృతి) మొదలు స్థావరములవరకు గల వస్తువులన్నియు, వ్యాకృతి, అవ్యాకృతి లక్షణములు గలవి, బీజాంకురమువలె - బీజమునుండి అంకురము పుట్టుట, అంకురమునుండి బీజము పుట్టునట్లుగా - ఒకదానిపుట్టుటకు ఇంకొకటి కారణమైట్లుగా - అనేకమైన అనర్థములకు కూటమి అయినవిన్నీ, అరటిబోదెవలె సారము లేనివిన్నీ, ఎండమావులు, గంధర్వనగరము, కల, జలబిందువు, నురగ - వీటితో సమానమైనవిన్నీ - ఇట్లే పుట్టి యిట్టే మాయమైనట్లు క్షణక్షణము నశించునవియు - (క్షణములో పుట్టి క్షణములో నశించునవియు - అగునవి లోకములు - అనగా, పుట్టుచు, గిట్టుచు నుండుటచేత శాశ్వతముగా నుండనివి, కార్యములగుటచేత నశించునవి, అనేక అనర్థములతో కూడియుండుటచేత కష్టములకాలవాలమైనవి యు లోకములు).

  1. “స్వప్నేంద్రజాల సదృశః ఖలు జీవలోకః”

(జీవలోకము - జీవులు, లేక. జీవులుండులోకము స్వప్నము. ఇంద్రజాలము వంటిది. అంతా భగవంతుడే కనుక పారమార్థికదృష్టిలో లేనిది, వ్యవహారదృష్టిలో నున్నట్లు కనుపించునది. లేనిది యున్నట్లు కనుపించుటవలన మాయాజాలము వంటిది, కలలో కనుపించి మెలుకువ వచ్చినతోడనే లేనిదానివలె నుండునది. కనుక కలవంటిది, యదార్థముగా లేనిది.)

  1. “లోకస్తు భవనే జనే”

(లోకమనగా స్వర్గమర్త్యపాతాళ లోకములు, లేక, లోకములలోని జనులు.)

  1. “ఈశస్యహి వశే లోకో యోషా దారు మయీ యథా |” (శ్రీమద్భాగవతం - 1 - 6 - 7)

(కఱ్ఱతో చేయబడిన ఆడబొమ్మలవలె లోకము - లోకములోని జనులు భగవంతుని వశములో నుందురు, కర్రబొమ్మ ఎట్లు చెక్కబడితే అట్టి రూపమునొందును. అట్లే భగవంతుడెట్లు నడిపించిన లోకులు అట్లే నడిచెదరు - స్వతంత్రులుకారు. వారివారి కర్మానుసారముగ జననము, మరణము, కష్టము, సుఖము మొదలగువాటిని భగవంతుడు పొందింపచేయును. అందుచేత లోకులు భగవంతుని వశములో నున్నారు. ఆ కర్మఫలమును తప్పించుకొని వ్యవహరించలేరు - కనుక స్వతంత్రులు కారు)

  1. “ఏకస్య కర్మ సంవీక్ష్య కరోత్యన్యోపి గర్హితం |

గతానుగతికో లోకో న లోకోపారమార్థికః ||“.

(ఒకడు చేయు పనిని - పనితీరును - చూచి, ఇంకొకడు, అది ఎంత గర్వించతగిన పని అయినను, దానిని అట్లే చేయును. అంతియేగాని పరమార్థమునాలోచించడు).

“యద్యదా చరతి శ్రేష్ట స్తత్తదేవేతరో జనః |

స యత్ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే ||“.

“యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతం ద్రితిః |

మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః, పార్థ సర్వశః ||“. (శ్రీమద్భగవధ్గీత - 3 - 21, 23)

(శ్రేష్టుడైనవాడు ఏపని చేసినను మిగిలిన జనులుకూడా ఆ పనినే చేయుదురు. ఎవడు ఏది ప్రమాణమని చెప్పునో జనులు దానినే ప్రమాణమని అంగీకరించి దాని ప్రకారమే చేయుదురు. నేను ఎప్పుడైనా అజాగ్రత్తవలన కర్మచేయని యడల జనులు నామార్గమునే పట్టుదురు - అతను శ్రేష్టుడు - అతను కర్మ చేయలేదుకనుక మేమెందుకు చేయవలెను ? మేమూ చేయము అను అభిప్రాయము కలుగును - అందుచేత లోకులు - జనులు - గతానుగతికులు - ముందువారు వెళ్ళిన మార్గమునే వెళ్ళువారగుదురు.)

  1. “స ఇమాన్ లోకా న సృజత” (ఐతరేయోపనిషత్)

(భగవంతుడు ఈ లోకములను సృష్టించెను.) తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ - తదను ప్రవిశ్య సచ్చత్యచ్చా అభవత్

(ఆ లోకములను సౄష్టించి వాటిలోనే ప్రవేశించెను - అట్లు ప్రవేశించి ‘సత్’, ‘త్యత్’ తానే ఆయెను - అందుచేత లోకములన్నియు తానే - అందులోని ఆత్మవస్తువులు, అనాత్మ వస్తువులు తానే ఆయెను - లోకములన్నియు, లోకములలోని వస్తువులన్నియు భగవంతుని రూపములే. అందుచేత సృష్టిలో నున్నదంతా భగవంతుడే - భగవంతుడొక్కడే - అందుచేతనే అద్వయుడు - తనుకాని రెండవ వస్తువు లేనివాడు.)

  1. “నారాయణ నియమ్యంబులు లోకంబులు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 84)

  2. ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున. (శ్రీమద్భగవద్గీత - 8 - 16)

“బ్రహ్మలోక సహితా లోకాయే భోగభూమయః |

అసమ్యగ్దర్శనాం సంతి పునారావర్తినో (అ)ఖిలాః |

కర్మభిర్నిర్మితానాం హి స్థాయిత్వం నాస్తి కర్హిచిత్ |

కర్మభిర్నిల్మితాః తేస్యుర్బ్రహ్మ లోకాదయో (అ)ఖిలాః |

- - - లోకాః కాలపరిచ్చిన్న తయా సర్వే వినశ్వరాః ||” (గీతాభావప్రకాశము - 8 - 98, 99, 101)

భోగభూములైన బ్రహ్మలోకము మొదలగు లోకములు సమ్యగ్దర్శనులు కానివారికే గలవు - అవన్నియు నశించి మరల పుట్టుచుండునవి - వారి అనుభవముకొఱకే గలవు. కర్మవలన పుట్టినటువంటివి స్థిరముగానుండవు. బ్రహ్మలోకము మొదలగు లోకములన్నియు కర్మవలన కలిగినవియే. లోకములకు కాలపరిమితి కలదుకనుక అవన్నియును నశించవలసినవే. వాటికి కాల పరిమితి ఎట్లనగా : -

సహస్ర యుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః – |

రాత్రించ యుగసహస్రాంతం తే అహోరాత్ర విదో జనాః ||.

అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహ రాగమే |

రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే || (శ్రీమద్భగవద్గీత - 8 - 18)

బ్రహ్మకు సహస్ర యుగముల కాలము పగలు, అంతయే కాలము రాత్రి. బ్రహ్మ పగటి కాలములో అవ్యక్తమునుండి (ప్రకృతినుండి) లోకములు పుట్టుచున్నవి, రాత్రికాలములో దానిలోనే యేకమగుచున్నవి).

  1. మహర్షయః సప్త పూర్వేచత్వారో మనవస్తథా |

మద్భావా మానసాజాతాః యేషాం లోకే ఇమః ప్రజాః ||. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)

(పూర్వకాలమందు - సృష్టి ప్రారంభములో, సప్తమహా ఋషులు, మనువులు - నా మనస్సునుండి పుట్టినవారు, నా సంకల్పమాత్రమున నా భావములే అయి, నా అంశలే అయి - పుట్టిరి.వారి వలన లోకములోని ప్రజలందరు పుట్టిరి - మనువు సంతతివారు కనుకనే మానవులు అని చెప్పబడిరి).

  1. “వర్ష పూగ సహస్రాంతే తదండం ఉదకే శయం |

కాలకర్మ స్వభావస్థో జీవో జీవమజీవ యత్ |

స ఏవ పురుషస్తస్మాదండం నిర్భిద్య నిర్గతః |

సహస్రోర్వంఘ్రి బాహ్వక్షః సహ స్రానన శీర్షవాన్ |

యస్యాద యవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః |

కట్యాభిరధిస్సప్త సప్తోర్ధ్వం జఘనాదిభిః |

పురుషస్య ముఖం బ్రహ్మక్షత్రమే తస్య చాహ వః |

ఊర్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రోఅజాయత |

భూర్లోకః కల్పితః పద్భ్యాం భువర్లోకో అస్య నాభితః |

హృదా స్వర్లోక ఉరసా మహర్లోకో మహాత్మనః |

గ్రీవాయాం జనలోకశ్చ తపో లోకస్త న ద్వయాత్ |

మూర్థభిః సత్యలోకస్తు బ్రహ్మలోకస్తు సనాతనః |

తత్కట్యాం చాతలం క్లుప్త మూరుభ్యాం వితలం విభోః |

జానుభ్యాం సుతలం శుద్ధం జంఘాభ్యాంతు తలాతలం |

మహాతలం తు గుల్ఫాభ్యా ప్రపదాభ్యాం రసాతలం |

పాతాళం పాద సలతః ఇతి లోకమయః పుమాన్ |

భూర్లోకః కల్పితః పద్భ్యాం భువర్లోక పద్భ్యాం భువర్లోకస్య నాభితః |

స్వర్ళోకః కల్పితో మూర్థ్నా ఇతివా లోక కల్పనా ||“. (శ్రీమద్భాగవతం - 2 - 5 - 35 to 43)

పైన చెప్పబడిన సంస్కృత భాగవతమునకు అనువాదము ఈ క్రిందివిధముగా శ్రీమదాంధ్రమహాభాగవతములో చెప్పబడినది: -

“కాలకర్మ స్వభావ ప్రేరకుండైన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్యస్థితంబయిన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబు గావించి యట్టి యండంబు భేదించి నిర్గమించె నెట్లంటేని –

క. భువనాత్మకుడా యీశుడు

భువనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్

వివరముతో బదునాలుగు

వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్ -

మ. బహు పాదోరు భుజాననేక్షణ శిరః ఫాలశ్రవో యుక్తుడై

విహరించున్ బహు దేహి దేహగతుడై విద్వాంసులూహించి త

ద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురు - - -|”

వ. చతుర్దశ లోకంబులందు మీది పదియేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటి ప్రదేశంబున నుండి యూర్ధ్వదేహమనియును గ్రింది యేడు లోకంబులు జఘనంబున నుండి యధోదేహమనియును బలికుదురు - ప్రపంచ శరీరుండగు భగవంతునికి - - - భూలోకంబు కటి పర్యంత ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జవలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మ నివాసంబును నైన సత్యలోకంబు శిరంబు, గటి ప్రదేశంబతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబు అని లోకమయంగా భావింతురు -. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 89)

  1. లౌకికాః ప్రాణినః -

(లోకములకు సంబంధించిన వారు, జీవులు)

  1. “పాతాళాద్బ్రహ్మ లోకాంతం బ్రహ్మాందం పరికీర్తితం |

అతః ఊర్ధ్వం చ వైకుంఠో బ్రహ్మాండాద్బహిరేవసః |

తతః ఊర్ధ్వంచ గోలోకః పంచా శత్కోటి యోజనః |

నిత్య సత్వ స్వరూపశ్చ యథా కృష్ణః తథా ప్యయం |

సప్తద్వీప మితా పృధ్వీ స్ప్తసాగర సం యుతా |

ఊన పంచాశ దుపద్వీప సంఖ్యా శైలవనాన్వితా |

ఊర్థ్వం సప్తస్వర్గ లోకాః స్వర్గలోక సమన్వితాః |

పాతాళాని చ సప్తాధశ్చైవం బ్రహ్మాండమేవచ |

ఊర్థ్వం ధరాయాః భూర్లోకో భువర్లోకస్తతః పరం |

తతః పరశ్చ స్వర్లోకో | జనలోకస్థథా పరః |

తతః పరస్తపోలోకః సత్యలోకస్త తః పరః |

తతః పరం బ్రహ్మలోకః తప్త కాంచన సన్నిభః |

ఏవం సర్వం పరం బ్రహ్మలోకః తప్తకాంచన సన్నిభః |

ఏవం సర్వం కృత్రిమంచ బాహ్యాంభ్యంతర మేవచ |

తద్వినాశే వినాశశ్చ సర్వేషామేవ, నారద |

జలబుద్బుద వత్సర్వం విశ్వ సంఘ మనిత్యకం |

నిత్యౌ గోలోక వకుంఠా స్రోక్తా శశ్వదకృత్రిమౌ ||“. (దేవీభాగవతం)

(క్రిందను పాతాళలోకము మొదలు మీదను బ్రహ్మలోకమువరకు గలదంతయు బ్రహ్మాందమని (గ్రుడ్డు ఆకారముగానున్న బ్రహ్మ అని)చెప్పబడును. దీనికి పైనున్నది వైకుంఠము. ఇది బ్రహ్మాండమునకు వెలుపలనున్నది. దానికి పైన పంచశత్కోటి యోజనముల విస్తీర్ణముగల గోలోకమున్నది - శ్రీకృష్ణభగవానుడు నిత్య సత్య స్వరూపుడైనట్లే ఇది కూడ అటులనే యున్నది. పృథివి సప్రద్వీపములు సప్తసాగరములు కలది, ఉపద్వీపములు, కొండలు, అడవులు గలది. మీదను స్వర్గలోకముతో కలిసి ఏడు లోకములున్నవి, క్రిందను సప్త పాతాళలోకములున్నవి. ఇవన్నియు కలిసినది బ్రహ్మాండము. భూలోకము మీద భూర్లోకము, దాని మీదను భువర్లోకము, దాని పైన స్వర్లోకము, తరువాత జనలోకము, దాని పైన తపోలోకము, దాని పైన సత్యలోకము, దాని పైన బ్రహ్మలోకము - అది కాల్చిన బంగారు కాంతి కలది. ఈవన్నియు కృత్రిమములే - కల్పింపబడినవే - సృష్టి చేయబడినవే. ఆ బ్రహ్మాండము నశించిన అవన్నియు నశించును - నీటి బుడగవలె ప్రపంచములోనున్నవన్నియు నిత్యముకానివి. గోలోక వైకుంఠములు కృత్రిమములు కావు. అందుచేత శాశ్వతమైనవి అని చెప్పబడినవి).

  1. “త్వం తదాపః, ఆపోజ్యోతీరసో(అ)మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం”. (మంత్ర పుష్పము)

(నీవే - పరబ్రహ్మమే జలము, నీవే జ్యోతి, రసము, అమృతము - భూలోకము, భువర్లోకము, సువర్లోకము). కొన్ని లోకములు చెప్పియుండుటచేత లోకములన్నియు బ్రహ్మరూపములే).

Transliteration
  1. lōkyatē, ālōkyatē, dṛśyatē, sākṣātkriyatē iti lōkaḥ, dṛśyavargaḥ

(cūḍabaḍucunnadi, kaṃṭiki kanabaḍucunnadi, lōkamu. kanabaḍucunnadaṃtayu, carācara rūpamulu kaladaṃtayu lōkamu - kanabaḍu prapaṃcamu)

  1. lōkyatē, prakāśyatē iti lōkaḥ, jaḍavargaḥ.

(cūḍabaḍucunnadi, prakāśamugā kanabaḍucunnadi, jaḍarūpamaina prapaṃcamu).

  1. lōkyatē, bhujyatē iti lōkaḥ, phalaṃ ityarthaḥ -

(karmala phalamulanu anubhaviṃcuṭaku kaligina janmalu.)

  1. lōkana hētubhūtaṃ

(cūḍaḍāniki, pariśīliṃcaḍāniki kāraṇamainadi lōkamu -)

  1. bhōgya prapaṃcamu -

(anubhaviṃcavalasina cōṭu - prapaṃcamu - sukhamugāni duḥkhamukāni anubhaviṃcavalasina sthānamu)

  1. prāṇijātaḥ, prāṇi nikāyaṃ, janaḥ, prāṇinaḥ.

(prāṇulu, annividhamulaina prāṇula samudāyamu, lōkamulōni janulu, lōkulu).

  1. lōkyatē. anubhūyatē, svātmatvēna yōgibhiriti lōkaḥ -

(yōgulu ī dṛśyaprapaṃcamunaṃtanu tama ātmagānē - paramātmagānē, paramātma rūpamugānē cūci anubhaviṃcedaru - aṭṭi bhāvananusariṃciyē pravartiṃcedaru)

  1. “karmaphalāni lōkyaṃtē, dṛśyaṃtē, bhujyaṃtē iti lōkāḥ” (śrī śaṃkaraḥ)

(karma phalamulanu cūcucunnāmu, karma phalamulu ikkaḍa anubhaviṃcabaḍucunnavi - kanuka idi lōkamu).

  1. lōkyaṃtē iti lōkāḥ viṣayāḥ ityarthaḥ -

(cūḍabaḍucuṃḍunavi - viṣayamulu)

lōkyamānāḥ viṣayāḥ -

  1. prāṇikarmōpa bhōgasthāna bhūtāḥ -

(prāṇulu cēsina karmala nanubhaviṃcu sthānamulu)

  1. kāryamu, dēhamu -

(bhagavaṃtuḍu anu kāraṇamuvalana sṛṣṭiṃpabaḍina kāryavastuvu - dēhamu).

  1. “lōkān saṃsāragati bhūtān avaktādi sthāvarāṃ tān vyākṛtā vyākṛta lakṣaṇāt bījāṃkuravat, itarēta rōtpatti nimittānēkānartha śatasahasra saṃkulān, kadaḷīgarbhavadasārān, māyā marīcyudaka, gaṃdharva nagarākāra svapna jalabudbudaphēnasamān pratikṣaṇa pradhvansān” (śrīśaṃkaraḥ)

(saṃsāramu - (puṭṭuṭa, canipōvuṭa, marala puṭṭuṭa, marala canipōvuṭa) - anu pravāhamulō paḍi koṭṭukonipōvunadi, avyaktamu (prakṛti) modalu sthāvaramulavaraku gala vastuvulanniyu, vyākṛti, avyākṛti lakṣaṇamulu galavi, bījāṃkuramuvale - bījamunuṃḍi aṃkuramu puṭṭuṭa, aṃkuramunuṃḍi bījamu puṭṭunaṭlugā - okadānipuṭṭuṭaku iṃkokaṭi kāraṇamaiṭlugā - anēkamaina anarthamulaku kūṭami ayinavinnī, araṭibōdevale sāramu lēnivinnī, eṃḍamāvulu, gaṃdharvanagaramu, kala, jalabiṃduvu, nuraga - vīṭitō samānamainavinnī - iṭlē puṭṭi yiṭṭē māyamainaṭlu kṣaṇakṣaṇamu naśiṃcunaviyu - (kṣaṇamulō puṭṭi kṣaṇamulō naśiṃcunaviyu - agunavi lōkamulu - anagā, puṭṭucu, giṭṭucu nuṃḍuṭacēta śāśvatamugā nuṃḍanivi, kāryamulaguṭacēta naśiṃcunavi, anēka anarthamulatō kūḍiyuṃḍuṭacēta kaṣṭamulakālavālamainavi yu lōkamulu).

  1. “svapnēṃdrajāla sadṛśaḥ khalu jīvalōkaḥ”

(jīvalōkamu - jīvulu, lēka. jīvuluṃḍulōkamu svapnamu. iṃdrajālamu vaṃṭidi. aṃtā bhagavaṃtuḍē kanuka pāramārthikadṛṣṭilō lēnidi, vyavahāradṛṣṭilō nunnaṭlu kanupiṃcunadi. lēnidi yunnaṭlu kanupiṃcuṭavalana māyājālamu vaṃṭidi, kalalō kanupiṃci melukuva vaccinatōḍanē lēnidānivale nuṃḍunadi. kanuka kalavaṃṭidi, yadārthamugā lēnidi.)

  1. “lōkastu bhavanē janē”

(lōkamanagā svargamartyapātāḷa lōkamulu, lēka, lōkamulalōni janulu.)

  1. “īśasyahi vaśē lōkō yōṣā dāru mayī yathā |” (śrīmadbhāgavataṃ - 1 - 6 - 7)

(kaṟṟatō cēyabaḍina āḍabommalavale lōkamu - lōkamulōni janulu bhagavaṃtuni vaśamulō nuṃduru, karrabomma eṭlu cekkabaḍitē aṭṭi rūpamunoṃdunu. aṭlē bhagavaṃtuḍeṭlu naḍipiṃcina lōkulu aṭlē naḍicedaru - svataṃtrulukāru. vārivāri karmānusāramuga jananamu, maraṇamu, kaṣṭamu, sukhamu modalaguvāṭini bhagavaṃtuḍu poṃdiṃpacēyunu. aṃducēta lōkulu bhagavaṃtuni vaśamulō nunnāru. ā karmaphalamunu tappiṃcukoni vyavahariṃcalēru - kanuka svataṃtrulu kāru)

  1. “ēkasya karma saṃvīkṣya karōtyanyōpi garhitaṃ |

gatānugatikō lōkō na lōkōpāramārthikaḥ ||“.

(okaḍu cēyu panini - panitīrunu - cūci, iṃkokaḍu, adi eṃta garviṃcatagina pani ayinanu, dānini aṭlē cēyunu. aṃtiyēgāni paramārthamunālōciṃcaḍu).

“yadyadā carati śrēṣṭa stattadēvētarō janaḥ |

sa yatpramāṇaṃ kurutē lōkastadanu vartatē ||“.

“yadihyahaṃ navartēyaṃ jātu karmaṇyataṃ dritiḥ |

mama vartmānu vartaṃtē manuṣyāḥ, pārtha sarvaśaḥ ||“. (śrīmadbhagavadhgīta - 3 - 21, 23)

(śrēṣṭuḍainavāḍu ēpani cēsinanu migilina janulukūḍā ā paninē cēyuduru. evaḍu ēdi pramāṇamani ceppunō janulu dāninē pramāṇamani aṃgīkariṃci dāni prakāramē cēyuduru. nēnu eppuḍainā ajāgrattavalana karmacēyani yaḍala janulu nāmārgamunē paṭṭuduru - atanu śrēṣṭuḍu - atanu karma cēyalēdukanuka mēmeṃduku cēyavalenu ? mēmū cēyamu anu abhiprāyamu kalugunu - aṃducēta lōkulu - janulu - gatānugatikulu - muṃduvāru veḷḷina mārgamunē veḷḷuvāraguduru.)

  1. “sa imān lōkā na sṛjata” (aitarēyōpaniṣat)

(bhagavaṃtuḍu ī lōkamulanu sṛṣṭiṃcenu.) tatsṛṣṭvā tadēvānu prāviśat - tadanu praviśya saccatyaccā abhavat

(ā lōkamulanu sṝṣṭiṃci vāṭilōnē pravēśiṃcenu - aṭlu pravēśiṃci ‘sat’, ‘tyat’ tānē āyenu - aṃducēta lōkamulanniyu tānē - aṃdulōni ātmavastuvulu, anātma vastuvulu tānē āyenu - lōkamulanniyu, lōkamulalōni vastuvulanniyu bhagavaṃtuni rūpamulē. aṃducēta sṛṣṭilō nunnadaṃtā bhagavaṃtuḍē - bhagavaṃtuḍokkaḍē - aṃducētanē advayuḍu - tanukāni reṃḍava vastuvu lēnivāḍu.)

  1. “nārāyaṇa niyamyaṃbulu lōkaṃbulu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 84)

  2. ābrahmabhuvanāllōkāḥ punarāvartinōrjuna. (śrīmadbhagavadgīta - 8 - 16)

“brahmalōka sahitā lōkāyē bhōgabhūmayaḥ |

asamyagdarśanāṃ saṃti punārāvartinō (a)khilāḥ |

karmabhirnirmitānāṃ hi sthāyitvaṃ nāsti karhicit |

karmabhirnilmitāḥ tēsyurbrahma lōkādayō (a)khilāḥ |

- - - lōkāḥ kālapariccinna tayā sarvē vinaśvarāḥ ||” (gītābhāvaprakāśamu - 8 - 98, 99, 101)

bhōgabhūmulaina brahmalōkamu modalagu lōkamulu samyagdarśanulu kānivārikē galavu - avanniyu naśiṃci marala puṭṭucuṃḍunavi - vāri anubhavamukoṟakē galavu. karmavalana puṭṭinaṭuvaṃṭivi sthiramugānuṃḍavu. brahmalōkamu modalagu lōkamulanniyu karmavalana kaliginaviyē. lōkamulaku kālaparimiti kaladukanuka avanniyunu naśiṃcavalasinavē. vāṭiki kāla parimiti eṭlanagā : -

sahasra yugaparyaṃtamaharyadbrahmaṇō viduḥ – |

rātriṃca yugasahasrāṃtaṃ tē ahōrātra vidō janāḥ ||.

avyaktā dvyaktayaḥ sarvāḥ prabhavaṃtyaha rāgamē |

rātryāgamē pralīyaṃtē tatraivāvyakta saṃjñikē || (śrīmadbhagavadgīta - 8 - 18)

brahmaku sahasra yugamula kālamu pagalu, aṃtayē kālamu rātri. brahma pagaṭi kālamulō avyaktamunuṃḍi (prakṛtinuṃḍi) lōkamulu puṭṭucunnavi, rātrikālamulō dānilōnē yēkamagucunnavi).

  1. maharṣayaḥ sapta pūrvēcatvārō manavastathā |

madbhāvā mānasājātāḥ yēṣāṃ lōkē imaḥ prajāḥ ||. (śrīmadbhagavadgīta - 10 - 6)

(pūrvakālamaṃdu - sṛṣṭi prāraṃbhamulō, saptamahā ṛṣulu, manuvulu - nā manassunuṃḍi puṭṭinavāru, nā saṃkalpamātramuna nā bhāvamulē ayi, nā aṃśalē ayi - puṭṭiri.vāri valana lōkamulōni prajalaṃdaru puṭṭiri - manuvu saṃtativāru kanukanē mānavulu ani ceppabaḍiri).

  1. “varṣa pūga sahasrāṃtē tadaṃḍaṃ udakē śayaṃ |

kālakarma svabhāvasthō jīvō jīvamajīva yat |

sa ēva puruṣastasmādaṃḍaṃ nirbhidya nirgataḥ |

sahasrōrvaṃghri bāhvakṣaḥ saha srānana śīrṣavān |

yasyāda yavairlōkān kalpayaṃti manīṣiṇaḥ |

kaṭyābhiradhissapta saptōrdhvaṃ jaghanādibhiḥ |

puruṣasya mukhaṃ brahmakṣatramē tasya cāha vaḥ |

ūrvōrvaiśyō bhagavataḥ padbhyāṃ śūdrōajāyata |

bhūrlōkaḥ kalpitaḥ padbhyāṃ bhuvarlōkō asya nābhitaḥ |

hṛdā svarlōka urasā maharlōkō mahātmanaḥ |

grīvāyāṃ janalōkaśca tapō lōkasta na dvayāt |

mūrthabhiḥ satyalōkastu brahmalōkastu sanātanaḥ |

tatkaṭyāṃ cātalaṃ klupta mūrubhyāṃ vitalaṃ vibhōḥ |

jānubhyāṃ sutalaṃ śuddhaṃ jaṃghābhyāṃtu talātalaṃ |

mahātalaṃ tu gulphābhyā prapadābhyāṃ rasātalaṃ |

pātāḷaṃ pāda salataḥ iti lōkamayaḥ pumān |

bhūrlōkaḥ kalpitaḥ padbhyāṃ bhuvarlōka padbhyāṃ bhuvarlōkasya nābhitaḥ |

svarḷōkaḥ kalpitō mūrthnā itivā lōka kalpanā ||“. (śrīmadbhāgavataṃ - 2 - 5 - 35 to 43)

paina ceppabaḍina saṃskṛta bhāgavatamunaku anuvādamu ī kriṃdividhamugā śrīmadāṃdhramahābhāgavatamulō ceppabaḍinadi: -

“kālakarma svabhāva prērakuṃḍaina paramēśvaruṃḍu jīvarūpaṃbuna mahāvaraṇa jalamadhyasthitaṃbayina brahmāṃḍaṃbulōnu socci savistāraṃbu gāviṃci yaṭṭi yaṃḍaṃbu bhēdiṃci nirgamiṃce neṭlaṃṭēni –

ka. bhuvanātmakuḍā yīśuḍu

bhuvanākṛtitōḍa nuṃḍu brahmāṃḍaṃbun

vivaramutō badunālugu

vivaraṃbulugā nonarce viśadaṃbulugan -

ma. bahu pādōru bhujānanēkṣaṇa śiraḥ phālaśravō yuktuḍai

vihariṃcun bahu dēhi dēhagatuḍai vidvāṃsulūhiṃci ta

dbahurūpāvayavaṃbulan bhuvana saṃpattin vicāriṃturu - - -|”

va. caturdaśa lōkaṃbulaṃdu mīdi padiyēḍu lōkaṃbulu śrīmahāviṣṇuvunakuṃ gaṭi pradēśaṃbuna nuṃḍi yūrdhvadēhamaniyunu griṃdi yēḍu lōkaṃbulu jaghanaṃbuna nuṃḍi yadhōdēhamaniyunu balikuduru - prapaṃca śarīruṃḍagu bhagavaṃtuniki - - - bhūlōkaṃbu kaṭi paryaṃta pradēśaṃbu, bhuvarlōkaṃbu nābhi, suvarlōkaṃbu hṛdayaṃbu, maharlōkaṃbu vakṣaṃbu, javalōkaṃbu grīvaṃbu, tapōlōkaṃbu stanadvayaṃbu, sanātanaṃbunu brahma nivāsaṃbunu naina satyalōkaṃbu śiraṃbu, gaṭi pradēśaṃbatalaṃbu, toḍalu vitalaṃbu, jānuvulu sutalaṃbu, jaṃghalu talātalaṃbu, gulphaṃbulu mahātalaṃbu, pādāgraṃbulu rasātalaṃbu, pādatalaṃbu pātāḷaṃbu ani lōkamayaṃgā bhāviṃturu -. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 89)

  1. laukikāḥ prāṇinaḥ -

(lōkamulaku saṃbaṃdhiṃcina vāru, jīvulu)

  1. “pātāḷādbrahma lōkāṃtaṃ brahmāṃdaṃ parikīrtitaṃ |

ataḥ ūrdhvaṃ ca vaikuṃṭhō brahmāṃḍādbahirēvasaḥ |

tataḥ ūrdhvaṃca gōlōkaḥ paṃcā śatkōṭi yōjanaḥ |

nitya satva svarūpaśca yathā kṛṣṇaḥ tathā pyayaṃ |

saptadvīpa mitā pṛdhvī sptasāgara saṃ yutā |

ūna paṃcāśa dupadvīpa saṃkhyā śailavanānvitā |

ūrthvaṃ saptasvarga lōkāḥ svargalōka samanvitāḥ |

pātāḷāni ca saptādhaścaivaṃ brahmāṃḍamēvaca |

ūrthvaṃ dharāyāḥ bhūrlōkō bhuvarlōkastataḥ paraṃ |

tataḥ paraśca svarlōkō | janalōkasthathā paraḥ |

tataḥ parastapōlōkaḥ satyalōkasta taḥ paraḥ |

tataḥ paraṃ brahmalōkaḥ tapta kāṃcana sannibhaḥ |

ēvaṃ sarvaṃ paraṃ brahmalōkaḥ taptakāṃcana sannibhaḥ |

ēvaṃ sarvaṃ kṛtrimaṃca bāhyāṃbhyaṃtara mēvaca |

tadvināśē vināśaśca sarvēṣāmēva, nārada |

jalabudbuda vatsarvaṃ viśva saṃgha manityakaṃ |

nityau gōlōka vakuṃṭhā srōktā śaśvadakṛtrimau ||“. (dēvībhāgavataṃ)

(kriṃdanu pātāḷalōkamu modalu mīdanu brahmalōkamuvaraku galadaṃtayu brahmāṃdamani (gruḍḍu ākāramugānunna brahma ani)ceppabaḍunu. dīniki painunnadi vaikuṃṭhamu. idi brahmāṃḍamunaku velupalanunnadi. dāniki paina paṃcaśatkōṭi yōjanamula vistīrṇamugala gōlōkamunnadi - śrīkṛṣṇabhagavānuḍu nitya satya svarūpuḍainaṭlē idi kūḍa aṭulanē yunnadi. pṛthivi sapradvīpamulu saptasāgaramulu kaladi, upadvīpamulu, koṃḍalu, aḍavulu galadi. mīdanu svargalōkamutō kalisi ēḍu lōkamulunnavi, kriṃdanu sapta pātāḷalōkamulunnavi. ivanniyu kalisinadi brahmāṃḍamu. bhūlōkamu mīda bhūrlōkamu, dāni mīdanu bhuvarlōkamu, dāni paina svarlōkamu, taruvāta janalōkamu, dāni paina tapōlōkamu, dāni paina satyalōkamu, dāni paina brahmalōkamu - adi kālcina baṃgāru kāṃti kaladi. īvanniyu kṛtrimamulē - kalpiṃpabaḍinavē - sṛṣṭi cēyabaḍinavē. ā brahmāṃḍamu naśiṃcina avanniyu naśiṃcunu - nīṭi buḍagavale prapaṃcamulōnunnavanniyu nityamukānivi. gōlōka vaikuṃṭhamulu kṛtrimamulu kāvu. aṃducēta śāśvatamainavi ani ceppabaḍinavi).

  1. “tvaṃ tadāpaḥ, āpōjyōtīrasō(a)mṛtaṃ brahma bhūrbhuvassuvarōṃ”. (maṃtra puṣpamu)

(nīvē - parabrahmamē jalamu, nīvē jyōti, rasamu, amṛtamu - bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu). konni lōkamulu ceppiyuṃḍuṭacēta lōkamulanniyu brahmarūpamulē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.